Jump to content

International Kuchipudi Dance Convention


sonykongara

Recommended Posts



కూచిపూడి ఎలా వచ్చిందంటే...



ప్రపంచ ప్రఖ్యాత కూచిపూడి నృత్య ప్రదర్శన లు నవ్యాంధ్రప్రదేశ్‌లో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు విజయవాడలో అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారిగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కూచిపూడి అనే గ్రామం ఎలావచ్చిందన్నది ఆసక్తికరం. ఈ గ్రామం విజయవాడకు సుమారు 62 కిలో మీటర్ల దూరంలో ఉంది. పూర్వ కాలంలో కుచల అనే వ్యక్తి ఈ గ్రామ నిర్మాణానికి తొలి పునాది వేసినట్లుగా చారిత్రక కఽథనం. ఆ తరువాత కుశీలవపురిగా మారింది. కుశీలవపురం రాను రాను కూచిపూడిగా మారినట్లు కథనాలు ఉన్నాయి. కుశీలవులు నాటకాలు ప్రదర్శించేవా రట. దీంతో వారి నాటకాభినయంలో భాగంగానే కూచిపూడి నృత్యం వచ్చిందని చెబుతారు. పైగా కూచిపూడికి రెండు కిలోమీటర్ల దూరంలో శ్రీకాకు ళాంధ్ర దేవుడు ఉన్నాడు. ఈయన సన్నిధిలోనే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రాసినట్లుగా చెబుతారు. ఆముక్తమాల్యద అంటే దాదాపు గోదాదేవి చరిత్రేనని కూడా ప్రసిద్ధం.

శ్రీకాకుళం రెండవ శతాబ్దంలో శాతవాహను లకు రాజధానిగా ఉండేది. కూచిపూడికి సమీపం లోనే ప్రసిద్ధ బౌద్దక్షేత్రం ఘంటసాల కూడా ఉంది. కూచిపూడి నృత్యం ఇక్కడ ప్రారంభం కాకముందు దేవదాసీ నృత్యాలు ఉండేవట. కళింగరాజుల కాలంలో నరహరితీర్ధుడు అనే మంత్రి కూచిపూడి ని పాలించారట, ఆయనకు అనందతీర్ధులకు శిష్యులుగా ఉండేవారు. ఆయన నాట్యకళను బాగా ప్రసిద్ధంగా తీసుకువచ్చారు. ఇక సిద్దేంధ్రుడు కథనం కూడా ఎంతో ఆసక్తికరం. ఆయన తొలుత సిద్దప్ప అనే అనాధ బాలుడట. ఆయన తల్లి తండ్రులు ఎవరో, ఎక్కడ పుట్టారో తెలియని పరిస్థితి. ఆయన సాక్షాత్తూ కృష్ణుని ప్రసన్నం చేసుకుని సిద్దేంధ్రయోగిగా ప్రసిద్ధి పొందారు. నాట్యంలో ఆయనను మించిన వారు ప్రపంచంలోనే లేరు.

కూచిపూడి నాట్యం అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది. ఈ నృత్యంలో చేతులు తిప్పడం దగ్గర్నుంచి కాళ్ళ కదలిక, ముఖంలోని హావభా వాల ప్రదర్శన నుంచి అన్నింటా ఎలా ఉండాలన్న నియమాలు చూస్తే దానిపై పూర్తి ఏకాగ్రత ఉంటేనే కాని సాధ్యపడదన్నది స్పష్టమవుతున్నది. సుమారుగా 63 రకాలుగా చేతులు తిప్పాలి. ఏదో చేతులు తిప్పడం కాకుండా ఏ నాట్యంలో ఎలా చేతులు తిప్పాలన్నదానిపై ఒక పెద్ద గ్రంఽథమే ఉంది. మరో 67 రకాల సంయుక్త హస్తాలు ఉన్నాయి,. 30 రకాల నృత్యహస్తాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే కూచిపూడి నాలుగు వేదాలంత ఉంటుందని విజ్ఞులు అంటారు. మూడు రోజుల పాటు విజయవాడలో జరిగే కూచిపూడి నృత్యోత్సవాన్ని తిలకించడం ఒక గొప్ప అనుభూతిని ఇవ్వగలదని చెప్పచ్చు

Link to comment
Share on other sites

కూచిపూడి నాట్య సమ్మేళనం ప్రారంభం

23brk-69a.jpg

విజయవాడ: అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం శుక్రవారం ఉదయం విజయవాడలో ప్రారంభమైంది. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తదితరులు హాజరయ్యారు.

కృష్ణా పరివాహక ప్రాంతంలో విలసిల్లి... ఖ్యాతినార్జించిన కూచిపూడి నాట్యం నవ్యాంధ్ర రాజధానిలో మూడు రోజుల పాటు వెలుగొందనుంది. కూచిపూడి నాట్యం పుట్టినగడ్డపై కళా ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రపంచంలోని దిగ్గజాలంతా విజయవాడకు తరలి వచ్చారు. ఆరు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన కూచిపూడి నాట్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చేందుకు, నేటి తరానికి మరింత చేరువ చేసేందుకు, తెలుగు వారి కళకు అరుదైన గౌరవం కల్పించే లక్ష్యంతో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు.

23brk-69b.jpg

23brk-69c.jpg

 
Link to comment
Share on other sites

సాంస్కృతిక రాజధానిగా అమరావతి
 
636181402378015616.jpg
  • కూచిపూడి గురువులకు త్వరలోనే చేయూత..
  • ప్రతి ఇంట్లో కూచిపూడి చేసేవారు ఒకరుండాలి
  • విజయవాడలో 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనం
  • ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు వెల్లడి
 
విజయవాడ, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిని సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దుతామని.. సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని భవిష్యత తరాలకు పదిలంగా అందించడానికి తాను కంకణబద్ధుడై పనిచేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ-సిలికానాంధ్ర సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం లో శుక్రవారం 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనం ప్రారంభమైంది. 3 రోజులు జరిగే సమ్మేళనాన్ని.. సుప్రీం కోర్టు జడ్జి ఎన్‌.వి.రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామసుబ్రహమణ్యన్‌ లతో కలిసి సీఎం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రారంభ సభకు హాజరైన సభికులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కూచిపూడి ఏపీలోని కృష్ణాజిల్లాలోనే ఆవిర్భవించిందని, అయితే ఇక్కడి వారే కూచిపూడిని మరిచిపోయారని అన్నారు. అమెరికాలో ప్రతి తెలుగువారి ఇంట్లోనూ కూచిపూడి నృత్యం నేర్చుకున్నవారు ఉంటున్నారని, ఏపీలో కూడా ప్రతి ఇంట్లో కూచిపూడి నృత్యం నేర్చుకుని ఉండాలని చెప్పారు.
 
మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, వారసత్వాన్ని, కళలను కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్య లూ తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే కూచిపూడి నాట్యారామం కోసం రూ.100 కోట్లు కేటాయించామని, దీని అభివృద్ధి కమిటీ చైౖర్మన్‌గా కూచిభొట్ల ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించామని గుర్తుచేశారు. డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ చైర్మన్‌గా గల కమిటీ తెలుగు భాషాభివృద్ధి కోసం పనిచేస్తోందని, ఈ కమిటీ నివేదిక రాగానే ఏమి చేయాలనేదానిపై ఒక ప్రణాళికను సిద్ధంచేసి అమలు చేస్తామన్నారు. ఇప్పటికే 6500 మంది కళాకారులకు ఫించ ను ఇస్తున్నామని, 250 మంది కూచిపూడి గురువులకు కూడా మే లు కలిగించేందుకు త్వరలో ప్రకటన చేస్తామని తెలిపారు. ఇక.. సిలికానాంధ్ర, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖలు తెలుగుభాషకు, తెలుగు కళాకారులకు ఈవిధంగా పట్టాభిషేకం చేయడం అభినందనీయమని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ అన్నారు.
 
తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించేందుకు అమరావతిలో అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యన్‌ మాట్లాడుతూ.. త్యాగరాజు జన్మించిన తంజావూరే తన ఊరని చెప్పారు. ఏడు నెలల క్రితం తాను హైదరాబాద్‌కు బదిలీపై వచ్చానని, ప్రస్తుతానికి తెలుగును అర్థం చేసుకోగలుగుతున్నాను కానీ మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. మద్రాసులో కళలకు బాగా ఆదరణ ఉండేదని, ఇప్పుడు తగ్గిందని అభిప్రాయపడ్డారు. అక్కడ కోల్పోయిన అనందాన్ని ఇప్పు డు విజయవాడలో కూచిపూడి నాట్యసమ్మేళాన్ని చూసి పొందుతున్నానని చెప్పారు. కాగా.. డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ద ప్రసాద్‌, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, విజయవాడ మేయర్‌ శ్రీధర్‌, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీకాంత, కృష్ణా జిల్లా అధికారులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూచిపూడి నాట్యారామం చైర్మన్‌ కూచిభొట్ల ఆనంద్‌ అధ్యక్షత వహించారు. కూచిపూడి నాట్య ప్రముఖులు రాజారెడ్డి, శోభానాయుడు, స్వప్నసుందరి, యామినీ కృష్ణమూర్తి వేదికపై ఆసీనులయ్యారు.
Link to comment
Share on other sites

 

 

మన కూచిపూడికి, గిన్నిస్ రికార్డు సొంతం

గత రెండు రోజుల నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సిలికానాంధ్ర సంస్థ సంయుక్తంగా, విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో జరుగతున్న, 5 వ అంతర్జాతీయ కూచిపూడి మహా సమ్మేళనం ఘనంగా ముగిసింది.

అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో 18 దేశాలకు చెందిన 6117 కళాకారులతో మహా బృంద నాట్యం చేసి, గిన్నిస్ రికార్డు సాదించిరు. సీఎం చంద్రబాబు కి గిన్నిస్ రికార్డు పత్రాన్ని అందించిరు గిన్నిస్ బుక్ ప్రతినిధి.

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌, కృష్ణాజిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

 

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...