Jump to content

Telangana lo nijalu.

LuvNTR

Recommended Posts

HMDA cheating people in the name of LRS. 34000 applications are rejected under LRS scheme. KCR's dubious nature. GHMC elections lo motham TRS ki guddesaru blind ga. ippudu anubhavinchandi. Mee Life savings motham dobbettasadu KCR LRS scheme peru tho.

------------------------------------------------------------

దారుణంగా మోసపోయారు! 
మధ్యతరగతి ప్రజలను వంచించిన స్థిరాస్తి వ్యాపారులు 
వేలాది మందికి అసైన్డ్‌ భూములను ‘ప్లాట్లు’గా అమ్మేశారు 
వీటి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను తిరస్కరిస్తున్న హెచ్‌ఎండీఏ 
ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న దరఖాస్తుదారులు 
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి 

అందరూ మధ్య తరగతి ప్రజలే.. దాదాపు 34 వేల మంది.. కష్టార్జితం అంతా పెట్టి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు.. దారుణంగా మోసపోయారు.. వీరి స్థలాలను క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) చేయడానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిరాకరించడంతో ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

రెండేళ్లకిందట రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు 1.49లక్షలమంది దరఖాస్తుచేశారు. ఏడాది కాలంగా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అన్ని దరఖాస్తులను పరిశీలించారు. వీటిలో దాదాపు 34,237 దరఖాస్తులకు సంబంధించి భూ రికార్డులు సక్రమంగా లేవని తేల్చారు. వీటికి ఎల్‌ఆర్‌ఎస్‌ ఇవ్వాలంటే రెవెన్యూ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలని సూచించారు. దీంతో వేలాదిమంది ఎన్‌వోసీ కోసం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ తదితర జిల్లాల రెవెన్యూఅధికారులకు దరఖాస్తు చేశారు. వీటిలో అత్యధిక దరఖాస్తులకు ఎన్‌వోసీ ఇవ్వడానికి అధికారులు తిరస్కరిస్తున్నారని తెలిసింది. దీనికి కారణం సంబంధిత స్థలాల్లో అధిక భాగం అసైన్డ్‌, ఇతర ప్రభుత్వ భూములు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గడవులోగా ఎన్‌వోసీ సమర్పించని 7,818 దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ దరఖాస్తుదారులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేకమంది హెచ్‌ఎండీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

ఇప్పుడేం చేయాలి? 

పదేళ్ల నుంచి అనేక మంది ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితంతో ఆరు జిల్లాల పరిధిలో ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశారు. కొంతమంది పెద్ద స్థిరాస్తి వ్యాపారుల దగ్గర కొనుగోలు చేయగా.. చాలా మంది స్థానిక వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా వేసిన వెంచర్లలో కొనుగోలు చేశారు. ఇలాంటి వారంతా పూర్తిగా మోసపోయారు. భూముల రికార్డులను పరిశీలించకుండానే కొనుగోలు చేయడం వల్లే వీటికి అధికారులు ఎన్‌వోసీ ఇవ్వడం లేదని చెబుతున్నారు. అనేకమంది తప్పుడు పత్రాలను సృష్టించి స్థలాలను విక్రయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎన్‌వోసీ దరఖాస్తుల ఆధారంగా సంబంధిత స్థలాలపై రెవెన్యూ అధికారులు విచారణ చేస్తే చాలా వరకు అసైన్డు భూములుగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 34 వేల దరఖాస్తుల్లో ఇంకా తిరస్కరించని వాటికి హెచ్‌ఎండీఏ అధికారులు గడువిచ్చారు. ఈ గడువులోగా ఎన్‌వోసీ సమర్పించని మిగిలిన దరఖాస్తులను కూడా తిరస్కరిస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలాల్లో భవిష్యత్తులో కూడా ఎటువంటి భవన నిర్మాణాలకు అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు. దీంతో దరఖాస్తుదారులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

బృహత్‌ ప్రణాళిక.. తప్పుల తడక 
ప్రస్తుతం హెచ్‌ఎండీఏ బృహత్‌ ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌) తప్పుల తడకగా ఉంది. దీనివల్ల మరో 10 వేల మంది దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం అనేక ప్రాంతాల్లో పెద్దపెద్ద చెరువులున్నట్లు చూపిస్తున్నారు. ఇలా చెరువులున్నాయన్న ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారు. క్షేత్రస్థాయిలో చూస్తే చెరువులే లేవని తేలింది. దాదాపు పదివేల దరఖాస్తులు పరిశ్రమల జోన్‌ పరిధిలోకి వచ్చినట్లు బృహత్‌ ప్రణాళిక చూపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఒక్క పరిశ్రమ లేకపోగా వందలాది ఇళ్లు ఉన్నాయి. బృహత్‌ ప్రణాళిక అంతా తప్పులతడకగా ఉండడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఆ తప్పులను సవరిస్తేనే ఫలితం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తప్పులను సరిదిద్దడానికి అవకాశమివ్వాలని హెచ్‌ఎండీఏ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

HMDA_LRS.jpg

Link to comment
Share on other sites

  • Replies 547
  • Created
  • Last Reply

మద్యం వేళలు పెంపు
13-09-2017 02:51:41

  • రాజధానిలో 11 గంటల వరకు మద్యం
  • ఉదయం గంట.. రాత్రి గంట అదనం
  • జిల్లాల్లో 10 గంటలకే షురూ.. రాత్రి యథాతథం
  • ప్రతీ షాపు ముందు సీసీ కెమెరా ఉండాల్సిందే
  • కంట్రోల్‌ రూమ్‌కు కెమెరా అనుసంధానించాలి
  • మద్యం విధానం వెల్లడి... నేడు నోటిఫికేషన్‌
హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం షాపుల వేళలను పెంచారు. రాజధాని హైదరాబాద్‌లో రెండు గంటలు పెరగ్గా, జిల్లాల్లో గంట సమయం పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఉదయం 11 గంటలకు మద్యం షాపులు తెరుస్తున్నారు. రాత్రి పది గంటలకు మూస్తున్నారు. అంటే, పదకొండు గంటలు అమ్ముకొనే అవకాశం ఇచ్చారు. అక్టోబరు ఒకటి నుంచి రాష్ట్ర రాజధానిలో ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 11 గంటల వరకు అమ్ముకోవచ్చు. అంటే, 13 గంటలపాటు వ్యాపారం చేసుకోవచ్చు. జిల్లాల్లో ఉదయం పది గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు మూసేయాలి. అంటే, 12 గంటలపాటు వ్యాపారం చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రమంతటా మద్యం విక్రయ వేళలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవి. కొత్త రాష్ట్రం వచ్చాక మద్యం పాలసీలో మార్పు తెచ్చారు.
 
శాంతి భద్రతల జాగ్రత్తతో పోలీసులు ఒత్తిడి చేయడం కారణంగానే రాష్ట్రమంతటా మద్యం దుకాణాలను పది గంటలకే మూసేసే నిబంధనను తీసుకొచ్చారు. రాజధాని నగరంలో మద్యం వ్యాపారానికి ఇదో పెద్ద అవరోధంగా మారడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పాత వేళల బాట పట్టింది. ఇప్పటికే బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేలా అనుమతి ఇచ్చింది. ఒంటి గంట వరకు ఫుడ్‌ను సర్వ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. తాజాగా రాజధాని వరకు తిరిగి ఉమ్మడి రాష్ట్రం నాటి వేళలనే పునరుద్ధరించారు. జిల్లాలకూ ఉదయం ఒక గంట అదనపు సమయం ఇచ్చారు.
మంగళవారం ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ జీవో జారీ చేశారు.
 
కొత్త విధానం అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 2,217 మద్యం షాపులకు లైసెన్సులను జారీ చేస్తారు. దరఖాస్తు ఫీజును రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఆరు స్లాబులుగా ఉన్న లైసెన్సు ఫీజును నాలుగు స్లాబులకు కుదించారు. జీఎస్‌టీ ప్రభావం పడకుండా ఎక్సైజ్‌ లైసెన్స్‌ అనే పదాన్ని తొలగించి ఎక్సైజ్‌ ట్యాక్స్‌గా మార్చారు. కొత్త షాపుల కోసం దరఖాస్తులను ఆహ్వానించడానికి గురువారం నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు 19వ తేదీ వరకు ఉంటుంది. 22న లక్కీ డీప్‌ తీసి షాపులకు లైసెన్సులను జారీ చేస్తారు. ఏ జిల్లాలోని షాపులకు ఆ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో లైసెన్సులు ఇస్తారు.

Hammayya..mari 10 ke close chestunnaru...good decision

Link to comment
Share on other sites

తగ్గిన తెలంగాణ ఆదాయం
13-09-2017 22:02:45
 
హైదరాబాద్: తెలంగాణ ఆదాయంపై జీఎస్టీ ప్రభావం పడింది. గత ఏడాది ఆగస్టు కంటే.. ఈ ఆగస్టు నెలలో తెలంగాణ ఆదాయం తగ్గింది. ఈ ఆగస్టు నెలలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం రూ. 2,661.28 కోట్లు రాగా, గత ఏడాది ఆగస్టు నెలలో రూ.2822.14 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం వచ్చిన ఆదాయంలో పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ. 682.69 కోట్లు, మద్యం ద్వారా రూ. 565.60 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ.154.20 కోట్ల ఆదాయం వచ్చింది. ఎస్‌జీఎస్‌టీ ద్వారా రూ. 840.79 కోట్లు, ఐజీఎస్‌టీ ద్వారా రూ. 418 కోట్లు ఆదాయం వచ్చింది. కాగా, ఆగస్టులో ఐజీఎస్టీ ద్వారా కేంద్రానికి రూ.24,021 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణ వాటా కింద 6 నుంచి 8 వందల కోట్లు వస్తాయని అంచనా ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు
Link to comment
Share on other sites

40 years krithan telisina valla fater ofice lo 100 members kalipi hitech city daggara gajam 2 rs tho 5 acers konnaru... individual plots...

Hightech city kattaka evado aakraminchi motham villas katti dobbi ... revenue office lo records maarchi paresadu... even court judge kooda vallake favour

Link to comment
Share on other sites

Irrigation lo open ga talk nadustundi and Raghu e.t.c said same

Kaleswaram design marchi water LIFT HEIGHT drastic ga penchi Power ki Over Demand create chestunaru....Myhome has new power projects .....

prastutam private valla daggara cheap ga power unna kuda konatledu ani chetunaru...Chattisgadh di already over price lo kontunaru...

Link to comment
Share on other sites

చూడు చంద్రముఖి లా మారుతున్న గంగను చూడు…..పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడు అని సినిమాలో అంటే చూసేసి చంద్రముఖి సినిమాని సూపర్ హిట్ చేసేశాము. అలాగే చూడండి కవితమ్మ లా మారుతున్న బతుకమ్మని చూడు… పూర్తిగా కవితమ్మ లా మారిన బతుకమ్మ ని చూడు అనుకొని ఇప్పుడు ఈ బంగారు బతుకమ్మ అనే కమర్షియల్ సినిమా ని హిట్ చెయ్యక తప్పని పరిస్థితి వచ్చింది.

జాన్ పెర్కిన్స్ తన కన్ఫెషన్ ఆఫ్ ఎ ఎకానామిక్ హిట్ మ్యాన్ లో చెప్పినట్లు ఒక సంస్కృతి ని ధ్వంసం చెయ్యాలంటే ముందుగా ఆ సంస్కృతి మంచిది కాదు అని చెప్పాలి. తద్వారా ఆ ప్రాంత సంస్కృతిని దెబ్బతీసి తమ సంస్కృతిని అక్కడ స్థాపిస్తే చాలు. ఆ జాతి లేదా దేశం మొత్తం పాదాక్రాంతమవుతుంది, ఎందుకో కానీ, ఈ ఫార్ములా ప్రపంచం మొత్తం హిట్ అయ్యింది కానీ భారతదేశం దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అయ్యింది. కానీ ఆ సంస్కృతి మీద దాడి మాత్రం మరో విధంగా జరుగుతూనే ఉంది, దానికి మరో మార్గం ఆ సంస్కృతిని సామాన్య ప్రజలకు దూరం చెయ్యటం. ఇది మాత్రం క్రమక్రమంగా భారతదేశంలో సక్సెస్ అవుతూనే ఉంది. అందులో భాగమే ఇప్పుడు బతుకమ్మ ను కమర్షియలైజ్ చెయ్యటం. ఇప్పటికే వినాయక చవితి ఉత్సవాలను కమర్షియలైజ్ చేసి, భక్తిని విగ్రహాల సైజుల్లో, లడ్డుల బరువుల్లో కొలిచి, ఎవడు ఎంత గొప్ప భక్తుడో అని తేల్చుకొనే అడ్డాగా తేల్చేశాక, అత్యంత గొప్ప భక్తుడు ఎవడంటే అత్యంత ఎక్కువ ఖర్చు పెట్టేవాడే అని అందరూ నిర్ణయించేశారు. ఇప్పుడు ఇదే పరిస్థితి బతుకమ్మకు వచ్చింది

తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణా సంస్కృతి పునరుజ్జీవం అనే పేరుతో సామాన్య ప్రజలు అత్యంత సహజంగా చేసుకొనే ఒక పండగను పట్టణ నడివీదుల్లోకి లాక్కొచ్చి , అత్మీయ దేవతను ఆడంబరాల బొమ్మగా మార్చి వైభవోపేతం అనే ట్యాగ్ లైన్ తగిలించి కలర్ ఫుల్ లైట్లతో అలంకరించేశాక, బతుకమ్మ లో జీవం పోయి, కేవలం బొమ్మ లా మిగిలిపోయింది, తెలంగాణా ఉద్యమానికి దన్నుగా బతుకమ్మ లాంటి సామాన్యుల సామూహిక ఉత్సవాన్ని వాడుకోవటం, తద్వారా ఒక ఉద్యమ స్పూర్తి తీసుకురావటంలో ఆక్షేపణ ఏమీ లేదు, బాల గంగాధర్ తిలక్ కూడా వినాయక ఉత్సవాలను స్వాతంత్ర కాంక్ష రగిలించటానికి ఒక సాధనంగా వాడుకొనే సామూహిక నిమజ్జనం అనే కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చాడు, అది స్వాతంత్ర పిపాసను రగిలిస్తే . ఇది ప్రత్యేక తెలంగాణా పిపాసను రగిలించాయి, ఇవి రెండూ ఖచ్చితంగా గొప్ప పరిణామాలే. సామాన్యుల కు దగ్గర కావాలంటే వారి సంస్కృతిని ప్రతిబింబించే ఉత్సవాల ద్వారానే దగ్గర కాగలం అని చెప్పే పరిణామాలే, దగ్గర కావటం వరకు చాలా మంచిది, కానీ ఆ దగ్గరవటం క్రమక్రమంగా ఆ సంస్కృతిని తన గుప్పిట్లోకి తీసుకుంటే….. అప్పుడు అది సామాన్య ప్రజలకు దూరం అవుతుంది, కూలీ వర్గాల నుండి పాలక వర్గాల చేతుల్లోకి వెళ్తుంది.

పండగలు అన్నీ సామూహిక ఉత్సవాలే అయినా , కొన్ని పండగలు మాత్రం వ్యక్తి గతం కన్నా జరుపుకొనే దానికన్నా సామూహికంగా జరుపుకొనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పండగలు కూలీ వర్గాలు జరుపుకొనే పండగలయిఉంటాయి,భూస్వామ్య వర్గాలు ఇలాంటి సామూహిక పండగలకు కొంచెం దూరం పాటించటం కద్దు. బతుకమ్మ పండగ కూడా ఇలాంటి పండగే. కల్లా కపటం తెలియని అచ్చమైన పల్లెపండగ, సామాన్య ప్రజలు మాత్రమే జరుపుకొనే పండగ. హిందూ మతంలో సాధారణంగా కనిపించే విగ్రహారాధన అనే భావన కూడా లేకపోవటం ఈ పండగ ప్రత్యేకత, ఇది పామరుల పండగ తప్ప, పండితుల పండగ కాదు అని చెప్పటానికి ఇది కూడా ఒక నిదర్శనం, కేవలం ప్రకృతిలో లభించే సహజమైన పూలతో పల్లెటూరి ప్తజలు ప్రేమగా పేర్చుకొని తమ తోబుట్టువులా భావించి మహిళలు సాయం సంధ్యవేళ పాడుకొనే పాటంత సహజమైన పండగ.

అసలు బతుకమ్మ పండగ ఎందుకు జరుపుకుంటారు అనే దానికి చాలా కథనాలున్నాయి, అప్పట్లో భూస్వామ్యుల అకృత్యాలు భరించలేక మరణించిన ఆడపడుచులను తలచుకొని బాధపడుతూ, బతుకమ్మా..బతుకమ్మా అని వారినుద్దేశించి , చనిపోయిన వారి గుర్తుగా పువ్వులు పేర్చి (భారతీయ మహిళల్లో పువ్వులు సౌభాగ్యానికి చిహ్నం) వారిని పూజించటం అనే ఒక సాంప్రదాయం గా ప్రారంభం అయ్యింది అనేది ఒక కథనం, ఇలాంటి కథలు ఆంధ్రా ప్రాంతంలో ఉండటం కూడా గమనార్హం, ప్రసిద్ది పొందిన తిరుపతమ్మ కథ కూడా ఇలాంటిదే , బతుకమ్మ చుట్టూ చేరి పాడే పాటల్లో అంతర్లీనంగా ఒక విషాద వీచిక వినిపించటం కూడా ఈ కథనానికి బలం చేకూరుస్తున్నాయి. అంతే కాదు, చాలా పాటల్లో ` బావిలో పడ్డ ` లేదా ఆ అర్థం వచ్చేలా పదాలు ఉండటం కూడా గమనించాలి, బహుశా ఇదే కారణంతో భూస్యామ్య వర్గాలు ఈ పండగకు బడుగు ప్రజలు ఇచ్చినంత గొప్ప ప్రాధాన్యత ఇవ్వలేదు.

మరో కథనం ప్రకారం బతుకమ్మను గౌరమ్మ తల్లి గా భావించి పూజించటం కూడా , ఈ పండగ వచ్చే సమయానికి వర్షాకాలం దాదాపుగా పూర్తవుతుంది. శీతాకాలం వస్తుంది , వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పడతాయి, ఆ సందర్బంగా గౌరీ దేవి ( గౌరి దేవి శక్తి కి ప్రతిరూపం, గ్రామదేవతలన్నీ గౌరి దేవి రూపాలే ) కి తమ కృతజ్ఞత తెలియచేసుకోనే పండగ అనే ఒక వాదన కూడా ఉంది, ఇది కూడా సామాన్య ప్రజలు చేసుకొనేదే. గ్రామదేవతలకు కూడా ఒక నిర్దిష్టమైన రూపం అంటూ ఉండకపోవటం , బతుకమ్మ కి కూడా ఒక నిర్దిష్టమైన రూపం లేకపోవటం కూడా గమనార్హం.,

ఇలా చాలా కథలు ప్రచారంలో ఉన్నా, ఇది బడుగు ప్రజల, శ్రామిక ప్రజల పండగ అనటంలో మాత్రం సందేహం లేదు. ఈ పండగలో ఎక్కడా భూస్వామ్య వర్గాలకు స్థానం లేదు. బతుకమ్మ కోసం పాడే జానపదుల పాటల్లో కానీ, ఎక్కడా ఈ వర్గాల ప్రస్తావన లేదు, ఎక్కడా మంత్రతంత్రాలు లాంటి భూస్వామ్య వర్గ పండగ లక్షణాలు లేవు . ఇలా ఏ లక్షణం చూసుకున్నా, ఇది సామాన్య ప్రజల పండగే అనేది సుస్పష్టం

కొన్ని శతాబ్దాలుగా బడుగు ప్రజలకోసం, వారి ఆనందోత్సాహాలలో భాగమైన ఈ బతుకమ్మ ఇప్పుడు క్రమక్రమంగా కమర్షియలైజ్ అయిపోతుంది, ఆదునికతను సంతరించుకొని, ఆడంబరాలను అద్దుకొని అందరి పండగ కాస్త, కొందరి పండగ గా మారిపోతుంది. తంగేడు పూలు , బంతి, చామంతుల తో అందంగా రంగు రంగులతో కనపడే బతుకమ్మ, ఇప్పుడు బంగారు బతుకమ్మ అయిపోయింది. ఇప్పుడు బతుకమ్మ ఒక ఈవెంట్, ఇప్పుడు బతుకమ్మ ఒక డాన్సింగ్ ఈవెంట్, ఒక సింగింగ్ ఈవెంట్ అన్నీ కలిసిన ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్. మన పండగను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలంటే పండగను అత్యంత సహజంగా తీసుకెళ్లాలి కానీ, ఇక్కడ మన పండగ కొత్త రెక్కలు తొడుక్కుంది, కొత్త కొత్త పువ్వులొచ్చి చేరాయి, అక్కడక్కడా బంగారు పువ్వులొచ్చి చేరాయి, ఇప్పుడు ఈ పండగ చెయ్యటానికి ఈవెంట్ మానేజర్స్ వచ్చారు, తెలంగాణా జాగృతి పేరుతో రంగంలోకి దిగిన ఒక ఈవెంట్ మానెజ్ మెంట్ సంస్థకు ఈ పండగ మీద పేటెంట్ హక్కులు ఇచ్చేశారు, ఇప్పుడు ఈ మేనేజర్స్ ఏ వీదిలో పండగెప్పుడు జరగాలో డిసైడ్ చేస్తారు. ఏ వీదిలో ఎంత మంది ఆడియన్స్ ఉండాలో డిసైడ్ చేస్తారు, బతుకమ్మ సైజ్ డిసైడ్ చేస్తారు, ఆ డాన్స్ లో ఏ స్టెప్స్ వెయ్యాలో, ఏ పాట పాడాలో,….. ఒక్కటేమిటి అన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇక దాని మీద ప్రసార హక్కులూ వాళ్లవే. ప్రసారం కలర్ ఫుల్ గా ఉండటం కోసం పట్టు చీరలకు తప్ప నూలు చీరలకు చోటుండదు. కెమెరా యాంగిల్స్ ని బట్టి లిప్ స్టిక్ వేసుకున్న నవ్వులు అందంగా ఫోజులు ఇస్తాయి. సహజమైన చలోక్తులు ఉండవు. సత్తుపిండి ని అమ్మే స్వీట్ షాపులొస్తాయి. అందమైన పాకెట్లలో ఒకరికొకరు అందించుకుంటారు. ఎవరి పాకెట్ సైజ్ పెద్దదో వాడికి ఎక్కువ ప్రేమ ఉన్నట్లనిపిస్తుంది. ఇవన్నీ మనకు తెలియకుండానే జరుగుతుంటాయి . తెలంగాణా దాటిన బతుకమ్మ దేశవిదేశాలకు వీసా పుచ్చుకొని తిరిగేస్తూ తన యాస , బాస, మర్చిపోతుంది.

ఇప్పటి వరకు ఎవరి వీధిలో , ఎవరి గుమ్మం ముందు వాళ్ళు చేసుకున్న అందమైన బతుకమ్మ లో ఒక అమాయకత్వం ఉంటుంది, ఒక స్వచ్చత ఉంటుంది. కానీ ఇకముందు బతుకమ్మలో ఆ స్వచ్చత కనిపించదు. ఆ ఆమాయకత్వం కనిపించదు . కనిపించేది, వినిపించేది అంతా ఆర్భాటమే. పల్లెటూరిలో ఎక్కడైనా దొరికే పువ్వులతో పైసా ఖర్చు లేకుండా జరుపుకొనే బతుకమ్మ ఇప్పుడు కోటీశ్వరురాలు. అక్షరాల15 కోట్లున్న భూస్వామి పుత్రిక అవును ఇప్పుడు ఈ ఈవెంట్ ఖర్చు 15 కోట్లు.

బతుకమ్మ నిండా వెయ్యేళ్ళు బతకాలి, ఆ బతుకు నిండా ఆ స్వచ్చమైన పువ్వులాంటి నవ్వుండాలి తప్ప, ప్లాస్టిక్ నవ్వుల, బంగారు పువ్వుల బతుకు కాదు. బతుకమ్మను ప్రశాంతంగా బతకనివ్వండి.

ఈ సంవత్సరం బతుకమ్మ చీరల పేరుతో జరిగిన ప్రహసనం చాలు, బతుకమ్మ బతుకు ఎటు పోతుందో తెలియటానికి..

Link to comment
Share on other sites

Guest Urban Legend

DKngx-3VwAAasSp.jpg

ap lo gunman ni tosanandhuku racha racha chesi 2 ays vesaru 24*7 news

idhi asala news lo chupisthara ledha

thu lxxx lo hyd media

Link to comment
Share on other sites

Janagama ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమాలపై జనగామ కలెక్టర్ దేవసేన వివరంగా చెబుతున్న సీన్...

Janagama ఎమ్మెల్యే ముత్తిరెడ్డి occupied 5 acres of govt. lake illegally. see collector herself explaining how mla did irregularities and kabjas.

https://www.facebook.com/batukumuchatlu/videos/1952749984967031/

https://www.muchata.com/main-news/collector-devasena-explains-about-irregularities-of-mla-muthireddy/

Link to comment
Share on other sites

Guest Urban Legend

TRS MLA land grabbing

Yadigiri-Reddy_2571.jpgHyderabad : Telangana BJP on Thursday demanded a high level probe into the allegations of land grabbing against TRS party's Jangaon MLA Yadigiri Reddy.

Speaking to media persons here, BJP General Secretary Chinta Samba Murthy said that District Collector Devasena herself has levelled the allegation that the MLA has encroached upon lake land. He said that the TRS MLA, who is a realtor, has been facing several allegations of land grabbing. However, he said that the State Government never ordered investigations into those charges.

The BJP leader reminded that Chief Minister K. Chandrashekar Rao had promised to take stern against those involved in irregularities. Therefore, he said that the Chief Minister should keep his word by ordering a probe against his party MLA.

Link to comment
Share on other sites

TRS govt. is busy turning hyderabad into paris, new york. These small floods happens due to failure of earlier govts. CBN correct ga roads, drainage system veyaledu. Anduke ee problems.

https://twitter.com/PGautham/status/914876800886435842 
https://twitter.com/umasudhir/status/914910812396953600 
https://twitter.com/satyapamula/status/914869579129675778 
https://twitter.com/Frustitute/status/914911572635525120

https://www.facebook.com/pulseoftelangana/videos/517663378588384/

https://www.facebook.com/prabhakarreddy.kallem.5/videos/477637799281070/

http://image.ibb.co/kkkoyw/210hyd_raingal1.jpg

http://image.ibb.co/fhRvdw/2hyd_raingal22.jpg

ZESg1Vm.png

హైదరాబాద్‌ అతలాకుతలం 
గత పదేళ్లలో అక్టోబర్‌ నెలలో అత్యధిక వర్షపాతం 
రాజేంద్రనగర్‌లో 12.6 సెం.మీ. 
ఐదు ప్రాంతాల్లో 10 సె.మీ. పైగా.. 
ఇంతకు ముందు రికార్డు 2013 అక్టోబరు 10న 9.8 సెం.మీ. 
సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో ఆకాశం భల్లున బద్దలైందా అన్నట్లుగా హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆకాశం చిల్లుపడిందా అన్నట్లుగా 13 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది. గత పదేళ్లలో అక్టోబరు నెలలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. మీరాలంలో 13.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్‌లో 12.6, అంబర్‌పేట 12.03, గోల్కొండ 10.4, మోండా మార్కెట్‌లో 10.4 సెం.మీ. వర్షం కురిసింది. అంతకు ముందు 2013 అక్టోబరు 10న 9.8 సెం.మీ.ల వర్షం కురిసినట్లు వాతావరణశాఖ రికార్డుల్లో ఉంది. విద్యుత్‌ తీగ పడి ఒకరు మృతి చెందగా మట్టి గోడ కూలి తండ్రీ కుమారుడు చనిపోయారు. సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు వేర్వేరు ఘటనల్లో తల్లీకొడుకులు నలుగురు చనిపోయారు. నగరంలో దాదాపు 300 కాలనీలు, రెండు వందల కూడళ్లు వరద ముంపులో ఉన్నాయి. దాదాపు పది వేల ఇళ్లలోకి వాననీరు చేరిందని అంచనా.

పొంగిపొర్లిన నాలాలు, రహదారులు 
నగరంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో రహదారులు, నాలాలు పొంగిపొర్లాయి. చెరువులు నిండి కాలనీలు, రహదారుల్లోని వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.సెల్లార్లు సెప్టిక్‌ ట్యాంకులుగా మారాయి. వాహనాలు ఎక్కడికక్కడ వరద నీట మునిగిపోయాయి. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. హుస్సేనీ ఆలం పోలీసుస్టేషన్‌ పరిధిలో మురిగిచౌక్‌ ప్రాంతంలో ఒక రిక్షాకార్మికుడి ఆటోపై కరెంట్‌ వైరు తెగిపడటంతో అక్కడికక్కడే అఫ్సర్‌ అనే వ్యక్తి చనిపోగా, బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో నాయుడునగర్‌ దోబీఘాట్‌ వద్ద మట్టిగోడ కూలి యాదుల్లా(30), అతని నాలుగు నెలల కుమారుడికి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అంతకు కొద్ది క్షణాల ముందే యాదుల్లా భార్య, మరో కుమారుడు బయటకు రావడంతో పెనుప్రమాదం తప్పింది.

వరదనీటిని దాటే ప్రయత్నంలో వాహనాలు, ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ సమస్య తీవ్రమై రాకపోకలకు గంటల తరబడి అంతరాయం కలిగింది. అర్ధరాత్రి వరకూ ఇదే పరిస్థితి. ముషీరాబాద్‌, కాప్రాలలో 9.5 సెం.మీ., నారాయణగూడ 9.3, విరాట్‌నగర్‌ 9.2, సైదాబాద్‌ 9.1, బండ్లగూడ 8.9, ఎల్‌.బి.నగర్‌లో 8.4, చార్మినార్‌లో 7.6, అమీర్‌పేటలో 7.5 సెం.మీ.వర్షం కురిసింది.

* రాజేంద్రనగర్‌ నుంచి శంషాబాద్‌ వెళ్లే వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఎగువ నుంచి వచ్చిన వరదతో పిల్లర్‌ నెం.192 వద్ద మోకాల్లోతు నీరు నిలిచింది. సిబ్బంది అందుబాటులోలేక బల్దియా ఇంజినీరింగ్‌ అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు నానా అవస్థలు పడ్డారు. ఇదే ప్రాంతంలో రెండు సబ్‌స్టేషన్లు నీట మునిగడంతో అధికారులు అప్రమత్తమై సరఫరా నిలిపేశారు.

* చాంద్రాయణగుట్ట పైవంతెన కింద చేరిన నీరు చెరువును తలపించింది. కాప్రాలో మునుపెన్నడూ లేని విధంగా పాదచారుల బాటపై కూడా వరద ప్రవహించింది.

* పంజాగుట్ట మోడల్‌హౌజ్‌, రాజ్‌భవన్‌రోడ్డు, మూసాపేట్‌, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, కార్వాన్‌, జియాగూడలోని పలు ప్రాంతాలతోపాటు నాంపల్లి యార్డులోకి రెండుఅడుగల వరద నీరు చేరింది. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కొంతసేపు నిలిపివేశారు.

* సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని పట్టాలపై నీరు చేరింది. మల్కాజిగిరి మరోమారు వణికిపోయింది. ఆర్‌కేపురం, సఫిల్‌గూడ చెరువుల నుంచి వచ్చిన వరదతో బండ చెరువు మళ్లీ ఉప్పొంగింది. ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, షిర్డీనగర్‌, తదితర ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.

వర్షం తగ్గినా ఆగని వరద 

శేరిలింగంపల్లి, చందానగర్‌, కొత్తపేట, హైటెక్‌సిటీ, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, బయోడైవర్సిటీ పార్కు, గచ్చిబౌలి మొదలు.. కూకట్‌పల్లి, మియాపూర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట.. నాంపల్లి, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, లకడికాపూల్‌, అంబర్‌పేట, బీఎన్‌రెడ్డినగర్‌, నల్లకుంట, విద్యానగర్‌ ఇలా నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. కూకట్‌పల్లి ప్రధాన నాలా పక్కన ఉన్న అనేక కాలనీలు వరదనీటిలో చిక్కుకున్నాయి.

* రాజధానిలో కొన్ని ప్రాంతాల్లో రహదారులపై రెండు మూడు అడుగుల నీరు చేరడంతో అధికారులు చాలా కాలనీల విద్యుత్తు సౌకర్యాన్ని నిలిపివేశారు. మంగళవారం పునరుద్ధరించాలని నిర్ణయించారు.

సెలవురోజు కావడంతో కాస్త వూరట 
గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడినా ట్రాఫిక్‌ సమస్య తలెత్తలేదని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అయ్యప్పసొసైటీ, దుర్గంచెరువు దిగువ భాగం, తదితర ప్రాంతాల్లోని కాలనీలు నీటమునిగాయన్నారు. ప్రధాన నగరంలోని అన్ని ప్రాంతాలూ జలమయమయ్యాయని, ట్యాంక్‌బండ్‌, ఆదర్శ్‌నగర్‌, తెలుగుతల్లి పైవంతెన కింది నుంచి వచ్చిన వరదతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం సైతం నీట మునిగిందని వివరించారు. బల్దియా వర్షకాల అత్యవసర సిబ్బంది ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టారని కమిషనర్‌ డాక్టర్‌.బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.. సగం మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి పనులపై 5 నుంచి పది శాతం పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి.. వీటికి తోడు సెటిల్‌మెంట్లు కూడా చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నట్లు తెలిసింది.. తమ వ్యవహారాలను చక్కబెట్టడానికి ఏజెంట్లను నియమించుకున్నట్లు సమాచారం.. జిల్లా అధికార యంత్రాంగం ఇదే దారిలో నడుస్తున్నట్లు విమర్శలున్నాయి. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు..

కరీంనగర్: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారగణంలో జవాబుదారీతనం పెంచి ప్రభుత్వ కార్యా లయాల్లో అవినీతిని రూపుమాపుతా మని చెప్తూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర స మితి ప్రభుత్వంలో జిల్లాలో ఆ పార్టీకి చెం దిన ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు ఎదు ర్కోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మె ల్యేలపై అవినీతి ఆరోపణలు రావడమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో రోజురోజుకు అవినీతి అం తులేకుండా పెరిగిపోతున్నదని, అధికారుల లంచాల పర్వానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నదని ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో సగం మంది ఎమ్మెల్యేలపై..
కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మంది అధికార పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇప్పుడు ఈ ఎమ్మె ల్యేలలో సగం మంది అవినీతి ఆరోపణలలో కూరుకు పోయారు. మంత్రులిద్దరిపై ఎలాంటి అవినీతి ఆరోపణ లు లేకున్నా పలువురు శాసనసభ్యులు అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా నామినేషన్‌ వేసేనాటికి ఒక్క రూపాయి ఆస్తికూడా లేదని, ఇన్‌కాంటాక్స్‌ పరిధిలోకే రానని చెప్పిన ఒక ఎమ్మెల్యే ఏకంగా వంద కోట్ల రూపాయల ఆస్తులు ఈ మూడు సంవత్సరాల్లో సంపాదించారని ఆరోపణలు రా వడం జిల్లాలోనే కాకుండా టీఆర్‌ఎస్‌ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నది.

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు చెందిన ఈటల రాజేందర్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో ఏ అభివృద్ధి పథకం ప్రతిపాదనతో ఆయనకు వద్దకు వెళ్లినా లేదనకుండా నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేస్తుండడంతో ఏ ఇతర జిల్లాకు రానివిధంగా పెద్దఎత్తున నిధులు మంజూరయ్యాయి. ప్రతి నియోజ క వర్గంలో పలు అభివృద్ధి పనులు జరుగుతుండడంతో ఈ పనులే అవినీతి కేంద్రాలుగా మారిపోతున్నాయి.

ప్రతి పనికి 5 నుంచి 10 శాతం..
కొందరు శాసనసభ్యులు నిజాయితీగా ఆ పనుల విషయంలో ఏమాత్రం పట్టించుకోకుండా కాంట్రాక్టర్ల ను త్వరగా పనులు పూర్తి చేయాలనే విషయంలో మా త్రమే అజమాయిషీ చేస్తుండగా మరికొందరు శాసన సభ్యులు మాత్రం 5 నుంచి 10 శాతం సొమ్ము ముం దుగా తమకు ముట్టచెబితేనే పనులకు శంకు స్థాపన చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ బి నా మీలను కాంట్రాక్టర్లుగా రంగప్రవేశం చేయించి కాం ట్రాక్టు సొమ్ములో మూడో వంతుకుపైగా స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు మరికొందరు ఎ మ్మెల్యేలపై వస్తున్నాయి. పలు నియో జకవర్గాల్లో అభివృద్ధి పనుల్లో 5 నుంచి 10 శాతం మామూలు ఇవ్వడమనేది వ్యవస్థీకృ తమై శాసనసభ్యుల ఇంటికి ఆ మొత్తం ముందుగానే నడిచి వస్తు న్నాయని చెబుతున్నారు.

పర్సంటేజీలకు తోడు సెటిల్‌మెంట్లు..
మరికొందరు శాసనసభ్యులు అభివృద్ధి పను ల్లో మామూళ్లు దండుకోవడంతో సరిపెట్టుకో కుం డా తమ తమ నియోజకవర్గాల పరిధిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఏవైనా సమస్యలు ఉంటే సెటిల్‌ మెంట్‌ చేస్తూ భూములు సంపాదించడం, ఆ స్తులు కూడబెట్టుకోవడం, లక్షల్లో ఆదాయం సమకూర్చు కోవ డం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ఎ మ్మెల్యేలు నియోజకవర్గ పరిధిలో ముగ్గురి నుంచి న లుగురు ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారానే ఇలాంటి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటు న్నారని బా హాటంగానే చర్చించుకుంటున్నారు.

ఫలానా ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలంటే ఫలానా వ్యక్తిని కలవాల నేది ప లు నియోజకవర్గాల్లో జగమెరిగిన సత్యంగా మా రింది. జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేల మీద మినహా కొద్దో గొ ప్పో అందరు ఎమ్మెల్యేలపై ఇలాంటి ఆరోపణలే వ స్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఈ వ్యవహారాల్లో నే రుగానే డీల్‌ చేస్తుండగా మరికొందరు ఎమ్మెల్యేలు బం ధువులు, పీఏలు, బినామీలతో పనులు చక్కబెట్టు కుం టున్నారని అనుకుంటున్నారు.

అధికార యంత్రాంగానిదీ అదే దారి
శాసనసభ్యుల వ్యవహారం ఇలా ఉండగా జిల్లా అ ధికార యంత్రాంగంలో జవాబుదారీతనమే లేకుండా పోయిందని, అవినీతి గత ప్రభుత్వ హయాంలో కం టే మితిమీరిపోయిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్త మవుతున్నది. జిల్లాస్థాయి అధికారుల్లో ప్రజాప్రతి ని ధులంటే గౌరవంకాని, చట్టాలు చేసేవారనే భయం కాని లేకుండా పోయిందని, ఏమైనా అంటే తమకు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయ మద్దతు ఉన్నదని అంటున్నారని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులంటే భయభక్తులు లేకపోవడంతో అ ధికారులు పట్టపగ్గాలు లేకుండా అవినీతికి పాల్ప డు తున్నారని, ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి తమ హక్కుగా ఆ సొమ్ము వసూలు చేస్తున్నారని ఆరోపణ లు వస్తున్నాయి. ఎమ్మెల్యేలకు ఈ విషయాలన్నీ తెలి సినా అధికారులను తాము ఏమి చేసే పరిస్థితి లేదని ద్వితీయశ్రేణి నేతల వద్ద వాపోతున్నారని స మా చారం. ప్రభుత్వపథకాల్లో లబ్ధిదా రుల ఎంపికలో ఎమ్మెల్యేలదే తుది నిర్ణయమైనా కొన్ని నియోజకవర్గా ల్లో ఆ ఎమ్మెల్యేలు కూడా జిల్లా ముఖ్య అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఎంపికలు చేసుకో వా ల్సి వస్తున్నదని తెలుస్తున్నది.

తాము చెప్పిన ఏ విషయాన్ని జిల్లాస్థాయి అధికారులు పట్టించుకో వడం లేదని, ఇలా అయితే నియోజకవర్గాల్లో తాము తలె త్తుకొని తిరిగేదెలా అని కొందరు ఎమ్మెల్యేలు మంత్రి ఈటల రాజేందర్‌ వద్ద మొరపెట్టుకున్నారని, దీంతో మంత్రి ఈ సమస్యను పరిష్కరించడమెలాగో తెలి యక తలపట్టుకున్నారని సమాచారం. ఎమ్మెల్యేలు అధికారుల పనితీరుపై గట్టిగా విమర్శిస్తే ఉద్యో గులు పెన్‌డౌన్‌ చేస్తూ నిరసన తెలపడంతోపాటు ఎమ్మెల్యే ల అవినీతిపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నార ని ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. దొందు దొందే కావడంతో ప్రజలు తమ పనుల కోసం పైరవీ కా రు లను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది.

Link to comment
Share on other sites

Kalvakuntla family becoming dangerous decoits and worst than mahametha YSR.

------------------------------------------------------------

దేవునికొండకేదీ అండ? 
చారిత్రక విధ్వంసానికి సిద్ధమవుతున్న అధికార గణం 
గ్రానైట్‌ కోసం 1300 ఏళ్ల చరిత్రకు చరమగీతం 
తాజాగా బయటపడిన జైనతీర్థంకరుడి విగ్రహం 
కోట్లనర్సింహులపల్లిలో రాష్ట్రకూటుల నాటి ఆలయం, కోటలకు ముప్పు 
కొండను గుత్తేదారుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం 
ఆగమేఘాల మీద దస్త్రాన్ని సిద్ధం చేసిన గనుల శాఖ 
కొండను వారసత్వ సంపదగా ప్రకటించాలంటున్న స్థానికులు

అదో చారిత్రక ప్రాంతం.. అక్కడ అడుగు తీసి అడుగేస్తే ఏదో ఒక చారిత్రక సాక్ష్యం స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంటుంది.. అటువంటి అద్భుత వారసత్వ సంపద విధ్వంసానికి పథక రచన జోరుగా సాగుతోంది. 79 ఎకరాల్లో విస్తరించి ఉన్న శతాబ్దాల నాటి చరిత్రను గ్రానైట్‌ రాళ్ల కోసం కాలగర్భంలో కలిపేందుకు గనుల శాఖలో దస్త్రం శరవేగంగా కదులుతోంది. ఇప్పటికే అక్కడ అనేక గ్రానైట్‌ కొండలు, వాటితో పాటే చరిత్రా కనుమరుగైపోయాయి. మిగిలి ఉన్న ఒకే ఒక్క కొండనూ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పేల్చివేయాలనే ఆలోచన రావడమే దారుణం.

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లిలోని కొండను గ్రానైట్‌ క్వారీగా మార్చడానికి అధికార గణాలు సిద్ధమయ్యాయి. ‘ఈనాడు’ ప్రతినిధి ఆ కొండపై, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు అనేక ఆసక్తికర అంశాలను గుర్తించారు. 1300 ఏళ్లనాటి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, కోట తదితరాలన్నీ భావితరాలకు పదిలపర్చడం పాలకుల కర్తవ్యం.

పిళ్లా సాయికుమార్‌ 
 
ఈనాడు, హైదరాబాద్‌

కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర, రామడుగు, బోయినపల్లి, మల్యాల మండలాలు నాణ్యమైన గ్రానైట్‌ రాళ్లకు ప్రసిద్ధి. గ్రానైట్‌ రాయి లాభాలను ఆర్జించిపెడుతుండడంతో కొన్నేళ్లుగా పలువురి కన్ను వీటిపై పడింది. పలు గుట్టలను ఇప్పటికే మింగేశారు. గంగాధర మండలంలో ఇప్పుడు మిగిలింది రెండే కొండలు. అందులో ఒకటి జైన స్థావరంగా వర్ధిల్లిన బొమ్మలగుట్ట. దాన్ని కాపాడుకోవడానికి ప్రజలు పోరాటాలు చేయాల్సి వచ్చింది. మిగిలింది కోట్లనర్సింహులపల్లిలో 79 ఎకరాల్లో విస్తరించి ఉన్న ‘దేవుని కొండ’. ఇప్పుడు కొందరు పెద్దల కన్ను దీనిపై పడింది. కొండపై పురాతన ఆలయాలతో పాటు ఇప్పటికీ ఛేదించని రహస్యాలెన్నో ఉన్నాయి. అటువంటి కొండను ఆరుగురు గుత్తేదార్లకు ధారాదత్తం చేసేందుకు గనుల శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ శాఖలో దస్త్రాలు కదిలిన తీరును పరిశీలిస్తే.. చరిత్ర ధ్వంసమైపోయినా సరే కొండను గుత్తేదార్లకు ఇచ్చేయడమే లక్ష్యమనే ధోరణి అధికారగణాల్లో కనిపిస్తోంది.

అవి రాష్ట్రకూటుల కాలం నాటివి.. 
తెలంగాణలోని పాత కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల పరిధిలోని ప్రాంతాలు రాష్ట్రకూటుల (క్రీ.శ.750-973) కాలంలో ‘సపాదలక్ష’ అనే రాజ్యంలో ఉండేవి. సపాదలక్ష అంటే లక్షా పాతిక వేల గ్రామాలున్న దేశమని అర్థం. దీనికే ‘పోలవస’ అనే మరో పేరూ ఉండేది. రాష్ట్రకూటులకు సామంతులైన వేములవాడ చాళుక్యులు తెలంగాణలోని ప్రాంతాలను పరిపాలించేవారు. వీరి పాలనలోనే ప్రస్తుత కోట్లనర్సింహులపల్లి.. జైన, వైష్ణవ ఆలయాలు, కోటలతో అలరారింది. దీనికి నందికొండ అనే పేరు కూడా ఉంది. కొండపై లక్ష్మీనర్సింహస్వామి ఆలయం అప్పట్లోనే నిర్మితమైంది. ఆలయం పైనున్న శిలపై ఎనిమిది తలలు, 16 చేతులతో చెక్కిన ఉగ్రనర్సింహుడి ప్రతిమ.. ఒక అద్భుత కళాఖండం. ప్రస్తుతం ఉగ్రనర్సింహుడి 8 తలల్లో కుడివైపునున్న మూడు తలలే కనిపిస్తున్నాయి. మిగిలి ఉన్న రూపురేఖలనైనా అపురూపంగా చూసుకోవాలంటూ భారత పురావస్తు సర్వేక్షణ(ఏఎస్‌ఐ) శాఖ ఇటీవల తేల్చింది. ఇటువంటి ఉగ్రనర్సింహుడే ఎల్లోరాలోని 15వ గుహలోనూ ఉన్నట్లు వెల్లడించింది. ఆలయం 150 ఏళ్ల క్రితం వరకు దట్టమైన అడవిలో ఉండేది. 1860లో రామడుగుకు చెందిన కల్వకోట కృష్ణయ్య దేశపాండే దీన్ని కనుగొన్న తర్వాతే ప్రజలకు తెలిసి దేవుని కొండగా ప్రచారంలోకి వచ్చింది.

జంతుజాలమే కారణం 
దేవుని కొండ శిఖరంపై గల కోట వైపు ఎవరూ వెళ్లకపోవడానికి అక్కడనున్న జంతుజాలం కూడా కారణం. చుట్టుపక్కల కొండలన్నింటినీ గ్రానైట్‌ కోసం నామరూపాల్లేకుండా కొట్టిపారేయడంతో అక్కడ నివసించిన ఎలుగుబంట్లు, పాములు, కొండచిలువలు, ముళ్ల పందులు, కోతులు, కొండెంగలు, నెమళ్లు తదితరాలన్నీ దేవుని కొండపైకి చేరాయని గ్రామస్థులు చెబుతున్నారు. సమీప చిప్పకుర్తిలో ఇటీవల గొర్రెలను హతమార్చింది చిరుతపులేనని, అది ఈ కొండపై నుంచే వచ్చిందని చెబుతున్నారు. గతంలో ఇక్కడ విస్తారంగా వర్షాలు పడేవని, గుట్టలను పిండి చేసిన తర్వాత కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలు గ్రామాల వారు వాపోతున్నారు.

రెండు రోజుల్లోనే సర్వే పూర్తి 
విలువైన గ్రానైట్‌తోగల దేవుని కొండను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించి కోర్టు జోక్యంతో వెనకడుగు వేసిన గుత్తేదార్లు.. మళ్లీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు కోర్టుల ప్రశ్నించిన అంశాలు పునరావృతం కాకుండా చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. గుడిని విడిచిపెట్టి 46 ఎకరాల్లోని కొండను ముక్కలు చేసుకొంటామని గుత్తేదార్లు అడగడమే తరవాయి.. గనుల శాఖ సంచాలకుడి నుంచి జనవరి 3న ఒక లేఖ కరీంనగర్‌లోని ఆ శాఖ సహాయ సంచాలకుడికి చేరింది. ఆయన రెండ్రోజుల్లోనే సర్వే పూర్తి చేసి నివేదికను పంపించారు. ఆలయానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోనున్నందున కొండను గ్రానైట్‌ కోసం ఇచ్చేయవచ్చంటూ సర్కారుకు దస్త్రం వెళ్లినట్లు తెలిసింది.

కొండ బద్దలైతే? 
దేవుని కొండ ధ్వంసమైతే శతాబ్దాల చరిత్ర తాలూకు ఆనవాళ్లు, ఇంకా శోధించాల్సిన అంశాలు కాలగర్భంలో కలిసిపోతాయి. అక్కడి జంతుజాలం సమీప గ్రామాల్లోకి చొచ్చుకొస్తాయి. కొండను పేల్చేటప్పుడు ఆ ధాటికి గ్రామంలోని ఇళ్లకు, గుడికీ నష్టం కలుగుతుంది. కొండపై చెక్కిన ఉగ్రనర్సింహుడి ప్రస్తుత రూపురేఖలు కూడా అంతర్ధానమైపోయే ప్రమాదం ఉంది. ఆలయం జోలికి రాకుండానే కొండను బద్దలు చేస్తామనే గుత్తేదార్ల వాదనలు నమ్మశక్యం కానివనడానికి వెదిరలోని మల్లన్నగుట్టే నిదర్శనం. అక్కడ కొండకు ఒకవైపు ఆలయం ఉండగా వెనకవైపు నుంచి కొండమొత్తాన్ని తొలచివేస్తున్న తీరు చూస్తే విధ్వంసం ఎలా ఉంటుందో తేటతెల్లమవుతుంది. మల్లన్న ఆలయంలోని శాసనం కనిపించకుండా పైన సున్నం ఎందుకు పూశారో కూడా పరిశీలించాల్సి ఉంది. మల్లన్న కొండవద్ద ఇలా గ్రానైట్‌ రాళ్లను తొలిచే సమయంలో వెలువడే ముక్కలన్నింటినీ పక్కనే ఉన్న చెరువు వద్ద పోస్తుండడంతో అక్కడిప్పుడు కొత్త కొండ తయారైంది.

కొండా లేదు.. దేవుని పాదాలూ లేవు 
గంగాధర మండలంలోని బుత్కారులో ఇటీవల వరకు ‘దేవుని పాదాలు’ గల గుట్ట.. పాదాలతో సహా కనుమరుగైపోయింది. వెదిరలోని నెమళ్ల గుహలు ఎలుగుబంట్లకు ఆవాసంగా ఉండేవి. జగిత్యాల జిల్లా వెల్గుటూరులో బుగ్గిరాజశ్వేర స్వామి గుహల వద్ద పేలుళ్ల వల్ల అక్కడి విలువైన సంపద నాశనమైపోతోంది. ప్రభుత్వం అనుమతులిస్తే నర్సింహులపల్లిలోని కొండ కూడా వీటి సరసన చేరడం ఖాయం.

బొమ్మల గుట్టను కాపాడగలిగారు 
గంగాధర మండలం కురిక్యాలలోని బొమ్మలగుట్ట.. ఒకప్పుడు జైనులకు ప్రముఖ పుణ్యక్షేత్రం. అక్కడి కొండపై జైన యక్షిణి, వృషభనాథుడు, వర్ధమానవీరుడు తదితరుల విగ్రహాలున్నాయి. కొంతకాలం క్రితం ఆ కొండను కూడా పేల్చివేసే ప్రయత్నాలు జరగ్గా దాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఉద్యమించారు. దీంతో సర్కారు వెనక్కి తగ్గి దాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తున్నట్లు ప్రకటించి కొన్ని మెట్లను కట్టి వదిలేసింది.

150మీటర్ల ఎత్తులో కోట ఆనవాళ్లు 
ఆలయానికి కొంత దూరంలో 150 మీటర్ల ఎత్తులో గల కొండపై కోట, మరికొన్ని ఇతర ఆనవాళ్లు ఉన్నాయి. కొండపైన మెట్లతో కూడిన సన్నటి నేలమాళిగ ఉంది. కొండ దిగువన దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణం చుట్టూ ఎత్తయిన మట్టిగోడ ఉండేది. ఇప్పటికీ కొన్ని చోట్ల నాటి భారీ గోడ, కందకం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గ్రామంలో ‘సవతి నూతులు’ అనే రెండు గుండాలు పక్కపక్కనే ఉన్నాయి. ఒక దాంట్లో ఉప్పునీరు, మరో దాంట్లో తియ్యటి నీళ్లు ఉండేవని గ్రామస్థులు చెప్పారు.

గర్భగుడి నుంచి రహస్య మార్గం!  లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా 16 స్తంభాల మండపం, కొండపై రామాలయం, విశ్వనాథ ఆలయం ఉన్నాయి. నర్సింహుడి ఆలయ గర్భగుడి నుంచి కోనేరు వైపునకు ఒక సొరంగ మార్గం ఉంది. స్వామివారు రాత్రివేళ స్నానం చేయడానికి ఆ మార్గంలో వెళతారనేది భక్తుల నమ్మకం. కోనేరు దిగువ భాగంలో గుల్లగా ఉంటుందని, అక్కడ ఏదైనా మండపం ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. కొండను వారసత్వ సంపదగా ప్రకటించాలి దేవుని కొండకు చెందిన 79 ఎకరాలనూ ప్రభుత్వం వారసత్వ సంపదగా ప్రకటించి అక్కడి ఆలయాలు, కోట, ఇతర చారిత్రక ఆనవాళ్లను కాపాడాలి. రాష్ట్ర, కేంద్ర పురావస్తు శాఖల నిపుణులు విస్తృత పరిశోధనలు నిర్వహించాలి. కొండను గ్రానైట్‌ కోసం లీజుకివ్వాలనే గనుల శాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి.

- కల్వకోట కీర్తికుమార్‌, అనువంశిక ధర్మకర్త, లక్ష్మీనర్సింహస్వామి ఆలయం

ఇక్కడ ఉండడం మా అదృష్టం.. కోట్లనర్సింహులపల్లిలో ఎక్కడ చూసినా చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇంతటి గొప్ప ప్రాంతం కావడంతోనే ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన తర్వాత కరీంనగర్‌లో కాకుండా మా వూరిలోనే ఉంటూ ఎంతో తన్మయత్వం చెందుతున్నా. కొండను బద్దలు చేస్తే దానిపై నివాసం ఉంటున్న జంతువులన్నీ గ్రామంలోకి వచ్చే ప్రమాదం ఉంది.

-సిహెచ్‌.రమణాచారి, కోట్లనర్సింహులపల్లి

పార్శ్వనాథుడు బయటపడిన తీరు అద్భుతం.. పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా నాగలి కొక్కానికి తగిలి ఒక రాయి బయటకొచ్చింది. ట్రాక్టర్‌ను ఆపి చూస్తే అదో విగ్రహం. శాతాబ్దాల నాటి పార్శ్వనాథుడి విగ్రహమని తేలిన తర్వాత మరింత ఆశ్చర్యానికి లోనయ్యా. గ్రామస్థుల సహకారంతో విగ్రహాన్ని గ్రామకూడలిలో నెలకొల్పి చరిత్రను మరింత మందికి తెలిపేలా ప్రయత్నిస్తా.

- ఒగ్గు ఆంజనేయులు, రైతు, కోట్లనర్సింహులపల్లి

నాగలి తగిలి బయటపడిన పార్శ్వనాథుడు  కొండ దిగువన ఎక్కడ చూసినా చారిత్రక సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. రైతు ఒగ్గు ఆంజనేయులు తన పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా జైన విగ్రహం బయటపడింది. అది 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడిదిగా తేల్చారు. రాష్ట్రకూటులు తొలుత జైన మతాన్ని ప్రోత్సహించారు. వారికి సామంతులైన వేములవాడ చాళుక్యులు కూడా అప్పట్లో అనేక హిందూ ఆలయాలు, జైన బసదులు నిర్మించారు. నర్సింహులపల్లిలో ఎక్కడ తవ్వినా ఏదో ఒక చిన్న విగ్రహం లేదా రాతి పాత్రలు లభిస్తుంటాయని గ్రామస్థులు చెబుతున్నారు. నాటి కత్తులు, బాకులు తదితర ఆయుధాలూ బయటపడుతున్నాయి. వాటిని స్థానిక బీరయ్య గుడిలో ఉంచి పూజించడం సంప్రదాయంగా మారింది.

Link to comment
Share on other sites

TRS govt. is busy turning hyderabad into paris, new york. These small floods happens due to failure of earlier govts. CBN correct ga roads, drainage system veyaledu. Anduke ee problems.

హైదరాబాద్‌ అతలాకుతలం 

గత పదేళ్లలో అక్టోబర్‌ నెలలో అత్యధిక వర్షపాతం 

రాజేంద్రనగర్‌లో 12.6 సెం.మీ. 

ఐదు ప్రాంతాల్లో 10 సె.మీ. పైగా.. 

ఇంతకు ముందు రికార్డు 2013 అక్టోబరు 10న 9.8 సెం.మీ. 

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో ఆకాశం భల్లున బద్దలైందా అన్నట్లుగా హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆకాశం చిల్లుపడిందా అన్నట్లుగా 13 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది. గత పదేళ్లలో అక్టోబరు నెలలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. మీరాలంలో 13.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్‌లో 12.6, అంబర్‌పేట 12.03, గోల్కొండ 10.4, మోండా మార్కెట్‌లో 10.4 సెం.మీ. వర్షం కురిసింది. అంతకు ముందు 2013 అక్టోబరు 10న 9.8 సెం.మీ.ల వర్షం కురిసినట్లు వాతావరణశాఖ రికార్డుల్లో ఉంది. విద్యుత్‌ తీగ పడి ఒకరు మృతి చెందగా మట్టి గోడ కూలి తండ్రీ కుమారుడు చనిపోయారు. సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు వేర్వేరు ఘటనల్లో తల్లీకొడుకులు నలుగురు చనిపోయారు. నగరంలో దాదాపు 300 కాలనీలు, రెండు వందల కూడళ్లు వరద ముంపులో ఉన్నాయి. దాదాపు పది వేల ఇళ్లలోకి వాననీరు చేరిందని అంచనా.

పొంగిపొర్లిన నాలాలు, రహదారులు 

నగరంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో రహదారులు, నాలాలు పొంగిపొర్లాయి. చెరువులు నిండి కాలనీలు, రహదారుల్లోని వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.సెల్లార్లు సెప్టిక్‌ ట్యాంకులుగా మారాయి. వాహనాలు ఎక్కడికక్కడ వరద నీట మునిగిపోయాయి. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. హుస్సేనీ ఆలం పోలీసుస్టేషన్‌ పరిధిలో మురిగిచౌక్‌ ప్రాంతంలో ఒక రిక్షాకార్మికుడి ఆటోపై కరెంట్‌ వైరు తెగిపడటంతో అక్కడికక్కడే అఫ్సర్‌ అనే వ్యక్తి చనిపోగా, బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో నాయుడునగర్‌ దోబీఘాట్‌ వద్ద మట్టిగోడ కూలి యాదుల్లా(30), అతని నాలుగు నెలల కుమారుడికి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అంతకు కొద్ది క్షణాల ముందే యాదుల్లా భార్య, మరో కుమారుడు బయటకు రావడంతో పెనుప్రమాదం తప్పింది.

వరదనీటిని దాటే ప్రయత్నంలో వాహనాలు, ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ సమస్య తీవ్రమై రాకపోకలకు గంటల తరబడి అంతరాయం కలిగింది. అర్ధరాత్రి వరకూ ఇదే పరిస్థితి. ముషీరాబాద్‌, కాప్రాలలో 9.5 సెం.మీ., నారాయణగూడ 9.3, విరాట్‌నగర్‌ 9.2, సైదాబాద్‌ 9.1, బండ్లగూడ 8.9, ఎల్‌.బి.నగర్‌లో 8.4, చార్మినార్‌లో 7.6, అమీర్‌పేటలో 7.5 సెం.మీ.వర్షం కురిసింది.

* రాజేంద్రనగర్‌ నుంచి శంషాబాద్‌ వెళ్లే వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఎగువ నుంచి వచ్చిన వరదతో పిల్లర్‌ నెం.192 వద్ద మోకాల్లోతు నీరు నిలిచింది. సిబ్బంది అందుబాటులోలేక బల్దియా ఇంజినీరింగ్‌ అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు నానా అవస్థలు పడ్డారు. ఇదే ప్రాంతంలో రెండు సబ్‌స్టేషన్లు నీట మునిగడంతో అధికారులు అప్రమత్తమై సరఫరా నిలిపేశారు.

* చాంద్రాయణగుట్ట పైవంతెన కింద చేరిన నీరు చెరువును తలపించింది. కాప్రాలో మునుపెన్నడూ లేని విధంగా పాదచారుల బాటపై కూడా వరద ప్రవహించింది.

* పంజాగుట్ట మోడల్‌హౌజ్‌, రాజ్‌భవన్‌రోడ్డు, మూసాపేట్‌, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, కార్వాన్‌, జియాగూడలోని పలు ప్రాంతాలతోపాటు నాంపల్లి యార్డులోకి రెండుఅడుగల వరద నీరు చేరింది. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కొంతసేపు నిలిపివేశారు.

* సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని పట్టాలపై నీరు చేరింది. మల్కాజిగిరి మరోమారు వణికిపోయింది. ఆర్‌కేపురం, సఫిల్‌గూడ చెరువుల నుంచి వచ్చిన వరదతో బండ చెరువు మళ్లీ ఉప్పొంగింది. ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, షిర్డీనగర్‌, తదితర ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.

వర్షం తగ్గినా ఆగని వరద 

శేరిలింగంపల్లి, చందానగర్‌, కొత్తపేట, హైటెక్‌సిటీ, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, బయోడైవర్సిటీ పార్కు, గచ్చిబౌలి మొదలు.. కూకట్‌పల్లి, మియాపూర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట.. నాంపల్లి, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, లకడికాపూల్‌, అంబర్‌పేట, బీఎన్‌రెడ్డినగర్‌, నల్లకుంట, విద్యానగర్‌ ఇలా నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. కూకట్‌పల్లి ప్రధాన నాలా పక్కన ఉన్న అనేక కాలనీలు వరదనీటిలో చిక్కుకున్నాయి.

* రాజధానిలో కొన్ని ప్రాంతాల్లో రహదారులపై రెండు మూడు అడుగుల నీరు చేరడంతో అధికారులు చాలా కాలనీల విద్యుత్తు సౌకర్యాన్ని నిలిపివేశారు. మంగళవారం పునరుద్ధరించాలని నిర్ణయించారు.

సెలవురోజు కావడంతో కాస్త వూరట 

గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడినా ట్రాఫిక్‌ సమస్య తలెత్తలేదని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అయ్యప్పసొసైటీ, దుర్గంచెరువు దిగువ భాగం, తదితర ప్రాంతాల్లోని కాలనీలు నీటమునిగాయన్నారు. ప్రధాన నగరంలోని అన్ని ప్రాంతాలూ జలమయమయ్యాయని, ట్యాంక్‌బండ్‌, ఆదర్శ్‌నగర్‌, తెలుగుతల్లి పైవంతెన కింది నుంచి వచ్చిన వరదతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం సైతం నీట మునిగిందని వివరించారు. బల్దియా వర్షకాల అత్యవసర సిబ్బంది ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టారని కమిషనర్‌ డాక్టర్‌.బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

Last year September 2016 lo kuda floods vochinappudu, V6 News satires on CBN. For small rains, Hyd is getting floods so it is mistake of CBN as he did not built Hyd roads and drainage system properly. See below video. Now after 1 year also they did not make any attempt to repair drainage system...

ఒక గొర్రె : ఇంకో గొర్రెతో ఇలా అందట, ఒరేయ్ మన యజమాని చాలా తెలివైనోడురా లేకపోతే తన భుజం మీదున్న గొంగడితో మన వీపు మీద జుట్టు మెులిచేలా ఎలా చేయగలడు...!

ఇంకో గొర్రె: అవునురోయ్ నిజమే..

నీతి: ఇలాంటి గొర్రెలు ఉన్నంతకాలం వాటి చుట్టూ నక్కలు తిరుగుతూనే ఉంటాయి :roflmao:  :roflmao:  :roflmao:

https://youtu.be/IMZ7cBY3bm0

Link to comment
Share on other sites

వ్యర్థాల వరద 

ఈనాడు, హైదరాబాద్‌

Oct 5, 2017

hyd_Hus_Sagar.jpg

ఇదేదో శివార్లలోని చెత్త నిల్వ కేంద్రం (డంపింగ్‌ యార్డు) కాదు.. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ జలాశయం. రూ. వందల కోట్లతో ప్రక్షాళన చేసినట్లు.. చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే జనం విస్తుపోవాల్సి వస్తోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాలాల నుంచి వరదతోపాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలూ భారీగా చేరి అపరిశుభ్రత తాండవిస్తోంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...