Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

రాజధానికి సాఫ్ట్‌వేర్‌ హెచ్‌సీఎల్‌ సంస్థ
 
మొగల్రాజపురం(విజయవాడ): ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ విజయవాడ నగరంలో తమ కార్యాలయ నెలకొల్పేందుకు పరిశీలన బృందం బుధవారం పీబీ సిద్దార్ధ కళాశాలను సందర్శించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రవాస తెలుగు వ్యవహారాలు, పెట్టుబడుల సంఘం ముఖ్యకార్యదర్శి వేమూరు రవికిరణ్‌ ఆధ్వర్యంలో సంస్థ ఉపాధ్యక్షులు గణేష్‌కుమార్‌, జీఎం రామచంద్రన్‌, అసోసియేట్‌ జనరల్‌ మేనేజర్‌ నిహాల్‌ ఆహ్మద్‌, సీనియర్‌ మేనేజర్‌లు వెంకటేష్‌, రామకృష్ణన్‌, రాజమురుగన్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. వాణిజ్య శాస్త్ర విభాగం రెండో ఏడాది విద్యార్థుల బృందం ఉదిత్‌, ప్రణయ్‌ పట్వారీ, ప్రేక్షగోలేచా స్థాపించిన అంకుర సంస్థ ద్వారా త్వరలో కేఎల్‌ యూనివర్సిటీలో నిర్వహించబోతున్న అమరావతి మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ ప్రాజెక్టు ప్రదర్శనను తిలకించారు. అనంతరం ప్రిన్పిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌, డైరెక్టర్‌ వేమూరి బాబురావు, డీన్‌ రాజేష్‌ సి.జంపాల, కళాశాల ప్రత్యేకతను, విద్యార్థుల ప్రతిభను నైపుణ్యాలను బృందానికి వివరించారు. బృంద సభ్యుల వెంట కామర్స్‌ విభాగాధిపతి నారాయణరావు, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాదిపది రమేష్‌చంద్ర, కళాశాల ఉపాది విభాగం అధికారి కావూరి శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

 

Link to comment
Share on other sites

 

విజ‌య‌వాడ‌లో త్వ‌ర‌లో హెచ్‌సీఎల్ శాఖ ప్రారంభం

 

Super User

 

 

09 February 2017

 

Hits: 240

 

 

hcl-technologies-09022017.jpg

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నూత‌న రాజ‌ధానిలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు, పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌కు అనుస‌రిస్తున్న వినూత్న ప‌థ‌కాల‌లో భాగంగా ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ (హెచ్‌సీఎల్‌) టెక్నాల‌జీస్ లిమిటెడ్‌కు చెందిన ఆరుగురు స‌భ్యుల‌తో కూడిన అత్యున్న‌త బృందం బుధ‌వారం విజ‌య‌వాడ మొగ‌ల్రాజ‌పురంలోని ప‌ర్వ‌త‌నేని బ్ర‌హ్మ‌య్య సిద్ధార్థ క‌ళాశాల‌ను సంద‌ర్శించింది. ఈ సంద‌ర్భంగా సంబంధిత సంస్థ త‌మ శాఖ‌ను త్వ‌ర‌లో విజ‌య‌వాడ‌లో స్థాపించేందుకు సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించిన‌ట్లు క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డాక్ట‌ర్ మేకా ర‌మేష్ తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌వాస తెలుగు వ్య‌వ‌హారాలు, పెట్టుబ‌డులు సంఘం ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి డాక్ట‌ర్ వేమూరి ర‌వికిర‌ణ్ ఆధ్వ‌ర్యంలో హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ ఉపాద్య‌క్షుడు గ‌ణేష్‌కుమార్‌, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ రామ‌చంద్ర‌న్‌, అసోసియేట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ నిహాల్ అహ్మ‌ద్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్లు శ్రీవేంక‌టేష్‌, రామ‌కృష్ణ‌న్ రాజ‌గోపాల‌న్‌, రాజమురుగన్ క‌ళాశాల‌ను సంద‌ర్శించి వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ ప‌ట్ట‌భ‌ద్రులైన విద్యార్థుల‌కు త్వ‌ర‌లో బ్యాంకింగ్ రంగంలో బి.పి.ఓ. సేవ‌లు అందించేందుకు 1000 మంది ఉద్యోగుల‌కు స‌రిప‌డా కార్యాల‌యం ల‌భ్య‌త గురించి ప‌రిశీలించారు.

 

ఈ సంద‌ర్శ‌న‌లో భాగంగా క‌ళాశాల డైరెక్ట‌ర్ వేమూరి బాబూరావు, డీన్ డాక్ట‌ర్ రాజేష్ సి. జంపాల పాల్గొని క‌ళాశాల ప్ర‌త్యేక‌త‌ల‌ను, విద్యార్థుల ప్ర‌తిభా, నైపుణ్యాల‌ను బృంద స‌భ్యుల‌కు వివ‌రించారు. అనంత‌రం బృంద స‌భ్యులు విద్యార్థుల‌తో స్వ‌యంగా సంభాషించి వారి భావ‌ప్ర‌క‌ట‌న నైపుణ్యాన్ని, విష‌య ప‌రిజ్ఞానాన్ని తెలుసుకొని అభినందించారు. బి.బి.ఎ. ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల బృందం ఉదిత్‌, ప్ర‌ణ‌య్ ప‌ట్వారీ, ప్రేక్ష‌గొలేచా స్థాపించిన అంకుర సంస్థ ద్వారా త్వ‌ర‌లో నిర్వ‌హిస్తున్న అమ‌రావ‌తి మోడ‌ల్ యునైటెడ్ నేష‌న్స్ ప్రాజెక్టును బృందంస‌భ్యులు ప్ర‌త్యేకంగా అభినందించారు.

బృంద‌స‌భ్యుల వెంట కామ‌ర్స్ విభాగాధిప‌తి నారాయ‌ణ‌రావు, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాధిప‌తి ర‌మేష్‌చంద్ర‌, క‌ళాశాల ఉపాధి అధికారి కావూరి శ్రీధ‌ర్ త‌దిత‌రులు పాల్గొని క‌ళాశాల విశిష్ట‌త‌ను వివ‌రించారు.

 

Link to comment
Share on other sites

బెజవాడకు హెచ్‌సీఎల్‌

అమరావతిలో రూ.500 కోట్లతో ఏర్పాటు

దాదాపు 10వేల మందికి ఉద్యోగావకాశాలు

09ap-main3a.jpg

అమరావతి: ఐటీ రంగంలో దిగ్గజ సంస్థ ‘హెచ్‌సీఎల్‌’ సంస్థ రాష్ట్రంలో కాలుమోపబోతోంది. విజయవాడలో ఆ సంస్థ బీపీవో ఏర్పాటుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. అదే జరిగితే రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలకు పెద్ద వూతమిచ్చినట్లు అవుతుంది. ఇప్పటివరకూ నవ్యాంధ్రకు పెద్దపెద్ద ఐటీ కంపెనీలు రావడం లేదు. ఇప్పుడు తొలిసారి రాష్ట్రానికి ఒక పెద్ద ఐటీ కంపెనీ రావడానికి సిద్ధపడుతోంది. ఆ సంస్థ ఛైర్మన్‌ శివనాడార్‌తో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం. దాదాపు 10వేల మందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యమున్న బీపీవోను ఇక్కడ స్థాపించడానికి ఆ సంస్థ ముందుకొచ్చినట్లు తెలిపింది. అమరావతిలో ఆ సంస్థకు ప్రభుత్వం స్థలం కేటాయించనున్నట్లు సమాచారం. అక్కడ అత్యంత సుందరమైన భవనాన్ని నిర్మించి బీపీవోను శాశ్వతంగా ఏర్పాటు చేయనుంది. అప్పటి వరకూ గన్నవరం సమీపంలోని మేధా టవర్స్‌లో కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

రూ.500 కోట్ల పెట్టుబడి

అమరావతిలో హెచ్‌సీఎల్‌ సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడితో బీపీవోను స్థాపించనుంది. దీనికి సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. హెచ్‌సీఎల్‌ కంపెనీకి రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ సంస్థ ఛైర్మన్‌ శివనాడార్‌ల సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని ఈ సంస్థ రాక గురించి అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

అదే బాటలో మరిన్ని సంస్థలు

హెచ్‌సీఎల్‌ సంస్థ రాకతో రాష్ట్ర ఐటీ రంగంలో ఒక కీలక అడుగు పడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతపెద్ద సంస్థ రాష్ట్రంలో కాలుమోపితే, దాని మార్గంలో మరిన్ని పెద్ద ఐటీ సంస్థలు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు దిగ్గజ ఐటీ సంస్థలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌ తదితర సంస్థలతో చర్చలు జరుపుతున్నారు.

Link to comment
Share on other sites

HCL Technologies to set up operations in AP with Rs 500 cr investment AP has also allotted 42,000 square foot of space to HCL for a skill development centre

BS Reporter  |  Hyderabad  February 14, 2017 Last Updated at 17:02 IST

 
  •  

 

India's fourth largest global IT services company HCL Technologies(HCL) is all set to become the anchor client of an upcoming IT cluster being developed near Andhra Pradesh state's new capital Amaravati.

A senior AP government official said HCL chairman Shiv Nadar and chief minister N Chandrababu Naidu are likely to make a joint announcement about HCL Tech foray into AP next month.

AP investment promotion board, headed by chief minister Naidu, has already cleared the company's proposals, which entail an investment of Rs 500 crore in two phases, according to government officials. The company did not respond to queries related to its AP plans.

 


HCL would set up two green field campuses across 27.5 acres of land with Rs 300 crore investment in phase 1, which see commencement of operations as early as from next year, and another Rs 200 crore investment in phase 2 related to the second project. The company's proposed operations would include IT, BPO services as well as the high end engineering R&D, according to the officials.

Besides agreeing to provide the necessary land, the state government has also allotted 42,000 square foot of space in a ready-built tower to HCL for a skill development centre to train local boys and girls for their possible absorption in future jobs to be created by the company. The company has promised to create 3000 jobs in the first phase and 2000 jobs in the second phase, each spread across a time line of five years.

HCL Tech's move to expand its operations into AP comes at a time the Indian IT companies were fearing the slowdown in global business, while raising the hopes among hundreds of tech graduates coming out of the engineering college campuses in districts like Krishna and Guntur. Also HCL will be the first major company to come forward to establish operations in Vijayawada region where the efforts to create an IT cluster by the previous governments had met with little success.

"An ecosystem conducive to the IT companies would take shape with the entry of a prominent player like HCL in this region. We consider this as a big breakthrough," a senior IT department official told Business Standard on Tuesday.

While AP contributes a substantial amount of human resources for the IT sector, the growth of IT industry was not much in the region for various reasons including the local tech graduates' preference to migrate to big cities in the south such as Hyderabad, Bengaluru and Chennai for greater opportunities.

According to the plan submitted to the AP government, HCL proposes to complete the construction of the first IT center and the skill development center by June and start the regular operations with 500 employees from October, 2017. It would start the training programme for local graduates from the temporary premises from July, 2017.

Besides the usual incentives that are linked to the investment, land and jobs, the company has also sought provision to run the operations in 24/7 shifts and engage women employees across the three shifts.

With 1.10 lakh employees working on its rolls Noida headquartered IT services company operates out of 32 countries and has a consolidated revenues of $ 6.7 billion for 12 months ended December 31, 2016.

Link to comment
Share on other sites

విజయవాడ: విజయవాడ ఆటో నగర్‌లోని ఇండ్‌వెల్ టవర్‌లో తొమ్మిది ఐటీ కంపెనీలను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎనిమిది కంపెనీలు ఇక్కడికి వచ్చి 650మందికి ఉద్యోగాలిస్తున్నారని, ఇది చాలా ఆనందకరమైన విషయమన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనన్నారు. అంతే కాకుండా చాలా కంపెనీలు విజయవాడకు వచ్చేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. తెలివి ఉంటే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటుందని తెలిపారు. భారత దేశానికి ఉన్న అనుకూల పరిస్థితులు వేరే దేశానికి లేవన్నారు. కంపెనీలు ఇంకా పెరగాలని ఆశిస్తున్నానన్నారు

Link to comment
Share on other sites

విజయవాడ: విజయవాడ ఆటో నగర్‌లోని ఇండ్‌వెల్ టవర్‌లో తొమ్మిది ఐటీ కంపెనీలను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎనిమిది కంపెనీలు ఇక్కడికి వచ్చి 650మందికి ఉద్యోగాలిస్తున్నారని, ఇది చాలా ఆనందకరమైన విషయమన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనన్నారు. అంతే కాకుండా చాలా కంపెనీలు విజయవాడకు వచ్చేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. తెలివి ఉంటే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటుందని తెలిపారు. భారత దేశానికి ఉన్న అనుకూల పరిస్థితులు వేరే దేశానికి లేవన్నారు. కంపెనీలు ఇంకా పెరగాలని ఆశిస్తున్నానన్నారు

Link to comment
Share on other sites

ఏపీని సిలికాన్‌వ్యాలీగా మారుస్తా: చంద్రబాబు

17brk111a.jpg

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతిని ఐటీ కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్‌ను సిలికాన్‌ వ్యాలీగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఐటీ రంగానికి పునాదులు వేసే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన ఎనిమిది కంపెనీలను ప్రారంభించారు. నైపుణ్యం కల్గిన యువత ఏపీ సొంతమని, వారికి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. విదేశాలకు వెళ్లినవారు తిరిగి పుట్టినగడ్డకు వచ్చి కంపెనీలు ఏర్పాటుచేయడాన్ని సీఎం అభినందించారు. భవిష్యత్తులో ఏపీలో ఐటీరంగం ఎలా ఉండబోతుందో ఈ సందర్భంగా వివరించారు. ఒకనాడు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉండేదని.. దాన్ని విజ్ఞానాంధ్రప్రదేశ్‌గా మార్చే క్రమంలో హైటెక్‌సిటీని ఏర్పాటుచేశానన్నారు. ఆ క్రమంలోనే మైక్రోసాఫ్ట్‌ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు తాను ఎంతగా శ్రమించారో వివరించారు. ఆ తర్వాత ఎన్నో ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌ బాట పట్టాయన్నారు. కంపెనీలకు మానవ వనరులను సమకూర్చే లక్ష్యంతో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వందలాది ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీని విజ్ఞాన కేంద్రంగా మార్చేందుకు చేసిన కృషి ఫలితంగానే మెరికల్లాంటి ఐటీ నిపుణులు తయారయ్యారన్నారు.

హైటెక్‌ సిటీకి దీటుగా..

ప్రస్తుతం ఎనిమిది కంపెనీలతో ప్రారంభమైన ఈ ప్రస్థానం భవిష్యత్తులో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేలా ఎదగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. జులై నాటికి మరికొన్ని కంపెనీలు అమరావతి ప్రాంతానికి రానున్నాయని, 6వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అమరావతి నుంచి ప్రపంచానికి ఐటీ సేవలందించే అవకాశాన్ని కంపెనీలు అందిపుచ్చుకోవాలన్నారు. ప్రపంచంలో ఐదు అగ్రగామి నగరాల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. కంపెనీల ఏర్పాటుకు పూర్తిస్థాయిలో సహకరిస్తూ.. హైటెక్‌సిటీ కంటే బ్రహ్మాండమైన ప్రాంతాన్ని రాజధానిలో ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. విజయవాడలో హార్డ్‌వేర్‌ బజార్‌ ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. ఉద్యోగాలిచ్చే కంపెనీలతో పాటు 13 శిక్షణా కేంద్రాలు కూడా రాజధానిలో ఏర్పాటైనట్టు చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, శిక్షణా సంస్థలు, కళాశాలలు, విద్యార్థులను ఒకచోట కలిపేలా రూపొందించిన www.itcentral.in వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...