Jump to content

NTR Arogya Raksha Health Insurance Scheme


Recommended Posts

ఆరోగ్యరక్ష రెన్యువల్‌ గడువు 30కి పొడిగింపు
11-04-2018 10:45:28
 
636590403295491546.jpg
గుంటూరు: ఆరోగ్య రక్ష పథకంలో లబ్ధిదారుల ప్రీమియం రెన్యువల్‌ గడువును ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వడ్లమూడి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో జిల్లాలో పది వేల కుటుంబాలు నమోదయ్యాయని, ఏప్రిల్‌ ఆరో తేదీతో రెన్యువల్‌ గడువుముగిసినట్లు ఆయన వివరించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో గడువు తేదీని ఈనెల 30 వరకు పొడిగించినట్లు తెలిపారు. దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రాల్లో కాని, ఎన్టీఆర్‌ వైద్యసేవ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్య మిత్రలను కలసి కాని, చుట్టుగుంటలోని ఎన్టీఆర్‌ వైద్యసేవ కార్యాలయంలోని కాని సంప్రదించి తమ కార్డులను రెన్యువల్‌ చేసుకోవచ్చని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.
 
    ఒకవేళ ఎవరైనా 30వ తేదీ తర్వాత రెన్యువల్‌ చేయించుకుంటే వారిది కొత్త కార్డుగా పరిగణిస్తామన్నారు. కొత్త వారు ఆరోగ్యరక్ష పథకం ద్వారా వైద్యసేవలు పొందాలంటే 15రోజుల తర్వాతే సాధ్యపడుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఈ పథకంలో ఉన్న కుటుంబాలు ఏప్రిల్‌ 30వ తేదీలోపు తమ కార్డులను పునరుద్ధరించుకోవాలని ఆయన కోరారు. చుట్టుగుంటలోని ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం కార్యాలయానికి, నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వచ్చే లబ్ధిదారులు తమ వెంట డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు తీసుకొని వచ్చికార్డు పేమెంట్‌ ద్వారా పాలసీ రెన్యువల్‌ చేయించుకోవచ్చని ఆయన వెల్లడించారు. మరింత సమాచారం కోసం సెల్‌ నం: 83338 17449, 83338 17403 లలో సంప్రదించాలని కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వడ్లమూడి విజ్ఞప్తిచేశారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...
  • 6 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...