Jump to content

4 lane road ga polavaram kalava katta


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
  • 5 weeks later...
పోలవరం ఎడమవైపు నాలుగు లేన్ల రోడ్డు
 
హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం సాగునీటి ప్రాజెక్టు కుడి కాలువను ఆనుకుని ఎడమవైపున నున్న నుంచి జక్కంపూడి వరకూ నాలుగు వరుసల రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ కాలువ 156.500 కిలోమీటర్ల నుంచి 164.500 వరకూ ఈ రోడ్డును నిర్మిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 months later...
  • 1 month later...
  • 1 month later...
  • 4 months later...
సా..గని రోడ్డు నిర్మాణం
12-12-2017 10:39:01
 
636486735366378304.jpg
  •  పనులు ప్రారంభించి ఏడాదైనా అసంపూర్తే
  • గొల్లనపల్లి ఏరియాలోనే పూర్తి
  •  నున్న, పాతపాడు, పి. నైనవరంలో పెండింగ్‌
  • దృష్టి సారించని ఉన్నతాధికారులు
 
విజయవాడ రూరల్‌:  విజయవాడ నగరంపై ట్రాఫిక్‌ సమస్యను తగ్గించటంతోపాటు తక్కువ సమయంలోనే రాజమహేంద్రవరం వెళ్లేందుకు పోలవరం కుడి ప్రధానకాల్వ కట్టపై నిర్మిస్తున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. గత ఏడాది కృష్ణా పుష్కరాల సమయంలో పనులను ప్రారంభించినా ఇంకా పూర్తి కాలేదు. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి నుంచి గన్నవరం మండలం గొల్లనపల్లి వరకు సుమారు 32 కిలో మీటర్ల పొడవునా నాలుగులైన్ల రోడ్డును నిర్మిస్తున్నారు. ఇందుకోసం తొలి దశలో రూ.80 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మొదట్లో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరిగినప్పటికీ, కొద్ది నెలలుగా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. పోలవరం కుడి ప్రధాన కాల్వ నిర్మాణ పనుల్లోనే 175 కిలో మీటర్ల మేర నాలుగు లైన్ల రహదారి నిర్మాణం ఉంది. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం, కోల్‌కతా వెళ్లే భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నగరం బయట నుంచి వెళ్లేందుకు వీలుగా ఈ రోడ్డును డిజైన్‌ చేశారు. కృష్ణా పుష్కరాల సమయంలోనే ఈ రోడ్డును పూర్తి చేయాలని అప్పటి కలెక్టర్‌ బాబు ఎ ఆదేశించారు. కాని ఆశించిన మేర రోడ్డు నిర్మాణ పనులు జరగలేదు. విజయవాడ నగరంలో దుర్గా ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతుండటంతో, నగరంలో ట్రాఫిక్‌ సమస్య విపరీతంగా పెరిగింది. హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా వైపు వెళ్లాల్సిన వాహనాలను ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కొత్తూరు తాడేపల్లి మీదుగా మళ్లించి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నుంచి రామవరప్పాడు రింగ్‌ వైపు పంపిస్తున్నారు. దీనివల్ల కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభిస్తోం ది. దీనికితోడు స్థానికులు కూడా భారీ వాహనాల వల్ల పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గొల్లనపల్లి వద్ద నాలుగు లైన్ల రహదారి నిర్మాణం పూర్తయింది. ఆ గ్రామంలో డివైడర్‌ను మాత్రమే అభివృద్ధి చేయాల్సి ఉంది. సూరంపల్లి రోడ్డుపై కంకర పోసి వదిలేశారు.
 
కంకర గుట్టలతో అవస్థలు
రోడ్డు నిర్మాణం కోసం వేసిన కంకర గుట్టలతో నున్న, పాతపాడు, కుందావారి కండ్రిక, మంగళాపురం, పి నైనవరం గ్రామాల ప్రజలు నానా బాధలు పడుతున్నారు. కట్ట మీదగా రాకపోకలు జరిపే వారు గ్రామంలోకి వెళ్లాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. రైతులు మామిడి తోటల్లోకి వెళ్లాలంటే తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మూడు నెలల్లో మామిడి సీజన్‌ వస్తోంది. మామిడిని మార్కెట్‌కు తరలించేందుకు వాహనాలు తోటల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం రోడ్డు స్థితి అందుకు అనుకూలించే అవకాశం లేదు ఇప్పటికైనా రోడ్డు నిర్మాణంపై అధికారులు దృష్టి సారించి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Link to comment
Share on other sites

  • 4 months later...
4 minutes ago, AnnaGaru said:

More than just transport purpose it is required to stop "breach"....

 

ALl along right canal it is loose soil and very dagerous and high chances for "gandi"....

naku enduko kaluva ni vedalupu chestharu anipisthundi, appudu ayina road lechipothundi road veyytam dandaga anipisthundi bro

Link to comment
Share on other sites

8 minutes ago, sonykongara said:

naku enduko kaluva ni vedalupu chestharu anipisthundi, appudu ayina road lechipothundi road veyytam dandaga anipisthundi bro

nenu choosinppudu motham kalavalu  concreate tho construct chesi unnai,   wont it be too much effort to widen now?

Link to comment
Share on other sites

7 minutes ago, sonykongara said:

naku enduko kaluva ni vedalupu chestharu anipisthundi, appudu ayina road lechipothundi road veyytam dandaga anipisthundi bro

Expansion is required only above "bandarugudem" to increase discharge capacity at POlavaram ......

anything between "bandarugudem-vijayawada" they will directly discharge from polavaram canal to others in future without prakasam barrage so no expansion required..

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...