Jump to content

నిరుద్యోగ భృతి

sonykongara

Recommended Posts

నిరుద్యోగ భృతి
 
636237544048226860.jpg
  • ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు 
  • డిగ్రీ, ఆపైన చదివిన యువతకు లబ్ధి
  • విద్యార్హతను బట్టి నెలకు
  • వెయ్యి నుంచి రూ. 2 వేలు చెల్లింపు
  • సమాజ సేవ చేయిస్తూ చేయూత
  • కులాల వారీ కార్పొరేషన్లకు సెలవు
  • అన్ని వర్ణాల పేదలకూ సహాయం
  • ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు
  • కొత్తవి, పాతవి కలిపి 10 లక్షల ఇళ్లు
  • ఒకేసారి ఎన్నికల నిర్వహణకు మొగ్గు
  • మూడంచెల ‘పంచాయతీ’ మేలు
  • మార్పు కోసం కేంద్రానికి లేఖ రాస్తా
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు
  • టీడీపీ పొలిట్‌ బ్యూరో కీలక నిర్ణయాలు
  • పెండింగ్‌ హామీల అమలుపై దృష్టి
అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యను అభ్యసించి, ఉపాధి దొరకని యువతకు శుభవార్త! విద్యావంతులైన నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విద్యార్హతను బట్టి రూ.1000 నుంచి 2వేల వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న టీడీపీ ఎన్నికల హామీని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ అంశాన్ని సీఎం స్వయంగా లేవనెత్తారు. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను, ఇప్పటివరకు అమలు చేసిన పథకాలను వివరిస్తూ... ‘అమలు చేయాల్సిన హామీల్లో ముఖ్యమైనది నిరుద్యోగ భృతి’ అని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేద్దామని సీఎం చెప్పారు. డిగ్రీ, ఆ పైన చదువుకున్న యువతకు... ఉపాధి సంపాదించుకునేంతవరకు భృతిని ఇవ్వాలని సీఎం ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తామని... 2017-18 రాష్ట్ర బడ్జెట్‌లోనే నిరుద్యోగ భృతి కోసం నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ నిర్ణయానికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ‘‘నిరుద్యోగ భృతి చాలా కీలకమైన అంశం. భృతి పేరిట నెలనెలా ఊరికే డబ్బు ఇచ్చినట్టు కాకుండా, వారి చేత సామాజిక సేవ చేయించాలని భావిస్తున్నాం.’’ అని సీఎం తెలిపారు. భృతి అందుకునే వారితో గామ్రాల్లో పిల్లలకు చదువు చెప్పించడంవంటి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు.
 
అన్ని వర్ణాల పేదలకు సాయం

అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ) ఆర్థిక సాయం అందించాలని పొలిట్‌ బ్యూరోలో కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇందుకు 2017-18 బడ్జెట్‌లోనే నిధులు కేటాయించనున్నట్టు సీఎం చెప్పారు. ఈ అంశం పొలిట్‌బ్యూరోలో చర్చకు వచ్చినప్పుడు... ఇకపై కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయరాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి ఇప్పుడు చంద్రబాబు ఏర్పాటు చేసిన బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల వరకు.. ఆయా వర్గాలకు చేయూతనిస్తున్నాయని సభ్యులు ప్రశంసించారు. అయితే, ఒక్కో కులానికి ఒక్కో సంస్థ ఏర్పాటు చేస్తూ పోతే... ‘విభజన’ భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. దీంతో... కులాలకు అతీతంగా, అన్ని వర్గాల్లోని పేదలకు (ఈబీసీ) సాయం చేద్దామని సీఎం చెప్పారు. ఆడపిల్ల పుట్టినప్పుడు రూ. 30వేలు డిపాజిట్‌ చేసి, యుక్త వయసు వచ్చాక రెండు లక్షల రూపాయలను డ్రా చేసి ఇవ్వాలన్న ఎన్నికల హామీని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. విధి విధానాలను ఖరారు చేశాక దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ ఎంఈ)ను ప్రోత్సహించడం కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో త్వరలో ఎన్టీఆర్‌ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక విత్తన చట్టాన్ని తేనున్నట్టు సీఎం వెల్లడించారు. ఇక... చంద్రన్న బీమా పథకాన్ని పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రశంసించారు. 2.5 కోట్ల మంది పేదల జీవితాలకు ఈ పథకం భరోసా కల్పిస్తోందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో ఉన్నవి, కొత్తగా మంజూరు చేయబోయేవి కలిపి మొత్తం 10 లక్షల గృహాలను 2018లోగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలకే గృహ అవసరం ఉందని, అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో 50 లక్షల కుటుంబాలకు ఉన్నట్టు చూపించారని, ఇది వాస్తవాలను ప్రతిబింబించడంలేదని చెప్పారు. ఈ ప్రమాణాలను మార్చాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని, మోదీకి లేఖ రాస్తానని సీఎం తెలిపారు.
 
ఇన్‌పుట్‌ సబ్సిడీకి 1600 కోట్లు

కరువుపై టీడీపీ పొలిట్‌బ్యూరో సుదీర్ఘంగా చర్చించింది. ఈ ఏడాది ఇన్‌పుట్‌ సబ్సిడీ... కేంద్రం నుంచి వచ్చేదిగానీ, రాష్ట్రంలో కేటాయించేది కానీ రూ.1600 కోట్లు ఉంటుందని సీఎం చెప్పారు. ఈ వేసవిలో మంచి నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామీకి 150 పని దినాలు కల్పించనున్నట్టు సీఎం చెప్పారు.
 
ఒకేసారి ఎన్నికలకు సై: పార్లమెంటుకు, రాష్ట్రాల శాసన సభలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రతిపాదనతో టీడీపీ ఏకీభవించింది. ప్రధాని మోదీ పదేపదే చేస్తున్న ఈ సూచన మంచిదే అని అభిప్రాయపడింది. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరగడంవల్ల కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీల దృష్టి మొత్తం ఆవైపే ఉంటోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఏటా ఎన్నికల వల్ల కేంద్రంలో పరిపాలన కుంటుపడుతోందని అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీ అమలు తీరునే ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించారు. ‘‘కేంద్రం ఇచ్చిన హామీలలో కొన్నింటికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం అవసరం. ఆ ప్రక్రియ వాయిదా పడుతోంది. ఇతర హామీల అమలూ నెమ్మదిగానే ఉంది. పార్లమెంటు ఎన్నికలు జరిగిననాటి నుంచి ప్రతి సంవత్సరమూ రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి. గత ఏడాది మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే... ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. వచ్చే ఏడాది కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 నుంచి 4 నెలలు రాషా్ట్రల ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలకు ఓసారి కోడ్‌... రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినప్పుడల్లా కోడ్‌ అమలు... ఇలా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పరిపాలనకు ఆటంకం కలుగుతోంది.
 
అలా కాకుండా ఒకేసారి అన్ని ఎన్నికలూ జరిగితే మిగిలిన కాలమంతా అభివృద్ధిపై కేంద్రీకరించవచ్చు’’ అని సీఎం వివరించారు. కేంద్రం దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన విధానాన్నే రాష్ట్రంలోనూ అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం పొలిట్‌బ్యూరోలో వ్యక్తమైంది. ప్రస్తుతం జరగాల్సిన మునిసిపల్‌ ఎన్నికలు మినహా మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం అసెంబ్లీ ఎన్నికలకు దగ్గరగానే ఉన్నాయని, ఆ విషయంలో రాష్ట్రం కొంచెం మెరుగని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ అన్ని రకాల ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరు నెలలకే పూర్తి చేస్తే మిగిలిన నాలుగున్నరేళ్లు అభివృద్ధిపైనే దృష్టి పెట్టవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏకకాలంలో ఎన్నికల ప్రతిపాదనకు పొలిట్‌బ్యూరో సభ్యులంతా ఆమోదం తెలిపారు.
 
మూడంచెల ‘పంచాయతీ’
పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ఐదంచెల వ్యవస్థకు బదులు మూడంచెల వ్యవస్థ ఉంటే బాగుంటుందని సీఎం చెప్పారు. ‘‘ ప్రస్తుతం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్‌పర్సన్లు ఉన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నామ్‌కేవాస్తేగా ఉన్నారు. వారికి విధులేవీ లేవు. ఆ రెండంచెలను రద్దు చేసి... సర్పంచ్‌లు, మండలాధ్యక్షులు, జడ్పీ చైర్‌పర్సన్లతో వ్యవస్థను నడిపించవచ్చు’’ అని వివరించారు. దీనిపై కేంద్రానికి కూడా లేఖ రాస్తానని చెప్పారు. అమరావతి నిర్మాణం నుంచి అమెరికాలో తెలుగువారిపై దాడుల వరకు అనేక అంశాలపై టీడీపీ పొలిట్‌బ్యూరోలో చర్చించారు. ఉమ్మడి అంశాలు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి 15 ఉండగా... తెలంగాణకు ప్రత్యేకించిన మరో రెండు అంశాలపైనా చర్చ జరిగింది. సమావేశం తర్వాత ముఖ్యమైన నిర్ణయాలను పొలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖరరెడ్డి సంయుక్తంగా విలేకరులకు వెల్లడించారు.
Link to comment
Share on other sites

Idhi kanuka chesthe Super. Asalu కులాల వారీగా vunna corporations ni remove cheyyali.

Link to comment
Share on other sites

10 లక్షల మందికి నిరుద్యోగ భృతి!
 
636238421224176352.jpg
  • బడ్జెట్‌లో రూ.100 కోట్లు!
  • విధి విధానాలపై సీఎం కసరతు
  • ఉన్నతాధికారులతో సీఎం భేటీ 
అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు భృతిని అందించే భారీ పథకం విధి విధానాలపై కసరత్తు మొదలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వాలని ఆదివారం జరిగిన పొలిట్‌ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ పథకానికి ఓ రూపు ఇచ్చేందుకు సోమవారం ఆయన ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎంతమందికి నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉంటుంది? ఎవరెవరికి చెల్లించాలి? వారి ఎంపికకు ప్రాతిపదిక ఏమిటి? అన్న అంశంపై అధికారులతో సీఎం విస్తృతంగా చర్చించారు. ఒక అంచనా ప్రకారం... సుమారు 10 లక్షల మంది యువతకు భృతి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. డిగ్రీ, ఆ పై చదువుకున్న నిరుద్యోగులకు నెలకు రూ.1000 నుంచి 2000 నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే, పాలిటెక్నిక్‌, ఐటీఐ చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నవారికి కూడా కొంత భృతిని చెల్లించడంపైనా సోమవారం నాటి సమావేశంలో చర్చ జరిగింది. అయితే, ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో కచ్చితమైన సమాచారంతో మంగళవారం మరోసారి సమావేశానికి రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిరుద్యోగుల గణాంకాలను పల్స్‌ సర్వే డేటాతో పోల్చి చూడాలని, ఆర్థిక-సామాజిక సర్వేలనూ పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. మంగళవారం నాటి భేటీలో నిరుద్యోగ భృతి విధివిధానాలపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మహారాష్ట్ర తరహాలో నిరుద్యోగులకు భృతిని చెల్లించాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.

అన్ని వర్గాలకూ తగు కేటాయింపులు 
వెనుబడిన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, కాపు, బ్రాహ్మణ, మైనారిటీ వర్గాలపాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా ఈసారి బడ్జెట్‌లో తగిన న్యాయం చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రయోజనాలనూ నెరవేర్చేలా రానున్న బడ్జెట్‌కు పరిపూర్ణత కల్పించాలని చెప్పారు సీఎం సోమవారం మధ్యాహ్నం తన నివాసంలో ఆర్థిక శాఖ అధికారులతో 2017-18 రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Ippudochi money waste somaripotulu avtaru adi idi ani cheppakandi. Ilantivi cheyakapote votlu veyaru so cheyali.

Good step by government.... At least government is now taking liability for unemployment and sure now governments will focus more on creating employment opportunities more and more to come out of the liabilities... Good job by CBN sir

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...