Jump to content

బాలయ్య 101వ సినిమా కి puri


sonykongara

Recommended Posts

షాకింగ్‌: ఆ దర్శకుడికి బాలయ్య అవకాశమిచ్చాడా?
U636234523346724875.jpg
నందమూరి బాలకృష్ణ 101వ సినిమాకు దర్శకుడిగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కేఎస్‌ రవికుమార్‌, కృష్ణవంశీ, ఎస్వీ కృష్ణారెడ్డి.. ఇలా ఎంతో మంది బాలయ్య కోసం క్యూలో ఉన్నారు. అయితే బాలకృష్ణ మాత్రం ఎవరూ ఊహించని ఓ దర్శకుడి చేతిలో తన 101వ సినిమాను పెట్టాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్‌.
 
మొదటి టైటిల్‌ పడిన దగ్గర్నుంచి, శుభం కార్డు వరకు డైలాగ్స్‌తో సహా కథ మొత్తాన్ని బాలయ్యకు వినిపించాడట పూరీ. ఆ కథ అద్భుతంగా ఉందని ఫీలయ్యాడట బాలయ్య. అందుకే మరింకేం ఆలోచించకుండా ‘గో ఏ హెడ్‌’ అన్నాడట. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారమే ప్రకటిస్తారని సమాచారం.

 

Link to comment
Share on other sites

హైదరాబాద్‌: ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తర్వాత బాలకృష్ణ తదుపరి సినిమా ఏంటనేది తేలిపోయింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన తదుపరి చిత్రంలో నటించనున్నారు. ఈ విషయాన్ని పూరీ తన ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మార్చి 9న ముహూర్తపు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సినిమాను సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎన్టీఆర్‌, మహేశ్‌, రాంచరణ్‌ వంటి యువ కథానాయకులతో ఇప్పటికే సినిమాలు తీసి తన సత్తా చాటిన పూరీ.. తొలిసారిగా బాలయ్య కథానాయకుడిగా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తొలిసారిగా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

 

source: eenadu

 

  •  
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...