Jump to content

ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు


Ramesh39

Recommended Posts

నంది స్థానంలో సింహం 

దేశంలోని ఉత్తమ సినీ కళాకారునికి ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు 
7tollywood6a.jpg

తెలంగాణలో నిర్మించిన ఉత్తమ చిత్రాలు, ప్రతిభ చూపిన కళాకారులకు సింహ పురస్కారాలివ్వాలని ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నంది పురస్కారాలుండగా తెలంగాణ ప్రత్యేకంగా అందజేయనున్న పురస్కారాలు ‘సింహం’ రూపంలో.. మొత్తం నలభై విభాగాల్లో ఉండాలని సూచించింది. మొదటి విభాగంలో వాటికి రూ.అయిదు లక్షల నగదు పారితోషికం ఇవ్వాలని ప్రతిపాదించింది. తెలంగాణ ముద్ర చాటేలా చలనచిత్ర పురస్కారాలివ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, నిపుణుల కమిటీ ఆరు నెలలు విస్తృతస్థాయిలో చర్చించి అవగాహనకు వచ్చింది. మంగళవారం జరిగిన సమావేశంలో సిఫార్సులను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అందజేసింది. దీనికి సంబంధించిన దస్త్రాన్ని సినిమాటోగ్రఫీ శాఖ రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుధవారం పంపించారు. ఆయన ఆమోదం అనంతరం ఉత్తర్వులు వెలువడతాయి.

ఇవీ సిఫార్సులు 
* దేశంలోని ఉత్తమ సినీ కళాకారునికి ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం. రూ.5 లక్షల పారితోషికంతో స్వర్ణ సింహం 
* నటులు కాకుండా ఇతర సినీ ప్రముఖుడికి పైడి జయరాజు పేరిట స్వర్ణసింహం, రూ.అయిదు లక్షలు 
* తెలుగు సినీ ప్రముఖుడికి రఘుపతి వెంకయ్య పురస్కారం, స్వర్ణసింహం, రూ.అయిదు లక్షలు 
* తెలంగాణ సినీ ప్రముఖుడికి కాంతారావు పురస్కారం, స్వర్ణసింహం, రూ. అయిదు లక్షలు

ఉత్తమ చిత్రాలకు 
* ఉత్తమ చిత్రానికి రూ. అయిదు లక్షలు. నిర్మాతకు స్వర్ణసింహం, దర్శకుడు, కథానాయకుడు, కథానాయికకు సింహ పురస్కారాలు 
* ద్వితీయ ఉత్తమ చిత్ర నిర్మాతకు రజత సింహం, రూ.మూడు లక్షలు. దర్శకుడు, కథానాయకుడు, కథానాయికకు పురస్కారాలు 
* తృతీయ ఉత్తమ చిత్ర నిర్మాతకు కాంస్య సింహం, రూ. రెండు లక్షల నగదు. దర్శకుడు, నాయకానాయికలకు పురస్కారాలు 
* ఉత్తమ కుటుంబ చిత్రానికి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పురస్కారం: నిర్మాతకు స్వర్ణ సింహం, రూ. 2 లక్షల నగదు 
* ఉత్తమ వినోదాత్మక చిత్రానికి స్వర్ణ సింహం, రూ.రెండు లక్షల నగదు 
* జాతీయ సమగ్రతను చాటే చిత్రానికి సరోజిని నాయుడు పురస్కారం : నిర్మాతకు రూ.రెండు లక్షల నగదు, స్వర్ణసింహం, దర్శకుడికి తామ్ర పురస్కారం 
* ఉత్తమ బాలల చిత్ర నిర్మాతకు స్వర్ణసింహం, రూ.రెండు లక్షల నగదు, దర్శకునికి రూ.లక్ష, తామ్ర సింహం 
* ద్వితీయ ఉత్తమ బాలలచిత్ర నిర్మాతకు రూ.లక్ష, రజత సింహం, దర్శకుడికి రూ.50 వేలు 
* బాలల చిత్రానికి ఉత్తమ దర్శకుడికి రూ. లక్ష, స్వర్ణ సింహం 
* తెలుగు సినిమాపై ఉత్తమ గ్రంథానికి రూ.50 వేలు, తామ్ర సింహం 
* తెలుగు సినిమాపై ఉత్తమ విమర్శకుడికి రూ.30 వేలు, తామ్ర సింహం

సినీకళాకారులు, సాంకేతిక నిపుణులకు.. 
* ఉత్తమ దర్శకుడు, కథానాయకుడు, నాయికకు స్వర్ణ సింహం, రూ.లక్ష చొప్పున నగదు 
* సహాయ నటుడు, నటికి రూ.50 వేలు, స్వర్ణ సింహాలు 
* హాస్యనటునికి తామ్ర సింహం, రూ. 50 వేలు 
* ప్రతినాయకునికి స్వర్ణ సింహం, రూ. 50 వేలు 
* బాల నటునికి స్వర్ణ సింహం, రూ. 50 వేలు 
* ఉత్తమ తొలిచిత్రదర్శకుడు, నటుడు, నటికి రూ.50 వేలు, రజత సింహం 
* ఉత్తమ కథారచయిత, మాటలు, పాటల రచయిత, సినిమాటోగ్రాఫర్‌కు స్వర్ణ సింహం, రూ. 50 వేల నగదు ఇస్తారు. 
* ఉత్తమ సంగీత దర్శకునికి చక్రి పేరిట రూ. 50 వేలు, స్వర్ణ సింహం, ఉత్తమ నేపథ్యగాయకుడు, గాయనిలకు రూ.50 వేలు, స్వర్ణసింహాలు, ఉత్తమ ఎడిటర్‌, కళాదర్శకుడు, నృత్యదర్శకుడు, ఆడియోగ్రాఫర్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, మేకప్‌ ఆర్టిస్టు, స్టంట్‌ డిజైనర్‌, డబ్బింగు కళాకారుడు, కళాకారిణి, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ప్రత్యేక కేటగిరి పురస్కారాల కింద తామ్ర సింహాలు, రూ. 50 వేల చొప్పున నగదు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...