Jump to content

NTR Housing Scheme


Recommended Posts

నంద్యాలలో బహుళ అంతస్తు గృహాలను లాటరీ ద్వారా లబ్దిదారులకు సింగల్ బెడ్, డబుల్ బెడ్ ఎన్టీఆర్ గృహాలను కేటాయించడం జరిగినది.

https://pbs.twimg.com/media/DueRKWYUYAAUsYI.jpg

https://pbs.twimg.com/media/DueRLEgU0AAuF4Q.jpg

https://pbs.twimg.com/media/DueRLm7UUAA23kL.jpg

 

Link to comment
Share on other sites

2019 నాటికి పేదలకు 19 లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను అమలుజేస్తోంది. పేదలకు ఇల్లు అంటే ఏదో మొక్కుబడిగా కట్టడం కాదు. షీర్ వాల్ సాంకేతికతతో, పేద గొప్ప అన్న భావన రాకుండా సకల సౌకర్యాలతో చంద్రబాబు ఈ ఇళ్ళను నిర్మించి ఇస్తున్నారు.

ఈ ఐదేళ్ళలో దాదాపు ఏడున్నర లక్షల ఇళ్ళు పూర్తిచేశారు. మరో నాలుగు లక్షల ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తం 14,97,950 ఇళ్ళు మంజూరయ్యాయి. పదో, వందో కాదు ఒకేసారి లక్షల ఇళ్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 4లక్షల ఇళ్లను ఇలా సామూహికంగా పంచారు.

త్వరలో మరో మూడు లక్షల ఇళ్ళను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పేదల సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ పరమావధి. 

 

Link to comment
Share on other sites

  • సంక్రాంతికి ప్రారంభోత్సవాల వేడుక
  • తుళ్ళూరు మండలంలో ఐదు ప్రదేశాల్లో 3200 ఫ్లాట్లు
  • 3041 దరఖాస్తులు - లబ్ధిదారుల ఎంపిక పక్రియ పూర్తి
  • చలానాలకు అనుమతి
అమరావతి: రాజధాని 29 గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీనిచ్చారు. ఆ మేరకు ఇంటి స్థలం, ఇళ్లులేని వారికి గ్రూపు ఇళ్లు నిర్మా ణం చేసి అందజేయటానికి తుళ్ళూరు మండలంలో దొండపాడు, అనంతవరం, మందడం, తుళ్లూరు, ఐనవోలు గ్రామాల్లో ఐదు ప్రదేశాల లో, మంగళగిరి మండలంలోని నవులూరు, నిడమర్రులో, తాడేపల్లి మండలం పెనుమాక లో పేదల ఇళ్ల నిర్మాణాలు చేశారు. ఎపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణ పనులు పూర్తయి లబ్ధిదారులకు అందజేయడానికి సీఆర్‌డీఏ అధికారు లు సిద్ధమయ్యారు. ఇప్పటికే నవులూరు,పెను మాక గ్రామాలకు చెందిన 1300మంది పేదలకు ఇళ్లను లాటరీ పద్ధతిలో కేటాయించారు.
 
3 రకాలుగా ఫ్లాట్లు...
పేదలకు నిర్మించిన అపార్ట్‌మెంట్లు మూడు రకాలుగా ఉన్నాయి. 300 చదరపు అడుగులు, 365,430చదరపు అడుగులువిస్తీరణంలో ఫ్లాట్లు నిర్మించారు.లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేటప్పుడే ఏ విస్తీర్ణఫ్లాట్‌ కావాలో అందులో నమో దు చేసుకున్నారు. దానినిబట్టే నిర్మాణాలు జరిగాయి. 2014 డిసెంబరు8 అంటే రాజధాని ప్రకటించే సమయానికి నివాసం ఉండి ఇళ్లు, నివా సస్థలం లేని పేదలకు ఈ గ్రూపు ఇళ్లను అంద జేసేందుకు సీఆర్‌డీఏ అధికారులు సిద్ధమయ్యా రు.సంక్రాంతి కల్లా అర్హతకలిగిన అందరికీ రాజధానిలో సొంతింటి కల సాకారంకాబోతుంది.
 
ఫ్లాట్‌ పొందేదిలా...
రాజధానిలో ఫ్లాట్లు పొందేవారు ముందుగా సీఆర్‌డీఏ కాంపిటెంటు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. విచారణ చేసి ఇళ్లు లేదని నిర్థారించిన తరువాత లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. అనంతరం 300 చదరపు అడుగుల ఫ్లాటుకు రూ.500. 365చదరపు అడుగుల ఫ్లాటుకి రూ.50,000, 430చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాటుకు రూ.1,00,000లు బ్యాంకు చలానా కట్టాల్సి వుంది. ఈ మార్జిన్‌ మొత్తం పోను మిగిలిన ఫ్లాట్‌ మొత్తం విలువలో సగం ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన సగానికి బ్యాంకు రుణం ఏర్పాటు చేస్తారు. వాయిదాల పద్ధతిలో బ్యాంకు రుణం తీర్చాల్సి వుంటుంది. కరెంటు, అంతర్గత రోడ్లు, వాటర్‌ ఇలా అన్నివసతులతో ఫ్లాటు లబ్ధిదారుడికి అందజేస్తారు. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జరిగి బ్యాంకు చలనా కట్టే దశలో ఉంది. సంక్రాంతి కల్లా రాజధానిలో ఇళ్లులేని పేదలందరికీ సొంతింటికల సాకారం కానుంది.
 
ఇప్పటికే బ్యాంకర్లతో సీఆర్‌డీఏ అధి కారులు సంప్రదించి రుణ సదుపాయాన్ని ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే చలనా మొత్తం ఒకేసారి చెల్లించలేమని విడతల వారికి చెల్లిస్తామని కొంతమంది లబ్ధిదారులు విన్నవిస్తున్నారు. అలా అయితే బ్యాంకు రుణం విషయంలో జాప్యంజరిగి, ఫ్లాటు దక్కించుకోవటానికి సమయం పడుతుందని అధికారులు సూచిస్తున్నారు. చలనా మొత్తం ఒకేసారి కడితే వెంటనే ఫ్లాటులో నివాసం ఉండవచ్చని అధికారులు చెపుతున్నారు.
Link to comment
Share on other sites

గేటెడ్‌ తరహా గృహ నిర్మాణం
27-12-2018 04:04:23
 
  • పట్టణాల్లో నాణ్యమైన ఇళ్లు
  • తక్షణమే పెండింగ్‌ బిల్లుల చెల్లింపు
  • టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ఆదేశం
అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో లబ్ధిదారులకు నాణ్యమైన ఇళ్లు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు నిర్మించాలని సూచించారు. బుధవారం ఆయన జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరెంటు, తాగునీటి కనెక్షన్లు, డ్రైనేజీ, పచ్చదనం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌ బిల్లులు వెంటనే క్లియర్‌ చేయాలని నిర్దేశించారు. రూ.500 కోట్ల హడ్కో నిధులు ఈ రోజే వచ్చేలా చూడాలని, జనవరి తొలివారంలో కేంద్రం నుంచి రూ.500 కోట్లు రప్పించాలని సూచించారు.
 
‘అందరం కలిసికట్టుగా కృషి చేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలం. లబ్ధిదారులతో సమన్వయం చేసుకోవాలి. పట్టణాల్లో 10 లక్షలు కాదు.. 12 లక్షల ఇళ్ల నిర్మాణానికి అవకాశముంది. ఎక్కడా ఒక్క పైసా అవినీతి జరగకూడదు. ఇళ్ల లబ్ధిదారులు పదికాలాలు మీ గురించి మంచిగా చెప్పుకోవాలి. ఇంటి నిర్మాణానికి సహకరిస్తే ఆ తృప్తే వేరు. పట్టణాల్లో 5.24 లక్షల ఇళ్లు మంజూరైతే 3.47 లక్షల ఇళ్లు గ్రౌండ్‌ అయ్యాయి. 1.23 లక్షల ఇళ్లకు శ్లాబులు పడ్డాయి. 62,591 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ వారంలో 8,589 ఇళ్లు గ్రౌండ్‌ అయ్యాయి. 3,410 శ్లాబులు పడ్డాయి. 5,063 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇప్పటి వరకు 1,88,930 ఫ్లాట్లు కేటాయించారు. మిగిలినవి కూడా త్వరితగతిన కేటాయించాలి’ ’ అని సీఎం స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

రాష్ట్రానికి 57వేల పీఎంఏవై ఇళ్లు మంజూరు
28-12-2018 03:58:39
 
న్యూఢిల్లీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఇళ్లను మంజూరు చేసింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పట్టణం) కింద 57,433 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...