Jump to content

Telangana lo nijalu.


LuvNTR

Recommended Posts

  • Replies 547
  • Created
  • Last Reply

 

హైదరాబాద్: నేటి రాజకీయాలపై తనకు కొంత వైరాగ్యం వచ్చిన మాట వాస్తవమే అని టీటీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ తాను శేరిలింగంపల్లి నుంచి పోటీచేస్తాననే ప్రచారంలో నిజం లేదని, తాను ఎక్కడ నుంచి పోటీచేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌ సెటిలర్లపై ప్రేమ చూపిస్తారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాకు ఏం చేస్తారో కేసీఆర్‌ చెప్పలేకపోయారన్నారు. గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికుల సమస్యలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. చంద్రబాబు వలనే తెలంగాణ ధనిక రాష్ట్రమైందని మండవ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

తెరాస అభ్యర్థి రేఖా నాయక్‌కు చేదు అనుభవం

హైదరాబాద్‌: తెరాస అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత తప్పడంలేదు. ఖానాపూర్‌ మాజీ ఎమ్మెల్యే, తెరాస అభ్యర్థి రేఖానాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంచిర్యాల జిల్లా చెన్నారం మండలంలో ప్రజలు ఆమెను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాదంపల్లికి వెళ్లిన రేఖానాయక్‌ను నాలుగున్నరేళ్లలో ఒక్కసారైనా రాని వారు ఇప్పుడెందుకు వచ్చారంటూ గ్రామస్థులు నిలదీశారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న కొందరు తెరాస కార్యకర్తలు సైతం ఆందోళనకారులతో గొంతు కలిపారు. తమ ఊరుకు ప్రచారానికి వస్తున్నట్టు తమకూ సమాచారం ఇవ్వరా? అంటూ ఆమెపై మండిపడ్డారు. ప్రచార రథాన్ని ముందుకు పోకుండా అడ్డుకున్నారు. దీంతో అసహనానికి గురైన రేఖానాయక్‌ తెరాస పార్టీ ఎవరికీ భయపడదంటూ.. తెరాస ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది.

KCR might change this candidate. 

Link to comment
Share on other sites

మీకు ఓటెయ్యం.. మా ఊరికి రావొద్దు
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శోభను అడ్డుకున్న గ్రామస్థులు

చొప్పదండి: తెలంగాణలోని పలుచోట్ల మాజీ ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టని మీకు ఓటు అడిగే హక్కు లేదని.. ఇకపై ఓట్ల కోసం తమ గ్రామానికి రావద్దంటూ కొలిమికుంట గ్రామస్థులు ఆమెను అడ్డుకున్నారు. తెరాస తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా శోభ తన అనుచరులతో కలిసి కొలిమికుంట గ్రామానికి వెళ్లారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు ఆమెను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు లబ్ధిదారులకు అందకుండా చేశారని, రైతు సమన్వయ సమితిలో అనర్హులకు చోటు కల్పించారని గ్రామస్థులు శోభపై మండిపడ్డారు. మరోవైపు చొప్పదండి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న తెరాసకు చెందిన మరో నేత సుంకె రవి వర్గీయులు సైతం శోభకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘బొడిగె శోభ.. గోబ్యాక్‌’ అంటూ నినాదాలు హోరెత్తడంతో చేసేదేమీ లేక శోభ అక్కడ నుంచి వెనుదిరిగారు.

Link to comment
Share on other sites

తెరాస ప్రచార రథంపై దాడి

03100601110RATHAM-BRK94A.JPG

షాద్‌నగర్‌: అధికార పార్టీ తెరాస అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి పలు చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని ఫరూక్‌నగర్‌ మండలం గంట్లవెల్లి తండా పరిధిలో తెరాస ప్రచార రథంపై గ్రామస్థులు గురువారం దాడిచేశారు. తండాలో తాగునీటి సమస్య పరిష్కారంలో నేతలు పూర్తిగా విఫలమయ్యారని, దీనిపై వారిని ఎన్నిసార్లు కలిసినా స్పందించడం లేదంటూ గ్రామంలోని కొందరు వ్యక్తులు ఆగ్రహంతో ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. తండాలోని కొందరు ప్రచార రథాన్ని చుట్టిముట్టి ఫ్లెక్సీలు చింపి గొడవ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో తండాకు వెళ్లిన కొందరు నాయకులు గ్రామస్థులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ గ్రామాలకు పార్టీలవారీగా ప్రచార రథాలను తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెరాస ప్రచార రథం గురువారం గంట్లవెల్లి తండాకు చేరుకుంది.

Eenadu is covering anti TRS news in recent past..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...