Jump to content

‘గౌతమిపుత్ర..’కి గుమ్మడికాయ కొట్టారు


Ramesh39

Recommended Posts

 

‘గౌతమిపుత్ర..’కి గుమ్మడికాయ కొట్టారు
11216cinigauthami1.jpg

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. చిత్రంలో శాతకర్ణి తల్లి గౌతమి పాత్రను పోషిస్తున్న హేమమాలిని ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. సినిమా స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. రెండో శతాబ్దానికి చెందిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ 100వ చిత్రంగా వస్తున్న దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

శ్రియ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరతన్‌ భట్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11216cinigauthami1a.jpg

11216cinigauthami2.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...