Jump to content

Jakkampudi Township


sonykongara

Recommended Posts

జక్కంపూడి భూములకు ధర కుదిరింది..
13-03-2018 08:56:16
 
636565281777750576.jpg
  • ఎకరానికి రూ.కోటి చెల్లింపు
  • తొలి దశలో 116 ఎకరాల సేకరణ
  • రైతుల సమక్షంలో ఖరారు చేసిన డిప్యూటీ కలెక్టర్‌ రవీంద్రరావు
విజయవాడ రూరల్: విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలో ఏర్పాటు కానున్న జక్కంపూడి ఎకనామిక్‌ టౌన్‌షిప్‌ కోసం సేకరించనున్న భూమికి ధర కుదిరింది. జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఎకరా భూమికి రూ.కోటి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ ధరకు రైతులు కూడా తమ భూములను ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. విజయవాడ రూరల్‌ మండల రెవెన్యూ కార్యాలయంలో జక్కంపూడి ఎకనామిక్‌ టౌన్‌షిప్‌ భూముల ధర నిర్ణయంపై తుదిసారి డిప్యూటీ కలెక్టర్‌ (అండర్‌ ట్రైనీ తహసీల్దార్‌) ఏ రవీంద్రరావు జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, వేమవరం, గొల్లపూడి, షాబాద రైతులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. టౌన్‌షిప్‌ కోసం తొలి దశలో 116 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.గతంలో ఎకరాకు రూ.84.50 లక్షలు ఇచ్చేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయగా, రైతులు రూ.1.20 కోట్లు చెల్లించాలని కోరారు. దీనిపై పలువురు రైతులు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలిసి న్యాయమైన ధర ఇప్పించాలని అభ్యర్ధించారు.
 
జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం స్వయంగా జక్కంపూడి ఎకనామిక్‌ టౌన్‌షిప్‌ను సందర్శించి త్వరగా ధర నిర్ణయం చేయాలని ఆదేశించారు. ఆ మేరకు డిప్యూటీ కలెక్టర్‌ రవీంద్రరావు రైతులతో సమావేశం నిర్వహించి ధర నిర్ణయం చేశారు. రెండు నెలలుగా ధరపై స్పష్టత లేకపోవటంతో అధికారులు పలుమార్లు రైతులతో సమావేశాలు నిర్వహించారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో 196 ఎకరాలు ఉండగా, ప్రభుత్వం 116 ఎకరాలు సేకరించేందుకే సిద్ధమైంది. మిగలిన భూమిని కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైతులు తెలియజేశారు. ప్రాజెక్టుల కోసం రైతులు భూమి ఇస్తానంటే తీసుకుని, వారికి న్యాయమైన ధర చెల్లించాలని మంత్రి దేవినేని ఉమా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్‌ రవీంద్రరావు మాట్లాడుతూ, ప్రభుత్వ ధర కంటే ఎక్కువగానే ధర చెల్లించి టౌన్‌షిప్‌కు భూములు సేకరించనున్నట్లు చెప్పారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రోసెస్‌ను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, రైతు ప్రతినిధులు గంధం సుబ్బారావు, గర్నిపూడి మాధవరావు, గోపాలరావు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

జెట్ సిటీలో ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు టెండర్లు
23-03-2018 08:29:10
 
636573905497114444.jpg
  • నిన్న గృహ నిర్మాణాలకు ... నేడు పారిశ్రామిక యూనిట్ల కోసం
  • రూ. 143 కోట్ల వ్యయ అంచనా
  • జీ ప్లస్‌ త్రీ విధానంలో నిర్మాణం
  • ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాంప్లెక్స్‌లు
విజయవాడ: జక్కంపూడి ఎకనామిక్‌ సిటీ(జెట్‌ సిటీ)లో ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల కోసం టౌన్‌షిప్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టిడ్కో) టెండర్లు పిలిచింది. జక్కంపూడిలోని కొండ వాలు భూముల్లో తొలి విడతగా 6 ఎకరాలు అంటే.. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లు నిర్మించటానికి రూ. 143 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. జీ ప్లస్‌ త్రీ విధానంలో నిర్మించనున్నారు. ఈ టెండర్ల ప్రక్రియను కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తోంది. జెట్‌సిటీలో పదిహేను రోజుల కిందట తొలి విడతగా పేదల ఇళ్ల నిర్మాణాల కోసం టిడ్కో టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మొత్తం 28 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
 
   ఇందులో తొలి విడతగా 10,646 నిర్మాణానికి ఇటీవలే టెండర్లను పిలిచి ఖరారు చేసింది. ఇదే క్రమంలో ఇక్కడ నివసించేవారు పని చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లకు టెండర్లను పిలిచారు. పారిశ్రామిక యూనిట్లను బహుళ అంతస్థుల సముదాయంలో ఏర్పాటు చేస్తారు. ఈ ఫ్లాట్స్‌ను మాత్రమే ఔత్సాహికులకు కేటాయిస్తారు. ఇది పూర్తయిన తర్వాత ప్రధానంగా ఫుట్‌వేర్‌, ప్రింటింగ్‌ రంగాలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు. గృహ నిర్మాణాల్లో ఉండే వారికి మాత్రమే ఇక్కడి యూనిట్లలో పని ఇస్తారు. ఇక్కడ నివసించే వారందరికీ పని ప్రాతిపదికన ఉంటుంది. తొలి దశలో ఈ రెండు యూనిట్లకు మాత్రమే ఔత్సాహికులను ఆహ్వానించినా దశల వారీగా అనేక పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
 
280 ఎకరాల్లో..
జెట్‌సిటీ నిర్మాణం కోసం జిల్లా యంత్రాంగం మొత్తం 280 ఎకరాల భూములను సమకూరుస్తోంది. ఇప్పటికే మూడు కొండలతో కూడిన 140 ఎకరాల భూములను అప్పగించింది. కొండలను మినహాయించగా 70 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ డెబ్బై ఎకరాల్లో 30 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రస్తుతం చేపడుతున్నారు. జక్కంపూడి, వేమవరం, షాబాదల్లో 110 ఎకరాలను సేకరించటానికి నిర్ణయించారు. ఎకరానికి రూ. 1.10 కోట్లను పరిహారంగా ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. రైతులు కూడా అంగీకరించడంతో సమస్య లేకుండా పోయింది. నున్నలో 23 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. ఇవి కాకుండా 12 ఎకరాల భూములు అసైన్డ్‌ ల్యాండ్స్‌గా ఉన్నాయి. ప్రైవేట్‌ ల్యాండ్స్‌ మరో 65 ఎకరాలను సేకరించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. నున్న భూములకు రూ. 60 లక్షల మేర ధర నిర్ణయించినట్టు సమాచారం.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
జక్కంపూడి ఇన్నర్‌రింగ్‌కు యాక్షన్‌ ప్లాన్‌
08-04-2018 08:56:52
 
636587746110036481.jpg
  • నాలుగు మండలాల్లో భూముల సర్వే
  • తొలిదశ పనులు ప్రారంభం.. మలిదశకు కసరత్తు
  • మరో 160 ఎకరాల మేర సేకరణకు యోచన
  • రైతులతో అంగీకారం కుదిరిన భూములపై అనిశ్చితి
జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌ సిటీ)ని రాజధాని ప్రాంత ఇన్నర్‌రింగ్‌ వెంబడి విస్తరించేందుకు యాక్షన్‌ప్లాన్‌ రూపొందుతోంది! తొలిదశ పనుల్లో భాగంగా నిర్మాణ కంపెనీ 50 ఎకరాల్లో జీ ప్లస్‌ త్రీ విధానంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎన్‌సీసీ ఎర్త్‌వర్క్‌ పనులు ప్రారంభించింది. మరో నాలుగు మండలాల్లో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి అవసరమైన భూములను గుర్తించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించటంతో రెవెన్యూ యంత్రాంగం ఆ పనిలో తలమునకలుగా ఉంది. రెండవ దశ జెట్‌సిటీ నిర్మాణ పనులకు రెవెన్యూ యంత్రాంగం మొత్తం 116 ఎకరాలను గుర్తించింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
 
విజయవాడ(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని చెంతన ఆర్థిక రాజధాని (ఎకనమిక్‌ సిటీ)ని నిర్మించేందుకు విజయవాడ రూరల్‌ మండలం పరిధిలోని జక్కంపూడిని ఎంచుకున్న సంగతి తెలిసిందే. విజయవాడ నగరంతో పాటు సమాంతరంగా శరవేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలను అనుసంధానం చేసేదిగా జక్కంపూడి ఉంది. ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్‌, గన్నవరం మండల ప్రాంతాలకు జక్కంపూడి అనుసంధానంగా ఉంది. రాజధాని ప్రాంతం మీదుగా నిర్మించే ఇన్నర్‌రింగ్‌ రోడ్డు పెనమలూరు మండలం వైపు తిరుగుతుంది. ప్రస్తుతం నాలుగు మండలాల్లో జెట్‌సిటీలో భాగంగా ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి అవసరమైన భూములను గుర్తించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించటంతో రెవెన్యూ యంత్రాంగం ఆ పనిలో తలమునకలుగా ఉంది. మొత్తం 160 ఎకరాలను ఇన్నర్‌ వెంబడి బిట్‌ ప్యాకేజీలుగా గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
 
బాధ్యతలు టిడ్కోకు..
2016 ఏప్రిల్‌ 14న జక్కంపూడి ఎకనమిక్‌ సిటీ (జెట్‌సిటీ) నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఎకనమిక్‌ సిటీ అభివృద్ధికి వాక్‌ టు వర్క్‌ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ ప్రాంతంలోనే ప్రజలు నివశించటంతో పాటు పనిచేసుకునే అవకాశాలను కూడా కల్పించాలన్న ఉద్దేశ్యంతో కార్యాచరణను సిద్ధం చేసింది. మొత్తం 28 వేల ఇళ్ల నిర్మాణ బాధ్య తలను ఏపీ టిడ్కోకు అప్ప గించింది. టిడ్కోతో పాటు సీఆర్డీయే, ఏడీసీ, వీఎంసీ వంటి శాఖలను కూడా దీని అభివృద్ధికి సమష్టిగా బాధ్యతలు తీసుకోవటానికి కలెక్టర్‌ చైర్మన్‌గా ఓ కమిటీని ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
 
 
నియమించింది. ప్రధాన బాధ్యతలను మాత్రం టిడ్కో చేపడు తోంది. నివాస పనులకు సంంధించి ఇళ్ల నిర్మాణ పనులను టిడ్కో పర్యవేక్షిస్తోంది.
 
జక్కంపూడి ఎకనమిక్‌ సిటీలో 234 ఎకరాల భూములను కృష్ణాజిల్లా యం త్రాంగం టిడ్కోకు బద లాయించింది. ఇందులో మూడు కొండలు పోను 50 ఎకరాల వరకు సమతల భూములు ఉన్నాయి. కొండవాలులను సరిచేస్తే మరికొన్ని ఇళ్ళ నిర్మాణానికి అవకాశం ఉంటుంది. దీని పరిధిని మరింత విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్‌ వెంబడి ర్యాపిడ్‌ గ్రోత్‌ ఏరియాలుగా ఉన్న ఇబ్రహీపట్నం మండలం, ప్రధానంగా విజయవాడ రూరల్‌ మండలం, కొంత గన్నవరం మండలం, ఇంకొంత పెనమలూరు మండలాల్లో తక్షణం 160 ఎకరాలను సేకరించే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిపాదిత ఇన్నర్‌రోడ్డు వెంబడి విస్తారంగా ప్రైవేటు భూములు ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పరిశ్రమల ఏర్పాటుకు కూడా ఈ ప్రాంతాలు అనువుగా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జెట్‌సిటీని విస్తరించటానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
 
మలిదశపై మెలిక
 
రెండవ దశ జెట్‌సిటీ నిర్మాణ పనులకు రెవెన్యూ యంత్రాంగం మొత్తం 116 ఎకరాలను గుర్తించింది. వీటిలో దేవాదాయ భూములు 9 ఎకరాలు పోను 107 ఎకరాలను జక్కంపూడి, వేమవరం, షాబాద గ్రామాల నుంచి సేకరించాలని.. ఎకరం భూమిని రూ.కోటి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. రూ.1.20 కోట్లు ఇవ్వాలని పట్టుబట్టిన రైతులు మెట్టుదిగారు. రైతులు, రెవెన్యూ యంత్రాంగం మధ్య కుదిరిన ఒప్పందాన్ని నివేదిక రూపంలో జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రూ.కోటి చెల్లించటం అవసరమా అని కొందరు అధికారులు అభిప్రాయ పడినట్లు తెలిసింది. అయితే విజయవాడ నగరంలోని కాల్వగట్టు ప్రాంతాల వెంబడి ఉన్న వారిని తొలగించి వారికి ఎకనమిక్‌ సిటీలో ఇళ్లు కల్పిస్తారు. రైతులకు పరిహారంగా ఇచ్చే ధరనే చూస్తున్నారు కానీ, కాల్వగట్టు వాసులు తమ ప్రాంతాలను ఖాళీ చేస్తే వారి అధీనంలో ఉన్న భూమంతా ప్రభుత్వానికే స్వాధీనమౌతుంది. తర్వాత దశలో ఎలాంటి భూసేకరణ లేకుండానే అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఎకరం భూమిని రూ.కోటి పరిహారం చెల్లించినా.. జీ ప్లస్‌ త్రీ విధానంలో రైతుల నుంచి కొనుగోలు చేసే ఎకరం భూమిలో 100 ఇళ్ళ నిర్మాణం చేపట్టవచ్చు.
 
తొలిదశ పనులకు శ్రీకారం
జెట్‌సిటీ తొలిదశ నిర్మాణ పనులలో భాగంగా టిడ్కో అఽధికారులు రూ.700 కోట్ల వ్యయంతో 10,646 ఇళ్ళ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. నాగార్జున కన్‌ స్ట్రక్షన్స్‌ కంపెనీ (ఎన్‌సీసీ) టెండ ర్లను దక్కించుకుంది. ప్రస్తుతం 50 ఎకరాలలో జీ ప్లస్‌ త్రీ విధానంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎన్‌సీసీ ఎర్త్‌వర్క్‌ పనులు ప్రారంభించింది. వీఎంసీ అధికారులు ఇటీవలే 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పారిశ్రామిక భవనాల నిర్మాణానికి రూ.143 కోట్ల వ్యయంతో టెండర్లను పిలిచారు. వీటిని ఇంకా ఖరారు చేయాల్సిన అవసరం ఉంది.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
జెట్‌సిటీలో బిగ్‌ ‘ఫుట్‌వేర్‌’
19-05-2018 07:12:40
 
636623107616160875.jpg
  • దక్షిణ భారతదేశంలోనే రెండవ పెద్ద పరిశ్రమ
  • పారిశ్రామిక టెండర్లకు అనూహ్య స్పందన
  • ఫుట్‌వేర్‌ ఇండస్ర్టీకి మొత్తం 340 దరఖాస్తులు
  • కేటాయించింది 6.30 ఎకరాలు
  • జీ ప్లస్‌ 5 ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ భవనాల టెండర్లు మరికొద్ది రోజుల్లో ఖరారు
 
విజయవాడ: జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌ (జెట్‌) సిటీలో దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఫుట్‌వేర్‌ ఇండస్ర్టీ ఏర్పడబోతోంది. ఇక్కడ తొలిదశ పరిశ్రమల ఏర్పాటులో భాగంగా ఫుట్‌వేర్‌ ఇండస్ర్టీకి పిలిచిన టెండర్లకు విజయవాడ నగరం, శివారు ప్రాంతాలలోని ఔత్సాహికుల నుంచి ఊహించని స్పందన లభించింది. మొత్తం 26.55 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుట్‌వేర్‌ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వచ్చారు. అంటే దాదాపు 7.01 ఎకరాల భూముల్లో ఫుట్‌వేర్‌ ఇండస్ర్టీ ఏర్పాటుకు స్పందన వచ్చింది. మొత్తం 340 మంది ఔత్సాహికుల నుంచి టిడ్కోకు దరఖాస్తులు వచ్చాయి. ఈ టెండర్లు పిలిచే ముందు ఇంత స్పందన వస్తుందని టిడ్కో అధికారులు ఊహించలేదు. విజయవాడలో ఫుట్‌వేర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌కు సంబంధించి 180 కంపెనీలు ఉన్నాయి. వీటిలో బడా సంస్థలతో పాటు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు కూడా ఉన్నాయి.
 
 విజయవాడలోని ఫుట్‌వేర్‌ పారిశ్రామిక సంస్థలన్నీ టిడ్కోకు దరఖాస్తు చేసుకున్నాయి. నగరంలోని గాంధీనగర్‌, గవర్నర్‌పేట, శివారు ప్రాంతాలలో ఉన్న అన్ని యూనిట్ల తరపున టిడ్కోకు దరఖాస్తులు వచ్చాయి. విజయవాడలో చిన్నపాటి గదులలో యూనిట్లను ఏర్పాటు చేసి తగిన స్థలం లేక విస్తరించలేని ఔత్సాహికులు ఐదు వేల చదరపు అడుగుల స్థలం పైగా కోరుకుంటున్నారు. ఇంత భారీ స్పందన వస్తుందని ఊహించని టిడ్కో అధికారులకు ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చి పడింది. అందరికీ అకామిడేషన్‌ కల్పించాలంటే డిమాండ్‌కు తగినట్టుగా విస్తరించాలి. ప్రస్తుతం 6.45 ఎకరాలలో మాత్రమే వీటి నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. మొత్తం ఏరియాలో కార్పెట్‌ ఏరియా 4.32 ఎకరాలు మాత్రమే ఉంది. దీనిలో 2.69 ఎకరాల తేడా కనిపిస్తోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని టిడ్కో అధికారులు చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో దేశంలోనే జెట్‌సిటీలో ఫుట్‌వేర్‌ ఇండస్ర్టీ అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉన్నదనడంలో సందేహం లేదు.
Link to comment
Share on other sites

కేఎంవీకి ఫుట్‌వేర్‌ ఇండస్ర్టీ కాంప్లెక్స్‌ బాధ్యతలు!
23-05-2018 08:03:46
 
636626594277079373.jpg
  • జెట్‌ సిటీలో మూడు సంస్థల టెండర్లు.. కేఎంవీ ఎంపిక
  • మార్చి, 2019 డెడ్‌లైన్‌
విజయవాడ: జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌) సిటీలో పారిశ్రామిక నిర్మాణాలకు అడుగు పడింది. ఫుట్‌వేర్‌ ఇండస్ర్టీ కాంప్లెక్స్‌ నిర్మాణ కాంట్రాక్టును ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ కేఎంవీ దక్కించుకుంది. జీ ప్లస్‌- 4 విధానంలో 6.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుట్‌వేర్‌ ఇండస్ర్టీ కాంప్లెక్స్‌ను నిర్మించాల్సి ఉంది. ఈ కాంప్లెక్స్‌ నిర్మాణానికి టెండర్లను వీఎంసీ ద్వారా టిడ్కో పిలిపించింది. మూడు సంస్థలు పోటీ పడగా, రెండు ప్రధాన సంస్థలు కేఎంవీ, బీఎస్‌ఆర్‌ బరిలో నిలిచాయి. అర్హతల ప్రాతిపదికన, టెక్నికల్‌ బిడ్స్‌ పరంగానూ ఈ రెండు సంస్థలు పోటీ పడ్డాయి. ఫైనాన్షియల్‌ బిడ్‌లో కేఎంవీ సంస్థ పై చేయి సాధించింది. ఎంతకు కోట్‌ చేసిందన్న వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు.
 
ఈ సంస్థను ఫుట్‌వేర్‌ ఇండస్ర్టీ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఎంపిక చేశారు. మార్చి, 2019 నాటికి కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఈ సంస్థకు తుది గడువును నిర్దేశించారు. టిడ్కో తమకు కేటాయించిన 6.41 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేఎంవీ సంస్థ స్వాధీనం చేసుకోనుంది. ఈ స్థలంలో 4.32 లక్షల అడుగుల కార్పెట్‌ ఏరియాలో జీ ప్లస్‌ 4 విధానంలో ఫుట్‌వేర్‌ ఇండస్ర్టీ కాంప్లెక్స్‌ను నిర్మించాల్సి ఉంది. ఇండస్ర్టీ కాంప్లెక్స్‌లో తమ యూనిట్లను ప్రారంభించటానికి విజయవాడ నగరంతో పాటు, కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఫుట్‌వేర్‌ యూనిట్లు నడిపే వారు చాలా మంది ఆసక్తితో ముందుకొచ్చారు. వారు టిడ్కో అధికారులతో చర్చించారు కూడా.
 
అయితే వచ్చిన డిమాండ్‌ను బట్టి చూస్తే 7.02 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్లను ఏర్పాటు చేయాలి. దీనిని చూసి టిడ్కో అధికారులు సైతం కంగుతిన్నారు. అందుబాటులోఉన్న భూముల ప్రకారం టిడ్కో అధికారులు 6.45 లక్షల చదరపు అడుగుల స్థలాన్నే కేటాయించారు. ఇందులో 4.32 లక్షల చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియానే వినియోగంలోకి వస్తుంది. ఇంకా రెట్టింపు డిమాండ్‌ ఉండటంతో ఫేజ్‌ - 2లో మరో కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు.
 
 
 
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...
  • 3 weeks later...
అధునాతనంగా ఆర్థిక రాజధాని...
20-08-2018 10:48:50
 
636703589319537657.jpg
జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌) సిటీ నిర్మాణపనులు ప్రారంభమయ్యాయి. లివ్‌ అండ్‌ వర్క్‌ విధానంతో గృహనిర్మాణం, ఇండస్ర్టియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణపనులకు బీజం పడింది. పేదల ఇళ్ళ నిర్మాణ పనులు ఇప్పటకే ప్రారంభం కాగా, ఇండ స్ర్టియల్‌ కాంప్లెక్స్‌ పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. రాష్ర్టానికి అమరావతి రాజధాని అయితే ప్రధాన ఆర్థిక రాజధానిగా జక్కంపూడిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే! ఆర్థికరాజధానిలో చేపట్టే నిర్మాణపనులన్నింటినీ షేర్‌వాల్‌ టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
 
 
విజయవాడ: జెట్‌ సిటీ నిర్మాణంలో భాగంగా పేదల ఇళ్ల నిర్మాణాలను షేర్‌వాల్‌ టెక్నాలజీ విధానంలోనే నిర్మిస్తున్నారు. జక్కంపూడి ఎకనమిక్‌ సిటీ కోసం ఏపీ టిడ్కోకు కృష్ణాజిల్లా యంత్రాంగం 230 ఎకరాల ప్రభుత్వ భూములను అప్పగించింది. ఈభూముల్లో కొండలు పోను 70ఎకరాల సమతల భూమి ఉంది. ఇందులో 10,250 ఇళ్ల నిర్మాణానికి టిడ్కో అధికారులు చర్యలు చేపట్టారు. టెండర్లను కూడా పిలిచారు. నాగార్జున కన్‌ స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌సీసీ)ఇళ్ళ నిర్మాణ బాధ్యతలను దక్కించుకుంది. ప్రస్తుతం 6000 ఇళ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థ చేపట్టింది.
 
జీ ప్లస్‌ త్రీ విధానంలో వీటిపనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఫౌండేషన్‌ వర్క్‌ నడుస్తోంది. ఇళ్ల నిర్మాణాలను షేర్‌వాల్‌ టెక్నాలజీతో నిర్మించటం వల్ల వేగంగా జరుగుతున్నాయి. ఫౌండేషన్‌ పనుల నుంచే షేర్‌వాల్‌ టెక్నాలజీ విధానంలోనే పనులు చేస్తున్నారు. షేర్‌వాల్‌ టెక్నాలజీ విధానంలో కాంక్రీట్‌ ప్యానెల్స్‌ కీలకపాత్ర పోషిస్తాయి. ఈ ప్యానెల్స్‌ అత్యంత దృఢంగా ఉంటాయి.గోడలు దుర్భేద్యంగా ఉంటాయి. భవనం లోపల ఎలా కావాలనుకుంటే ఆ విధంగా మార్చుకోవటానికి వీలుగా ఉంటుంది.హోటల్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లకు సంబంధించి ఎక్కువుగా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. జనవరి, 2019 నాటికి ఈ ఇళ్ళ నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉంది.
 
 
మరికొద్ది రోజుల్లో ఇండస్ర్టియల్‌ కాంప్లెక్స్‌ పనులు
కొండ ప్రాంతంగా ఉన్నచోట వాలు వద్ద చదును చేసి ఇండస్ర్టియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు చేపట్టడానికి టిడ్కో రంగం సిద్ధం చేసింది. తొలివిడతగా ఫుట్‌వేర్‌ ఇండస్ర్టియల్‌ కాంప్లెక్స్‌కు టెండర్లు పిలిచింది. జీప్లస్‌3 విధానంలో దీనిని నిర్మించటానికి టెండర్లు పిలిచారు. ఈ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను కేఎంవీ ప్రాజెక్ట్స్‌ సంస్థ దక్కించుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ కాంప్లెక్స్‌ నిర్మాణపనులను కాంట్రాక్టు సంస్థ చేపట్టనుంది. ఫుుట్‌వేర్‌ ఇండస్ర్టీ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేయటానికి టిడ్కో ప్రతిపాదించిన విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణానికి ఫుట్‌వేర్‌ వర్గాల నుంచి డిమాండ్‌ రావటంతో అధికారులు సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఇండస్ర్టియల్‌ కాంప్లెక్స్‌లకు కూడా ఇలాంటి స్పందనే వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
 
 
నవంబర్‌లో రైతులకు పరిహారం
జక్కంపూడి విస్తరణకు అవసరమైన 106 ఎకరాలకు సంబంధించి నవంబర్‌లో రైతులకు పరిహారం ఇచ్చే అవ కాశం ఉంది. ఇప్పటికే భూసేకరణ ప్రతిపాదన ఉన్న భూముల్లో రైతులను పంటలు వేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు. ఖాతాలో డబ్బులు పడగానే వెంటనే సెటిల్‌ చేస్తారు. రైతులతో ఇప్పటికే ఓ దఫా జేసీ సమావేశం నిర్వహించారు. డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, బ్యాంకు ఖాతాలను సంసిద్ధంగా ఉం చుకోవాలనివారికి సూచించారు.
ma.jpg 
Link to comment
Share on other sites

  • 4 weeks later...
సీఎం చంద్రబాబు కోరుకున్నట్టుగానే 200 ఎకరాలకు పైగా...
22-09-2018 08:50:33
 
636732030308510427.jpg
 
  • కొండ చుట్టూ జెట్‌ సిటీ నిర్మాణాలు
  • ప్రకృతి ఒడిలో ప్రజా జీవనం
  • 6 వేల ఇళ్ల నిర్మాణాలు
  • సీఎం కోరిన విధంగా జెట్‌సిటీకి రూపు
  • ఏరియల్‌ వ్యూ చిత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం
 
ప్రకృతి ఒడిలో ప్రజా జీవనం ఉండాలి! చెంతనే పరిశ్రమలు ఏర్పడాలి.. నివాసం.. పని ఒకేచోట ఉండాలి. ఆహ్లాదంగా ఇక్కడి ప్రజలు జీవించాలి.. భవిష్యత్తులో రాష్ట్రం ప్రతిష్ఠాత్మక ఆర్థిక రాజధానిగా రూపాంతరం చెందాలి.. ఇదీ... ఆర్థిక నగరం.. జక్కంపూడి నిర్మాణం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టౌన్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టిడ్కో)కు చేసిన దిశా నిర్దేశం! ఇందుకు అనుగుణంగా ప్రకృతి ఒడిలో దాదాపుగా 200 ఎకరాలకు పైగా విస్తరించి.. పచ్చటి ప్రకృతితో అలరారుతున్న కొండల చెంతన గృహ సౌధాల నిర్మాణం జరుగుతోంది.
 
 
విజయవాడ: రాజధాని స్థాయిలో.. విజయవాడను ఆనుకుని ఉన్న జక్కంపూడిలో ఆర్థిక నగరాన్ని అభివృద్ధి చేయడానికి సంకల్పించిన యంత్రాంగం జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌ షిప్‌(జెట్‌) సిటీ క్రమేణా సీఎం కోరుకున్నట్టుగా రూపం సంతరించుకుంటోంది. ప్రకృతి ఒడిలో ఉన్న ట్టుగా .. దాదాపుగా 200 ఎకరాలకుపైగా విస్త రించి.. పచ్చటి ప్రకృతితో అలరారుతున్న కొం డల చెంతన గృహసౌధాల నిర్మాణం జరు గుతోంది. ఇప్పటికే ఒక రూపం వచ్చింది. కొండ చుట్టూ ఆరువేల ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో అపురూప దృశ్యం ఆవిష్కృతమవుతోంది.
 
 
రాజధాని ప్రాంతంలో ఆర్థిక నగరాభివృద్ధికి విజయవాడ వాయువ్య దిక్కున ఉన్న జక్కంపూడిని ప్రభుత్వం ఎంపిక చేసిన తర్వాత.. నగర నిర్మాణానికి అవసరమైన గృహనిర్మాణం, ఇండస్ర్టియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులకు ఇటీవలే శ్రీకారం చుట్టారు. గృహ నిర్మాణ పనులకు, ఇండస్ర్టియల్‌ కాంప్లెక్స్‌ పనులు రెండింటికీ టెండర్లు పిలిచారు. గృహ నిర్మాణ పనులను నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ (ఎన్‌సీసీ), ఇండస్ర్టియల్‌ కాంప్లెక్స్‌ పనులను కేఎంవీ ప్రాజెక్ట్స్‌ దక్కించుకుంది. గృహనిర్మాణ పనులను ఎన్‌సీసీ ఆగ మేఘాల మీద ప్రారంభించింది. జక్కం పూడిలో కొండ ప్రాంతం చుట్టూ ఎన్‌సీసీ గృహ నిర్మాణం చేపట్టింది.
 
 
ఆరు వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
మొదటి ఫేజ్‌లో భాగంగా 10,624 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ప్రభుత్వ అనుమతి మేరకు 8 వేల ఇళ్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. అందుబాటులో ఉన్న స్థలం, కొంత మేర చదును చేసి సమకూర్చుకున్న స్థలంలో మొత్తం ఆరు వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొండచుట్టూ నిర్మాణాలు చేపట్టాలని సీఎం సూచించడంతో .. మాస్టర్‌ప్లాన్‌ను దానికి తగినట్టుగానే రూపొందించారు. కొండ చుట్టూ మొత్తం కవర్‌ చేయడానికి వీలుగా నాలుగు సైడులుగా విభజించారు. ఇవి కొండ చుట్టుకొలతను పూర్తిగా కవర్‌ చేస్తాయి. ఇలా కవర్‌ చేయడానికి చాపాకారంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. సైడ్‌ -ఎ, సైడ్‌ - బి, సైడ్‌ - సి, సైడ్‌ -డిలలో ఒక్కో సైడులో 1500 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఇవంతా షేర్‌ వాల్‌ టెక్నాలజీ విధానంలోనే జరుగుతోంది.
 
 
జెట్‌ సిటీకి రూపం
వాయువేగంతో పనులు జరుగు తుండటంతో జెట్‌ సిటీకి రూపమొచ్చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జెట్‌ సిటీ నిర్మాణ పనులను డ్రోన్‌ద్వారా ఛాయా చిత్రీకరణ జరిపించింది. మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా కొండచుట్టూ జరుగుతున్న గృహ నిర్మాణ తీరును సీఎం చంద్రబాబు వీక్షించినట్టు తెలిసింది. కొండల మీద చదును చేసి రిక్రియేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి సదుపాయాలను తర్వాత దశలో కల్పిస్తారు.
 
 
జనవరిలో రెండో దశ ఇళ్ల నిర్మాణం
జెట్‌ సిటీలో టిడ్కో అధికారులు జనవరిలో రెండో దశ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌లోకి ప్రజలను తీసుకురావడానికి వీలుగా నగరానికి మొత్తం 28,152 ఇళ్లను కేటాయించింది. ఇందులో భాగంగా తొలిదశలో 10,624 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో 6 వేల ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా దాదాపుగా 22 వేల ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. వీటికోసం 200 ఎకరాలు పైచిలుకు కావాల్సి వస్తోంది. ఎకరం విస్తీర్ణంలో 100 ఇళ్లను నిర్మిస్తారు. కాబట్టి 20 వేల ఇళ్లకు 200 ఎకరాలు కావాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న గృహ నిర్మాణాన్ని అనుకుని ఉన్న వ్యవసాయ భూములు 106 ఎకరాలకు.. ఎకరం రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. రైతులకు డిసెంబర్‌ నెలాఖరుకు ప్రభుత్వం పరిహారాన్ని అందజేయనుంది.
 
వెంటనే భూములను స్వాధీనం చేసుకోవడం ద్వారా మరో 10 వే ల ఇళ్ల నిర్మాణ పనులకు అవకాశం కలుగు తుంది. వీటికి మరో 100 ఎకరాలు కావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం ఈ భూముల కోసం కసరత్తు చేసింది. రెండేళ్ల క్రితం జక్కంపూడి గృహ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఇప్పటికే జాప్యం కావడంతో ఎట్టి పరిస్థితుల్లో శరవేగంగా ఈ ప్రాజెక్టును నిర్మించి తీరాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...