Jump to content

NTR Housing Scheme


Recommended Posts

జులై 5న 3 లక్షల గృహ ప్రవేశాలు: మంత్రి కాల్వ
03-07-2018 16:42:20
 
అమరావతి: ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఆక్టోబర్ 2న లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు నిర్వహించామని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. 13 జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతో మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎండీ కాంతిలాల్ దండే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 5 నుంచి నిర్వహించనున్న రెండో విడత గృహ ప్రవేశ మహోత్సవ మార్గదర్శకాలపై చర్చించారు. జులై 5న 3లక్షల గృహ ప్రవేశాలు నిర్వహించుకుంటున్నామని మంత్రి కాల్వ తెలిపారు. పేద కుటుంబాల సొంత ఇంటి కల ఎంతో సంతృప్తినిచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారని తెలిపారు. ఎక్కడా లోపాలు లేకుండా గృహప్రవేశాలు నిర్వహిస్తామని అన్నారు.
Link to comment
Share on other sites

గృహ ప్రవేశం
05-07-2018 02:18:29
 
636663539100751166.jpg
  • నేడు 3 లక్షల ఇళ్ల ప్రారంభం
  • 174 నియోజకవర్గాల్లో ఏకకాలంలో
  • ప్రవేశ గృహాల ముందు తోరణాలు
  • మేళతాళాలతో నేతలకు స్వాగతం
  • గృహనిర్మాణశాఖ భారీ ఏర్పాట్లు
  • విజయవాడలో పాల్గొననున్న సీఎం
  • లబ్ధిదారులతో నేరుగా సంభాషణ
  • పేదల సొంత ఇంటి కల తీర్చాం
  • 2022నాటికి అందరికీ ఇళ్లు: కాలవ
ఒకేరోజు రాష్ట్రంలో మూడు లక్షల మంది పేదలు తమ సొంత ఇళ్లలోకి గృహప్రవేశాలు జరిపే మహోన్నత కార్యక్రమం. రాష్ట్ర చరిత్రలో ఇదొక అద్వితీయ ఘట్టం. ఈ నిర్ణయంతో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొంది. - మంత్రి కాలవ
 
అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): గృహనిర్మాణశాఖ మరో ముఖ్యమైన కార్యక్రమానికి సిద్ధమైంది. గతంలో ఒకేసారి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఈ శాఖ, ఈసారి అంతకు రెండు రెట్లు ఎక్కువగా మూడు లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు చేపడుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు. ఊరూరా పండగ వాతావరణం నెలకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గృహప్రవేశం జరిగే ప్రతి ఇంటి వద్దా రెండు మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నారు.
 
ఇళ్లకు మామిడి తోరణాలు కట్టిస్తున్నారు. ప్రజాప్రతినిధులు వచ్చే చోట్ల మేళతాళాలు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క నియోజకవర్గం మినహా 174 నియోజకవర్గాల పరిధిలోని 664 మండలాలు, 12,767 గ్రామ పంచాయతీలు, 110 మున్సిపాలిటీల్లోని 2,093 వార్డుల్లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళంలో 19,616, విజయనగరంలో 16,504, విశాఖపట్నంలో 27,697, తూర్పుగోదావరిలో 37,207, పశ్చిమగోదావరిలో 27,710, గుంటూరులో 24,767, ప్రకాశంలో 19,655, నెల్లూరులో 19,045, చిత్తూరులో 20,888, కడపలో 15,891, అనంతపురంలో 24,608, కర్నూలులో 24402 ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే సభలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
 
ఆర్థిక ఇబ్బందులను అధిగమించి..: కాలవ
సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని నిరుపేదల సొంత ఇంటి కల సాకారం అవుతున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార, పౌరసంబంధాలశాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. ఇళ్ల మంజూరు విషయంలో ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని, పాత లెక్కలను చూపిస్తూ.. ఇళ్లను మంజూరు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా, సీఎం ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, ఇళ్ల నిర్మానానికి అవసరమైన నిధులు సమకూర్చారని చెప్పారు. ‘ఒకేరోజు రాష్ట్రంలో 3 లక్షల మంది పేదలు తమ సొంత ఇళ్లలోకి గృహప్రవేశాలు జరిపే మహోన్నత కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్ర చరిత్రలో ఇదొక అద్వితీయ ఘట్టం. ఈ నిర్ణయంతో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాం. దానికోసం యూనిట్‌ ధరను రూ.70 వేల నుంచి లక్షా 50 వేల రూపాయలకు పెంచాం’ అని మంత్రి వివరించారు.
Link to comment
Share on other sites

19 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం
నేడు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల గృహప్రవేశాలు
మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడి
ఈనాడు - అమరావతి

రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల గృహప్రవేశాలను పండగ వాతావరణంలో గురువారం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణ గృహనిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. 2019 నాటికి రూ.50 వేల కోట్లతో పేదలకు 19 లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను అమలుజేస్తోందని తెలిపారు. బుధవారం ఆయన వెలగపూడి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మినహా రాష్ట్రంలోని 174 నియోజకవర్గాల్లో ఈ గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గృహప్రవేశాలను ప్రారంభిస్తారు. విశాఖ, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళా లబ్ధిదారులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఏర్పాటై గురువారానికి 40 సంవత్సరాలవుతోంది. ఇది కూడా గృహ ప్రవేశాల రోజున కలిసి వచ్చింది. 1979 జులై 5న ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకూ ఏపీలోని 13 జిల్లాల్లో 65 లక్షల ఇళ్లను నిర్మించింది’’ అని మంత్రి తెలిపారు.

కేంద్రం సహకరించకపోయినా
‘‘దేశవ్యాప్తంగా 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించాల్సి ఉంది. అందులో కోటి మందికి ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ప్రతిపాదించినా ఇప్పటివరకు కనీసం 35 లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయింది. రాష్ట్రంలో ఇళ్ల కోసం వేచి చూస్తున్న పేదలు 20.97 లక్షల మంది ఉన్నారు. ఏటా 5 లక్షల మందికి ఇళ్లు కేటాయించాలని కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. కేంద్రం సహకరించకపోయినా గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వమే 5,80,849 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. 2017-18లో రూ.3,787 కోట్లతో 3.15 లక్షల ఇళ్లను పూర్తి చేశాం’’ అని మంత్రి తెలిపారు.

పేదోడి ఇంటి కలను నెరవేర్చేందుకు...
‘‘2014కి ముందు రూ.70 వేలున్న యూనిట్‌ ధరను రూ.1.50 లక్షలకు పెంచాం. అప్పట్లో లబ్ధిదారులకు ఇచ్చే రాయితీ నామమాత్రంగా ఉండేది. ఇప్పుడు యూనిట్‌ ధర మొత్తాన్ని రాయితీగా ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి భవన నిర్మాణ ప్రణాళిక అనుమతిలేకపోయినా వెసులుబాటు కల్పించాం. గతంలో 450 చదరపు అడుగులకు మించి ఇల్లు కడితే బిల్లు ఇచ్చేవారు కాదు. ఇప్పుడా పరిమితిని 750 చ.అడుగులకు పెంచాం’’ అని మంత్రి కాలవ శ్రీనివాసులు వివరించారు.

4ap-main11a.jpg
నేడు జరగనున్న గృహ ప్రవేశాలు..
గ్రామీణ ప్రాంతాల్లో 2,71,083
పట్టణాల్లో 24,145
హుద్‌హుద్‌ తుపాను బాధితులవి 5,118
మొత్తం 3,00,346
* ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతో నిర్మించినవి: 2,56,132
* కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి నిర్మించినవి: 44,214
(ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన, ఎన్టీఆర్‌ గ్రామీణ్‌ పథకంలో: 22,806
పీఎంఏవై, ఎన్టీఆర్‌ అర్బన్‌ పథకంలో: 21,408)
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...