Jump to content

40 Years for DaanaVeeraSooraKarna: Snippets


Raaz-NTR

Recommended Posts

Copied from OLD ARCHIVES:

 

 

 

 

KRISHNA STARTED THE FILM KURUKSHETHRA OPPOSITE TO LEGEND NTR.NTR COMPLETED THE SHOOTING OF DANA VEERA SURA KARNA IN JUST 43 DAYS AND RELEASED IT ON 56TH DAY OF STARTING THE FILM.KRISHNA STARTED SHOOTING BEFORE NTR ITSELF AND HE WENT TO KURUKSHETRA TO SHOOT SOME PART OF THE FILM

NTR ACTED AS LORD KRISHNA,KARNA,DURYODHANA
KRISHNA ACTED AS ARJUNA
IN KURUKSHETRA SOBHAN BABU ACTED AS LORD KRISHNA
IN THAT FILM HIS FAMOUS DIALOGUE"ARJUNA ARJUNA ARJUNA" IS WELL KNOWN

MANY STARS ACTED IN KRURUKSHTRA

A THE TIME OF SHOOTING THERE IS A RULE BETWEEN TWO FILMS THAT NO ACTOR SHOULD ACT IN BOTH THE FILMS
BUT NTR GAVE PERMISSION TO SATYANARANA TO ACT IN BOTH THE FILMS
IN DANA VEERA SURA KARNA CHALAPATHI RAO ALSO AVTED IN THREE CHARACTERS
BALAYYA ACTED IN ABHIMANYU'S CHARACTER
MADALA RANGA RAO IS TAKEN FOR ARJUNA'S CHARACTED IN THE STARTING
IN MIDDLE IN DEMANDED FOR NON-VEG
NTR REQUESTED HIM AS IT IS A FILM BASED ON MAHABHARATHA NON-VEG IS NOT BEEN TAKEN
MADALA RANGA RAO DENIED
NTR LET HIM OFF AND TOOK HARI KRISHNA IN THE CHARACTER OF ARJUNA

AS THE FILM IS RELEASED FASTLY WITHOUT TAKING TOO MANY DAYS,WE CAN SEE THREADS IN THE FILM DANA VEERA SURA KARNA

FILM RELEASED ON 14-01-1977 AND BECAME INDUSTRY HIT WHILE KURUSHETRA IS A FLOP

FILM COMPLETED 100DAYS NOT FOR ONCE
BUT FOR THREE RELEASES(I DONT KNOW 2ND,3RD) RELEASE DATES
ITS A RECORD IN TELUGU FILM INDUSTRY

OTHER SIDELIGHTS OF FILM:
>>That day Tollywood saw the release of longest movie ever made


>>“Dana Veera Sura Karna” was released on Makarasankranthi and and completed 30 years on 14-01-2007


>>This movie was made by Nandamuri Taraka Ramarao(NTR)under his own banner, Ramakrishna cine studios


>>He showcased the friendship between Karna and Dhuryodhana


>>Director:ntr


>>Cast:NTR,B.Saroja Devi,NBK,Kaikala,Prabhakar Reddy,ChalapathiRao


>>N.T.Ramarao besides directing and producing the movie "Dana veera Sura Karna" he acted in three controvertial roles of Krishna, karna and Duryodana in that movie


>>This movie was NTR’s 248th movie as an actor


>>He got the idea of making such an epic when he was acting as Lord Krishna in Shivagi Ganeshan’s “Karna”


>>The movie was of 4 hours 7 minutes duration and also with 25 reels


>>It had 10 songs and 35 poems in it


>>NTR took only 43 days to shoot the movie

FILM TOTALLY COLLECTED 1.60 CRORES
AT THAT TIME HIGHEST TICKET RATE IS LESS THAN 1 RUPEE
NOW THA TICKET RATE IS MIN: 60RS
THEATERS LIST OF THE FILMS INCREASED A LOT
IF WE RELEASE THAT FILM WE CAN COLLECT AN AMOUNT OF NEARLY 250CRORES NOW A DAYS
TOTALLY FILM PLAYED 450 DAYS IN 1ST RELEASE
 

Link to comment
Share on other sites

చలనచిత్ర జగత్తులోనే ‘దాన వీర శూర కర్ణ’ ఓ అద్భుతం! యేడాదికి ఏడు, ఎనిమిది చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉండే నటుడు పౌరాణికంలో త్రిపాత్రాభినయం చేయాలనుకోవడమే సాహసం. అలాంటిది కథ, చిత్రానువాదం తానే సమకూర్చుకొని, నిర్మాత, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఓ పౌరాణిక చిత్రంలో త్రిపాత్రలను అనితర సాధ్యమైన రీతిలో పోషించడం అద్భుతం కాక మరేమవుతుంది!? హీరోగా ఎంతో బిజీగా ఉన్నా, అప్పుడప్పుడే దర్శకునిగా మారి తనకిష్టమైన ఇతివృత్తాలతో చిత్రాలను రూపొందించేవారాయన. అలా ఆయనను ఆకట్టుకున్న అంశం భారతంలోని కర్ణ, సుయోధనుల మైత్రీబంధం. దీనిని ప్రధానాంశంగా గైకొని ఆయన ‘దాన వీర శూర కర్ణ’ కథను రూపొందించుకున్నారు. ఇందులో అశేషాంధ్రులను విశేషంగా అలరించిన అంశం శ్రీకృష్ణ, కర్ణ, సుయోధనులుగా నందమూరి ప్రదర్శించిన నటవిశ్వరూపం! అందుకే ఈ చిత్రం చలనచిత్ర జగత్తులో ఓ మహాద్భుతం! ఈ రోజుల్లో పౌరాణిక చిత్రం సంగతి అటుంచి జానపద చిత్రం తీయడానికే సంవత్సరాలు పడుతోంది... ఏమంటే సినిమా తీయడం ఒకెత్తు- వాటికి తగ్గ గ్రాఫిక్స్‌ జోడించడం మరో ఎత్తు అంటున్నారు ఈ తరం దర్శకనిర్మాతలు... ఆప్టికల్‌ వర్క్‌ తోనే పౌరాణిక,జానపద చిత్రాల్లో జిమ్మిక్స్‌ చేసే ఆ రోజుల్లో వాటికన్నా మిన్నగా నటీనటుల ప్రతిభే రక్తి కట్టించేది... లేదంటే పౌరాణిక, జానపదాలకు ఆ వెలుగే ఉండేది కాదు... ఎన్నో పౌరాణిక, జానపద చిత్రాలకు ప్రాణం పోసిన కథానాయకుడు యన్టీ రామారావు... ఆయన మనఃఫలకంపై ముద్ర వేసుకున్న కథ ’దానవీరశూర కర్ణ’... ఈ కథను జనరంజకంగా ఆయన తెరకెక్కించిన తీరు అనితరసాధ్యమనే చెప్పాలి. ఈ సినిమా శనివారంతో 40 ఏళ్లు పూర్తి చేసుకుంది.

అది నాన్నగారికే సాధ్యం: బాలకృష్ణ 
’దానవీరశూరకర్ణ’ అన్న పేరు వింటేనే ఒళ్లు పులకరిస్తుంది. ’తెలుగు’ అన్న మూడక్షరాలు వింటే ఎలా పులకరించిపోతానో, యన్టీఆర్‌ అన్న మూడక్షరాలు విన్నా నా మేను రోమాంచితమవుతుంది. అలాంటి అనుభూతి ’దానవీరశూరకర్ణ’ అన్న పేరు వింటే నాకు కలుగుతుంది. 1976 జూన్‌ 7న రామకృష్ణా సినీస్టూడియోస్‌ లో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభమయింది. ఎమ్జిఆర్‌ గారు ముఖ్యఅతిథిగా వచ్చి క్లాప్‌ కొట్టారు. యన్టీఆర్‌ గారు ఇందులో పోషించిన త్రిపాత్రాభినయం పెద్ద ఎస్సెట్‌. ఈ సినిమాలో దుర్యోదనుడి పాత్రే మిన్నగా ఉంటుంది. చాలామంది అన్నారు ఈ చిత్రానికి ’రారాజు’ అన్న టైటిల్‌ పెట్టొచ్చుగా, దానవీరశూరకర్ణ అన్న టైటిల్‌ ఎందుకు అని. నిజానికి మనం చూసే ఈ సినిమాలో దుర్యోధనుడే హీరో. కానీ, కర్ణుని గుణగణాలు అన్నీ ఎంతో ఉన్నతమైనవని ఈ చిత్రానికి ’దానవీరశూరకర్ణ’ అని టైటిల్‌ పెట్టారు. ఈ చిత్రం ఆ కాలంలోనే 43 రోజుల్లో పూర్తయింది. ఇప్పటి మా ’గౌతమిపుత్ర శాతకర్ణి’ కూడా కేవలం 79 రోజుల్లో పూర్తయింది. అయితే ’దానవీరశూరకర్ణ’ ఓ చరిత్ర. అందులో మూడు పాత్రలు పోషిస్తూ, దర్శకత్వం వహిస్తూ అంత పెద్ద చిత్రాన్ని తెరకెక్కించాలంటే మాటలు కాదు. అది యన్టీఆర్‌ కే సాధ్యమయింది.

ఎంతోమంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. వారందరినీ షెడ్యూల్‌ ప్రకారం తీసుకురావడం, వారందరి నుండి తనకు కావలసిన నటనను రాబట్టడం ఇవన్నీ ఆయనే స్వయంగా చూసుకొనేవారు. రాజసూయయాగానికి పాండవులు ఆహ్వానలేఖ పంపిన సమయంలో దుర్యోధనుడు వల్లించే డైలాగ్స్‌ అంతా అయిపోయాక చూసుకుంటే, పక్కన ఉండాల్సిన దుశ్శాసన పాత్రధారి జగ్గారావు లేరు. దాంతో ఆయన వచ్చిన తరువాత మళ్ళీ షూట్‌ చేశారు. అది మొదటిదానికంటే బాగా రావడంతో సంతృప్తి చెందారు. ఇక మేము, సోదరులం అందరమూ ఈ సినిమాకు కార్మికుల్లాగే పనిచేశాం. సెట్స్‌ కు రంగులు మేమే వేసేవాళ్ళం. అక్కడే నిద్రపోయేవాళ్ళం. మేము నిద్ర పోతూ ఉండగానే బార్బర్‌ వచ్చి మా గడ్డాలు నీట్‌ గా షేవ్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇంతగా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసిన ఈ చిత్రంలో సమయభావం వల్ల సవరించలేని కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి. అయినా వాటిని లెక్క చేయకుండా విడుదల చేశాం. ఎలా ఉన్నా జనం తనను ఆదరిస్తారనే నమ్మకంతో విడుదల చేశారు. దటీజ్‌ యన్టీఆర్‌! ఇంతటి మహత్తర చిత్రంలో నేను అభిమన్యుని పాత్ర పోషించాను. నాకు మంచి పేరు వచ్చింది.

ముఖ్యంగా కర్ణుని గెటప్‌ లో ఉన్న పెద్దాయనను ’’ఛీ కర్ణా...’’ అంటూ చెప్పే డైలాగ్‌ సమయంలో వణకు పుట్టింది. అయినా నాన్నగారు పాత్రనే కనిపించాలి, మనం కనిపించరాదని చెప్పేవారు. అలాగే చేశాను. 40 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది. అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొంది. 250 రోజులు ప్రదర్శితమయింది. ఇక ఈ చిత్రం డైలాగ్‌ రికార్డ్స్‌ రికార్డ్‌ స్థాయిలో అమ్ముడయ్యాయి. ఎల్పీ, క్యాసెట్‌, సీడీ, ఆన్‌ లైన్‌- ఇఆ నాలుగు ఫార్మాట్స్‌ లోనూ ’దానవీరశూరకర్ణ’ డైలాగ్స్‌ సేల్స్‌ రికార్డ్‌ స్థాయిలో జరిగాయి. ఇలా ఓ సినిమా డైలాగ్స్‌ అంతలా అమ్ముడవ్వడం ఇండియాలోనే ఓ రికార్డ్‌. ఇక ఈ సినిమా నిడివి విషయానికి వస్తే 4 గంటల 7 నిమిషాల ప్రదర్శన సమయం. అంతకు ముందు రాజ్‌ కపూర్‌ గారి ’మేరా నామ్‌ జోకర్ రాజ్‌ కపూర్‌ పెద్ద సినిమాగా ఉండేది. తరువాత దానిని ట్రిమ్‌ చేశారు. ’దానవీరశూరకర్ణ’ ఇప్పటికీ నాలుగు గంటల ఏడు నిమిషాలుగానే ఉండడంతో ఇదే ఇండియాలో పెద్ద సినిమా అయింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే పెట్టుబడికి పదింతలు రాబడి చూసింది. 1994లో రిపీట్‌ రన్‌ లోనూ కోటి రూపాయల షేర్‌ చూసిందీ చిత్రం’’ అని బాలకృష్ణ ’దానవీరశూరకర్ణ’ విశేషాలను గుర్తు చేసుకొని సంతసించారు. అన్నట్టు, రిపీట్‌ రన్‌ లో కోటి రూపాయల షేర్‌ చూసిన రికార్డ్‌ మన దేశంలో యన్టీఆర్‌ కే దక్కడం గమనార్హం!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...