Jump to content

Govt. General Hospital, Guntur


sonykongara

Recommended Posts

  • Replies 101
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 3 weeks later...
  • 3 weeks later...
  • 1 month later...
  • 1 month later...
గుంటూరులో.. వైరాలజీ ల్యాబ్‌
16-02-2019 09:15:39
 
636859053376798491.jpg
  • ల్యాబ్‌ పనులు ప్రారంభం
  • రూ.6.50 కోట్లతో నిర్మాణం
  • ఎనిమిది నెలల్లో అందుబాటులోకి..
గుంటూరు(మెడికల్‌): ప్రస్తుత సీజన్‌లో స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభణతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏపీలో పలు జిల్లాల్లో ఈ ఇన్‌ఫ్లూయోంజ వ్యాధికి పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ స్ట్రెయిన్‌ మారిందని నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో ప్రబలిన స్వైన్‌ఫ్లూకు వైరస్‌ హెచ్‌1 ఎన్‌1 వైరస్సా? లేక హెచ్‌3 ఎన్‌2 వైరస్‌ రకమా? అని నిర్ధారించేందుకు తగిన ప్రయోగశాలలు నవ్యాంధ్రలో అందుబాట్లో లేదు. గతంలో వైరల్‌ సంబంధిత వ్యాధుల నిర్దారణకు ఉమ్మడి రాష్ట్రంలో, హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) స్టేట్‌ రిఫరల్‌ ల్యాబ్‌గా ఉండేది.
 
తెలంగాణ విడిపోయాక నవ్యాంధ్రలో రాష్ట్రస్థాయి వైరాలజీ ల్యాబ్‌ లేకుండా పోయింది. మన ప్రాంతంలో నమూనాలను వ్యాధి నిర్ధారణకు పూణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి నమూనాలను పంపాల్సి వస్తోంది. రాష్ట్రంలో ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి ఏదో ఒక వైరల్‌ వ్యాధి ప్రబలి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. స్వైన్‌ఫ్లూ, డెంగీ ఫీవర్‌, చికున్‌ గన్యా తదితర వైరల్‌ ఫీవర్లు విజృంభిస్తూనే ఉన్నాయి. సమర్ధవంతమైన చికిత్సలు అందించాలంటే.. ఆయా వ్యాధుల నిర్ధారణ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి స్టేట్‌ లెవెల్‌ వైరాలజీ ల్యాబ్‌ను మంజూరు చేసింది.
నవ్యాంధ్ర రాజధాని గుంటూరులో రాష్ట్రస్థాయి వైరాలజీ ల్యాబ్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
 
 
రూ.6.50 కోట్ల వ్యయంతో
గుంటూరు వైద్య కళాశాల ఆవరణలో రూ.6.50 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వైరాలజీ ల్యాబ్‌ నిర్మాణానికి అవసరమయ్యే నిధుల్లో 75 శాతం కేంద్ర ప్రభుత్వం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్నాయి. వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ ల్యాబ్‌ పని చేస్తుంది. 2018 డిసెంబరులో నిర్మాణ పనులు ప్రారంభిం చారు. కళాశాల ఆవరణలోని ప్రాంతీయ నీటి పరిశోధన కేంద్రం కార్యాలయంపైన, రెండో అంతస్తులో ఈ ల్యాబ్‌ నిర్మాణ పనులను ఇటీవల ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎంఎస్‌ ఐడీసీ) ఇంజనీరింగ్‌ విభాగం పర్యవేక్షణలో ప్రస్తుతం సివిల్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సివిల్‌, ఎలక్ట్రికల్‌ పనులకు రూ.50 లక్షలు కేటాయించారు. ఎనిమిది నెలల్లో వైరాలజీ ల్యాబ్‌ను అందుబాట్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వైరాలజీ ల్యాబ్‌ ప్రిన్సిపుల్‌ ఇన్వెస్టిగేటర్‌, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్‌ జాహ్నవి తెలిపారు.
 
 
వైద్య సిబ్బందికి పూణెలో శిక్షణ...
బయోసేఫ్టీ కేబినెట్లు, ల్యామినార్‌ ఎయిర్‌ఫ్లో ల్యాబ్‌లు నిర్మిస్తారు. హైస్పీడ్‌ సెంట్రిఫ్యూజ్‌, ఆటోక్లేవ్‌, ఫ్లోరోసెంట్‌ మైక్రోస్కోప్‌, రియల్‌ టైమ్‌ పీసీఆర్‌ మెషిన్‌ వంటి ఆధునిక వైద్య పరికరాల కొనుగోళ్లకు రూ.3.47 కోట్లు కేటాయించారు. ఈ స్టేట్‌ లెవెల్‌ వైరాలజీ ల్యాబ్‌లో విధులు నిర్వహించేందుకు సీనియర్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌, జూనియర్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్లను కాంట్రాక్ట్‌ పద్దతిలో నియమిస్తారు. వీరితో పాటు వైద్య కళాశాల మైక్రోబయాలజీ వైద్య సిబ్బంది కూడా ఉంటారు. ’’వైరాలజీ ల్యాబ్‌లో వినియోగించే వైద్య పరికరాలు కొనుగోళ్లకు త్వరలో టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేసినట్లు’’ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జీ సుబ్బారావు తెలిపారు.
 
 
ల్యాబ్‌లో నియమించే కాంట్రాక్ట్‌ సిబ్బందిని, మైక్రోబయాలజీ వైద్యులకు పూణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో శిక్షణకు పంపుతామని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న మైక్రోబయాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ల్యాబ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రశాంతి తెలిపారు.
 
 
పీజీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం
  • డాక్టర్‌ జాహ్నవి
వైద్య కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్టేట్‌ లెవెల్‌ వైరాలజీ ల్యాబ్‌ వల్ల రోగులతో పాటు పీజీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మైక్రోబయాలజీ విభాగాధిపతి, ల్యాబ్‌ ప్రిన్సిపుల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ ఐ.జాహ్నవి తెలిపారు. ఈ ల్యాబ్‌ అందుబాట్లోకి వస్తే.. పలు రకాల వైరల్‌ వ్యాధుల నిర్ధారణ పద్దతులను మైక్రోబయాలజీ పీజీ విద్యార్థులు అభ్యసించే అవకాశం ఏర్పడుందన్నారు. అదేవిధంగా ఆయా సీజన్‌ల్లో జిల్లాలో, రాష్ట్రంలో ఏదైనా కొత్త వైరస్‌ వ్యాధులు ప్రబలితే వాటిని గుంటూరులోని నిర్ధారించే అవకాశం కలుగుతుందని ఆమె వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి వైరాలజీ ల్యాబ్‌ అందుబాట్లోకి వస్తుందని జాహ్నవి పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...