Jump to content

రోషంతో దేశం తిప్పిన మీసం ఈ శాతకర్ణి


Lokanadham

Recommended Posts

ఎవడి మీసం వాడు తిప్పుకొని… ఎవడి ఒళ్లు వాడు వికుచుకొని అదే హీరోయిజం అనడం చూశాం ఇప్పటి వరకూ! చరిత్ర అంటే మాదీ అని దీర్ఘం తీసిన బాలయ్య… హిస్టరీ అంటే మనదీ అంటూ సింహనాదం చేశాడు. దేశం మీసం తిప్పడం అంటే ఏంటో చూపించాడు. జాతి జెండా ఎగరేస్తే ఇలా ఉంటుందని నిరూపించాడు. మొనగాడు బరిలో దిగితే చిరునామా గల్లంతు అవుతుందని ఫస్ట్ షో పడి పావుగంట కాగానే రుజువైపోయింది!

ఇన్నాళ్లూ… అప్పట్లోనే నాన్నగారు అనే బాలయ్య ట్రెండ్ మార్చి చూపించాడు. అప్పట్లోనే అమ్మకి అంత గౌరవం ఉండేదని… మనజాతి మూలాలు అంతాలా పాతుకుపోయాయని, మన పౌరుష పరాక్రమ విక్రమాలు నేల నాలుగు చెరగులా విస్తరించాయని… దిగ్గజాలనే ధిక్కరించి దిక్కులు పిక్కటిల్లే జయజయ ధ్వానాలై వర్థిల్లాయని శాతకర్ణి చూస్తే తెలుస్తుంది. తెలియడం కాదు మన ప్రమేయం లేకుండానే రోమాలు నిక్కబొడుచుకునే ఉత్తేజం ఇచ్చే సందర్భాలు జీవితంలో ఎన్ని ఉంటాయో తెలీదు. అలాంటి లెక్కంటూ వేస్తే మనం శాతకర్ణితో మొదలు పెట్టాలి.

కొత్తగా మొదలు పెట్టిన జాతికి డిక్షనరీ కావాలి. ప్రయాణం మొదలు పెట్టిన తొలినాళ్లలో రూట్ మ్యాప్ తెలియాలి. ల్యాండ్ మార్క్ ఇదీ అని చెప్పుకోగలగాలి. మేమంటే ఇదీ… మా సత్తా ఇదీ అని నొక్కి ఒక్కాణించేందుకు పక్కా పాయింట్ కావాలి. అలాంటి సందర్భంలో ఉంది ఆంధ్రజాతి. సంకోచాల్ని చెండాడుతూ …. సంశయాలను తుడిచి పెడుతూ నువ్ దిక్కులు చూసే స్థితిలో లేవ్ దిగంతాలను శాసించిన

మొనగాడివి నువ్ అని భుజం తట్టి … తెలుగోడి పౌరుషాన్ని ఆవిష్కరించిన అద్భుతం శాతకర్ణి.

వందో సినిమా వచ్చే వరకూ ఉద్వేగం. వచ్చాక ఒకరకమైన గగుర్పాటుతో కూడిన గర్వం! గగుర్పాటు ఎందుకంటే .. ఇలాంటి సినిమా రాకపోయి ఉంటే ఏమైపోయేవాళ్లమా… ఎంత కోల్పోయే వాళ్లమా అని! ల్యాండ్ మార్క్ మూవీ అంటే లెక్కలేసుకొని… మసాలా కోసం అరువులు తెచ్చుకోవడమే చూశాం ఇప్పటి వరకూ! కానీ వంద అంటే పండగ నాకు కాదు మీకు అని చెప్పడమే కాదు చేతల్లో చూపించడం…జాతి గుండెల్లో నిలిచిపోయే సినిమా తీయాలంటే క్లారిటీనే కాదు… అంతకుమించిన ప్యూరిటీ కూడా ఉండాలి. ఉన్నాయ్ కాబట్టే … క్రిష్ లాంటి దర్శకుడు కుదిరాడు కాబట్టే శాతకర్ణి సాకారం అయ్యింది. ఫైనల్ గా ఒక్క మాట… సెంచరీలు జాతికి అంకితం ఇచ్చిన బ్యాట్స్ మన్ ని చూసి ఉంటాం కానీ… జాతితోనే సెంచరీ చేయించి, చరిత్రను చరితార్థం చేయడం కొందరికే సాధ్యం !

అమరావతిని గుండెలకి హత్తుకుంటున్న ఆంధ్రుడిగా రొమ్ము విరిచి చెబుతున్నా…రోషంతో దేశం తిప్పిన మీసం ఈ శాతకర్ణి! వంద సంక్రాంతుల్ని వీడు ఒకేసారి తెచ్చాడు. మరి అసూయ చెందకుండా ఎలా ఉంటుంది అనంత విశ్వం,.......

Well said Bro ... Super ga cheppav 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...