Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

JVC

బళ్లారి బాలయ్య

Recommended Posts

బళ్లారి బాలయ్య 
kar-sty3a.jpg

బళ్లారి: ప్రతి సినిమా నటుడికి అభిమానులు ఉండటం సహజమే. సినిమా విడుదలైన వెంటనే మొదటి ఆటకు వెళ్లడం, థియేటర్‌ వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టి, చిత్రమందిరం ముందు ప్లెక్సీలు కట్టడం అందరికీ తెలిసిందే. కానీ బళ్లారి నగరానికి చెందిన కె.వెంకటేశ్వర(49)ది మాత్రం విభిన్న శైలి. ప్రఖ్యాత తెలుగు సినీనటుడు నందమూరి బాలకృష్ణ (బాలయ్య) సినిమా చిత్రీకరణ ప్రారంభం కాగానే ప్రధాన పాత్ర వేషధారణ గమనిస్తారు. అచ్చం అదే పోలికతో నగరంలో ప్రత్యక్షమవుతారు. బాలయ్య పాత్రకు ఉండేలా గడ్డం, మీసాలు పెంచడం, అదే తరహాలో ఖరీధైన దుస్తులు కుట్టించడం, ఆయుధాలు తయారు చేయించడం ఈయన అలవాటు చేసుకున్నారు. ఆ సినిమా విడుదల రోజున సినిమా కథ ఆధారంగా దేవస్థానం నుంచి బాలయ్య వేషధారణతో వూరేగింపుగా చిత్రమందిరానికి వెంకటేశ్వర చేరుకుంటారు. సినిమా ఆడినన్ని రోజులు చిత్రమందిరానికి అభిమానులతో కలిసి వెళ్లడం, సినిమా చూస్తు మిఠాయిలు పంచడం అలవాటు చేసుకున్నారు. బాలయ్య వీరాభిమానిగా ఈ ఆహార్యంతో బళ్లారిలో చిరపరిచితుడయ్యాడు. బళ్లారిలో ఇతడిని జూనియర్‌ బాలకృష్ణగా పిలుస్తుంటారు. మరికొందరైతే మాకూ ఓ బాలయ్య ఉన్నాడు..అంటూ హాస్యోక్తులతో గుర్తు చేస్తుంటారు.
ఎవరీయన?
బళ్లారి తాలూకా కుడతిని గ్రామానికి చెందిన వెంకటేశ్వర కూరగాయల వ్యాపారం నిమిత్తం బళ్లారిలోని మిల్లర్‌పేటలో స్థిరపడ్డాడు. చిన్న మార్కెట్‌లో కూరగాయల వ్యాపారం చేస్తూ వచ్చిన సంపాదనతో కుటుంబపోషణ చేసుకుంటాడు. వెంకటేశ్వర తల్లి మల్లమ్మ కూడా నందమూరి తారకరామారావు అభిమాని. రామారావు నటించిన ‘గండికోట రహస్యం’ సినిమా విడుదలైన సమయంలో ఆమె మూడు నెలల బాలింత. కుమారుడిని ఇంట్లో విడిచిపెట్టి సినిమాకి వెళ్లింది. పూర్వీకులు బయలాట కళాకారులు కావడంతో, వెంకటేశ్వర వారి స్ఫూర్తితోనే బాలయ్య అభిమానిగా మారాడు. కె.వెంకటేశ్వరకు వరుసగా అయిదుగురు ఆడపిల్లలే పుట్టారు. మగ సంతానం కోసం దైవదర్శనాలు చేశాడు. చివరికి నందమూరి తారకరామారావును ప్రతినిత్యం పూజించడంతో 1997లో కుమారుడు జన్మించాడని చెబుతాడు. బాలకృష్ణ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామితో కలిసి వెంకటేశ్వర కుమారుడిని హైదరాబాద్‌కు తీసుకువెళ్లి నందమూరి బాలకృష్ణ సమక్షంలో తారకరామారావుగా నామకరణం చేయించాడు.
మంగమ్మగారి మనవడు చిత్రం నుంచి వేషధారణ
బాలకృష్ణ నటించిన 15వ సినిమా ‘మంగమ్మగారి మనవడు’ నుంచి కె.వెంకటేశ్వర ఆకర్షితుడై నాటి నుంచి నేటి 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకరి’్ణ వరకు ప్రధాన వేషధారణల (గెటప్‌)తో సినిమా విడుదల రోజు నగరంలో ప్రదర్శనలు నిర్వహించారు. నందమూరి తారకరామారావు నటించిన 301 సినిమాలకు సంబంధించిన ప్రతి సి.డి.ని సేకరించాడు. బాలకృష్ణ నటించిన తాతమ్మకల సినిమా నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి వరకు మొత్తం సి.డి.లు, పోస్టర్లు, బాలయ్యబాబు మాదిరిగా వేషధారణకు కుట్టించిన దుస్తులు, ఆయుధాలతో వెంకటేశ్వర ఇల్లు ఓ సంగ్రహాలయం(మ్యూజియం)గా మారింది. ఉదయం లేవగానే నందమూరి తారకరామారావు, బాలకృష్ణల చిత్రపటాలకు పూజ చేసిన తర్వాతే దిన చర్య ప్రారంభమవుతుంది. ఇంటిలో ఏ దేవుళ్ల చిత్రాలు కనిపించవు. అభిమాన నట వంశం చిత్రాలే కనిపిస్తాయి. బాలయ్య సినిమా విడుదలైన తర్వాత అభిమానులకు చేసిన సేవలు, ఇతర కార్యక్రమాలను చిత్ర సాక్ష్యంగా హైదరాబాద్‌కు వెళ్లి చూపించడం, ఆయనతో చాయాచిత్రాలు తీయించుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. బాలకృష్ణ జన్మదినోత్సవం, పండుగలు, నూతన సంవత్సర వేడుకల రోజు బాలయ్య బాబు నుంచి వెంకటేశ్వరకు శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీటింగ్‌ కార్డులు వస్తుంటాయి. ముందుగానే బాలయ్య అభిమానుల సంఘం అధ్యక్షుడు ఎర్రిస్వామి, పథాధికారులతో కలిసి వెంకటేశ్వర కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు చేరుకుని బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
వీరాభిమానిని
మా తల్లి మల్లమ్మ మొదటిసారిగా పాతాళబైరవి సినిమాకు తీసుకువెళ్లింది. అనంతరం అడవిరాముడు నుంచి నందమూరి తారకరామారావు అభిమానిగా మారాను. మంగమ్మగారి మనవడు సినిమా నుంచి బాలకృష్ణకు వీరాభిమానినయ్యా. నాకు దేవుడి కంటే కూడా బాలయ్యబాబు అంటేనే ఇష్టం. ప్రతి సినిమాకు దుస్తులు, వేషధారణ తదితర వాటికి సుమారు రూ.30వేలు ఖర్చవు తుంది. మాది సామాన్య కుటుంబం. ప్రతి సినిమాలో బాలకృష్ణ పోషించిన ప్రధాన పాత్ర వేషధారణకు కావాల్సిన వస్తువులకు మా అమ్మ, స్నేహితులు డబ్బులిచ్చి సహాయపడేవారు. ఆ ప్రోత్సాహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఎర్రిస్వామి, అభిమానులు సహకరిస్తుంటారు.

 

Share this post


Link to post
Share on other sites

"హద్దులు లేని అభిమానం" అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం.

 

జై బాలయ్య.... జై జై బాలయ్య......

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×