Jump to content

NTR Housing Scheme


Recommended Posts

పేదోడికి రాష్ట్ర ప్రభుత్వం ఊరట
02-08-2017 02:05:02
 
636372363036866274.jpg
  • కేంద్రం రూల్స్‌కి ప్రత్యామ్నాయం
  • బైక్‌, ఫోన్‌ ఉన్నా ‘పీఎంఏవై ఇల్లు
  • 20 తర్వాత కేంద్రానికి సమగ్ర నివేదిక
 
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పీఎంఏవై పథకం లో కేంద్రం విధించిన నిబంధనలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టింది. 2011 జనగణన ప్రకారం ద్విచక్ర వాహనం, ల్యాండ్‌ ఫోన్‌ ఉంటే పక్కా ఇంటికి అర్హులు కారని కేంద్రం నిబంధనలు పెట్టడం, రాష్ట్రంలోని పేదలకు అవరోధంగా మారింది. దీనిని సవరించాలని మూడుసార్లు కేంద్రానికి రాష్ట్రం లేఖలు రాసినా స్పందన రాలేదు. ఒక రాష్ట్రం కోసం నిబంధనలను మార్చలేమనేది కేంద్రం చెబుతోంది. దీంతో.. కేంద్రం మార్గదర్శకాలు కాకుండా తాము ఇటీవల నిర్వహించిన పల్స్‌ సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపికకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా కేంద్రాన్ని కోరింది.
 
అయితే పల్స్‌ సర్వే వివరాలను గ్రామ సభ ల్లో ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత వివరాలు ఇవ్వాలని కేంద్రం సూచించింది. దానికి అనుగుణంగా గృహనిర్మాణ శాఖ మంగళవారం నుంచి గ్రామసభలు ప్రారంభించింది. ఈ నెల 20లోపు తమ నివేదికలు పంపాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. ఆ వివరాలను అధ్యయనం చేసి కేంద్రానికి సమగ్ర నివేదిక పంపాలని గ్రామీణ గృహ నిర్మాణశాఖ నిర్ణయించింది.
 
నిజానికి, కేంద్రం మార్గదర్శకాలు ఏపీతో పాటు అన్ని రాష్ర్టాలకూ తలనొప్పిగానే మారాయి. కేంద్రం యేటా అన్ని రాష్ర్టాలకు పీఎంఏవై పథకంలో ఇళ్లను మంజూరుచేస్తుంది. 60, 40శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు రాయితీని అందజేస్తాయి. 2016-17లో ఏపీకి 72,885 ఇళ్లను కేంద్రం మంజూరుచేసింది. ఈ పథకంలో లబ్ధిదారులు తాము సూచించిన 13 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టంచేసింది. వాటిలో ముఖ్యమైనవి ల్యాండు ఫోన్‌, ద్విచక్రవాహనం లాంటి వి ఉండరాదని షరతు పెట్టింది. పడవ, వ్యవసాయ యంత్రం లాంటివి కూడా ఉండకూడదని పేర్కొంది. ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న పేదలను గుర్తించడం అధికారులకు కష్టమైంది. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో కేటాయింపుల స్థాయిలో కూడా లబ్ధిదారులు లేరు.
 
 
ఆగస్టు నాటికి ఎంపిక పూర్తి
ఎన్టీఆర్‌ పథకంలో కేటాయించిన ఇళ్లకు ఆగస్టు నెలాఖరు నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తికావాలని గృహనిర్మాణశాఖ అధికారులు తాజా గడువు విధించారు. ఈనెల 15 నాటికి 2017-18, నెలాఖరునాటికి 2018-19 కేటాయింపులకు లబ్ధిదారులు తుది జాబితా సిద్ధం కావాలని..మంగళవారం సచివాలయంలో జరిగిన ప్రాజెక్టు డైరెక్టర్ల సమావేశం నిర్ణయించింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

అక్టోబరు 2న లక్ష గృహ ప్రవేశాలు

అదే రోజు మరో ఐదు లక్షల ఇళ్లకు శంకుస్థాపన

పండగలా జాతీయ ఆవాస దినోత్సవం

గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు

31ap-state5a.jpg

ఈనాడు, అమరావతి: ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా అక్టోబరు 2న రాష్ట్రంలో ఒకే రోజు లక్ష గృహ ప్రవేశాల కోసం కార్యాచరణ సిద్ధం చేశామని గ్రామీణ గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయన 13 జిల్లాల పథక సంచాలకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఐదు నెలల వ్యవధిలో రాష్ట్రంలో 90 వేలకుపైగా గృహనిర్మాణాలు పూర్తి చేశామని తెలిపారు. 2016-17, 2017-18లో మంజూరుచేసిన ఇళ్లలో లక్ష నిర్మాణాలు సెప్టెంబరు 13కు పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. అక్టోబరు 2న ముఖ్యమంత్రి హాజరయ్యే లక్ష ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని పండగలా నిర్వహిస్తామన్నారు. అదే రోజు 2017-18లో మిగిలిన, 2018-19 సంవత్సరానికి కేటాయించిన మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో పది లక్షల ఇళ్లను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన చేపట్టేలా కార్యాచరణ రూపొందించామన్నారు. 2014కు ముందు నాటి అసంపూర్తి ఇళ్లలో రెండు లక్షలు పూర్తి చేసేందుకు ఒక్కో ఇంటికి రూ.25 వేల చొప్పున అదనపు సాయం అందించేందుకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని తెలిపారు. వీటిలో 98 వేల ఇళ్ల నిర్మాణాలు రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని వివరించారు. 2016-17లో కేటాయించిన రెండు లక్షల ఇళ్లలో 1,99,832 మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులిచ్చామని వివరించారు. ఇళ్ల నిర్మాణాలకు నిధుల కొరత లేదని వివరించారు. లబ్ధిదారుల సమస్యలు తెలుసుకునేందుకు 1100 నంబరును వినియోగిస్తామని, ఎవరైనా డబ్బు డిమాండు చేసినా.. బిల్లుల చెల్లింపులో జాప్యమైనా తెలియజేయవచ్చని మంత్రి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 14.40 లక్షల ఇళ్ల నిర్మాణాల్లో రూ.4,150 కోట్ల కుంభకోణం జరిగినట్లు నిఘా, అమలు విభాగం నివేదికపై తదుపరి చర్యల కోసం మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

https://m.facebook.com/story.php?story_fbid=521059571563671&id=418219205181042

 

పక్క రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పూర్తి కాకముందే ఇక్కడ లక్ష ఇళ్లలో విజయ దశమికి గృహ ప్రవేశాలు. లక్ష పేద కుటుంబాలకు నిజమైన పండుగరోజు. వారి జీవితాలకు శాశ్వత నివాసం దొరికిన రోజు. తమది చేతల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి మరోసారి నిరూపిస్తున్నారు.

రూ. 16 వేల కోట్లతో 10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఇళ్లు నిర్మిస్తోంది. గృహ ప్రవేశాల సందర్భంగా ప్రతి ఇంటి వద్ద రెండు మొక్కల చొప్పున రెండు లక్షల మొక్కలు నాటుతున్నారు. లబ్దిదారులు ఏ మొక్కలు కోరితే ఆ మొక్కలను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. 11 వందలకు పైగా గ్రామ పంచాయతీలకు, 30 మున్సిపాల్టీలలోని వార్డులకు మొదటి దశలో ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 9,835 గ్రామ పంచాయతీల్లో, 884 వార్డుల్లో లక్షకు పైగా గృహాల నిర్మాణం పూర్తి అయింది.

 

ఇళ్ల ప్రారంభోత్సవాల సందర్భంగా పండుగ వాతావరణ నెలకొనే విధంగా మామిడి ఆకుల తోరణాలు కట్టించడంతోపాటు అందుబాటులో ఉన్న చోట అరటి బాదులు ఏర్పాటు చేసి పేదల ఇళ్ళ వద్ద ప్రభుత్వమే పండుగ జరుపుతోంది. ఏఈల ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ గృహ ప్రవేశ ఫొటోలు వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తారు. ఈ గృహప్రవేశాలు సీఎం డ్యాష్‌బోర్డులో అనుసంధానమై ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడి నుంచి పర్యవేక్షిస్తారు.

Link to comment
Share on other sites

లక్ష ఇళ్లు పూర్తి
29-09-2017 02:15:23
 
  • లబ్ధిదారుల్లో సగం బీసీలే.. 2న సామూహిక గృహ ప్రవేశాలు
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): గూడు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా మంచి పురోగతి సాధించింది. ప్రస్తుత టీడీపీ హయాంలో లక్ష గృహాల నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు అయినా కేవలం సుమారు ఏడాదిన్నరలోనే ఈ నిర్మాణాలను పూర్తి చేసింది. ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణం, బెనిఫియరీ లీడ్‌ కనస్ట్రక్షన్‌ పథకాల కింద ఈ ఇళ్లు నిర్మించారు. పూర్తయిన ఇళ్లకు అక్టోబరు 2న సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం... అందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా, ఇప్పటివరకూ 1,01,396 ఇళ్లు పూర్తవగా అందులో 50,108 ఇళ్లు బీసీ సామాజికవర్గ పేద ప్రజలవే ఉన్నాయి.
 
అలాగే ఇళ్ల నిర్మాణాల పూర్తిలో ఉభయగోదావరి జిల్లాలు ముందున్నాయి. కేవలం ఈ రెండు జిల్లాల్లో మాత్రమే 10వేల సంఖ్య దాటింది. మొత్తం లక్ష ఇళ్ల పూర్తికి సుమారు రూ.1200 కోట్లు వెచ్చించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సామూహిక గృహప్రవేశాల కార్యక్రమానికి ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి రూ.20వేలు విడుదల చేసింది. ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే గృహప్రవేశం చేసిన వెంటనే ఆ ఇంటి ఫొటోలు తీసి హౌసింగ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. 702 మండలాల్లో మొత్తం 11,831 గ్రామాల్లో గృహప్రవేశాలు జరుగుతాయని శాఖ అధికారులు తెలిపారు
Link to comment
Share on other sites

 

లక్ష ఇళ్లు పూర్తి

29-09-2017 02:15:23

 

  • లబ్ధిదారుల్లో సగం బీసీలే.. 2న సామూహిక గృహ ప్రవేశాలు
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): గూడు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా మంచి పురోగతి సాధించింది. ప్రస్తుత టీడీపీ హయాంలో లక్ష గృహాల నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు అయినా కేవలం సుమారు ఏడాదిన్నరలోనే ఈ నిర్మాణాలను పూర్తి చేసింది. ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణం, బెనిఫియరీ లీడ్‌ కనస్ట్రక్షన్‌ పథకాల కింద ఈ ఇళ్లు నిర్మించారు. పూర్తయిన ఇళ్లకు అక్టోబరు 2న సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం... అందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా, ఇప్పటివరకూ 1,01,396 ఇళ్లు పూర్తవగా అందులో 50,108 ఇళ్లు బీసీ సామాజికవర్గ పేద ప్రజలవే ఉన్నాయి.

 

అలాగే ఇళ్ల నిర్మాణాల పూర్తిలో ఉభయగోదావరి జిల్లాలు ముందున్నాయి. కేవలం ఈ రెండు జిల్లాల్లో మాత్రమే 10వేల సంఖ్య దాటింది. మొత్తం లక్ష ఇళ్ల పూర్తికి సుమారు రూ.1200 కోట్లు వెచ్చించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సామూహిక గృహప్రవేశాల కార్యక్రమానికి ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి రూ.20వేలు విడుదల చేసింది. ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే గృహప్రవేశం చేసిన వెంటనే ఆ ఇంటి ఫొటోలు తీసి హౌసింగ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. 702 మండలాల్లో మొత్తం 11,831 గ్రామాల్లో గృహప్రవేశాలు జరుగుతాయని శాఖ అధికారులు తెలిపారు

Super
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...