NBK2NTRMT Posted January 18, 2017 Share Posted January 18, 2017 నందమూరి అనేది ఒక సాధారణ ఇంటి పేరు ఆ కారణ జన్ముడు పుట్టే దాక...ఆయన అవతరించాక ఆ ఇంటి పేరు కి ఒక గుర్తింపు...ఆయన ఎదిగాక ఆయన ఊరికి ఒక గుర్తింపు...ఆయన ఇంతింతై వటురింతై అని వ్యాపించాక తెలుగు జాతికి ఒక గుర్తింపు అది సినిమా నా.... దైవత్వం ఉట్టి పడే పాత్ర నుంచి రౌద్రం గా భయపెట్టె సర్దార్ పాపారాయుడైన అమాయకం గా నవ్వులు పూయొంచిన మిస్సమ్మ అయిన పాత్ర ఏదైన పరకాయ ప్రవేశం ఆయన స్టైల్ మొహానికి రంగేసుకునే వాళ్ళకి రాజకీయాల అని నవ్విన వారి మొహాల మీద పేడ కళ్ళాపి చల్లినా న భూథో అన్న స్థాయి లో డిల్లి దురహంకారాన్ని మెడలు వంచినా ఆయనకే చెల్లు కలం తో పటేల్ పట్వారి గుండెళ్ళో పోటు పొడిచిన రెండు రూపయిలకే కిలో బియ్యం తో కడుపు నింపినా జనతా వస్త్రాలతో పేద వాడి వళ్ళు కప్పినా కింద పడ్డ ప్రతి సారి కొత్త రికార్డ్స్ తో అధికారం చేపట్టినా ఆయనకె చెల్లు ఆయన ఈ భూమి మీద తిరుగాడిన కాలం లో అంటే 1996 ముందు పుట్టిన ప్రతి వాడు అదృష్టవంతుదే... నేను కమ్మ కాకున్నా ఈ అన్న కి భక్తిడిగా నేనున్నా...నేను మాల అయిన మాదిగ అయిన రెడ్డి అయినా కాపు అయిన ఈ రామన్న భక్తుడినే...ఆ రాముడెలా ఉండేవాడో ఈ రాముడిని చూసాక తెలిసింది.. నా ఎంటీవోడి కి కులం లేదు.... కులాన్ని మించి ఎదిగాడు...నా ఎంటీవోడు నా వాడు మా వాడు మన వాడు... కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లో కుప్పి గంతులు వెయ్యలేదు....బొక్క బోర్లా పడలేదు.. కలెక్షన్ వచ్చే ప్రతి జోకర్ గాడు ఆయన్ని చూసే ఎంటర్ అయ్యారు...కాని వాళ్ళకి తెలియనిది ......తెలుసుకోవాల్సింది.... ఎంటీవోడు మగోడు..మొండోడు..దమ్మున్నోడు..డిల్లి కి ఎదురొడ్డి నిలిచినోడు...కులాలకతీతం గా ఎదిగినోడు రామన్నా...మళ్ళెపుడు పుడతావన్నా... ....johar NTR !! Link to comment Share on other sites More sharing options...
nareshdevineni Posted January 19, 2017 Share Posted January 19, 2017 well written Link to comment Share on other sites More sharing options...
minion Posted January 20, 2017 Share Posted January 20, 2017 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.