Jump to content

Vijayawada Outer Ring Road

sonykongara

Recommended Posts

  • 2 months later...
ఇంకెన్నాళ్లు..
12-11-2018 09:23:43
 
636776114243800454.jpg
  • టెండర్లు పిలిచినా వీఐపీ కారిడార్‌కు మోక్షం లేదాయె!
  • ఇప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు రాని వైనం
  • గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులోనూ తాత్సారం
  • బెంజిసర్కిల్‌ 2 ఫ్లై ఓవర్‌కూ కదలిక లేదు
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ వారధి వరకు వీఐపీ కారిడార్‌ అభివృద్ధికి రూ.35 కోట్లతో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) పిలిచిన టెండర్లు ఫార్సుగా మారాయి. టెండర్లు పిలిచి సుమారు రెండునెలలు అవుతున్నా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. కేంద్రం ఆమోదం రాకపోవటంతో టెండర్ల ప్రక్రియ పూర్తిచేయలేని పరిస్థితి. కేంద్ర అనుమతులు లాంఛనమే అయినప్పటికీ ఇంత చిన్న ప్రాజెక్టు అనుమతులకు రెండునెలలు మించి సమయం పట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కనకదుర్గవారధి వరకు 16 నెంబర్‌ జాతీయ రహదారి పరిస్థితి అధ్వానంగా ఉంది. వీఐపీ కారిడార్‌ ప్యాచ్‌లతో కళావిహీనంగా మారింది. మరో వారం రోజుల్లో నగర కేంద్రంగా ప్రపంచస్థాయి గ్రాండ్‌ ఈవెంట్‌ ఫార్ములా 1 హెచ్‌ 2ఓ పవర్‌ బోట్‌ రేసింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు జరగనున్నాయి.
 
నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు రానున్నారు. అతిథులను ప్యాచ్‌వర్క్‌ రోడ్లపై తీసుకురావాల్సి ఉండటం ఒక రకంగా ఇబ్బందికరమైన అంశమే! వీఐపీ కారిడార్‌ నిడివి దాదాపుగా 21 కిలోమీటర్ల దూరం ఉంది. రెండు వరుసలతో ఉన్న రోడ్డు పలుచోట్ల కుంగి గుంతలు పడ్డాయి. రోడ్డు దుస్థితిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కారిడార్‌ను అభివృద్ధి చేయాల్సిందిగా ఎన్‌హెచ్‌ ను కోరింది. దీనికి తగ్గట్టుగా విజయవాడ డివిజన్‌ అధికారులు రూ. 35కోట్ల వ్యయంతో నూతన బీటీ లేయర్‌తోపాటు, సైన్‌బోర్డులు, ఐలాండ్‌ బ్యూటిఫికేషన్‌ కూడా జోడించి టెండర్లు పిలిచింది.
 
స్థానికంగానే నిర్ణయాధికారం
54az.jpgవాస్తవానికి డివిజన్‌ పరిధిలో చేపట్టే మరమ్మతులకు సంబంధించి స్థానికంగానే నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. ఒకవేళ కేంద్ర అనుమతులు కావాల్సి ఉన్నా అది లాంఛనమే. వెంటనే అనుమతులు వస్తాయి. కేంద్ర అనుమతులు రాకపోయినా టెండర్లు పిలుస్తారు. ఆ తర్వాత అనుమతులు రాగానే టెండర్లు ఖరారు చేస్తారు. కానీ వీఐపీ కారిడార్‌కు సంబంధించి రెండు నెలలవుతున్నా అనుమతులు రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉద్దేశపూర్వక జాప్యం ఏమీ లేదని జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెబుతున్నారు. కేంద్రం అనుమతులు వచ్చి ఉంటే ఈ పాటికే రోడ్డు అభివృద్ధి చెంది గ్రాండ్‌ ఈవెంట్లకు కొత్తకళ తెచ్చేది. రూ.500కోట్ల పైబడి ప్రాజెక్టులకు మాత్రమే కేంద్రం పర్యవేక్షణ చేస్తుంది. రూ.500కోట్ల లోపు ప్రాజెక్టులు అయితే రీజియన్‌ స్థాయిలో కానీ, డివిజన్‌ స్థాయిలో కానీ అనుమతులు ఇచ్చే అధికారం ఉంటుంది.
 
విజయవాడ-గుండుగొలను పరిస్థితి అంతే...
విజయవాడ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటి వరకు ప్యాకేజీ-2లో భాగంగా జంక్షన్‌ బైపాస్‌, జంక్షన్‌-పెద అవుటపల్లి రోడ్డు విస్తరణలకు సంబంధించి ఆరు నెలలుగా టెండర్లు ఖరారుచేయలేదు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఇప్పటికి ఆరుసార్లు వాయిదా వేశారు. విజయవాడ బైపాస్‌, కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జికి సంబంధించి కూడా డీపీఆర్‌ తయారు చేయటానికి కన్సల్టెన్సీ సంస్థను నియమించటానికి ఇప్పటికి మూడుసార్లు టెండర్లను ఖరారు చేయకుండా వాయిదా వేస్తూ వస్తోంది.
 
బెంజిసర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ పరిస్థితీ ..
arwerbf.jpgబెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ రెండో వరస పనులకు సంబంధించిన టెండర్లను కూడా పిలవనే లేదు. రూ.110 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియను సిద్ధం చేసినా ఇప్పటివరకు కేంద్రం ఆమోదం పడలేదు. ఇటీవలే విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కలిసి ప్రాజెక్టుకు నిధులు, అనుమతుల కోసం విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తిపై తక్షణం స్పందించినా ఇప్పటివర కు ఈ పెండింగ్‌ ప్రాజెక్టుకు సంబంధించి కనీస కదలిక లేకపోవటం గమనార్హం.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
విజయవాడ బైపాస్‌కు మోకాలడ్డు! 
గడువు మీద గడువు.. కొర్రీల మీద కొర్రీలు.. 
డీపీఆర్‌ కోసం కన్సల్టెన్సీలను ఎంపిక చేయని కేంద్రం 
జాతీయ రహదారి విస్తరణ టెండర్లలోనూ జాప్యం 
ఈనాడు, అమరావతి 
amr-gen2a.jpg

గడువుల మీద గడువులు పెంచారు.. అయిదుసార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు సాంకేతిక టెండర్లను పిలిచారు.. మరికొన్నింటికి ఇంకా సాంకేతిక అర్హత టెండర్లను సైతం తెరవలేదు.. సవివర నివేదికలకే కన్సల్టెన్సీలను నియమించలేదు. ఇక టెండర్ల ఖరారు ప్రశ్నార్థకమే..! కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు బెడిసి కొట్టిన తర్వాత ఆ ప్రభావం జాతీయ ప్రాజెక్టులపై చూపుతోంది. టెండర్లను పిలిచిన ప్రాజెక్టులకు సైతం కేంద్ర సంస్థలు ఆమోదముద్ర వేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారుల నిర్మాణంలో పూర్తి అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. గతంలో మంజూరైన ప్రాజెక్టులకు సైతం నిధులు విడుదల చేయకుండా అడ్డుపుల్ల వేస్తున్నాయి. కొర్రీల మీద కొర్రీలు వేస్తూ దస్త్రాలను తిప్పి పంపుతున్నారు.

నవ్యాంధ్ర రాజధాని నగరంగా గుర్తింపు పొందిన విజయవాడ నగరానికి బాహ్యవలయ రహదారి (బైపాస్‌) నిర్మాణం మూడు అడుగులు ముందుకు పడితే.. నాలుగు అడుగులు వెనక్కి వస్తోంది. గతంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గామన్‌ ఇండియా చేసిన నిర్వాకం ఫలితంగా ఆగిపోయిన జాతీయ రహదారి విస్తరణ.. ఏడాది అయినా టెండర్లు ఖరారు కాలేదు. కొన్ని సవివవర నివేదిక తయారు కాలేదు. ఇదిగో అదిగో అంటూ నెలలు గడిచిపోతున్నాయి. ఈ ప్రాజెక్టు అటకెక్కుతుందా లేదా అనేది అనుమానంగా మారింది.  ప్రాజెక్టులో జాతీయ రహదారి విస్తరణ పనులు, విజయవాడ బైపాస్‌ రహదారి నిర్మాణం, కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణం ఉన్నాయి. ప్రస్తుతం ఈ పనులపై నీలిపనీడలు కమ్ముకున్నాయి.

ఇదీ నేపథ్యం..! జాతీయ రహదారి నెం16 విస్తరణ పనుల్లో భాగంగా విజయవాడ బైపాస్‌ రహదారితో పాటు.. కృష్ణానదిపై వంతెన నిర్మాణం పనులను గతంలో జాతీయ రహదారుల సంస్థ మంజూరు చేసింది. బీఓటీ ప్రాజెక్టు కింద మంజూరు చేయగా దీన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గామన్‌ ఇండియా దక్కించుకుంది. ఒప్పందం చేసుకున్న తర్వాత పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది. చిన్నఅవుట్పల్లి వద్ద పనులను ప్రారంభించారు. తర్వాత పట్టించుకోలేదు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వరకు ఆరు వరసల రహదారి నిర్మాణం చేయాల్సి ఉంది. చిన్నఅవుట్పల్లి నుంచి గొల్లపూడి వరకు బైపాస్‌ రహదారి నిర్మాణం కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. చెన్నై నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరానికి రాకుండా ఈ బైపాస్‌లో విశాఖకు వెళ్లేందుకు అనువుగా ఉంటాయి. అలాగే హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలకు అనువుగా ఉంటుంది. నగరంలో ట్రాఫిక్‌ భారం తగ్గే అవకాశం ఉంది. కానీ ఈ పనులు ప్రారంభించకుండా గామన్‌ ఇండియా తాత్సారం చేసింది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆఖరి అవకాశం అంటూ దాదాపు రెండేళ్లు గడిపింది. ఎట్టకేలకు తాము పనులు చేయబోమంటూ చేతులు ఎత్తేసింది. దీంతో దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా జాతీయ రహదారుల సంస్థ నాలుగు ప్యాకేజీలుగా విభజించింది. వాటికి టెండర్లను పిలవాలని నిర్ణయించింది. రెండు ప్యాకేజీలకు ఆర్థిక ఆమోదం పొంది టెండర్లను పిలిచింది. రెండు ప్యాకేజీలకు సవివర నివేదికల కోసం కన్సెల్టెన్సీలను నియమించేందుకు బిడ్లు ఆహ్వానించింది. ఇది జరిగి ఆరు నెలలు గడిచినా ఒక  కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు రెండు ప్యాకేజీల టెండర్లను తెరిచారు. కానీ ప్రైస్‌ బిడ్‌ (ధరల టెండర్‌) ఇంకా ఖరారు చేయలేదు. కన్సల్టెన్సీల కోసం పిలిచిన బిడ్లకు ఇంతవరకు మోక్షం లేదు.

వాయిదాలపై వాయిదా..! విజయవాడ బైపాస్‌ రహదారిని ఈపీసీ కింద మెత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. వీటిలో రెండు ప్యాకేజీలకు డీపీఆర్‌ సిద్ధం చేసి టెండర్లను పిలిచారు. రెండు ప్యాకేజీలకు డీపీఆర్‌ సిద్ధం కావాల్సి ఉంది. విజయవాడ బాహ్యవలయ రహదారి బీఓటీ ప్రాజెక్టు వ్యయం మొదట రూ.1680 కోట్ల్లుగా అంచనా వేశారు. దీన్ని మూడేళ్ల కిందట గామన్‌ ఇండియా దక్కించుకుంది. దీనిలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణం కూడా ఒకటిగా ఉండేది. దీన్ని ఇప్పుడు నాలుగు ప్యాకేజీలుగా ఈపీసీ కింద విభజించిన జాతీయ రహదారుల సంస్థ రెండింటింకి వెంటనే టెండర్లను పిలిచింది. చిన్నఅవుట్‌పల్లి నుంచి కలపర్రు వరకు ఒక ప్యాకేజీ, కలపర్రు నుంచి గుండుగొలను (పశ్చిమగోదావరి జిల్లా) వరకు మరో ప్యాకేజీగా విభజించారు. రెండు ప్యాకేజీల అంచనా వ్యయం రూ.1355 కోట్లుగా నిర్ణయించారు. చిన్నఅవుట్‌పల్లి నుంచి కలపర్రు ప్యాకేజీ అంచనా వ్యయం రూ.648 కోట్లుగా నిర్ణయించారు. రెండో ప్యాకేజీ కింద కలపర్రు నుంచి గుండుగొలను వరకు అంచనా వ్యయం రూ.707 కోట్లుగా నిర్ణయించారు. దీనికి మొదట టెండర్లను పిలిచి మే నెల చివరి గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత మే నెల నుంచి జులై, తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు వరకు గడవు పెంచుకుంటూ పోయారు. ఎందుకింత జాప్యం జరిగిందనేది అధికారులకు తెలియదు. ఎట్టకేలకు ఇటీవల సాంకేతిక టెండర్లను తెరిచినట్లు తెలిసింది. ఒక ప్యాకేజీకి నాలుగు సంస్థలు, మరో ప్యాకేజీకి అయిదు సంస్థలు అర్హత సాధించాయి. ప్రస్తుతం ధరల బిడ్‌ను సరిపోల్చుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి ఎంత సమయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ప్రైస్‌బిడ్‌ ఖరారు చేసిన తర్వాత గుత్త సంస్థలతో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించాల్సి ఉంది.

నగరానికి అత్యంత కీలకం...: విజయవాడ నగరానికి సంబంధించి ఈ రహదారి విస్తరణ, బైపాస్‌ నిర్మాణం అత్యంత కీలకం. గన్నవరం నుంచి రామవరప్పాడు రింగ్‌ వరకు జాతీయ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. రోజూ నాలుగైదు ప్రమాదాలు జరుగుతున్నాయి. సగటున రోజుకొకరు మృత్యువాత పడుతున్నారు. ప్రధానంగా గన్నవరం, నిడమనూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు రింగు వద్ద ప్రమాదాలు దారుణంగా జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. గంటల తరబడివ వాహనాలు నిలిచిపోతున్నాయి. దీనికి బైపాస్‌ ఒకటే పరిష్కారం అని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ టెండర్లను వాయిదా వేస్తూ తాత్సారం చేస్తున్నారు.

రూ.36 కోట్లతో..! జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలోనే మరో ప్రాజెక్టు ఆఘమేఘాల మీద రోడ్డెక్కింది. విజయవాడ నగరం నుంచి గన్నవరం వరకు జాతీయ రహదారి మరమ్మతులకు రూ.36 కోట్లు మంజూరు చేశారు. దీనికి టెండర్లను పలిచి ఖరారు చేశారు. త్వరలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణలంక వారధి నుంచి గన్నవరం వరకు 16వ నెంబరు జాతీయ రహదారి గతుకుల మయంగా మారింది. ఇటీవల కాలంలో మరమ్మతులు లేవు. వాస్తవానికి ఇది టోల్‌ రోడ్డు. వినియోగ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ మరమ్మతులు మరిచారు. ఇటీవల కాలంలో గన్నవరం నుంచి ప్రముఖులు రావడంతో ఈ రహదారిని మెరుగులు దిద్దాలని సూచించారు. కొన్ని సాంకేతిక లోపాలను సరి చేసి మరో వరస బీటీ పొర వేయాలని ప్రతిపాదించారు. దీనికి కేంద్రం రూ.36 కోట్లు మంజూరు చేసింది. ఇటీవల దీనికి అత్యవసరంగా టెండర్లను పలిచారు. అయితే టెండర్‌ సంస్థను రహస్యంగా ఉంచారు. త్వరలో ఒప్పందం కుదరనుంది. ఈ పనుల్లో మిగులు శాతం అధికంగా ఉంటుందని అందుకే ఆఘమేఘాల మీద ఖరారు చేశారన్న విమర్శలు  ఉన్నాయి. 
జనవరి నాటికి..! పదహారో నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు వచ్చే జనవరి నాటికి ప్రారంభించే అవకాశం ఉందని జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ చెప్పారు. బైపాస్‌ రహదారి నిర్మాణం జాప్యంపై ఆయనను ‘ఈనాడు’ వివరణ కోరగా ధరల బిడ్‌ ఎవాల్యూషన్‌ జరుగుతుందని వివరించారు. ఒక ప్యాకేజీకి నాలుగు సంస్థలు, మరో ప్యాకేజీకి అయిదు సంస్థలు దాఖలు చేశాయని వివరించారు. మరో రెండు ప్యాకేజీల డీపీఆర్‌ తయారీకి సంస్థలను ఎంపిక చేయాల్సి ఉందని, దిల్లీలో దస్త్రం ఉందని తెలిపారు. విమానాశ్రయం రహదారి మరమ్మతుల పనులను త్వరలోనే ప్రారరంభిస్తామని చెప్పారు.

ఇన్ని రోజులా..? విజయవాడ బైపాస్‌ రహదారి నిర్మాణం, కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణం కోసం సవివర తయారీ నివేదిక అందించేందుకు ఏడు సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు (బిడ్లు) సమర్పించాయి. గత జులైలోనే ఈ బిడ్లు దాఖలు చేశాయి. డీపీఆర్‌ తయారు చేసిన తర్వాత దీన్ని కేంద్రానికి పంపనున్నారు. చిన్న అవుట్‌పల్లి నుంచి గొల్లపూడి వరకు విజయవాడ బైపాస్‌ రహదారి సుమారు 18 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీన్ని ఆరు వరసల రహదారిగా నిర్మాణం చేస్తారు. దీనికి డీపీఆర్‌ తయారు చేసిన తర్వాత ఈపీసీ టెండర్లను పిలవాల్సి ఉంది. ఈ రెండు ప్యాకేజీలకు కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సి ఉంది. సవివర నివేదిక తర్వాత మాత్రమే కేంద్రం ఆమోదానికి పంపనున్నారు. విజయవాడ బైపాస్‌ రహదారి గొల్లపూడి నుంచి చిన్న అవుట్‌పల్లి వరకు సుమారు రూ.300 కోట్లు పైగా ఉంటుందని అంచనా.  మరో ప్యాకేజీలో కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణం. దీన్ని ఇప్పటికే సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పలు ఆకృతులు తయారు చేశారు. దీని నిర్మాణంపై ప్రతిష్టంభన ఉంది. ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతుందా.. లేక సీఆర్‌డీఏ చేపడుతుందా అనేది ప్రశ్నార్థకమే. ఎన్‌హెచ్‌ఏఐ మాత్రం డీపీఆర్‌ తయారు చేయాలని టెండర్లను ఆహ్వానించడం విశేషం. ప్రస్తుతం ప్రాంతీయ కార్యాలయంలో టెండర్లను తెరవాల్సి ఉంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. వడపోతలో ఏడు సంస్థలు నిలిచాయని పీడీ విద్యాసాగర్‌ చెబుతున్నారు. దాదాపు అయిదు నెలలు గడిచినా దీనిపై ప్రాంతీయ కార్యాలయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డీపీఆర్‌ తయారీకి సంస్థలను ఎంపిక చేయలేదు. దీనికి అధికారులు సరైన కారణం మాత్రం చెప్పలేకపోతున్నారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం లేకపోవడమే కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం ఎందుకు సంస్థలను ఎంపిక చేయలేదనేది ప్రశ్నార్థకంగా మారింది.

Link to comment
Share on other sites

Outer ring antaaru, malli deentlo Iconic antaaru. Uff very confused.

The bridge on Krishna as part of Outer ring was proposed between Venkata palem-Gollapudi annaru. Ippudu Iconic location Rayapudi/Udhandarayuni palem - Pavithra sangamam maarcharu.

Outer ring land acquisition all completed kada, malli ippudu Iconic location maaristhe malli land acquire chesthaara ?

This Outer will never happen, until Modi & co goes next year.

Link to comment
Share on other sites

6 minutes ago, ravikia said:

avi rendu veru veru.

Link to comment
Share on other sites

Tuesday, 12 Jun 2018
Share this on :
 
The construction arm of Larsen & Toubro (L&T) will build an iconic bridge across the river Krishna at Amaravati in Andhra Pradesh.

The scope of work envisages design and construction of a 3.2 km, six-lane iconic bridge across the river Krishna, which includes 2.72 km of approach bridges, on EPC basis.

The bridge will connect Pavitrasangamam in Vijayawada and NIO Road in Amaravati. The value of the project is Rs 1,387 crore. The tender was floated by the Amaravati Development Corporation (ADCL) and has also been entrusted with the operation and maintenance for the bridge for five years.

Link to comment
Share on other sites

7 minutes ago, sonykongara said:

Mari ee outer ring project lo Iconic bridge include chesaru ani raasaru ga bro.

 "మరో ప్యాకేజీలో కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణం. దీన్ని ఇప్పటికే సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పలు ఆకృతులు తయారు చేశారు. దీని నిర్మాణంపై ప్రతిష్టంభన ఉంది. ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతుందా.. లేక సీఆర్‌డీఏ చేపడుతుందా అనేది ప్రశ్నార్థకమే. ఎన్‌హెచ్‌ఏఐ మాత్రండీపీఆర్‌ తయారు చేయాలని టెండర్లను ఆహ్వానించడం విశేషం. ప్రస్తుతం ప్రాంతీయ కార్యాలయంలో టెండర్లను తెరవాల్సి ఉంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. వడపోతలో ఏడు సంస్థలు నిలిచాయని పీడీ విద్యాసాగర్‌ చెబుతున్నారు. దాదాపు అయిదు నెలలు గడిచినా దీనిపై ప్రాంతీయ కార్యాలయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు"

From above article.

Link to comment
Share on other sites

19 minutes ago, ravikia said:

first ppp model chesthunaruappudu edo mamuluga unnadi 4 lane,cbn  iconic bridge undali annadu, adi memu isthamu  annadu,alage a road amaravati city madya nudi pothundi ppp model lo ayithe toll pettali mrachannadu,old tender cancel chesi malli dpr chesthunnaru,

edi veredi adi edi okati kadu
Tuesday, 12 Jun 2018
Share this on :
 
The construction arm of Larsen & Toubro (L&T) will build an iconic bridge across the river Krishna at Amaravati in Andhra Pradesh.

The scope of work envisages design and construction of a 3.2 km, six-lane iconic bridge across the river Krishna, which includes 2.72 km of approach bridges, on EPC basis.

The bridge will connect Pavitrasangamam in Vijayawada and NIO Road in Amaravati. The value of the project is Rs 1,387 crore. The tender was floated by the Amaravati Development Corporation (ADCL) and has also been entrusted with the operation and maintenance for the bridge for five years.

edi veredi adi edi okati kadu

Edited by sonykongara
Link to comment
Share on other sites

56 minutes ago, ravikia said:

Outer ring antaaru, malli deentlo Iconic antaaru. Uff very confused.

The bridge on Krishna as part of Outer ring was proposed between Venkata palem-Gollapudi annaru. Ippudu Iconic location Rayapudi/Udhandarayuni palem - Pavithra sangamam maarcharu.

Outer ring land acquisition all completed kada, malli ippudu Iconic location maaristhe malli land acquire chesthaara ?

This Outer will never happen, until Modi & co goes next year.

Meeru confuse avutunnaru bro..

1)Outer ring road kanchikacharla dagara Krishna river paina oka bridge padutundhi..

2) Pavitra Sangam - Rayapudi dagara oka bridge padutundhi.. Hyd nunchi Capital city loki direct ga enter ayyetattu

3) Gollapudi - Venkatapalem dagara oka bridge padutundhi.. idhi before 2014 election sanction ayindhi.. panulu modhalu pettaledhu.. idhi Vijayawada city ki bypass oka rakam ga Vijayawada ki ORR lekka..

4)But Amaravati capital ayyaka existing plans alane vunchi..  Amaravati ki ORR  plan vesindhi TDP govt.. ee ORR lopala Vijayawada, Mangalagiri, Guntur vuntai.. ORR ki anukuni Tenali, Inka konni towns dagara ga velthadhi

5) Chodavaram-Revendrapadu oka bridge padutundhi..  this is also part of Vijayawada ORR (not Amaravati ORR)

6) Amaravati ORR lo bagam ga Chodavaram-Revendra padu ni dhaatinaka ante down stream lo inko Bridge padatadhi Krishna river paina..

Motham 5 bridges padatai..

Kanchikacharla

Pavitra Sangam

Gollapudi

Chodavaram

Inka down stream lo inko bridge

Edited by Raaz@NBK
Link to comment
Share on other sites

30 minutes ago, ravikia said:

Mari ee outer ring project lo Iconic bridge include chesaru ani raasaru ga bro.

 "మరో ప్యాకేజీలో కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణం. దీన్ని ఇప్పటికే సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పలు ఆకృతులు తయారు చేశారు. దీని నిర్మాణంపై ప్రతిష్టంభన ఉంది. ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతుందా.. లేక సీఆర్‌డీఏ చేపడుతుందా అనేది ప్రశ్నార్థకమే. ఎన్‌హెచ్‌ఏఐ మాత్రండీపీఆర్‌ తయారు చేయాలని టెండర్లను ఆహ్వానించడం విశేషం. ప్రస్తుతం ప్రాంతీయ కార్యాలయంలో టెండర్లను తెరవాల్సి ఉంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. వడపోతలో ఏడు సంస్థలు నిలిచాయని పీడీ విద్యాసాగర్‌ చెబుతున్నారు. దాదాపు అయిదు నెలలు గడిచినా దీనిపై ప్రాంతీయ కార్యాలయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు"

From above article.

Idhi Gollapudi - Venkatapalem bridge bro.. Gaman India vadi ki sanction ayindhi oka plan..Ippudu aa area capital ayindhi kabatti.. Gaman India vadu handsup anesariki kothaga tenders pilichindhi.. Ee bridge plan marcharu.. kotthaga vundetattu chesthunnaru..

Idhi Vijayawada ki ORR 

First Iconic Bridge plan Pavitra Sangam ki.. Ippudu gollapudi-venkatapalem bridge ki kuda iconic bridge plan include chesaru ani rasadu article lo

Link to comment
Share on other sites

6 minutes ago, Raaz@NBK said:

Ok got it. So two Iconic bridges annamaata. This gives lot of clarity. Thank you.

Endhukante Sangamam daggaridhi L&T vadiki icharu and works November lo start antunnaru and it is connected to N10, I think.

Eee ORR kanna mundhu IRR aipodhemo complete ?

Link to comment
Share on other sites

1 hour ago, ravikia said:

Ok got it. So two Iconic bridges annamaata. This gives lot of clarity. Thank you.

Endhukante Sangamam daggaridhi L&T vadiki icharu and works November lo start antunnaru and it is connected to N10, I think.

Eee ORR kanna mundhu IRR aipodhemo complete ?

Yeah 2 iconic bridges

Venkatapalem daggaradhi 6 lane bridge

Avnu L&T vadu chesedhi Pavitra Sangam dagaradhi..

Vijayawada ORR ee patiki ayipoyi vunte asala intha traffic vundedhi kadhu Durgamma temple and Benz Circle dagara.. 

Link to comment
Share on other sites

21 minutes ago, Raaz@NBK said:

Yeah 2 iconic bridges

Venkatapalem daggaradhi 6 lane bridge

Avnu L&T vadu chesedhi Pavitra Sangam dagaradhi..

Vijayawada ORR ee patiki ayipoyi vunte asala intha traffic vundedhi kadhu Durgamma temple and Benz Circle dagara.. 

Adega. Eee kindha google map chudandi. ORR land alignment clear ga vundhi(From gollapudi to BB.Gudem). Land acquired and paid and alignment marked clearly.

Aina kooda baffas ki road veyadaniki manasu ravatla. Worst fellows. Land isthe kooda road veyaleni adhogasthapu govt baffas thappa evaru vundaru.

ORR-Land-Acquisition-alignment-google-map-4.thumb.jpg.18cc793b145cfe8197369f14d9edf166.jpg

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Meeru confuse avutunnaru bro..

1)Outer ring road kanchikacharla dagara Krishna river paina oka bridge padutundhi..

2) Pavitra Sangam - Rayapudi dagara oka bridge padutundhi.. Hyd nunchi Capital city loki direct ga enter ayyetattu

3) Gollapudi - Venkatapalem dagara oka bridge padutundhi.. idhi before 2014 election sanction ayindhi.. panulu modhalu pettaledhu.. idhi Vijayawada city ki bypass oka rakam ga Vijayawada ki ORR lekka..

4)But Amaravati capital ayyaka existing plans alane vunchi..  Amaravati ki ORR  plan vesindhi TDP govt.. ee ORR lopala Vijayawada, Mangalagiri, Guntur vuntai.. ORR ki anukuni Tenali, Inka konni towns dagara ga velthadhi

5) Chodavaram-Revendrapadu oka bridge padutundhi..  this is also part of Vijayawada ORR (not Amaravati ORR)

6) Amaravati ORR lo bagam ga Chodavaram-Revendra padu ni dhaatinaka ante down stream lo inko Bridge padatadhi Krishna river paina..

Motham 5 bridges padatai..

Kanchikacharla

Pavitra Sangam

Gollapudi

Chodavaram

Inka down stream lo inko bridge

ORR ippatloo jarigee pani kadu first IRR paina concentrate chestharu 

Vaikuntapuram - Damuluru barrage cum bridge kadatharu as the part of IRR

Link to comment
Share on other sites

1 minute ago, ravikia said:

Adega. Eee kindha google map chudandi. ORR land alignment clear ga vundhi(From gollapudi to BB.Gudem). Land acquired and paid and alignment marked clearly.

Aina kooda baffas ki road veyadaniki manasu ravatla. Worst fellows. Land isthe kooda road veyaleni adhogasthapu govt baffas thappa evaru vundaru.

ORR-Land-Acquisition-alignment-google-map-4.thumb.jpg.18cc793b145cfe8197369f14d9edf166.jpg

Aa Gaman India vadi Tappu vundhi le.. Baffas ni purthiga analemu.. Andharu kalisi late chesaru including CBN

>1280 crores sanction chesaru ee Road ki around Nov-Dec 2013

>Gaman India vadu ventane full pledged ga work modhalu pettaledhu..

>ee lopu Amaravati ni capital ga chesaru.. CBN aa road ni temporary ga apamani chepparu Bcoz ee road Pooling area (capital) madhyalo nunchi velthundhi ani 2 years apaaru..

>Baffas ee road progress ni asala pattinchukoledhu..

>Eelopu Gaman India vadu funds levu ani handsup annadu..

Ala ala atakekkindhi.. Inka chesedhi em leka.. Benz Circle flyover start chesaru to control outside heavy vehicles..

Link to comment
Share on other sites

6 minutes ago, Raaz@NBK said:

+1111

ORR next Govt form ayinaka 6-8 months taruvata start avtadhi

Adi kuda kastameee brother IRR second phase start ayyaka ie atleast after 3-4 years ORR paina consentrate chestharu eeeloga kattina waste vaibility undadu so ippatlooo touch cheyyaru

Link to comment
Share on other sites

16 minutes ago, krish2015 said:

Adi kuda kastameee brother IRR second phase start ayyaka ie atleast after 3-4 years ORR paina consentrate chestharu eeeloga kattina waste vaibility undadu so ippatlooo touch cheyyaru

Land acquisition notification istharu bro.. future purpose kosam. 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
సాగుతున్న ‘విజయవాడ-గుండుగొలను’ పనులు
19-12-2018 07:48:20
 
636808025013735103.jpg
  • ‘ఎన్‌హెచ్‌’ అపహాస్యం!
  • డీపీఆర్‌ కోసం మళ్లీ టెండర్లు !!
  • గతంలో ‘హై’.. ఇప్పుడు ‘లో’ రేట్ల కారణంగా రద్దు
  • వీఐపీ కారిడార్‌ టెండర్లు కూడా
  • బెంజిసర్కిల్‌ పార్ట్‌ - 2 కు కేంద్రం కొర్రీ
ఆంధ్రజ్యోతి విజయవాడ : నగరానికి ప్రతిష్ఠాత్మక జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గ్రహణం వీడాలంటే ఇంకెంతకాలం పడుతుందో. విజయవాడ-గుండుగొలను ప్రాజెక్టుకు ప్యాకేజీల పేరుతో పనిని విభజించి ఇదిగో... అదిగో... అంటున్నారే కానీ మోక్షం కలిగించడం లేదు. ప్యాకేజీ 1, 2 టెండర్లు ఇప్పటి వరకు ఖరారు చేయకపోగా.. ప్యాకేజీ 3, 4 డీపీఆర్‌ రూపకల్పనకు కన్సల్టెన్సీ ఎంపిక టెండర్లను తాజాగా రద్దు చేశారు. తిరిగి మళ్లీ టెండర్లు పిలిచారు ! ఎన్‌హెచ్‌ - 65 లో వీపీఐ కారిడార్‌ అభివృద్ధికి పిలిచిన టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలిచారు. బెంజిసర్కిల్‌ పార్ట్‌ - 2 ఫ్లైఓవర్‌ సంగతిని కేంద్ర పాలకులు తేల్చరు. తాజాగా ఎన్‌హెచ్‌ విస్తరణ ప్రాజెక్టుల కోసం టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవడం కాలాతీతం చేయడానికే తప్ప .. సాకారం చేయడానికి కాదన్న విమర్శలను కేంద్రం మూటకట్టుకుంటోంది.
 
మళ్లీ టెండర్లు !
విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు అపహాస్యమవుతోంది. ఒక్కటిగా ఉన్న విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులను నాలుగు ప్యాకేజీలుగా విభజించింది. ప్యాకేజీ - 3, 4 పనుల డీపీఆర్‌ రూపకల్పనకు రెండోసారి పిలిచిన టెండర్లను కేంద్రం రద్దు చేసింది. మొదటి సారి సాగదీసి .. సాగదీసి హై రేట్ల కారణంగా టెండర్లను రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పుకున్న కేంద్రం రెండోసారి టెండర్లు పిలిచింది. వీటిని ఖరారు చేయకుండా ఆరు నెలలుగా సాగదీస్తున్న కేంద్రం మళ్లీ లో రేట్లు వేశారంటూ రద్దు చేసింది. వెంటనే టెండర్లను పిలవడం గమనార్హం. డీపీఆర్‌ తయారీకి అవసరమైన కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయడంపై కేంద్రం దోబూచులాడుతోంది. ప్యాకేజీ - 3 లో భాగంగా విజయవాడ బైపాస్‌, ప్యాకేజీ - 4 లో భాగంగా కృష్ణానదిపై ఆరు వరుసల బ్రిడ్జికి వేర్వేరుగా డీపీఆర్‌ల కోసం మొదటిసారిగా టెండర్లు పిలిచారు. ఇలా ప్యాకేజీల పేరుతో విభజించడంతో ఈ ప్రాజెక్టుకు కార్యరూపం ఇవ్వడానికి కిష్టత ఏర్పడుతోందనే విమర్శలు నాడే వచ్చాయి. ఇప్పుడు టెండర్ల రద్దుతో మళ్లీ ఆలస్యమయ్యే అవకాశముంది.
 
బెంజిసర్కిల్‌ - 2 సంగతేమిటి?
బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ - 2 పై ఇప్పటి వరకు కేంద్రం ఏమీ తేల్చడం లేదు. సకాలంలో పనులకు టెండర్లు పిలవకపోవడంతో ఇప్పటికే రూ. 75 కోట్ల అంచనాల నుంచి రూ.110 కోట్లకు పెరిగింది. తాజాగా ఈ పనులపై కేంద్రం అంచనాల విషయంలో కొర్రీలు వేసినట్టు తెలిసింది. దీంతో సవరించి పంపాల్సి ఉంది.
 
‘వీఐపీ కారిడార్‌ ’ టెండర్లు రద్దు
జాతీయ రహదారి 65పై ఎయిర్‌పోర్టు నుంచి కనదుర్గ వారధి వరకు ‘వీఐపీ కారిడార్‌’ కు నిన్నగాక మొన్న పిలిచిన టెండర్లను కూడా కేంద్రం రద్దు చేసింది ! హై టెండర్లు వేయడంతో రద్దు చేశామని చెబుతోంది. సీఎంతో పాటు, అమరావతికి రాకపోకలు సాగించే చాలా మంది ఇటుగా ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం వీఐపీ కారిడార్‌ గతుకులు, గోతులకు ఇటీవల వీటికి ప్యాచ్‌ వర్కులు చేసినా ఎంతకాలం నిలుస్తాయో తెలియదు. కాంట్రాక్టు సంస్థలు హై రేట్స్‌ వేస్తే వాటితో సంప్రదించి రేటును తగ్గించే ప్రయత్నాలను కేంద్రం చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి.
Link to comment
Share on other sites

  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...