Jump to content

Jakkampudi Township


sonykongara

Recommended Posts

  • 4 weeks later...
  • 3 weeks later...
  • 3 weeks later...
  • 3 weeks later...
  • 4 weeks later...
  • 1 month later...

త్వరితగతిన జెట్‌ సిటీ పనులు
ఈనాడు, విజయవాడ: దేశంలోనే తొలిసారిగా విజయవాడ సమీపంలో ఏర్పాటు చేయనున్న జక్కంపూడి ఆర్థిక నగరం (జెట్‌ సిటీ) పనులను త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జెట్‌ సిటీ ఏర్పాటు ద్వారా చిన్న వృత్తులు, చేతి వృత్తుల వారికి చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జక్కంపూడి ఆర్థిక నగరం ఏర్పాటుపై బుధవారంనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆర్థిక నగరం ఏర్పాటు వల్ల స్థానిక ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగు పడతాయని, విజయవాడకు కొత్త అందాలు చేకూరతాయని అభిప్రాయపడ్డారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...
జక్కంపూడి జెట్ సిటీకి.. అంకురార్పణ
28-01-2018 08:11:33
 
636527238913456085.jpg
  •  ఫేజ్‌ - 1 పనులకు శ్రీకారం
  •  10,624 ఇళ్ళకు టెండర్లు
  • పారిశ్రామిక భవనాలకూ టెండర్లు
  •  దశల వారీగా యాక్షన్‌ ప్లాన్‌
  •  ఫిబ్రవరి నెలాఖరులో శంకుస్థాపన ?!
  •  2029 నాటికి ఎకనమిక్‌ సిటీ నిర్మాణం పూర్తి
 
విజయవాడ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): జక్కంపూడి ఎకనమిక్‌ సిటీ (జెట్‌ సిటీ) మొదటి దశ పనులకు ‘టిడ్కో’ అధికారులు శ్రీకారం చుట్టారు. తొలి దశ లో ఆవాసం, ఉపాధి అంశాల ప్రాతిపదికన ఇళ్లు, పారిశ్రామిక భవనాలను నిర్మించటానికి టెండర్లు పిలిచారు. మొత్తం 10,624 ఇళ్లు, 6.35 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీస్‌ (పారిశ్రామిక భవనాలు) నిర్మించటానికి టెండర్లు పిలిచారు. ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్ల స్వీకరణకు తుది గడువు. రెండవ వారంలో టెండర్లను ఖరారు చేసి నెలాఖరుకు శంకుస్థాపన చే యటానికి టిడ్కో అధికారులు కసరత్తు చేస్తున్నారు. దశల వారీగా ఎకనామిక్‌ సిటీని అభివృద్ధి చేయటానికి టిడ్కో అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. రానున్న 2029 నాటికి ప్రణాళిక ప్రకారం ఎకనమిక్‌ సిటీ ( జెట్‌ సిటీ) ని నిర్మించటం పూర్తి అవుతుంది. టిడ్కో అధికారులు 2029 నాటికి అర లక్ష కుటుంబాలకు నివాసం... 22 వేల మందికి ఉద్యోగాల కల్పన దిశగా ఈ ప్రణాళికను రూపొందించటం జరిగింది. మొదటి దశ ప్రణాళికలలో భాగంగా . ఎకనమిక్‌ సిటీ నిర్మాణం కోసం కృష్ణాజిల్లా యంత్రాంగం 190 ఎకరాల భూమిని టిడ్కో కు ఇప్పటికే అప్పగించింది. ఈ భూములు మూడు కొండ ప్రాంతాలను కలిగి ఉన్నాయి. మూడు కొండల చుట్టూ ప్రస్తుతం 90 ఎకరాల భూమి మాత్రమే నిర్మాణాలకు అనుకూలంగా ఉంది. మిగిలిన అవసరాలకు మరింత భూమిని సేకరించాల్సి ఉంది. ఇది తర్వాత దశలో చేపట్టవలసి ఉంటుంది. మొదటి దశ పనులకు సంబంధించి పిలిచిన టెండర్లకు ఫిబ్రవరి మొదటి వారం తుది గడువుగా నిర్దేశించటం జరిగింది.
 
తుది గడువు లోపు టెండర్లు దాఖలు కానున్నాయి. రెండవ వారంలో టెండర్ల స్ర్కూటినీతోపాటు టెక్నికల్‌, ఫైనాన్షియల్‌ అవాల్యుయేషన్‌ విధానాలు కూడా పూర్తి చేసి తుది కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు. తర్వాత ప్రభుత్వ అనుమతి తీసుకుని శంకుస్థాపన పనులకు నెలాఖరులో శ్రీకారం చుట్టనున్నారు. జక్కంపూడి ని ఆర్థిక నగరం ( జెట్‌ సిటీ ) గా అభివృద్ధి చేయటానికి ఈప్రాంతంలోకి ముందుగా ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి 28 వేల ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఎకనమిక్‌సిటీలో నివశించే ప్రజలకు స్థానికంగానే ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా తొలి దశలో అందుబాటులో ఉన్న భూములలో 10,624 ఇళ్ళకు టిడ్కో అధికారులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. మొత్తం 6.35 ఎకరాల స్థలం అంటే... ఆరు లక్షల చదరపు అడుగుల స్థలంలో పారిశ్రామిక భవనాలను ఏర్పాటు చేయటానికి టెండర్లు పిలిచారు. ఈ భవనాలు గ్రౌండ్‌ఫ్లోర్‌తో కలుపుకుని ఐదు అంతస్థులతో ఉంటాయి. ఇవి కూడా బహుళ అంతస్థుల సముదాయంతో ఉంటాయి.
 
 గోడౌన్లు మాదిరిగా రేకుల షెడ్ల తరహాలో ఉన్న వాటిలో కాకుండా పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు కోసం ఏకంగా బహుళ అంతస్థుల భవనాలను నిర్మించబోతుండటం విశేషం. ఈ భవనాలను ’ ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీస్‌ ’ గా పేర్కొంటారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఇలాంటి ’ ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీస్‌ ’ ఉంటాయి. జక్కంపూడి ఎకనమిక్‌ సిటీలో కూడా ఇదే తరహాలో ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీస్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవటం గమనార్హం . భవనాలు పూర్తయిన తర్వాత వీటిలో ఫుట్‌వేర్‌, ప్రింటింగ్‌ తదితర అనేక రకాల పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికొక ప్రత్యేక పాలసీ ఉంటుంది.
Link to comment
Share on other sites

హిల్‌వ్యాలీగా ‘జెట్‌ సిటీ’
29-01-2018 07:41:35
 
636528084937655494.jpg
  • కొండ వాలులో మెగా నిర్మాణాలు
  • ఒక వైపు గృహాలు.. మరోవైపు ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీలు
  • కొండలపై భారీ పరిశ్రమల యూనిట్లు
విజయవాడ (ఆంధ్రజ్యోతి): అమరావతి ఆర్థిక నగరం (ఎకనమిక్‌ సిటీ).. ‘జక్కంపూడి’ని హిల్‌వ్యాలీగా అత్యద్భుతంగా నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఎకనమిక్‌ సిటీ (జెట్‌సిటీ)లో ఆవాసం, ఉపాధి కల్పనకు సంబంధించి టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. 2029 నాటికి అధునాతన ఆర్థిక నగరంగా రూపుదాల్చటానికి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. ఈ ప్రణాళికల ప్రకారం.. కృష్ణాజిల్లా యంత్రాంగం తక్షణం 190 ఎకరాలను ఏపీ టిడ్కోకు అందచేసింది. జెట్‌సిటీ అన్నది పదేళ్ల ప్రణాళిక కాబట్టి దశల వారీగా విస్తరించాల్సి ఉంటుంది. తొలిదశ పనులకు టెండర్లు పిలిచారు. ఈ భూముల్లో మూడు కొండలున్నాయి.
 
ఈ కొండలవాలు ప్రాంతాలలో 90ఎకరాల భూములు ఉన్నాయి. జెట్‌సిటీ నిర్మాణం హిల్‌వ్యాలీ సిటీగా రూపాంతరం చెందనుంది. హిల్‌వ్యాలీగా జెట్‌సిటీ నిర్మాణానికి టిడ్కో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వీటికి సంబంధించిన డిజైన్లు ‘ఆంధ్రజ్యోతి’చేతికి చిక్కాయి. మూడు కొండల చుట్టూ గృహ నిర్మాణాలు ఉంటాయి. తొలి దశలో జీ ప్లస్‌ త్రీ నిర్మాణాలు చేపడతారు. తర్వాత దశలలో జీ ప్లస్‌ ఐదు, ఏడు కూడా నిర్మించటానికి అవకాశాలున్నాయి. ఆవాసంలో ముందుగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి (ఈడబ్ల్యూఎస్‌) ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. పేదలే కాకుండా విభిన్న వర్గాల ప్రజలకు కూడా ఇక్కడ ఇళ్లు కట్టించటానికి ఏపీ టిడ్కో అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ప్రైవేటు డెవలపర్లు, బిల్డర్ల కంటే కాస్త తక్కువ ధరకే నాణ్యమైన ఇళ్లను ఇదే ప్రాంతంలో కట్టి ఇవ్వటానికి కూడా ఈ శాఖ రెడీగా ఉంది.
 
ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ బ్లాకులుగా అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు చేపడతారు. జెట్‌సిటీలో ఫ్యాక్టరీలు ఫ్లాటెడ్‌ మల్టీప్లెక్స్‌లలోనే ఉంటాయి. వీటిని ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీస్‌ అంటారు. బహుళ అంతస్థుల భవన సముదాయాలలోనే ఈ వసతులను కల్పిస్తారు. దీంతో పాటు స్థానికంగానే వినోదం పొందటానికి సహజసిద్ధ కొండ ప్రాంతంలో ఉద్యానవనాలు, ఆర్ట్‌గ్యాలరీ, సినిమాహాల్స్‌, మాల్స్‌, గేమింగ్‌ జోన్స్‌ వంటివి ఏర్పాటు చేస్తారు. స్థానికంగానే వైద్యసేవలు పొందటానికి హాస్పిటల్‌ నిర్మాణాలు కూడా చేపడతారు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు అయ్యేవి కాకపోయినా.. 2030నాటికి పూర్తిరూపు తీసుకురావటానికి ప్రణాళికలు రూపొందించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

జక్కంపూడిలో 196 ఎకరాల సేకరణ
10-02-2018 09:19:01
ప్రతిపాదనలు సిద్ధం చేయండి..
మార్కెట్‌ ధర రూ.79.91 లక్షలు చెల్లిద్దాం
డిప్యూటీ కలెక్టర్‌కు కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశం
విజయవాడ రూరల్‌ : విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలో ఏపీ టిడ్కో నిర్మించనున్న జక్కంపూడి ఎకనామిక్‌ టౌన్‌షిప్‌ కోసం వేమవరం రెవెన్యూ గ్రామంలోని 196 ఎకరాలను తీసుకోవాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశించారు. కొత్తూరు తాడేపల్లి పంచాయతీ పరిధిలోని వేమవరంలో 196 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, టౌన్‌షిప్‌ కోసం 116 ఎకరాలను సేకరించాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రైతులు మొత్తం భూమిని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో పలు దఫాలుగా విజయవాడ రూరల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎ.రవీంద్రరావు రైతులతో ధర నిర్ణయంపై చర్చించారు. ఎకరాకు రూ.1.20 కోట్లు చెల్లించాలని తొలుత రైతులు ప్రతిపాదించగా, అందుకు ప్రభుత్వం ససేమిరా అంది. దీంతో రూ.90 లక్షలు ఇచ్చి మొత్తం 196 ఎకరాలను తీసుకోవాలని రైతులు కోరారు.
 
ఇదిలావుండగా, సిటీ విజిట్‌లో భాగంగా బస్సు యాత్ర నిర్వహించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం, జక్కంపూడి ఎకనామిక్‌ టౌన్‌షిప్‌ భూములపై డిప్యూటీ కలెక్టర్‌ రవీంద్రరావుతో చర్చించారు. మొత్తం భూమిని సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు పంపించాలని ఆదేశించారు. మార్కెట్‌ ధర రూ.79.91 లక్షలు చెల్లించేందుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. దీంతో డిప్యూటీ కలెక్టర్‌ రవీంద్రరావు వేమవరం రెవెన్యూ పరిధిలోని భూముల సేకరణకు ప్రతిపాదించారు.
 
కనీసం రూ.90 లక్షలు ఇవ్వండి
జక్కంపూడి ఎకనామిక్‌ టౌన్‌షిప్‌ కోసం వేమవరంలో సేకరించనున్న భూములకు ఎకరాకు కనీసం రూ.90 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. అందులో భాగంగానే జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలిసి ప్రభుత్వానికి విన్నవించాలని భావిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వేమవరంలో ఎకరా ధర రూ.1.20 కోట్లు ఉంగా, మార్కెట్‌ ధర చెల్లిస్తే తాము నష్టపోతామని రైతులు చెబుతున్నారు. కనీసం రూ.90 లక్షలైనా ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం.

Link to comment
Share on other sites

On 3/9/2017 at 6:20 PM, uravis said:

naaku oka centu bhoomi ledu, oka illu ledu family lo nenu okkadine sampadistunna. naa daggara 1l tax cut chesaru ee year. naaku emina illu istaru atleast cheap price ki ina :thinking:

death and taxes are certain . no body can change that . many things are out of our control. government waste money on many useless schemes,unviable projects, statues(ambedkar, jyothy rao pule, ntr ,ysr or any other leader). atleast in this situation some poor people are getting houses. poor doesn't mean lazy. poor people do menial jobs  like milk vendor, labour, plumber,carpenter,sewage cleaner ......... . these people provide essential services which make city livable .

Link to comment
Share on other sites

  • 2 weeks later...

జెట్‌ సిటీ’ నిర్మాణానికి ప్రణాళిక
09-03-2018 07:52:10

160 ఎకరాల భూముల గుర్తింపు
రైతులతో సంప్రదింపులు
భూ ఆధార్‌కు మొబైల్‌ నెంబర్ల అనుసంధానం
100% నీటి తీరువా వసూలు దిశగా అడుగులు
కృష్ణా జేసీ - 2 బాబూరావు
విజయవాడ: ‘అమరావతి రాజధాని ప్రాంతంలో జక్కంపూడి ఎకనమిక్‌ సిటీ (జెట్‌సిటీ) నిర్మాణానికి అనువైన భూములను గుర్తించాం. రైతులు సానుకూలంగా ఉన్నారు. ధర విషయంలోనే రైతుల నుంచి అంగీకారం రావాల్సి ఉంది...’ అని కృష్ణా జాయింట్‌ కలెక్టర్‌-2 పిడుగు బాబూరావు అన్నారు. గురువారం సబ్‌ కలెక్టరేట్‌లో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జెట్‌సిటీ దగ్గర నుంచి పలు రెవెన్యూ సంస్కరణల వివరాలను వెల్లడించారు. ఆయన మాటల్లోనే...
 
 జక్కంపూడి ఎకనమిక్‌ సిటీకి ఇంకా 200 ఎకరాల భూముల అవసరం ఉంది. కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు ప్రతిపాదిత ఎకనమిక్‌ సిటీ సమీపంలోని జక్కంపూడి, వేమవరం, షాబాద గ్రామాల్లో 160 ఎకరాలను గుర్తించాం. ఈ భూములకు సంబంధించి రైతులతో కూడా సమావేశమయ్యాం. భూ సేకరణ విధానంలో ముందుకు వెళుతున్నాం. రైతుల నుంచి సానుకూలత ఉంది. ధర విషయంలోనే వారి నుంచి అంగీకారం రావాల్సి ఉంది. చట్టప్రకారం ఎకరానికి రూ.80 లక్షలు ఇవ్వటానికి అవకాశం ఉంది. రైతులు మాత్రం రూ.1.20 కోట్లు ఇవ్వమని అడుగుతున్నారు. ఇంత మొత్తం ఇవ్వటం కష్టమే అయినప్పటికీ రైతులతో సంప్రదింపులు జరపటం ద్వారా మరో రూ.5 లక్షలు అటో, ఇటో అయినా చేయగలిగే అవకాశం ఉంటుంది. జక్కంపూడి సిటీ విస్తరణకు సంబంధించి దాదాపుగా 28 వేల ఇళ్ళ నిర్మాణానికి భూములు అవసరం ఉంది. ఆ దిశగా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం.
 
 ఇళ్ల పట్టాలకు సంబంధించి సర్వే కొనసాగుతోంది. నగరవ్యాప్తంగా అన్నీ కలిపి 40 వేల వరకు పట్టాలు ఇవ్వాల్సి ఉంటుందన్నది అంచనా. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించటం జరుగుతోంది. విశాఖ నుంచి ప్రైవేటు సంస్థ ద్వారా పని చేయిస్తున్నాం. అనుకున్నంత దరఖాస్తులు రావటం లేదు. వారసులు లేకపోవటం, చేతులు మారటం, ఒకరి పేరుతోనే రెండు మూడు ఉండటం వంటివాటిపై మా పరిశీలన జరుగుతోంది. ఈ ప్రక్రియను త్వరగా ముగించటానికి చర్యలు తీసుకుంటాం.
 
 భూ ఖాతాలకు సంబంధించి ఆధార్‌ అనుసంధానంతో పాటు వారి మొబైల్‌ నెంబర్ల అనుసంధానం కూడా చేపడుతున్నాం. విజయవాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఈ ప్రక్రియ 93శాతం పూర్తయింది. జగ్గయ్యపేటలో భూ ఆధార్‌ను ప్రయోగాత్మకంగా చేపడుతున్నాం. ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదైన విస్తీర్ణానికి, అడంగల్‌లో నమోదైన విస్తీర్ణానికి సంబంధించి సరిచేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ వ్యత్యాసాలను సవరించటం ద్వారా ఇటు రెవెన్యూ పరంగానే ‘భూ ఆధార్‌’ వ్యవస్థను బలోపేతం చే యటానికి ఎంతో దోహదపడుతుంది. భూ యజమానుల ఫోన్‌ నెంబర్లను అనుసంధానించటం ద్వారా వారి ఫోన్లకే వారి భూములకు సంబంధించి స్కెచ్‌ను పంపిస్తాం. పొలం అమ్మినా ఆటోమేటిక్‌గా మ్యుటేషన్‌ అవుతుంది. అతని స్వాధీనంలో ఉన్న భూమికి సంబంధించిన కాపీని పంపిస్తాము కాబట్టి పాస్‌బుక్‌, టైటిల్‌ డీడ్స్‌ వంటి వాటితో సంబంధం ఉండదు.
 
 విజయవాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో నూరుశాతం నీటి తీరువా వసూలు లక్ష్యం దిశగా వెళుతున్నాం. రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని కంచికచర్ల, పెనుగంచిప్రోలు, వీరులపాడు, చందర్లపాడు, విజయవాడ రూరల్‌, జీ కొండూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తోట్లవల్లూరు మండలాలు నూరు శాతం నీటి తీరువా సాధించాయి. విజయవాడ అర్బన్‌ 95 శాతం, కంకిపాడు 78 శాతం, వత్సవాయి 77 శాతం, తోట్లవల్లూరు 65 శాతం మేర నీటితీరువా సాధించాయి.

Link to comment
Share on other sites

శరవేగంగా నగర వనం పనులు
10-03-2018 07:41:58
 
636562645194237027.jpg
  • జక్కంపూడిలో నిర్మాణ పనులు
  • చెట్టు కొమ్మ ఆకృతిలో ముఖద్వారం
  • చెక్కలతో తయారు చేసినట్లుగా బెంచ్‌లు
  • వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటు
విజయవాడ: విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలో నగర వనం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీయూజీఏబీసీ) పర్యవేక్షణలో నగర వనం పనులు జరుగుతున్నాయి. రెండున్నర సంవత్సరాల క్రితం అప్పటి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌, సీఎం చంద్రబాబు నగర వనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొన్నటివరకు అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవటంతో పనులు ముందుకు సాగలేదు. నాలుగు నెలల నుంచి ఏపీయూజీఏబీసీ ఆధ్వర్యంలో నగర వనం నిర్మాణాలు సాగుతున్నాయి. విజయవాడ - విస్సన్నపేట ఆర్‌ అండ్‌ బీ రోడ్డు పక్కనే ఉన్న నగర వనాన్ని ఏర్పాటు చేస్తుండటంతో చూపరులను ఆకర్షించేలా నిర్మాణాలు చేపట్టారు. సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న నగర వనంలో ఏడు మీటర్ల వెడల్పు, మూడు కిలో మీటర్ల పొడవునా ట్రాక్‌ల నిర్మాణం చేసేలా డిజైనింగ్‌ చేశారు.
 
   నగర వనం అంటే ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ కల్పించేలా ఉండాలనే ఉద్దేశంతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు వీలుగా డిజైనింగ్‌ చేశారు. ఇప్పటికే వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం పూర్తవగా, ఆ మార్గాలకు బ్యూటిఫికేషన్‌ చేస్తున్నారు. మార్గాలకు రెండువైపులా మొక్కలు నాటారు. ఇక ముఖద్వారాన్ని చెట్టుకొమ్మ ఆకృతిలో నిర్మిస్తున్నారు. నగర వనానికి వచ్చే వారు కొద్దిసేపు కూర్చునేందుకు వీలుగా చెక్కలతో తయారు చేసిన బెంచ్‌లను ఏర్పాటు చేసి రంగులు వేస్తున్నారు. రెండు నెలల్లో నగర వనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఫుడ్‌కోర్టులను కూడా ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ నగరానికి కేవలం ఐదు కిలో మీటర్ల దూరంలో రెండున్నర కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ నగర వనం జక్కంపూడి - అంబాపురం వద్ద ప్రారంభమై జక్కంపూడి వద్ద పోలవరం కాల్వ వరకు సుమారు మూడు కిలో మీటర్ల పొడవు ఉంటుంది.
 
రోడ్డు వెడల్పు అవశ్యం
నగర వనం ప్రారంభమైతే విజయవాడ - విస్సన్నపేట ఆర్‌ అండ్‌ బీ రోడ్డులో ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోడ్డును వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దుర్గా ఫ్లైఓవర్‌ నిర్మాణం వల్ల భారీ వాహనాలను ఈ రోడ్డులోకి మళ్లించటంతో తరచూ ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ప్రధానంగా పాముల కాల్వ వద్ద ఉన్న మలుపు మరింత ప్రమాదకరంగా మారిందంటున్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...