Jump to content

Vijayawada Outer Ring Road


sonykongara

Recommended Posts

జవాడ బైపాస్‌కు మళ్లీ టెండర్లు

కేంద్ర ఉపరితల రవాణాశాఖ స్పష్టత

ఈనాడు అమరావతి: విజయవాడ బైపాస్‌ రహదారి నిర్మాణం, గుండుగొలను రహదారి విస్తరణ ప్రాజెక్టుకు మళ్లీ టెండర్లు పిలవనున్నారు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టతనిచ్చింది. గతంలో ఈ పనులకు టెండర్లు పిలిచినప్పుడు గామన్‌ ఇండియా సంస్థ గుత్తేదారుగా ఎంపికైంది. కానీ ఆ సంస్థ ఇంతవరకూ పనులు చేపట్టలేదు. పదే పదే గడువు పెంచినా పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ రహదారి పనులకు గుత్తేదారుగా గామన్‌ ఇండియానే కొనసాగిస్తారా? మళ్లీ టెండర్లు పిలుస్తారా? అన్న విషయంలో నెలకొన్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో సమావేశమైనప్పుడు ఆయన ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. గడ్కరీతో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. రాజధాని అమరావతి చుట్టూ సీఆర్‌డీఏ పరిధిలో నిర్మించే బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) భూసేకరణకయ్యే ఖర్చులో 50శాతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. భూసమీకరణ సాధ్యమయ్యేలా లేనందునే భూసేకరణకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నామని, సగం ఖర్చు కేంద్రం భరిస్తే తమకు వెసులుబాటుగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై తాము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటామని, అక్టోబరు 3న విజయవాడ పర్యటనకు వచ్చినప్పుడు స్పష్టతనిస్తానని గడ్కరీ తెలిపారు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వ్యయంలో సగంభరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దానిపై ఆయన పూర్తి సానుకూలంగా స్పందించలేదని సమాచారం. పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో చంద్రబాబు సమావేశం సందర్భంగా... కాకినాడ¿ పెట్రో కెమికల్‌ ప్రాజెక్టు మౌలిక వసతుల కల్పనకయ్యే ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత భరించాలన్న అంశంపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం 70శాతం ఖర్చు భరించాలని, రాష్ట్ర ప్రభుత్వం 30శాతం నిధులు సమకూరుస్తుందని చంద్రబాబు ప్రతిపాదించారు. దీనిపై ధర్మేంద్ర ప్రధాన్‌ ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే ఒక స్పష్టతకు వద్దామని ఆయన చెప్పారని తెలిసింది.

Link to comment
Share on other sites

‘గామన్‌’పై వేటు!
 
 
636423372392589156.jpg
  • విజయవాడ-గుండుగొలను రోడ్డు నిర్మాణంలో దాదాపుగా నిర్ణయం తీసుకున్న కేంద్రం
  • ఈపీసీకి సిద్ధంగా ఉండాలని ఎన్‌హెచ్‌కు మౌఖిక ఆదేశం
విజయవాడ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): విజయవాడ-గుండుగొలను రోడ్డు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ‘గామన్‌’ను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోని ఆ సంస్థను వదిలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. మౌఖిక ఆదేశాలను గమనంలోకి తీసుకుంటే గామన్‌ సంస్థపై పూర్తి వేటు వేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
ఈపీసీకి వెళ్లేందుకు సిద్ధం కావాలని జాతీయ రహదారుల సంస్థ కేంద్ర ఉన్నతాధికారులకు భారత ఉపరితల రవాణా శాఖ నుంచి మౌఖికంగా ఆదేశాలు అందటం దీనిని బలపరుస్తోంది. దీంతో ఢిల్లీలోని నేషనల్‌ హైవే (ఎన్‌హెచ్‌) అధికారులు ఈపీసీ విధానంలో నూతనంగా టెండర్లు పిలవటానికి సన్నద్ధమౌతున్నారు. అంచనాలు పంపాలని విజయవాడ డివిజన్‌ అధికారులకు ఇంకా ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదు. అయినప్పటికీ ఇక్కడి అధికారులు సంసిద్ధంగా ఉన్నారు.
 
ప్రాజెక్టుకు సంబంధించి అంచనా వ్యయం దాదాపుగా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 నాటి అంచనా ప్రకారం రూ.1684 కోట్ల వ్యయం అవుతుంది. తాజా అంచనాల ప్రకారం రూ.3000 కోట్లకు అంచనా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
 
ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాలంటే చాలా ఆలస్యమవుతుంది. అందుకే బీవోటీని రద్దు చేయటానికి కేంద్ర అధికారులు సంశయించారు. పైగా అంచనా వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల గామన్‌ సంస్థకు అవకాశాల మీద అవకాశాలను కల్పించారు. కానీ, గామన్‌ సంస్థ ఏ అవకాశాన్నీ ఉపయోగించుకోలేకపోవటం వల్ల తప్పనిసరి పరిస్థితులలో రద్దు చేయక తప్పడంలేదు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 2 months later...
  • 2 weeks later...
విజయవాడ బైపాస్‌కు డీపీఆర్‌
18-04-2018 07:13:14
 
636596323953129044.jpg
  • ఆగస్టు .. డెడ్‌లైన్‌
  • నవంబర్‌ నాటికి ఐకానిక్‌ బ్రిడ్జి డీపీఆర్‌ పూర్తి
  • డీపీఆర్‌లు పూర్తికాగానే కేంద్రానికి టెండర్ల ప్రక్రియ
  • కొద్ది రోజుల్లో కన్సల్టెన్సీ ఎంపిక
  • ఆరులేన్లుగా విజయవాడ బైపాస్‌
  • భూ సేకరణ సమస్య లేదు..
  • ముఖ్యమంత్రి నిర్ణయించిన డిజైన్‌ ప్రకారం టెండర్ల ప్రక్రియ
విజయవాడ(ఆంధ్రజ్యోతి): కాజ - విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టులో అంతర్భాగంగా.. అమరావతి రాజధాని ప్రాంతాన్ని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను అనుసంధానించే ప్రతిష్ఠాత్మక విజయవాడ బైపాస్‌ పనులకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఆగస్టు నాటికి పూర్తి చేసి కేంద్రానికి టెండర్ల ప్రతిపాదనకు పంపించటానికి జాతీయ రహదారుల సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. అర దశాబ్ద కాలానికి పైగా ఊరిస్తున్న విజయవాడ బైపాస్‌ ఇక సరికొత్త ఆరు వరసలతో నిర్మించటానికి సెప్టెంబర్‌లో టెండర్లు పిలవటం ఆ వెంటనే వాటిని ఖరారు చేయటం జరగనుంది. అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ బైపాస్‌ ప్రాజెక్టులో అంతర్భాగంగా కృష్ణానదిపై ఆరులేన్ల ఐకానిక్‌ వంతెన డిజైన్స్‌, డీపీఆర్‌ రూపకల్పన నవంబర్‌ నాటికి పూర్తవుతుంది. నూతన సంవత్సరానికి ముందుగానే కాజ - విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టులో అంతర్భాగంగా విజయవాడ బైపాస్‌, ఐకానిక్‌ బ్రిడ్జి పనులు ప్రారంభం కానున్నాయి.
 
కాజ - విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టును ఏడు సంవత్సరాల కిందట బీఓటీ విధానంలో కాంట్రాక్టును దక్కించుకున్న గామన్‌ ఇండియా సంస్థ ఆర్థిక ఇబ్బందులతో ఈ రోడ్డు పనులు చేపట్టకపోవటంతో ఎంతో సమయం వృధా అయింది. విజయవాడ మీదుగా జాతీయ రహదారి-16, జాతీయ రహదారి - 65లు వెళతాయి. భారీ రవాణా వాహనాలు కూడా ఇటుగానే వెళ్లడంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోయింది. దీనినుంచి ఊరట కల్పించటానికి బెంజిసర్కిల్‌, కనకదుర్గా ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నప్పటికీ ఇవి అంతర్గతంగా మాత్రమే ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించగలవు. విజయవాడ నగరం మీద వాహనాల ఒత్తిడి తగ్గించాలంటే కాజ - విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టు అతి ముఖ్యం. కృష్ణానదిపై నాలుగు వరసల వంతెనను మొదట్లో ప్రతిపాదించారు.
 
గామన్‌ నిర్వాకం ఫలితంగా బీఓటీ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసింది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, అమరావతి రాజధాని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత విజయవాడ బైపాస్‌ను నాలుగులేన్ల స్థానంలో ఆరు లేన్లగాను, కృష్ణానదిపై నిర్మించే నాలుగులేన్ల బ్రిడ్జిని ఆరు లేన్లతో రాజధానికి ఐకానిక్‌గా కనిపించేలా నిర్మించటానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతిపాదించటం జరిగింది. ఈ క్రమంలో జాతీయ రహదారుల సంస్థ మొదటి, రెండు ప్యాకేజీల్లో చినఅవుటపల్లి - జంక్షన్‌ వరకు ఆరు వరసలు, జంక్షన్‌ నుంచి గుండు గొలను వరకు నాలుగులేన్ల బైపాస్‌ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది. మూడు, నాలుగు ప్యాకేజీలలో చిన అవుటపల్లి నుంచి బీబీ గూడెం, సూరంపల్లి, గుంటుపల్లిల మీదుగా కృష్ణానది వరకు 48 కిలోమీటర్ల మేర ఆరు వరసల విజయవాడ బైపాస్‌ నిర్మాణానికి, కృష్ణానదిపై ఆరు వరసల ఐకానిక్‌ బ్రిడ్జి కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించటానికి ఎన్‌హెచ్‌ నిర్ణయించింది.
 
ఈ క్రమంలో కేంద్ర అనుమతులు తీసుకున్న ఎన్‌హెచ్‌ అధికారులు డీపీఆర్‌ తయారు చేయటానికి కన్సల్టెన్సీ నియమించే పనిలో నిమగ్నమయ్యారు. మొదటి, రెండు ప్యాకేజీల డీపీఆర్‌కు ఈజీఐఎస్‌ సంస్థకు అప్పట్లో కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగించారు. ప్యాకేజీ 3, 4లకు సంబంధించి ఏ సంస్థకు అప్పగిస్తారన్నదానిపై స్పష్టత రాలేదు. ఈ నెలాఖరుకు కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయనున్నారు. ఈ సంస్థ ఆగస్టు నాటికి డీపీఆర్‌ను సమర్పించవలసి ఉంటుంది. విజయవాడ బైపాస్‌కు సంబంధించి గతం లోనే ఆరులేన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూ సేకరణ జరిపారు. కాబట్టి ప్రత్యేకంగా భూ సేకరణ చేయాల్సిన అవ సరం లేదు. ఇక కృష్ణానదిపై ఐకానిక్‌ వం తెన డిజైన్‌ ఇవ్వటానికి కన్సల్టెన్సీ సంస్థకు ఆరు నెలల సమయం ఇవ్వనున్నారు. నవంబర్‌ నాటికి కన్సల్టెన్సీ సంస్థ నివేదిక ఇచ్చిన తర్వాత.. ప్రధానంగా ఐకానిక్‌ డిజైన్లకు సంబంధించి సీఎం సమక్షంలో డిజైన్లను ఖరారు చేయటం జరుగుతోంది.
Link to comment
Share on other sites

బైపాస్‌కు పచ్చజెండా
టెండర్లు, డీపీఆర్‌ దశల్లో రెండేసి ప్యాకేజీలు
ఆగస్టులో పనులు ప్రారంభం: పీడీ విద్యాసాగర్‌
ఈనాడు, విజయవాడ
amr-top1a.jpg

గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విజయవాడ బైపాస్‌ రహదారికి నిధుల సమస్య తీరింది. ఎట్టకేలకు కేంద్రం పరిపాలన అనుమతి జారీ చేసింది. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రావడంతో జాతీయ రహదారులు సంస్థ టెండర్లను పిలిచింది. మే 10 వ తేదీ టెండర్ల దాఖలుకు చివరి గడువు కావడం విశేషం. వచ్చే ఆగస్టు నుంచి పనులు ప్రారంభించేందుకు జాతీయ రహదారుల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ బాహ్యవలయ రహదారిగా పిలిచే బైపాస్‌ రహదారి నిర్మించు, నిర్వహించు, బదిలీచేయు (బీఓటీ) పద్ధతిలో చేపట్టిన ఈ రహదారి ఆదిలోనే బాలారిష్టాలు ఎదుర్కొని పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు రెండున్నరేళ్ల తర్వాత కాంట్రాక్టు రద్దు చేశారు. బీవోటీ ప్రాజెక్టు కాస్తా స్వరూపం మార్చుకొని ఈపీసీ (ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కనస్ట్రక్షన్‌)గా మారింది. రెండు ప్యాకేజీలకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లను పిలిచింది. మరో రెండు ప్యాకేజీలకు డీపీఆర్‌ కోసం టెండర్లను పిలవడం విశేషం.

జూలై నాటికి ఖరారు..!
విజయవాడ-గుండుగొలను పనులను వచ్చే ఆగస్టు నాటికి ప్రారంభిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ ‘ఈనాడు’తో చెప్పారు. మొత్తం అంచనా వ్యయం రూ.1355 కోట్లుగా నిర్ణయించారు. ఆరు వరసల రహదారిగా దీన్ని నిర్మాణం చేయనున్నారు.

విజయవాడ బైపాస్‌లో భాగంగా జాతీయ రహదారి విస్తరణ పనులు చిన్న అవుటపల్లి నుంచి పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను   వరకు చేపట్టాల్సి ఉంది. చిన్న అవుటపల్లి నుంచి కలపర్రు వరకు ఒక ప్యాకేజీగా చేర్చారు. దీని అంచనా వ్యయం రూ.648కోట్లుగా నిర్ణయించారు. రెండో ప్యాకేజీ కింద కలపర్రు నుంచి గుండుగొలను వరకు చేర్చారు. దీని అంచనా వ్యయం రూ.707 కోట్లుగా నిర్ణయించారు. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఈపీసీ టెండర్లను పిలిచారు. మే 10 వతేదీ తుది గడువుగా నిర్ణయించారు. టెండర్ల దాఖలు తర్వాత జూన్‌ 10 వరకు టెండర్ల మూల్యాంకన, ముదింపు జరుగుతుంది. జులై10నాటికి టెండర్లను ఖరారు చేసి గుత్త సంస్థలతో ఒప్పందం చేసుకుంటారు. ఆగస్టు 10 నాటికి పనలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్‌ వివరిస్తున్నారు. ఈ రెండు ప్యాకేజీ పనులకు తర్వాత టోల్‌ వసూలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న టోల్‌ గేట్‌ల వద్ద అదనపు వినియోగ రుసుములు వసూలు చేసే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.

డీపీఆర్‌ తయారీలో..!
ఈ బీవోటీ ప్రాజెక్టులో చేపట్టాల్సిన మరో రెండు పనులను రెండు ప్యాకేజీలుగా చేర్చారు. దీనికి సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాల్సి ఉంది. డీపీఆర్‌ తయారీకే ఆసక్తి సంస్థల నుంచి బిడ్స్‌ ఆహ్వానించారు. ఇంకా గడువు ఉంది. ఈ సంస్థలను ఎంపిక చేసి డీపీఆర్‌ తయారు చేయాల్సి ఉంది. దీనిలో కృష్ణానదిపై వంతెన కూడా ఉంది. అయితే దీనికి కేంద్రం నుంచి పరిపాలన అనుమతి లభించాల్సి ఉంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. డీపీఆర్‌ తయారు చేసిన తర్వాత దీన్ని కేంద్రానికి పంపనున్నారు. చిన్న ఆవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 18 కిలోమీటర్ల వరకు ఆరు వరసల రహదారిగా నిర్మాణం చేస్తారు. దీనికి డీపీఆర్‌ తయారు చేసిన తర్వాత ఈపీసీ టెండర్లను పిలవనున్నారు. ఇది దాదాపు రూ.300 కోట్లు పైగా అంచనా వ్యయం అవుతుందని చెబుతున్నారు. ఈ రహదారి నిర్మాణానికి 18 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన మరోప్యాకేజీగా చేర్చారు. దీనికి డీపీఆర్‌ తయారీకి బిడ్లను ఆహ్వానించారు. విజయవాడ బైపాస్‌ నిర్మాణంలో జరిగిన జాప్యం నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ అంటున్నారు. పనులను ఆగస్టు నాటికి ప్రారంభిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Chinnaavutupalli - Gollapudi crucial.

alage gollapudi - new bridge on Krishna river also

New Bridge - Kaza 

until then no use for public 

Chinnaavutupalli - Gundugolanu panulu matrame chestaru anipisthundi 

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ప్రాజెక్టుల డీపీఆర్‌లకు కన్సల్టెన్సీల స్పందన నిల్‌
07-05-2018 08:10:02
 
636612774011368732.jpg
  • విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు డీపీఆర్‌కు కన్సల్టెన్సీల స్పందన నిల్‌
  • విజయవాడ బైపాస్‌, కృష్ణానదిపై బ్రిడ్జిలదీ అదే పరిస్థితి
  • పార్ట్‌-2 పనుల కోసం రెండోసారి టెండర్లు
  • పార్ట్‌-1లో పిలిచిన టెండర్లకు గడువు పెంపు
  • రెండు పార్ట్‌లుగా పనులు చేయాలన్న ఎన్‌హెచ్‌ఏఐ ఆలోచనలపై విమర్శలు
విజయవాడ: విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టులో అంతర్భాగం పార్ట్‌-2 లో విజయవాడ బైపాస్‌, కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణాలకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించటానికి కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తం కావటం లేదు. దీంతో కంగుతిన్న జాతీయ రహదారుల సంస్థ రెండోసారి టెండర్లు పిలిచింది. కన్సల్టెన్సీ సంస్థల నుంచి స్పందన రాకపోవడానికి కారణం అంతుచిక్కటం లేదు. రిపోర్టు ఇవ్వటానికే కన్సల్టెన్సీలు ముందుకు రాకపోతే రేపు ఈ ప్రాజెక్టు టెండర్ల పరిస్థితి ఏమిటన్నదానిపై గందరగోళం నెలకొంది. మరోవైపు పార్ట్‌-1లో భాగంగా గుండుగొలను నుంచి జంక్షన్‌ వరకు బైపాస్‌, జంక్షన్‌ నుంచి పెద అవుటపల్లి వరకు హైవే-16 విస్తరణకు పిలిచిన టెండర్లను కూడా ఇంకా ఖరారు చేయలేదు. ఇప్పటికే టెండర్లు ఖరారు చేయాల్సి ఉండగా, ఈ నెల 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు తెలుస్తోంది.
 
   కాంట్రాక్టు సంస్థలు ఎన్ని బిడ్లు సమర్పించాయి? అసలు టెండర్లు పడ్డాయా? పడితే గడువు పొడిగించాల్సిన అవసరం ఏమొచ్చింది? వంటి ప్రశ్నలు వేధిస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థలు ఆసక్తి చూపనపుడు, అభ్యంతరాలు లేవనెత్తినపుడు కూడా టెండర్ల ఖరారును పొడిగిస్తారు? జాతీయ రహదారుల సంస్థ అధికారులు మాత్రం ఈ విషయాలేమీ బయటకు రాకుండా గుంభనంగా ఉంచుతున్నారు. పార్ట్‌ - 1, పార్ట్‌ - 2 ప్రాజెక్టు పనుల పరి ణామాలను చూస్తే.. కన్సల్టెన్సీ సంస్థల విముఖత, కాంట్రాక్టు సంస్థల అభ్యంతరాలు గమనిస్తుంటే ఈ ప్రాజెక్టు ముందుకు సాగే విషయంపై గందరగోళం తలెత్తుతోంది. ఈ గందరగోళానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) సకాలంలో ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
అంతర్గత ప్రాజెక్టులు..
విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టును బీఓటీ కింద కాంట్రాక్టు సంస్థ గామన్‌ తలకెత్తుకున్న దగ్గర నుంచి ఈ ప్రాజెక్టు పరిస్థితి అతీ గతీ లేకుండా పోయింది. విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టులో భాగంగా కాజ నుంచి పెద అవుటపల్లి వరకు విజయవాడ జంక్షన్‌, మధ్యలో కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి వరకు ఒక పార్ట్‌ పెద అవుటపల్లి నుంచి జంక్షన్‌ వరకు జాతీయ రహదారి విస్తరణ, జంక్షన్‌ నుంచి గుండుగొలను వరకు జంక్షన్‌ బైపాస్‌లు అంతర్గత ప్రాజెక్టులుగా ఉన్నాయి. అప్పట్లో ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,645 కోట్లు. విజయవాడలో ట్రాఫిక్‌ కష్టాలు తీరాలంటే అతి ముఖ్యమైన రోడ్డు ప్రాజెక్టు ఇది! ఏళ్ల తరబడి గామన్‌ సంస్థ పనులు చేయలేకపోవటంతో ఈ ప్రాజెక్టును రద్దు చేయటానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.
 
   చివరకు బీవోటి ప్రాజెక్టును రద్దు చేసిన తర్వాత ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచే సరికి జాతీయ రహదారుల సంస్థ రెండు పార్ట్‌లుగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. విజయవాడ బైపాస్‌, కృష్ణానదిపై బ్రిడ్జిలు గతంలో నాలుగు వరసలుగా ఉండేవి. వీటిని ఆరు వరసలుగా నిర్మించటానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఆరు వరసలుగా నిర్మించటానికి భూ సేకరణ వంటి సమస్యలేమీ లేవు. దీనిని దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారుల సంస్థ తక్షణం మొత్తం ప్రాజెక్టుకు సరికొత్త డీపీఆర్‌ను తయారు చేసి ఒకేసారి టెండర్లు పిలిచి ఉంటే బాగుండేది దీనికి భిన్నంగా ప్రాజెక్టును రెండు ప్రాజెక్టులుగా చేపట్టాలని నిర్ణయించటం పెద్ద తప్పిదంగా భావించాల్సి వస్తోంది.
 
   పార్ట్‌ - 1 గా గుండుగొలను నుంచి జంక్షన్‌ వరకు బైపాస్‌, జంక్షన్‌ నుంచి పెదఅవుటపల్లి వరకు ఒక డీపీఆర్‌, పెద అవుటపల్లి నుంచి కాజ వరకు విజయవాడ బైపాస్‌, కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి పార్ట్‌-2 గానూ డీపీఆర్‌లు రూపొందించాలన్న ఆలోచనను ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారులు చేశారు. పార్ట్‌-1గా జంక్షన్‌ బైపాస్‌, జంక్షన్‌ నుంచి పెద అవుటపల్లి వరకు ఆరువరసల విస్తరణ పనులకు సంబంధించి డీపీఆర్‌ రూపకల్పనకు టెండర్లు పిలిచారు. ఈజీఐఎస్‌ అనే సంస్థ డీపీఆర్‌ రూపకల్పన చేసి అప్పగించిం ది. ఎన్‌హెచ్‌ ఇక్కడి అధికారులు ఢిల్లీలోని ఉన్న తాధికారులకు పంపించిన వెంటనే టెండర్లకు నోటిఫికేషన్‌ వెలువరించారు. కిందటి నెలలోనే టెండర్లకు తుది గడు వు కాగా, ఈ నెల 10 వరకు గడువు పొడిగించారు.
 
 
ఆసక్తి చూపని కన్సల్టెన్సీలు..
ఇదే క్రమంలో పార్ట్‌ - 2 గా విజయవాడ బైపాస్‌, కృష్ణానది పై ఐకానిక్‌ బ్రడ్జిలకు మరో డీపీఆర్‌ తయారు చేయించటానికి టెండర్లు పిలవగా.. కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆసక్తి రాలేదు. దీంతో మళ్ళీ టెండర్లు పిలిచారు. ఫేజ్‌-1, ఫేజ్‌-2 పనులకు సంబంధించి రెండూ కూడా అనిశ్చిత పరిస్థితిలో ఉన్నాయి. బహుశా ఒకే ప్రాజెక్టును రెండు భాగాలుగా చేసి డీపీఆర్‌లు రూపొందించి, టెండర్లు పిలవటానికి కాంట్రాక్టు సంస్థలు అయిష్టత చూపుతున్నాయేమోనని తెలుస్తోంది. ఇక్కడ జాతీయ రహదారుల సంస్థ అనుసరించిన విధానంపై విమర్శలు వస్తున్నాయి. రెండు పార్ట్‌లుగా డీపీఆర్‌ రూపొందించే బదులు ఒకే పార్ట్‌గా డీపీఆర్‌ రూపొందించి ఉంటే ఈ సమస్య తలెత్తి ఉండేది కాదే మో! పార్ట్‌ -1 పేరుతో ముందుగా టెండర్లు పిలిచినా... ఇప్పటివరకు దానికి సంబంధించి టెండర్లనే ఖరారు చేయలేని పరిస్థితి ఏర్పడింది. తాజా పరిస్థితులను చూస్తే.. గందరగోళంగా ఉంది. ఈ సమస్యను తక్షణం ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారులు పరిష్కరించటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Link to comment
Share on other sites

విజయవాడ-గుండుగొలను ప్రాజెక్టుపై నీలినీడలు
09-05-2018 07:50:10
 
636614490102445647.jpg
  • కేంద్రం కావాలనే అడ్డుపడుతోందా?
  • ఎన్‌హెచ్‌ విజయవాడ ఆర్‌వో అధికారులకు మౌఖిక ఆదేశాలు?
  • నిబంధనలు సరిగానే ఉన్నా జాప్యం
  • టెండర్లు ఖరారు చేయకుండా తాత్సారం
 
విజయవాడ-గుండుగొలను రోడ్డు నిర్మాణాన్ని కావాలనే ఆపుతున్నారా? టెండర్ల దశలో అవకతవకలు, డీపీఆర్‌ తయారీ కన్సల్టెన్సీల ఎంపిక జాప్యంలో కుట్ర దాగి ఉందా? అంటే పరిస్థితులు అవుననే సమాధానాన్నే ఇస్తున్నాయి. అన్నీ సవ్యంగానే ఉన్నా టెండర్లు ఖరారు చేయడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం, ఎన్‌హెచ్‌ అధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడం ప్రాజెక్టును సందిగ్ధంలోకి నెట్టింది.
 
 
విజయవాడ: విజయవాడ, గుంటూరు నగరాలకు ప్రతిష్ఠాత్మకమైన ‘విజయవాడ - గుండుగొలను’ ప్రాజెక్టు ఉద్దేశపూర్వక జాప్యం వెనుక కేంద్రప్రభుత్వ హస్తం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సకాలంలో కన్సల్టెన్సీలను పిలవటం మొదలుకుని, టెండర్ల తతంగం, వాటిని ఖరారు చేసే విషయం వరకు విపరీతమైన జాప్యం జరుగుతోంది. అన్నీ సవ్యంగానే ఉన్నా వాటిని ఖరారు చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతోందంటే సమాధానం లేని ప్రశ్నగా మారింది.
 
అనుమానాలివీ..
విజయవాడ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో పార్ట్‌-1గా ప్యాకేజీ-1, 2 పనులకు పిలిచిన టెండర్లు నేటికీ ఖరారు కాలేదు. పార్ట్‌-2 గా ప్యాకేజీ-3, 4 లకు సంబంధించి డీపీఆర్‌ల తయారీకి కన్సల్టెన్సీలనే ఎంపిక చేయలేదు. ఏమీ చెప్పలేక మౌనం వహిస్తున్న జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) అధికారులను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. జాతీయ రహదారుల సంస్థకు కేంద్రం నుంచి స్పష్టమైన మౌఖిక ఆదేశాలు వచ్చినందునే ఈ జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.
 
జాప్యమేల?
భూసేకరణలో 98 శాతం పూర్తిచేసుకున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు విజయవాడ-గుండుగొలను రోడ్డు. భూ ఇబ్బందులు లేని ఇలాంటి ప్రాజెక్టులు శరవేగంగా పట్టాలెక్కాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో గామన్‌ ఇండియా సంస్థ బీవోటీ పద్ధతిలో కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందుల వల్ల పనులు చేపట్టలేకపోయింది. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోడ్డు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థతో మాట్లాడి పనులు ప్రారంభమయ్యేలా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం బ్రూక్‌ఫీల్డ్‌ అనే సంస్థను తెరమీదకు తెచ్చినా.. ప్రాజెక్టును అప్పగించడానికి గామన్‌ ఇండియా ససేమిరా అంది. ప్రాజెక్టు నుంచి గామన్‌ ఇండియాను తప్పించిన తర్వాత తనకో అవకాశం కల్పించాలంటూ మళ్లీ దరఖాస్తు చేసుకుంది. మళ్లీ షరామామూలే. పనుల్లో జాప్యంతో మూడేళ్లు గడిచిపోయింది. చివరికి ఆరునెలల కిందట బీవోటీ ప్రాజెక్టును రద్దుచేశారు. ఈపీసీ విధానంలో టెండర్లు ప్రకటించారు. దీంతో మళ్లీ డీపీఆర్‌ను తయారు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ట్విస్ట్‌ ఏర్పడింది.
 
ఇదీ ‘వరుస’
మొత్తం ప్రాజెక్టును రెండు పార్ట్‌లుగా, నాలుగు ప్యాకేజీలుగా నిర్ణయించటం జరిగింది. పార్ట్‌-1లోని ప్యాకేజీ-1లో గుండుగొలను నుంచి కలపర్రు వరకు జంక్షన్‌ బైపాస్‌, ప్యాకేజీ-2లో జంక్షన్‌ నుంచి పెద అవుటపల్లి వరకు ఆరు వరుసలుగా ఎన్‌హెచ్‌-16 విస్తరణ ఉన్నాయి.
 
 
పార్ట్‌-2లోని ప్యాకేజీ-3లో కృష్ణానదిపై వంతెన, ప్యాకేజీ-4లో విజయవాడ బైపాస్‌లు ఉన్నాయి. రెండు పార్ట్‌లుగా, నాలుగు ప్యాకేజీలను నిర్ణయించటం వెనుక రాష్ట్ర ప్రభుత్వం గతంలో సూచించిన ప్రతిపాదనను కేంద్రం సాకుగా చూపించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ-3, 4ను నాలుగు వరుసలుగా, ప్రతిపాదనలో ఉన్న విజయవాడ బైపాస్‌ను ఆరు వరుసలుగా, కృష్ణానదిపై వంతెనను కూడా ఆరు వరుసలుగా, ఐకానిక్‌గా నిర్మించేందుకు ప్రతిపాదించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్నామని చెబుతున్న కేంద్రం మొత్తం అన్ని ప్యాకేజీలకు కలిపి కన్సల్టెన్సీని నియమించి ఉంటే బాగుండేది. అందుకు విరుద్ధంగా ప్యాకేజీ-1, 2కు మాత్రమే డీపీఆర్‌ రూపకల్పన కోసం టెండర్లు పిలిచింది. ఈజీఐఎస్‌ అనే సంస్థ దీని డీపీఆర్‌ను రూపొందించింది. డీపీఆర్‌ ప్రకారం టెండర్లు పిలిచారు. కిందటి నెలలోనే దీని టెండర్లను ఖరారు చేయాల్సి ఉండగా, ఆ పని చేయకుండా తాత్సారం చేసింది. టెండర్లను ఖరారు చేయడానికి గడువు పెంచటం మరింత విచిత్రంగా మారింది.
 
 
టెండర్ల పితలాటకం
విజయవాడ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-3లో కృష్ణానదిపై ఆరు వరుసల ఐకానిక్‌ బ్రిడ్జి, ప్యాకేజీ-4లో 48 కిలోమీటర్ల పొడవున విజయవాడ బైపాస్‌, కృష్ణానది బ్రిడ్జి, గుంటూరు వైపు కాజ వరకు 11 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి వేర్వేరుగా డీపీఆర్‌ రూపకల్పనల కోసం కన్సల్టెన్సీ సంస్థలను ఆహ్వానించడానికి ఎన్‌హెచ్‌ అధికారులు టెండర్లు పిలిచారు. ప్యాకేజీ-3లో భాగంగా గత జనవరి 18న సింగిల్‌ టెండర్‌ మాత్రమే వచ్చిందని, విజయవాడలోని రీజనల్‌ ఆఫీసు అధికారి టెండర్లను రద్దు చేశారు. ఆ తర్వాత రెండవసారి టెండర్లు పిలిచారు. రెండో దఫా పిలిచిన టెండర్లలో కూడా సింగిల్‌ టెండర్‌ పడింది. రెండుసార్లు ఐసీటీ టెక్నోక్రాట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌-న్యూఢి ల్లీ సంస్థ టెండర్లు వేసింది. జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం సింగిల్‌ టెండర్లు పడిన సందర్భంలో రెండవసారి కూడా అదే సంస్థ టెండర్‌ వేసి ఉంటే, దానికే బాధ్యతలను అప్పగించాలి.
 
   నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దీనికి సంబంధించి టెండర్లు ఖరారు చేయలేదు. ప్యాకేజీ-4లో భాగంగా కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి కోసం పిలిచిన టెండర్లలో ఆర్‌వీ అసోసియేట్స్‌, ఐసీటీ టెక్నోక్రాట్స్‌ రెండూ టెండర్లు వేశాయి. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దీనికి సంబంధించిన టెండర్లను ఖరారు చేయలేదు. ఈ టెండర్‌ను కూడా రద్దు చేసి రెండు ప్యాకేజీలకు కలిపి ఒకే టెండర్‌ పిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్యాకేజీ-1, 2 టెండర్లకు సంబంధించి ఇప్పటి వరకు టెండర్లను ఖరారు చేయకుండా గడువు పెంచటం వెనుక కూడా ఇదే మతలబు ఉందని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

  • 1 month later...
డీపీఆర్ టెండర్లకు పోటాపోటీ
08-07-2018 08:30:30
 
636666354291677102.jpg
  • విజయవాడ బైపాస్‌, ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణాలకు..
  • బిడ్లు సమర్పించిన ఎనిమిది కన్సల్టెన్సీ సంస్థలు
  • ఆరు నెలల్లో డీపీఆర్‌ రిపోర్టు సమర్పణ
  • పెద అవుటపల్లి, గుండుగొలను పనుల టెండర్ల 18న ఖరారు
 
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): విజయవాడ బైపాస్‌ రోడ్డు, కృష్ణానదిలపై ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించటానికి కన్సల్టెన్సీ సంస్థలు పోటీలు పడుతున్నాయి. మొత్తం ఎనిమిది సంస్థలు బిడ్లను సమర్పించాయి. ఈ సంస్థల వివరాలను జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌) బయట పెట్టడం లేదు. స్ర్కూటినీ పూర్తి కాగానే పాల్గొన్న సంస్థలు, ఎంపిక చేసిన సంస్థల వివరాలను ఎన్‌హెచ్‌ అధికారులు ప్రకటిస్తారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయటానికి ఆరునెలల సమయాన్ని నిర్దేశించనున్నారు. ఈ లెక్కన డిసెంబర్‌, జనవరి నాటికి డీపీఆర్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. డీపీఆర్‌ రాగానే కేంద్రానికి ఎన్‌హెచ్‌ అధికారులు పంపిస్తారు. కేంద్రం అమోదించిన తర్వాత టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తారు.
 
 
విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న విజయవాడ బైపాస్‌, కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెనల నిర్మాణానికి బిట్‌ ప్యాకేజీ ప్రాతిపదికన డీపీఆర్‌ రూపొందించటానికి ఎన్‌హెచ్‌ సన్నాహాలు చేయటంతో మొదట్లో కన్సల్టెన్సీ సంస్థల నుంచి స్పందన రాని సంగతి తెలిసిందే! దీంతో ఎన్‌హెచ్‌ టెండర్లను రద్దు చేసి తిరిగి మళ్ళీ టెండర్లు పిలిచింది. గతంలో ఒకే ప్రాజెక్టుగా ఉన్నదానిని బిట్‌ ప్యాకేజీ పద్ధతిన నాలుగు భాగాలుగా విభజించటం, రెండు ఫేజుల్లో పూర్తి చేయాల్సి రావటంతో కన్సల్టెన్సీ సంస్థలు ఆసక్తి చూపించటం లేదని అధికారులు భావించారు. ఫేజ్‌ - 2 లో ప్యాకేజీ 3గా విజయవాడ బైపాస్‌, ప్యాకేజీ 4 గా కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెనకు ఇంతకు ముందు డీపీఆర్‌ కోసం పిలిచిన టెండర్లలో ఒకే ఒక సంస్థ బిడ్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో, ఈ సారి కూడా అనుమానంగానే టెండర్లు పిలిచారు. ఈ దఫా టెండర్లకు అనూహ్య స్పందన రావటంతో ఎన్‌హెచ్‌ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏడు సంస్థలు రావటంతో ఎన్‌హెచ్‌ అధికారులుస్ర్కూటినీ ప్రక్రియను ప్రారంభించారు.
 
 
ఈపీపీ విధానంలో..
విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టులో భాగంగా మొదట్లో కాజ - కృష్ణానది అమరావతి రాజధాని ప్రాంతంలో నాలుగు వరసల రహదారి. కృష్ణానది - పెద అవుటపల్లి వరకు విజయవాడ బైపాస్‌ కిలోమీటర్ల పొడవున నాలుగు వరుసలుగాను, పెద అవుటపల్లి నుంచి జంక్షన్‌ వ రకు ఆరు వరసలుగా ఎన్‌హెచ్‌ - 16 విస్తరణ, జంక్షన్‌ నుంచి గుండుగొలను వరకు ఆరు లేన్లుగా జంక్షన్‌ బైపాస్‌ విస్తరణ వంటివి ఒకే ప్రాజెక్టుగా అంతర్భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టును బీఓటీ పద్ధతిని అప్పట్లో గామన్‌ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల రీత్యా ఈ సంస్థ పనులు ప్రారంభించకపోవటంతో రద్దు చేసీ ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈపీసీకి వచ్చేసరికి రెండు ఫేజులుగా నాలుగు ప్యాకేజీలకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా పెద అవుటపల్లి - జంక్షన్‌ హైవే విస్తరణ, జంక్షన్‌ - గుండుగొలను బైపాస్‌లకు ప్యాకేజీ - 1, ప్యాకేజీ - 2 లుగా టెండర్లు పిలిచారు. ఫేజ్‌ - 2 లో విజయవాడ బైపాస్‌, కృష్ణానదిపై వంతెనల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు మార్పులు, చేర్పులకు సూచనలు వచ్చాయి. విజయవాడ బైపాస్‌తో పాటు, కృష్ణానదిపై నిర్మించబోయే బ్రిడ్జిని కూడా ఆరు వరసలుగా నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. ఈక్రమంలో బైపాస్‌, ఆరు వరసల ఐకానిక్‌ బ్రిడ్జికి డీపీఆర్‌ తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం డీపీఆర్‌ టెండర్ల దశలో ఉంది. ఈ నెలాఖరు నాటికి కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయనున్నారు.
 
 
బెంజిసర్కిల్‌ ప్యాకేజీ - 1 ఫ్లై ఓవర్‌కు సంబంధించి అప్రోచ్‌ల దగ్గర భూ సేకరణకు సంబంధించి పూర్తి స్థాయి భూ ప్రతిపాదనలను ఎన్‌హెచ్‌ అధికారులు రూపొందించారు. ఈ భూ ప్రతిపాదనలను త్వరలో రెవెన్యూ శాఖకు ప్రతిపాదించనున్నారు. రెవెన్యూ శాఖ కూడా సర్వే నిర్వహించిన తర్వాత భూ సేకరణ నోటిఫికేషన్‌ వెలువరిస్తారు.
 
 
ఈ నెల 18న టెండర్లు
విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-1లో పిలిచిన పెద అవుటపల్లి - జంక్షన్‌, జంక్షన్‌ - గుండుగొలను బైపాస్‌ పనులకు సంబంధించి టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ టెండర్లను ఇప్పటివరకు ఖరారు చేయలేదు. కాంట్రాక్టు సంస్థలు గడువు కోరటం, సాంకేతికాంశాలకు సం బంధించి సమాచారాన్ని కోరుతుండటంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. చివరికి ఈ నెల 18కి చివరి వాయిదా వేశారు. ఈ నెల 18న పనులు చేప ట్టబోయే కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయ నున్నారు.
Link to comment
Share on other sites

బైపాస్‌ సవివర నివేదిక తయారీకి ఏడు సంస్థల ఆసక్తి
ఈనాడు, విజయవాడ

విజయవాడ బైపాస్‌ రహదారి, కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణం కోసం సవివర తయారీ నివేదిక అందించేందుకు ఏడు సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు (బిడ్లు) సమర్పించాయి. బైపాస్‌కు చెందిన మరో రెండు ప్యాకేజీల టెండర్ల గడువును ఈనెల 19 వరకు పొడిగించారు. గతంలో బీఓటీ ప్రాజెక్టు కాగా దాని స్థానంలో ఈపీసీ టెండర్లను ఆహ్వానించింది. దీనిలో రెండు ప్యాకేజీలకు కేంద్రం నుంచి ఆర్థిక అనుమతి రాగా మరో రెండింటికి ఇంకా రాలేదు. దీంతో డీపీఆర్‌ పేరుతో జాప్యం జరుగుతుందన్న వాదన వినవస్తోంది. విజయవాడ బాహ్యవలయ రహదారిగా పిలిచే బైపాస్‌ రహదారి నిర్మాణం గత కొన్నేళ్లుగా ప్రతిష్టంభనలో పడిన విషయం తెలిసిందే. నిర్మించు, నిర్వహించు, బదిలీచేయు (బీఓటీ) పద్ధతిలో నిర్మాణం చేయాల్సిన ఈ రహదారి నిర్మాణం అర్థంతరంగా ఆగిపోయింది. టెండర్‌ దక్కించుకున్న గుత్త సంస్థ ఇదిగో.. అదిగో అంటూ  రెండున్నరేళ్ల కాలయాపన తర్వాత చేతులు ఎత్తేసింది. దీంతో జాతీయ రహదారుల సంస్థ ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. చిన్న ఆవుటపల్లి వద్ద కొంత మట్టి పనులు చేసి తర్వాత వదిలివేసింది. పలుమార్లు హెచ్చరికలు, నోటీసులు జారీ చేసినా మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థించి ఎట్టకేలకు ఆ సంస్థ వదిలేసుకుంది. దీంతో మళ్లీ మొదటికి రావడంతో బీఓటీ కింద సంస్థలు ఆసక్తి చూపకపోవడంతో ఈపీసీ కింద టెండర్లను పిలిచారు. నాడు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి సత్ససంబంధాలు ఉండటంతో ఈపీసీ మార్పుకు అనుమతించింది. రెండు ప్యాకేజీలకు టెండర్లను పిలిచారు. దీనికి ఈ నెల 19 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఉంది.

ఆ రెండు ప్యాకేజీలు ఇలా..!
విజయవాడ బైపాస్‌ రహదారిని ఈపీసీ కింద మెత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. వీటిలో రెండు ప్యాకేజీలకు డీపీఆర్‌ సిద్ధం చేసి టెండర్లను పిలిచారు. రెండు ప్యాకేజీలకు డీపీఆర్‌ సిద్ధం కావాల్సి ఉంది.  విజయవాడ బాహ్యవలయ రహదారి బీఓటీ ప్రాజెక్టు వ్యయం మొదట రూ.1680 కోట్ల్లుగా అంచనా వేశారు. దీన్ని మూడేళ్ల కిందట గామన్‌ ఇండియా దక్కించుకుంది. దీనిలో కృష్ణానది పై వంతెన నిర్మాణం కూడా ఒకటిగా ఉండేది. దీన్ని ఇప్పుడు నాలుగు ప్యాకేజీలుగా ఈపీసీ కింద విభజించిన జాతీయ రహదారుల సంస్థ రెండింటింకి వెంటనే టెండర్లను పిలిచింది. ఒకటి కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన కాగా, మరో ప్యాకేజీ కింద చిన్నఆవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు బైపాస్‌ ఆరువరసల జాతీయ రహదారి నిర్మాణం. ఈరెండింటికి సవివర నివేదిక అందాల్సి ఉంది. చినఆవుటపల్లి నుంచి కలపర్రు వరకు ఒక ప్యాకేజీ, కలపర్రు నుంచి గుండుగొలను (పశ్చిమగోదావరి జిల్లా) వరకు మరోప్యాకేజీగా విభజించారు. ఇప్పుడు ఈ రెండు ప్యాకేజీల గడువు ఈనెల 29 వరకు పొడిగించారు. రెండు ప్యాకేజీల అంచనా వ్యయం రూ.1355 కోట్లుగా నిర్ణయించారు.

డీపీఆర్‌కు 7 సంస్థల ఆసక్తి!
బైపాస్‌లో మరో రెండు ప్యాకేజీల సవివర నివేదిక తయారీకి ఏడు సంస్థలు ఆసక్తిని ప్రదర్శించినట్లు జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ వెల్లడించారు. ఈ ఏడు సంస్థల వివరాలు తర్వాత వెల్లడిస్తామని ‘ఈనాడు’తో చెప్పారు. ఈ ఏడింటిలో ఒకదానిని మాత్రమే ఎంపిక చేస్తామని చెప్పారు. డీపీఆర్‌ తయారు చేసిన తర్వాత దీన్ని కేంద్రానికి పంపనున్నారు. మరోప్యాకేజీలో కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతుందా.. లేక సీఆర్‌డీఏ చేపడుతుందా అనేది ప్రశ్నార్థకమే. ఎన్‌హెచ్‌ఏఐ మాత్రం డీపీఆర్‌ తయారు చేయాలని టెండర్లను ఆహ్వానించడం విశేషం. ప్రస్తుతం ప్రాంతీయ కార్యాలయంలో టెండర్లను తెరవాల్సి ఉంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. వడపోతలో ఏడు సంస్థలు నిలిచాయని పీడీ విద్యాసాగర్‌ చెబుతున్నారు. ఈనెలాఖరులోగా డీపీఆర్‌ కోసం సంస్థను ఖరారు చేస్తామని వెల్లడించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...