Jump to content

Anna gari rare photo


vinayak

Recommended Posts

విజయవాడలో నర్రా రామబ్రహ్మం సినీ పంపిణీదారుడు ఉండేవారు. నందమూరి సోదరులు ఎన్టీఆర్, త్రివిక్రమరావులకు ఆప్తమిత్రుడైన అట్లూరి పుండరీకాక్షయ్యతో కలిసి గౌతమీ పిక్చర్స్ బ్యానరును స్థాపించారు. ఆ బ్యానరుపై తొలుత 1962లో 'మహామంత్రి తిమ్మరుసు' సినిమాను నిర్మించారు. ఆ తర్వాత 1967లో 'నిర్దోషి' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వహించింది దాదామిరాసీ అని మహారాష్ట్రకు చెందిన నటుడు, దర్శకుడు. అప్పటికే ఆయన తమిళంలో 9 విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. 
అంతకుముందే 'నిర్దోషి' పేరుమీద 1951లో హెచ్ ఎం రెడ్డిగారు ఒక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆ చిత్రంలో ముక్కామల హీరో. అంజలీదేవికి హీరోయిన్ గా తొలి అవకాశం. నటుడు కాంతారావు కూడా ఈ చిత్రంతోనే పరిచయమయ్యారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రం పేరుతో మరో సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయని తెలుసు. అయినా ఎన్టీఆర్ మీది నమ్మకంతో రంగంలోకి దిగారు నిర్మాతలు. 
చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. వ్యసనాలకు బానిసై, చట్టం దృష్టిలో నేరస్తుడైన దుష్ట పాత్రలో ఒకవైపు, నీతిమంతుడు, సౌమ్యుడు, చేయని నేరానికి నిందమోస్తూ ప్రేమించిన నెచ్చెలి దృష్టిలో అపరాధిగా నిలిచిన వేదనతో కుంగిపోయే నిర్దోషి పాత్రలో మరోవైపు నటించి తన నటనా వైవిధ్యాన్ని రసవత్తరంగా చూపించారు ఎన్టీఆర్. ''మల్లియలారా... మాలికలారా... '' అంటూ సాగే సి. నారాయణ రెడ్డి రాసిన పాట చిత్రీకరణలో ఎన్టీఆర్ చూపిన హావభావాలు అద్భుతం. చిత్రానికి ఘంటసాల మాస్టారే సంగీత దర్శకత్వం వహించారు. మాటలను డీవీ నరసరాజు రాశారు. 
'నిర్దోషి' చిత్ర నిర్మాణ సమయంలో పుండరీకాక్షయ్య, డీవీ నరసరాజు, ముక్కామల, పి.దాదామిరాసి, నందమూరి త్రివిక్రమరావు, నర్రా రామబ్రహ్మంలతో కలిసి ఎన్టీఆర్ దిగిన ఫోటో ఇది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...