Jump to content

బాలకృష్ణ నాకు అన్నయ్యతో సమానం

sonykongara

Recommended Posts

బాలకృష్ణ నాకు అన్నయ్యతో సమానం

శివరాజ్‌కుమార్‌

21216cinirajkum148.jpg

హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ తనకు అన్నయ్య లాంటివారని కన్నడ హీరో శివ రాజ్‌కుమార్‌ అన్నారు. క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో శివ రాజ్‌కుమార్‌ అతిథి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో తన అనుభవాల గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ‘ఇది నాకు కుటుంబ సినిమా వంటిది. నందమూరి తారకరామారావు, మా తండ్రి(రాజ్‌కుమార్‌) సోదరుల్లా ఉండేవారు. ఇప్పుడు నాకు, బాలకృష్ణకు మధ్య అదే అనుబంధం ఉంది. ఆయన బెంగళూరు వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తారు.. లేపాక్షి ఉత్సవాలకు అనంతపురం రమ్మని ఆహ్వానిస్తుంటారు. ఆయనకు చాలా ముఖ్యమైన ఈ చిత్రంలో నా భాగస్వామ్యం ఉండటం సంతోషంగా ఉంది. నా పాత్రను నేను బాగా చేశానని భావిస్తున్నాను’ అని చెప్పారు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో శ్రియ, హేమమాలిని, కబీర్‌బేడీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్‌ భట్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

Link to comment
Share on other sites

:terrific:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...