Jump to content

Telangana lo nijalu.


LuvNTR

Recommended Posts

  • Replies 547
  • Created
  • Last Reply

*పతనం దిశగా తెరాస*..!
ఎన్నికల ఫలితాల కోసం డిసెంబరు 11 వ తేదీ వరకు ఆగాల్సినపనిలేదు.
నవంబరు 11 కంటే ముందుగానే, దరిదాపు అక్టోబరు 20 నుండీ 27 మధ్యనే జాతకాలు తెలిపోయేటట్లు కనిపిస్తోంది.

ఎన్నికల ప్రచారంలో క్షేత్రస్థాయిలో తెరాస నాయకులు ఎదుర్కొంటున్న తీవ్ర ప్రజావ్యతిరేకతను ప్రజాప్రతిఘటనలను పార్టీలో అసమ్మతి తిరుగుబాట్లను హైదరాబాద్ మీడియా ఎంతగా తొక్కిపెట్టాలని చూసినా అది సాధ్యపడకపోగా రోజురోజుకి రెట్టింపు అవుతోంది. 
తీవ్ర నిరాశ నిస్పృహలతో తెరాస అభ్యర్థులు ఈ విషయాన్ని కొంతమంది ముఖ్యనాయకుల అధినాయకత్వం దృష్టికి తీసుకువస్తే అంతర్గత సంభాషణగా వారి ముందు పార్టీ ముఖ్యులు రాబోయే ఎన్నికలలో తమ ఓటమిని అంగీకరించారని, గరిష్టంగా 25 సీట్లు మించి రాకపోవచ్చని అన్నట్లు విశ్వసనీయ సమాచారం.
దీనితో ఖంగుతిన్న చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నాయకులు తమ ప్రత్యామ్నాయ భవిష్యత్ ప్రణాళికలు వ్యూహాలు రూపొందించుకుంటున్నారు.
వీరిలో చాలామంది కాంగ్రెస్ తెదేపా అధినాయకత్వం ముందు క్యూ కడుతున్నారు, కొంతమందైతే మీ పార్టీలోకి మమ్మల్ని రానిస్తే చాలు, మాకు ఎటువంటి పదవులు అవసరంలేదు అని బ్రతిమాలుకుంటున్నారు.

తెరాసలోని ఒక ముఖ్యనాయకుడు అయతే ఎన్నికల ఫలితాలు వెలువడినాక నాతోపాటు ఎక్కువమంది ఎమ్మెల్యేలను తీసుకువచ్చి మీతో చేరతాను, నాకు ఏ పదవి ఇస్తారో హామీ ఇస్తే వస్తాను అని ఢిల్లీతో రాయబారాలు నడిపిస్తున్నారు.
అక్టోబరు 20 వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో ఒక కీలక మంత్రి, మరొక కీలక ఎంపీ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోబోతున్నారు.
మరలా రాహుల్ గాంధీ అక్టోబరు 27 వ తేదీన వస్తున్న సందర్భంగా మరొక ఇద్దరు / ముగ్గురు కీలక మంత్రులు, ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇందుకొరకె మహాకూటమిలో సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన ఏర్పడుతోందని తెలుస్తోంది.
కేసీఆర్ ఏనాడూ ఊహించని రీతిలో తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు జట్టుకట్టడంతో దిక్కుతోచని పరిస్థితిలో తీవ్ర నైరాశ్యంలో కావాలనే కేసీఆర్ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ప్రేలాపనలు చేస్తున్నాడని అనుకోవచ్చు.

చంద్రబాబుని టార్గెట్ చేయడం ద్వారా భయపడిన హైదరాబాద్ ఆంధ్రులు మొన్న జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కొర్పొరేషన్ ఎన్నికలలో తెరాసకు ఓటేశారని, ఇప్పుడు కూడా అలాగే వేస్తారనే పిచ్చి భ్రమలో కేసీఆర్ ఉండడం విడ్డూరం.
తెలంగాణలో *పాయింట్ ఫైవ్* శాతం మాత్రమే జనాభా బలం ఉన్నటువంటి కేసీఆర్ & అతని కుటుంబము అధికారమదంతో గత నాలుగేళ్లుగా చేసిన అరాచకాలు కొవ్వెక్కిన మాటలు చూసిన కోటిమంది ఆంధ్రులు తగు సమయం కోసం వేచి చూస్తూ మౌనంగా అన్నీ భరించారు.

చంద్రబాబు నాయుడు మీద తండ్రీ కొడుకు కూతురు మేనల్లుడు ఏమాత్రం గౌరవం మర్యాదలు ఇంగితజ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా అవాకులు చెవాకులు హేళనలు దూషణలు చేసినప్పుడే కేసీఆర్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు.
ఆంధ్రులు ఎప్పటికీ ఛీ కొట్టే ఒక గొంగళిపురుగు లాంటి కేసీఆర్ ని సాటి సోదర పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని గౌరవంతో అమరావతి నగర నిర్మాణ శంఖుస్థాపనకి ఆహ్వానించి అతని పేరు శిలాఫలకం మీద వ్రాయించినా కూడా తన సహజబుద్ధి పోనిచ్ఛుకోకుండా కుట్రలు వెన్నుపోట్లకు మోసానికి మారుపేరైన కేసీఆర్ తన ఆంధ్రా వ్యతిరేక నిజస్వరూపం నిరూపించుకుంటూనే ఉన్నారు.
చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని కేసీఆర్ & కో అన్న ప్రతిమాటా, చేసిన హేళనలు, అవాకులు చవాకులు తెలంగాణలో ప్రతి ఆంధ్రుడూ తనని అన్నట్లుగానే ప్రతి ఆంధ్రుడు భావిస్తున్నారు.
గత నాలుగేళ్ల నుండీ ఇంతవరకూ ఏనాడూ కూడా కేసీఆర్ & కో కుసంస్కారంగా ఎన్ని మాట్లాడినా శ్రీ చంద్రబాబు నాయుడు కేసీఆర్ ని అతని మనుషుల్ని తిరిగి పల్లెత్తి మాట కూడా అనలేదు, అది చంద్రబాబు యొక్క సంస్కారాన్ని తెలంగాణ ప్రజలకు, ప్రపంచానికి తెలియచెప్పింది.

నేడు తెలంగాణ ప్రజలు యావత్తూ నిరంతరం అనుకుంటున్న / తలచుకుంటున్న సామెత "కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోపెట్టినట్లుంది" అని.

కేసీఆర్ ఎప్పుడూ కూడా.. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమని ప్రతి ఆంధ్రుడికి తెలుసు. 
అది అనాదిగా చంద్రబాబు / తెదేపా, సోనియాగాంధీ కాంగ్రెస్, అద్వానీ / బీజేపీ / మోడీ ల విషయంలో కేసీఆర్ బృటస్ పాత్ర తెలియనిది కాదు.
తెలంగాణలో పాయింట్ ఫైవ్ శాతం మాత్రమే ఉన్నటువంటి కేసీఆర్ కులం ఓట్ల ద్వారా అతను ముఖ్యమంత్రి కాలేదు.
కేవలం మాయమాటలు వెన్నుపోట్లు అవకాశవాదం మోసంతోనే ఇన్నాళ్లూ అతను అతని వర్గం పాలిస్తోంది.
నేడు తెలంగాణను ఆర్ధికంగా సర్వనాశనం చేసి 70 ఏళ్ల వెనక్కు నెట్టింది కూడా వీళ్ళే.
ఇప్పుడు కేసీఆర్ మరియ అతని కొడుకు, కూతురు హైదరాబాద్ కిరాయి మీడియా ద్వారా ఎన్ని శాంతివచనాలు నీతిసూక్తులు పలికినా కూడా మేకవన్నె పులుల్లాంటి ఈ కుటుంబాన్ని / ఆ కులాన్ని నమ్మడానికి వినడానికి తెలంగాణా ప్రజలు, తెలంగాణలోని ఆంధ్రా ప్రజలు సిద్ధంగాలేరు.

ఇంకెన్నోరోజులు వీళ్ళు ప్రజల్ని బెదిరించి అదిరించి మోసగించి పోలీసుల పహారాలో అక్రమ కేసులతో, కిరాయి మీడియా ముసుగులో పాలించలేరు.

తెలంగాణాలో కేసీఆర్ & కో గత నాలుగేళ్లలో ప్రతి గడపగడపకు చేసిన తీవ్ర అన్యాయము దగా మోసము దోపిడీ ఇంతా అంతా కాదు.
అమాయక ప్రజల్ని యువతను తన మాయమాటలతో నమ్మించి నిట్టనిలువునా ముంచారు.
నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచారు, యువత జీవితాలను చిదిమేశారు.
రైతుల్ని కల్తీ ఎరువులు పురుగుమందులతో వంచించారు, గిట్టుబాటు ధరలు ఆడిగితే బేడీలు వేసి జైళ్లలో పెట్టారు.
ఇసుక మాఫియా లారీలతో దళితుల్ని తొక్కించి చంపించారు.
కోదండరాం ఇంటిని అర్ధరాత్రి పోలీసులతో పగలకొట్టించి అతన్ని అరెష్టు చేశారు.
అమరవీరులను మరిచారు.
తెలంగాణ పోరాటాయోధుడు బలహీనవర్గానికి చెందిన కీశే కొండా లక్ష్మణ్ మృతిచెందితే పరామర్శకు వెళ్ళలేదు.
కొండగట్టు క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను కనీసం పరామర్శించలేదు.
ఇలాంటి చెప్పాలంటే ఒక పుస్తకమే వ్రాయాల్సి ఉంటుంది.

హైదరాబాద్ నగరం చుట్టుపక్కల రియలేస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై పోలీసులతో ప్రజల్ని బెదిరించి భయపెట్టి అక్రమ కేసులు పెట్టి వందలాది ఎకరాల భూములు ఆక్రమించారు.
చెరువులు వాగులు వంకలు పూడ్చిన అక్రమ లే అవుట్లకు అనుమతులు ఇచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పేరుతో నిరుపయోగమైన ప్రాజెక్టులు కట్టిస్తూ కనీసం లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు.

దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, జిల్లాకోకటి నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హెలికాఫ్టర్ అంబులెన్సులు, హుస్సేన్ సాగర్ ని మినరల్ వాటర్ తో నింపి దానిచుట్టు వంద అంతస్తుల ఆకాశ హార్మ్యాలు, కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రెటరీయేట్, కొత్త ఉస్మానియా ఆసుపత్రి, కొత్త రవీంద్రభారతి, నగరాల్లో స్కైవేలు, రింగురోడ్లు, హైదరాబాద్ కి మరో అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి ఉత్తుత్తి హామీలు కేసీఆర్ ఇఛ్చినవి కోకొల్లలు.
ఇవన్నీ ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు, ఇవన్నీ పిట్టలదొర మాటలని నవ్వుకున్నారు అంతే !

ప్రజలు అంత అమాయకులు కాదు, ప్రజలు కేసీఆర్ కంటే విజ్ఞులు.
సమయం చూసి కర్రుకాల్చి వాతలు పెడతారు.
ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది, కేసీఆర్ దొర కి & అతని కుటుంబానికి & అతని అనుచరులకు తెలంగాణప్రజలు దళితులు బలహీనవర్గాలు యువత నిరుద్యోగులు వ్యాపారులు కర్రుకాల్చి వాతలు పెట్టడానికి సిద్ధపడ్డారు, ఎవ్వరూ వాళ్ళను ఆపలేరు, వీళ్ళను కాపాడలేరు.

హైదరాబాద్ కిరాయి మీడియా ఇప్పటికైనా విజ్ఞతతో సంస్కారంతో భ్రమల్లో నుండీ వాస్తవాల్లోకి వచ్చి,
ఆ కుటుంబ కిరాయి భజనల్లో నుండీ ప్రజల్లోకి వచ్చి, ప్రజాబాహుళ్య ఆకాంక్షలకు అనుకూలంగా మీ కలాలు గళాలు వినిపిస్తే మీకు మర్యాద గౌరవం నిలుస్తాయి.

అలాకాకుండా నేటి నుండి 20 రోజుల తరువాత మీరు మహాకూటమికి అనుకూల వార్తలు ప్రచురించాల్సిన, ప్రసారం చేయాల్సిన పరిస్థితి తప్పదు. అప్పుడు రేపు మీరు నవ్వులపాలు అవ్వడం, మీకు శృంగభంగం అవ్వడం ఖాయం.

మొన్న రేవంత్ రెడ్డి మీడియాను బహిరంగంగా ప్రశ్నిస్తే ప్రజలు హర్షించారు. అతను మీడియాలోని కొందరి డీ ఎన్ ఏ ని ప్రశ్నిస్తే సమాజం రేవంత్ ని శెభాష్ అంది.

ఈరోజు మీ మీడియాకంటే సోషల్ మీడియా, వాట్సప్ లలో ప్రజలు నేరుగా, మీకంటే వేగంగా వాస్తవాలు వార్తలు చేరవేసుకుంటున్నారు.
మీకంటే సోషల్ మీడియానే చాలా బాధ్యతాయుతంగా నిఖార్సుగా నిస్పక్షపాతంగా వ్యవహరిస్తోంది.
ఆపద్ధర్మ తెలంగాణ ప్రభుత్వము, మీరు, పోలీసులు చేరి సోషల్ మీడియా, వాట్సాప్ లను కట్టడిచేయాలని చూస్తే సమాజం తిరగబడడం ఖాయం.

కేసీఆర్ అనుకూల హైదరాబాద్ మీడియా నేటికైనా ఆత్మవిమర్శ చేసుకుని, మహాకూటమికి వ్యతిరేక వార్తల్ని వండి వార్చకుండా, తెలంగాణా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా కేసీఆర్ నియంతృత్వ పాలన, కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా వాస్తవాలను సమాజానికి అందించి మీ నిజాయితీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.
ఈ పోస్టు నా మిత్రులలో ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే మాత్రం నేనేమీ చేయలేను, ఇది పూర్తిగా నా మనస్సాక్షిగా అంతా నిజమని యదార్ధమని నిష్పక్షపాతమని తలచి పూర్తి స్పృహతో తెలంగాణ సమాజాహితం కోరి,తెలంగాణ ప్రజాహితార్ధం వ్రాసాను అని మనవి.

Link to comment
Share on other sites

పేద ఎంపీ....!?
*********************

అనగనగా ఒక పేద కుటుంబం.. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేద వాడు.. తల్లి కూడ పేదదే. వాళ్ళ అమ్మాయి బంజారాహిల్స్ లో కేవలం కోటి 35 లక్షలు విలువ చేసే చిన్న ఇంట్లో భర్త పిల్లలతో జీవిస్తుండేది.(ఆ భర్త మరీ కటిక పేద)

ఆ పేద ఇంట్లో 10 మంది పనివాళ్ళు.. వంటవాడు, తోటమాలి, ఆఖరికి కారు డ్రైవర్ కూడ పేదవాడే..పాపం ఆ పేద అమ్మాయి తినడానికి చికెన్ బిర్యానీ కూడ దొరక్క ఆకలితో ఏసీ కారులో తిరుగుతుంటే ఆ పేద తండ్రి చూడలేక తల్లడిల్లిపోయి మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం కోటి రూపాయలతో భూములు కొనిచ్చి ఆదుకున్నాడు.

చివరకు ఏపని దొరక్క పోతే కూతురు పరిస్థితి చూడలేక చిన్న 'ఎంపీ కొలువు' ఇప్పించాడు.. అయినా ఆ అమ్మాయి పొద్దుపోక, టైం పాస్ కాక బోర్ కొడుతుంది నాయినా అని అడిగితే ఆ పేద కూతురి బాధను చూడాలేక ఏటా 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఇగపో నీ సోపతి గాళ్లతో 'బతుకమ్మ' అడుకపో అని పంపించాడు..

చేసేదేమీ లేక ఇంట్లో ఉన్న కిలోన్నర బంగారాన్నే మార్చి మార్చి వేసుకుంటూ.. సోపతి గాళ్లను వెతుకుంటూ దేశ దేశాలు తిరుగుతూ కాయకష్టం పడుతుంది.

టీవీల్లోకి ఎక్కి కష్టాలు చెప్పుకుంటుంటే మనసు తరుక్కుపోతుంది..పాపం ఇంత పేదరికంతో ఆ తల్లి ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో...?

పగోళ్లకు కూడ రాకూడదమ్మ ఇన్ని కష్టాలు..

kavita-1.jpg


kavita-2.jpg

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...