Jump to content

NTR Housing Scheme


Recommended Posts



  • విజయవాడ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌
  • ద్వారా నిర్వహించనున్న సీఎం
  • జిల్లాల్లో గృహనిర్మాణశాఖ ఏర్పాట్లు
  • 10 లక్షల ఇళ్ల లక్ష్యం రెండేళ్లలో పూర్తి చేస్తాం
  • మంత్రి కాల్వ శ్రీనివాసులు

అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంలో భాగంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన తొలి లక్ష ఇళ్లకు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం నేడు జరగనుంది. ప్రపంచ ఆవాస దినోత్సవం, గాంధీ జయంతి రెండు సందర్భాలనూ పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. తూర్పుగోదావరిలోని పెద్దాపురం, నెల్లూరు జిల్లాలోని గృహప్రవేశాలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా శ్రీకారం చుట్టి, అక్కడి లబ్ధిదారులతో సీఎం మాట్లాడతారు. ఇందుకోసం గ్రామీణ గృహనిర్మాణశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

 

పండుగ వాతావరణంలో సామూహిక గృహప్రవేశాలు జరగాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి రెండు సంవత్సరాలు పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వంపై కొంత అసంతృప్తి వచ్చింది. లక్ష ఇళ్లకు ఒకేసారి గృహప్రవేశాలు నిర్వహించడం ద్వారా ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యాయనే సంకేతాలు పంపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

టీడీపీ హయాంలో మొత్తం 10 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన రెండేళ్లలో లక్ష్య సాధనకుగాను స్వల్పకాలిక లక్ష్యాలు నిర్ధేశించుకుని ప్రతి ఏడాది మూడుసార్లు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబరు 2, సంక్రాంతి, నవనిర్మాణ దీక్ష అయిన జూన్‌ 8న ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. వచ్చే సంక్రాంతికి రెండున్నర లక్షల ఇళ్లు పూర్తిచేయాలని, ఆ తర్వాత జూన్‌ నాటికి మరో రెండున్నర లక్షల నిర్మాణాలు పూర్తిచేయాలని నిర్ణయించారు.

 

తద్వారా ఎన్నికల నాటికి మొత్తం లక్ష్యం పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రెండేళ్లలో లక్ష ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలనేది తమ లక్ష్యం అని గ్రామీణ గృహనిర్మాణశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో పక్కా ఇళ్లు అవినీతికి కేంద్రంగా మారాయని విమర్శించారు. దాదాపు 14 లక్షల ఇళ్లు భూమ్మీద కనిపించట్లేదని, రూ.4వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని అన్నారు. టీడీపీ హయాంలో అన్ని నిర్మాణ దశలకూ జియోట్యాగింగ్‌ చేసి, పూర్తి పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి గూడు కల్పిస్తామని చెప్పారు.

Link to comment
Share on other sites

  • 2 months later...
Guest Urban Legend

 

2019 నాటికి 19లక్షల ఇళ్లు నిర్మించడమే లక్ష్యం 
జన్మభూమి-మా ఊరులో సమాచారశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు 

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే: ‘పేద ప్రజల సొంత ఇంటికల నెరవేర్చాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈమేరకు 2019 నాటికి రాష్ట్రంలో 19లక్షల ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తోంది’. అని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని 53వ డివిజన్‌లో మంగళవారం నిర్వహించిన జన్మభూమి - మ ఊరు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కార వేదికగా జన్మభూమి కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఆర్థిక లోటు, అప్పులు, విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తం తదితర సమస్యలతో రాష్ట్ర ఏర్పడిందన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకొని పలు నిర్ణయాలు తీసుకోవడంవల్ల రాష్ట్రం అభివృద్ధిబాటలో పయనిస్తోందన్నారు. రాష్ట్రంలో రూ. 50 వేల కోట్లు ఖర్చుతో 19లక్షల ఇళ్లను 2019 నాటికి నిర్మించాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నారని కొనియాడారు. అనంతరం అర్హులకు కొత్తగా పింఛన్లు, రేషన్‌ కార్డులు అందజేశారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, మేయర్‌ కోనేరు శ్రీధర్‌, ఉపమేయర్‌ గోగుల రమణారావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఇప్పటికింతే.. తర్వాత చూద్దాం!
గ్రామీణ ఇళ్ల కేటాయింపులపై కేంద్రం స్పష్టత
మంజూరైన ఇళ్లతో సరిపెట్టుకోవాలని సూచన
ఈనాడు - అమరావతి
17ap-main13a.jpg

ప్రజాసాధికార సర్వే ప్రకారం ఇళ్లు కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం తెలివిగా స్పందించింది. సామాజిక, ఆర్థిక స్థూల గణన (ఎస్‌ఈసీసీ-2011) ప్రకారం కేటాయింపుల ప్రక్రియ పూర్తయ్యాక ప్రజాసాధికార సర్వే గణాంకాల గురించి ఆలోచిద్దామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తాజాగా రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో అదనపు ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లే అయ్యింది. ఎస్‌ఈసీసీ సర్వే ప్రకారం మిగతా రాష్ట్రాలకు కేటాయిస్తున్న నిష్పత్తిలోనే ఆంధ్రప్రదేశ్‌కు 2018-19 సంవత్సరానికి మరో 1,45,271 ఇళ్లను కేంద్రం కేటాయించనుంది. ప్రధానమంత్రి ఆవాస యోజన(పీఎంఏవై)-గ్రామీణ్‌లో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం 2016-17, 2017-18 సంవత్సరాలకు రెండు విడతలుగా 1,23,112 ఇళ్లను కేటాయించింది. గుజరాత్‌, బిహార్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌తో పోల్చిచూస్తే రాష్ట్రానికి తక్కువ కేటాయింపులు చేశారు. కేంద్రం 2011లో చేయించిన సామాజిక, ఆర్థిక స్థూల గణన సందర్భంలో రాష్ట్రంలో సొంతింటికి నోచుకోని నిరుపేద కుటుంబాలు 5.84 లక్షలుగా గుర్తించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వే ఆధారంగానే రాష్ట్రాలకు ఇళ్ల కేటాయింపులు చేశారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వ ప్రజాసాధికార సర్వేలో సొంతింటికి నోచుకోని నిరుపేద కుటుంబాలు 19.07లక్షలుగా తేల్చారు. ఇలా చూస్తే రాష్ట్రానికి పీఎంఏవై-గ్రామీణ్‌లో 10లక్షల ఇళ్లు కేటాయించాల్సి ఉంటుందని అధికారులు అంచనాగట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖË రాసింది. ప్రజాసాధికార సర్వే ప్రకారం ఇళ్ల కేటాయింపులు చేయాలని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడాది క్రితం దిల్లీ పర్యటన సందర్భంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిని కలిసి ఇళ్ల కేటాయింపులు పెంచాలని సూచించారు. గత నెలలో రాష్ట్ర గ్రామీణ గృహనిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి మరోసారి విజ్ఞప్తి చేశారు.

అదనపు కేటాయింపులు కష్టమే...
రాష్ట్ర వినతులపై కేంద్రం ఆచూతూచి స్పందిస్తూ చివరకు అదనపు కేటాయింపులు కష్టమేనని తేల్చి చెప్పింది. అన్ని రాష్ట్రాలకూ ఎస్‌ఈసీసీ-2011 ప్రకారమే పీఎంఏవై-గ్రామీణ్‌లో ఇళ్లు కేటాయిస్తున్నామని, కొత్తగా మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు అదనపు ఇళ్లు ఇవ్వలేమంది. ఇప్పటికే రెండు విడతలుగా 2,68,383 ఇళ్లు కేటాయించామని, 2018-19లో మరో 1,45,271 ఇళ్లు ఇస్తామని వెల్లడించింది. ప్రజాసాధికార సర్వే ప్రకారం ఇళ్లులేని పేద కుటుంబాలు 20.99లక్షలుగా రాష్ట్రప్రభుత్వం చెబుతున్నా, ఈ నిష్పత్తిలో కేటాయించాలంటే ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈసరికి వీటితో సంతృప్తి సరిపెట్టుకోవాలని పరోక్షంగా సూచించారు. ఈ పరిణామాలపై అధికారులతో సమావేశమై రాష్ట్రావసరాల దృష్ట్యా అదనపు కేటాయింపుల కోసం కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. గురువారం నాటి కలెక్టర్ల సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
Guest Urban Legend

Latest APTIDCO Construction drone video update on the following locations Nellore, Peddapuram, Rajahmundry, Mandapeta, Ramachandrapuram, Bhimavaram, Palkol, Tadepalligudem, Chilakaluripeta, Ponnuru, Guntur, Tenali and Adoni.

 

 

Link to comment
Share on other sites

6 hours ago, rk09 said:

construction type is different - no itukalu

Venkayya mahima

Ap is bearing 50% cost... Centre amount bills submit chesina taruvatha korilu petti istaru appati daka state ye barinchali ah 50% kuda 

Link to comment
Share on other sites

Guest Urban Legend

Construction update on the following locations  Peddapuram, Rajahmundry, Mandapeta, Ramachandrapuram, Bhimavaram, Palkol, Tadepalligudem, Chilakaluripeta, Ponnuru, Guntur, Tenali, Adoni, Nandyal (Nandamuri-nagar), Nandyal (SRBC Colony), Yemmiganur, Kurnool Nellore
 

 

Link to comment
Share on other sites

15 hours ago, MVS said:

Ap is bearing 50% cost... Centre amount bills submit chesina taruvatha korilu petti istaru appati daka state ye barinchali ah 50% kuda 

PMAY kinda ayithe why state needs to pay?

maximum PMAY kinda try chesthunnaru - may be konni areas lo NTR housing ni kuda add chesaru emo

and mainly, these houses are in urban areas - so my guess is they belongs to PM Awas Yojana scheme

NREGA, PMAY ni AP use chesinantha ga evaru use cheyyaledu antaru - adi admin skills ante - super leader

 

 

Edited by rk09
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...