Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
  • 1 month later...
ఐటీ... c/o అమరావతి
20-12-2018 08:04:41
 
636808899665979932.jpg
  • యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు
  • 5 కంపెనీలను ప్రారంభించిన మంత్రి లోకేశ్‌
  • ఏపీ ఎన్‌ఆర్‌టీ చొరవతో కంపెనీల రాక
 
తాడేపల్లి టౌన్‌, డిసెంబరు 19 : ఐటీ రంగానికి అమరావతి కేరాఫ్‌గా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. రాజఽధాని పరిధిలోని తాడేపల్లి జాతీయ రహదారి వెంట ఉన్న ఇన్ఫేసైట్‌ భవనంలోని ఏపీఎన్‌ఆర్‌టీ కార్యాలయంలో బుధవారం 5 ఐటీ కంపెనీలను మంత్రి లోకేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలసీలు ఏపీలో అమలవుతున్నాయని అన్నారు. డీటీపీ పాలసీ విధానం చిన్న, మధ్య తరగతి కంపెనీలకు వరంగా మారిందని తెలిపారు. 50 శాతం రెంటల్‌ సబ్సిడీతో, అదె ్ద భవనాలలో ప్లగ్‌ అండ్‌ పే విధానం అనుసరించడం వల్ల పెద్ద ఎత్తున రాష్ర్టానికి కంపెనీలు వస్తున్నాయని అన్నారు. ఐటీ రంగ అభివృద్ధిలో చిన్న కంపెనీలు కీలకపాత్ర పోషించడంతోపాటు, అధిక సంఖ్యలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.
 
ఏపీఎన్‌ఆర్‌టీ ప్రవాసాంధ్రులకు అవసరమైన సాయం చేయడం, ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యంతో గ్రామాలను దత్తత తీసుకొని ఏపీ అభివృద్ధికి కృషిచేయడం వంటి మంచి లక్ష్యాలతో పని చేస్తోందని అభినందించారు. అమరావతి రాజధానిలో మంగళగిరి ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్క్‌లో 18, సీఆర్‌డీఏ రీజియన్‌లో 13, గన్నవరం మేధా టవర్స్‌లో 12, విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో 33 కంపెనీలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించి 4 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయని తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన 5 కంపెనీల ద్వారా 500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి లోకేశ్‌ వివరించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్‌ఆర్‌టీ అధ్యక్షులు వేమూరు రవి, డైరెక్టర్‌ రాజశేఖర్‌, ఓఎస్డీ డీవీ రావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజి చిరంజీవి, టీడీపీ నేత జంగాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. నార్త్‌ జోన్‌ డీఎస్పీ రామకృష్ణ, సీఐ బ్రహ్మయ్య, ఎస్‌ఐ ఖాజీబాబు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
 
 
వాణిజ్య అవసరాలకు సాఫ్ట్‌వేర్‌ దోహదం
వాణిజ్య అవసరాలకు ఉపయోగించేవిధంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించాం. ఏపీ ఎన్‌ఆర్‌టీ సహకారంతో విజయవాడలో కంపెనీని నెలకొల్పాం. గ్లోబల్‌ ట్రేడింగ్‌ మేనేజ్‌మెంట్‌, బోయింగ్‌, మిత్సుభషి తదితర కంపెనీలకు అవసరమయ్యే సాఫ్ట్‌వేర్‌ను ఇక్కడ రూపొందిస్తాం. అమెరికా బేస్‌గా మా కంపెనీ నడుస్తుంది. 100 మందికి ఉద్యోగ అవాకాశాలు కల్పిస్తాం.
- కృష్ణకాంత్‌, కృష్ణ, ప్రతినిధులు,
జీటీ కనక్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌
 
 
ప్రచురణ రంగ సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తాం
ప్రచురణ రంగానికి సంబంధించి ఐటీ ఉత్పత్తులను అందిస్తాం. ఎక్స్‌ ఎమ్మెఎల్‌ పీడీఎఫ్‌ వంటి ఆధారిత రంగాలలో మా సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుంది. ఏపీ ఎన్‌ఆర్‌టీ సహకారంతో మంగళగిరి ఐటీ పార్క్‌లో కంపెనీని నెలకొల్పాం. సుమారు 80 మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
- జయప్రకాష్‌, శాంతి, ప్రతినిధులు, ట్రెండ్‌ సాఫ్ట్‌ టెక్నాలజీస్‌
 
 
 
 
ఏపీ ఎన్‌ఆర్‌టీ సహకారం మరువలేనిది
విజయవాడలో ఐటీ కంపెనీ నెలకొల్పడంలో ఏపీ ఎన్‌ఆర్‌టీ సహకారం మరువలేనిది. యూఎస్‌ఏ బేస్‌గా మా కంపెనీ నడుస్తుంది. ప్రస్తుతం ఏపీలో సర్వీసులు ప్రారంభిస్తున్నాం. ఐటీ అభివృద్ధి, దరఖాస్తు సేవలు, శిక్షణ వంటివి నిర్వహిస్తాం. వచ్చే ఏడాదిలోగా 100 మందికిపైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.
- జాగర్లమూడి శ్రీ, ప్రతినిధి, టెక్‌ స్కేప్‌
 
 
 
అమరావతిలో అవకాశాలు బాగున్నాయి
ఐటీ రంగానికి అమరావతిలో అవకాశాలు బాగున్నాయి. రాష్ట్రంలో ఉన్న డయాగ్నటిక్‌ సెంటర్‌లను ఒకే సాఫ్ట్‌వేర్‌గా రూపొందించి డాక్టర్లకు, ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. మంగళగిరి ఐటీ పార్క్‌లో కంపెనీ నెలకొల్పాం. ప్రస్తుతం మా కంపెనీలో 30 మంది పనిచేస్తున్నారు. త్వరలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 150 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం.
- సతీష్‌కుమార్‌, శివశంకరనారాయణ, ప్రతినిధులు, డయాగ్నో స్మార్ట్‌ సొల్యూషన్స్‌
 
 
 
 
 
స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం
మా కంపెనీ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ప్రధానంగా డేటా మైనింగ్‌, మీడియాలో బీపీవో సేవలు, ఎన్లెటిక్స్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాం. రాజధానిలో ఐటీ రంగానికి పుష్కల అవకాశాలు ఉన్నాయి. నూతనంగా 15 మందితో కంపెనీని ప్రారంభించాం. పెద్దసంఖ్యలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
- వేమూరి కృష్ణకిషోర్‌, అమరదీప్‌, ప్రతినిఽధులు, పరిక్రమ్‌ ఐటీ సొల్యూషన్
Link to comment
Share on other sites

ఐటీ ఉద్యోగం అనగానే వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. ఎందుకంటే రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లోనే వందల ఐటీ సంస్థలు నెలకొన్నాయి. అమరావతి ఐటీ హబ్ గా రూపుదాల్చుతోంది.

రాష్ట్ర ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేష్ చేస్తున్న కృషి ఫలితంగా రాజధాని పరిధిలోని గన్నవరంలో మేధా టవర్స్‌, మంగళగిరిలో ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్కు, గుంటూరులో ఐటీ టవర్‌, విజయవాడ ఆటోనగర్‌లో ఇండ్వెట్‌ టవర్‌, బిజినెస్‌ సెంటర్‌, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఎంకే ప్రీమియం టవర్‌ లలో వందకుపైగా ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇవిగాక విశాఖ, తిరుపతిలలో అదనం.

లక్ష ఐటీ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్న మంత్రి ఇప్పటికే 34,000 ఐటీ ఉద్యోగాలను కల్పించారు.

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 4 weeks later...
12 minutes ago, sonykongara said:

Software Technology Parks of India (STPI) Building design in Vijayawada? If i am not wrong, Construction works are near completion stage Location : Beside Polytechnic College, Krishna Nagar, Vijayawada Landmark - Opp LEPL INOX on other side road

DyyL1JgV4AAKc5F.jpg

NEAR completion aaa? ఒక్క video రాలేదు బయటకి.. 

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

Software Technology Parks of India (STPI) Building design in Vijayawada? If i am not wrong, Construction works are near completion stage Location : Beside Polytechnic College, Krishna Nagar, Vijayawada Landmark - Opp LEPL INOX on other side road

DyyL1JgV4AAKc5F.jpg

Looking awesome 

Link to comment
Share on other sites

  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...