Jump to content

Amaravati ki circular train


sonykongara

Recommended Posts

విజయవాడ-అమరావతి మధ్య రైల్వేలైన్‌కు రూ.2680కోట్లు

నడికుడి- శ్రీకాళహస్తి మధ్య రైల్వేలైన్‌కు రూ.340కోట్లు

 

The best connecting project of DELHI-SOUTH INDIA. With this we have best connecting dreams both in progress in this phase.

 

Nadikudi-Srikalahasti

Errupalem-Namburu

 

 

 

 

 

brahmiawhistle.gif

Link to comment
Share on other sites

  • 2 weeks later...

చకచకా! 

రైల్వే విద్యుదీకరణ పనులు వేగవంతం 
రూ.152.16 కోట్లు మంజూరు 
వచ్చే నెలలో కంభం వరకు 
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే 
amr-top1a.jpg

గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో విద్యుదీకరణ పనులు వేగవంతంగా జరిగేవిధంగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాజా కేంద్ర బడ్జెట్లో రూ.152.16 కోట్లు మంజూరు చేసింది. నల్లపాడు - దిగువమెట్ట మార్గానికి రూ.52.16 కోట్లు కేటాయించగా, నడికుడి - పగిడిపల్లికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు ఈ డివిజన్‌కు ఎంతో కీలకం. ఇవి పూర్తయితే డివిజన్‌కు ఆదాయం గణనీయంగా పెరగనుంది. అదనపు రైళ్లు ప్రారంభించడంతోపాటు తక్కువ సమయంలోనూ ప్రయాణించే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు ఎంతో మేలు కలగనుంది.

వచ్చే నెలలో కంభం వరకు : నల్లపాడు - దిగువమెట్ల మధ్యలో 266 కి.మీ మేర విద్యుదీకరణ పనులు రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. దీనికోసం రూ.380 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మార్చి నెలాఖరుకు నల్లపాడు నుంచి కంభం వరకు విద్యుత్తుతో నడిచే లోకోల సాయంతో రైళ్లను నడపాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన సగం మార్గంలో కూడా పనులు తుది దశకు వచ్చాయి. ఈ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా 300 మందికి పరోక్షంగా 1000 మందికి ఉపాధి దొరకనుంది. అదేవిధంగా గుంటూరు మీదుగా బెంగళూరు, ముంబయికి సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు రానున్నాయి. విజయవాడ నుంచి చెన్నై మార్గంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ మార్గం ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనుంది. తాజా బడ్జెట్లోనూ అవసరమైన మేర నిధులు కేటాయించినందున పనుల్లో జాప్యం లేకుండా జరిగే అవకాశం ఉంది.

పగిడిపల్లి - నడికుడి మార్గం : ఈ మార్గంలో మొత్తం 285 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పనులు ఇప్పటికే ప్రారంభించారు. దీంతో పాటు ప్రధాన లైనుకు పక్కనే ఉన్న నడికుడి నుంచి మాచర్ల, విష్ణుపురం నుంచి జాన్‌పహాడ్‌ లైన్లను కూడా విద్యుదీకరిస్తున్నారు. ఈ లైను నిర్మాణానికి రైల్వే బోర్డు గత సంవత్సరం రూ.134.56 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు పిలిచి టాటా ప్రాజెక్ట్సు లిమిటెడ్‌కు ఈ పనులు అప్పగించారు. ప్రస్తుతం సంవత్సరం రూ.100 కోట్లు కేటాయించినందున పనుల్లో జాప్యం లేకుండా జరిగే అవకాశం ఉంది. ఈ మార్గం విద్యుదీకరణ పూర్తయితే గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ కేవలం 3.30 గంటల్లోనే ప్రయాణికులు చేరడానికి వీలవుతుంది.

గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో మొత్తం 618 కిలోమీటర్ల నిడివిగల రైల్వే ట్రాక్‌ ఉంది. ఇందులో ఇప్పటికే నల్లపాడు-కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ వరకు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నల్లపాడు - దిగువమెట్ట, గుంటూరు - తెనాలి, నల్లపాడు - పగిడిపల్లి మార్గంలో పనులు జరుగుతున్నాయి. ఇంకా కేవలం తెనాలి - రేపల్లె మార్గం మాత్రమే విద్యుదీకరణ చేయాల్సి ఉంది. ఇది ప్రధాన మార్గంలో లేనందున ఎక్స్‌ప్రెస్‌ రైళ్లరాకపోకల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. గుంటూరు డివిజన్‌ ఆదాయంలో సగానికిపైగా నల్లపాడు - నంద్యాల మార్గాన నడిచే సరకుల రైళ్ల వల్లే వస్తున్నది. అందువల్ల ముందుగా ఈ మార్గంలో పనులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పనులు పూర్తయితే రైల్వే డివిజన్‌ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతి వచ్చే వారికి అదనంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులోకి రావడంవల్ల వారి రాకపోకలకి ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. ప్రస్తుతం గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో నడిచే ఎక్స్‌ప్రెస్‌, సరకుల రైళ్లు నల్లపాడు వరకు విద్యుత్తు లోకోలతో నడుస్తున్నాయి. అక్కడ నుంచి విద్యుత్తు లైన్లు లేనందున రైళ్లను ఆపి డీజిల్‌ లోకోలను ఏర్పాటు చేయాల్సి వస్తున్నది. దీనివల్ల సమయం ఎంతో వృధా అవుతున్నది. అంతేగాకుండా డీజిల్‌తో నడుపుతుండటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండటమేగాకుండా పర్యావరణానికి హాని కలుగుతున్నది. విద్యుదీకరణ పనులు పూర్తయితే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

Link to comment
Share on other sites

  • 1 month later...
హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టుకు 150 కోట్లు
 
636252492462359468.jpg
  • రాజధానిలో సైన్స్‌ సిటీ
  • స్మార్ట్‌ జాబితాలో మూడు నగరాలు
  • కృష్ణా డెల్టా వరద నివారణకు 2.60 కోట్లు
నవ్య రాజధానిలో.. నవ్యాంధ్ర తొలి బడ్జెట్‌లో అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం అగ్రపీఠం వేసింది. స్మార్ట్‌ సిటీల నుంచి సైన్స్‌ సిటీ వరకు.. అమరావతి క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు నుంచి మెట్రో రైల్‌ వరకు.. ఇలా సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న ప్రాంతాలకు, ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులతో ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాజధాని ప్రాంతంలో వరద ముంపు నివారణకు 39 కోట్లు, కృష్ణా డెల్టా వరద నివారణకు 2.60 కోట్లు కేటాయించారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, విజయవాడ) : అమరావతికి ముఖ్యమంత్రి 2017-18 వార్షిక బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. క్యాపిటల్‌ రిజియన్ డెవలప్‌మెంట్‌ అధారిటీ పరిధిలో ఉన్న ప్రాంతాలకు బడ్జెట్‌ కేటాయింపులలో ప్రభుత్వం పెద్దపీట వేసింది. అమరావతి క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు 500 కోట్లు కేటాయించిన ఆర్ధిక మంత్రి యనమల రాజధాని అభివృద్ధికి విడిగా మరో వెయ్యి కోట్లు వరకు కేటాయించారు. అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టు పనులకు 100 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 13 ముఖ్య నగరాలు, పట్టణాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందు కోసం 150 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆ నగరాల జాబితాలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలను కూడా చేర్చింది. అమరావతిలో నిర్మిస్తున్న నవనగరాలు, మౌలిక సదుపాయాల కోసం హడ్కోతో 7 వేల కోట్ల మేర ఒప్పందం కుదుర్చుకున్నామని, ప్రపంచ బ్యాంకు కూడా నిధులు సమకూర్చడానికి సూతప్రాయంగా అంగీకరించిందని ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారసత్వ సంపదకు భిన్నమైన అమరావతిని వారసత్వ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. బెంగళూరు తరహాలో అమరావతిని సైన్స సిటీగా అభివృద్ధి చేయడానికి బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. మేఽథో సంపత్తుకు కేంద్రమైన ఆంధ్రప్రదేశలో యువ ఇంజనీర్లు, సైన్స పట్టభద్రులు పరిశోధనలు చేపట్టడానికి వీలుగా అమరావతిలో సృజనాత్మక విజ్ఞాన అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పుతారు. ఈ కేంద్రాలలో సాంకేతికత, విజ్ఞానదాయక అంశాలపై విద్యార్థులు తమ సృజనాత్మకతకు పదునుపెట్టి పరిశోధనలు చేయవచ్చు. సైన్సు మ్యూజియం ద్వారా సైన్సు విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం, సైన్సు మీద ఆధారపడిన ఆర్థిక చోదకాల ద్వారా ఉపాధి కల్పన చేపట్టడం వంటివి కూడా ఇందులోకి వస్తాయి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ఒక కొలిక్కి వస్తోంది. ఫైనాన్స సంస్థలు రుణం ఇవ్వడానికి పోటీ పడుతుండటంతో ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగింది. విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి నగరాల మధ్య రాజధాని సందర్శకుల తాకిడి పెరగడంతో హైస్పీడ్‌ సర్క్యులర్‌ అర్బన్ రైలు నడపడానికి కేంద్రం అండతో సమగ్ర పథక ప్రణాళిక సిద్ధమవుతోంది. దీని కోసం బడ్జెట్‌లో 100 కోట్లు కేటాయించారు. పులిచింతల ప్రాజెక్టును తుది దశ పనుల కోసం 113 కోట్లు కేటాయించారు. రాజధాని ప్రాంతంలో వరద ముంపు నివారణకు 39 కోట్లు, కృష్ణా డెల్టా వరద నివారణకు 2.60 కోట్లు కేటాయించారు
Link to comment
Share on other sites

  • 1 month later...

image.jpgఅమరావతి వలయ రైళ్ల ఏర్పాటుకు
చైనా సంస్థ ఆసక్తి!
అమరావతిలో వేగవంతమైన (హైస్పీడ్‌) వలయ రైళ్లు (సర్క్యూట్‌ రైళ్లు) ఏర్పాటుకు చైనా సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. చైనాకు చెందిన చైనా రైల్వే రూలింగ్‌స్టాక్‌ కార్పొరేషన్‌ (సీఆర్‌ఆర్‌సీ) ప్రతినిధులు బుధవారం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఎండీ రామకృష్ణారెడ్డితో విజయవాడలో సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు వివిధ అంశాలపై చర్చించారు. వలయ రైళ్లు ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తంచేశారు. ప్రతినిధి బృందంలో సీఆర్‌ఆర్‌సీ డిప్యూటీ డైరెక్టర్లు కాయోయాన్‌, డిగాంగ్‌యువాన్‌, ఉపాధ్యక్షుడు ఝాంగ్‌మిన్యూ, ఎండీ వాంగ్‌ ఉన్నారు. ఈ సందర్భంగా వారు వలయ రైలు నమూనాను ఎండీ రామకృష్ణారెడ్డికి అందించారు. విజయవాడ -అమరావతి, గుంటూరు- తెనాలి నుంచి మంగళగిరి మీదుగా విజయవాడకు వలయ రైళ్లు నడపాలనే ప్రతిపాదన ఉంది. ఇటీవల దీన్ని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి సమగ్ర నివేదిక తయారు చేసేందుకు యూఎంటీసీ సలహాసంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఇదేతరహా ప్రాజెక్టును సీఆర్‌ఆర్‌సీ సంస్థ మలేసియాలో నిర్వహిస్తోంది. డీపీఆర్‌ పూర్తయిన తర్వాత ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిందిగా చైనా సంస్థ బృందానికి సూచించారు.

 

 

Link to comment
Share on other sites

హై స్పీడ్‌ ట్రైన్ ప్రాజెక్టుపై చైనా ఆసక్తి
 
636300933257102334.jpg
  • విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి మధ్య సర్క్యులర్‌ ట్రైన్ ప్రాజెక్టుపై చైనా ఆసక్తి
  • చైనా రైల్వే రోలింగ్‌ స్టాక్‌ కంపెనీ సుముఖత
  • విజయవాడలో ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డితో సమావేశం
  • ఏకాభిప్రాయానికి వచ్చిన సీఆర్‌ఆర్‌సీ, ఏఎంఆర్‌సీ
విజయవాడ: అమరావతి రాజధానికి మణిమకుటాయమైన విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి హై స్పీడ్‌ సర్క్యులర్‌ ట్రైన ప్రాజెక్టుపై చైనా ఆసక్తి చూపిస్తోంది. హై స్పీడ్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో భాగస్వామ్యం పంచుకునేందుకు ‘చైనా రైల్వే రోలింగ్‌ స్టాక్‌ కంపెనీ’ (సీఆర్‌ఆర్‌సీ) సంసిద్ధమైంది. మలేషియాలో ఇలాంటి ప్రాజెక్టునే చేపడుతున్న సీఆర్‌ఆర్‌సీ.. రాజధాని ప్రాంతంలో చేపట్టేబోయే ఈ ప్రాజెక్టుపై కూడా దృష్టి సారించటంతో ఆ కంపెనీని ప్రాజెక్టులో భాగస్వామ్యం చేసేందుకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన (ఏఎంఆర్‌సీ) ఎండీ ఎనవీ రామకృష్ణారెడ్డి ఆ బృందంతో బుధవారం సమావేశమైంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో చేపట్టే హై స్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. ఇందుకు విదేశీ ఆర్థిక సంస్థల అవసరం కాబట్టి చైనాకి చెందిన సీఆర్‌ఆర్‌సీ ఆసక్తి చూపటాన్ని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన(ఏఎంఆర్‌సీ) ఆహ్వానించింది. విజయవాడలోని ఏఎంఆర్‌సీ ప్రధాన కార్యాలయంలో ఎండీతో సీఆర్‌ఆర్‌సీ బృందం సమావేశమైంది. సీఆర్‌ఆర్‌సీ అధికార బృందంలో డిప్యూటీ డైరెక్టర్‌ కావ్‌ యాన, ఉపాధ్యక్షుడు ఝాంగ్‌ మిన్యూ, డిప్యూటీ డైరెక్టర్‌ డీగాంగ్‌ యూన, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వాంగ్‌లు ఉన్నారు. విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి నగరాలను అనుసంధానం చేసే హైస్పీడ్‌ సర్క్యులర్‌ ట్రైనప్రాజెక్టుపై ఏఎంఆర్‌సీ ఎండీ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టం మేరకు విజయవాడకు కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్‌ ప్రాజెక్టును మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమరావతి రాజధానికి కూడా విస్తరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. విజయవాడలో మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ఫీజుబిలిటీకి అవకాశాలు ఉండటంతో దానికి డీపీఆర్‌ పూర్తి చేసి ప్రాజెక్టు పనుల ప్రక్రియ ప్రారంభించటం జరిగిందన్నారు. ఇదే క్రమంలో ఇప్పుడున్న పరిస్థితులలో రాజధానికి మెట్రో రైల్‌ ప్రాజెక్టు వయబిలిటీ కాదని డిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన (డీఎంఆర్‌సీ) రిపోర్టు ఇవ్వటం, హై స్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టుకు సిఫార్సు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి నగరాలను హై స్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టుతో అనుసంధానం చేయాలని నిర్ణయించటంతో డీఎంఆర్‌సీ సంస్థ దీనికి సంబంధించి డీపీఆర్‌ బాధ్యతలను అప్పగించటం జరిగిందన్నారు. అర్బన మాస్‌ ట్రాన్సపోర్టు కంపెనీ(యుఎంటీసీ) సంస్థ దీనికి సంబంధించిన డీపీఆర్‌ తయారు చేస్తోందని చెప్పారు. సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత.. ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుంది? హై స్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రక్రియ ప్రారంభించటం సాధ్యమౌతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రైవేట్‌ అండ్‌ పబ్లిక్‌ పార్టనర్‌ షిప్‌ (పీపీపీ) విధానంలో నిర్మించాలని నిర్ణయించవచ్చని లేని పక్షంలో డీపీఆర్‌ వచ్చిన తర్వాత రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపించటం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మిసే ్త ప్రాజెక్టుకు నిధులకు సంబంధించి రెండు ప్రభుత్వాల వాటాను డీపీఆర్‌ ప్రకారం నిర్దేశించటం జరుగుతుందన్నారు. మిగిలిన వాటాను విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్ళటం జరుగుతుందని చెప్పారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషనను వీక్షించిన తర్వాత చైనా రైల్వే రోలింగ్‌ స్టాక్‌ కంపెనీ తమ అనభవాలను వివరించింది. చైనా అధికార బృంద సభ్యులు మాట్లాడుతూ మలేషియాలో తాము ఇలాంటి హై స్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టు పనులు చేపడుతున్నామని వివరించారు. దీనికి రామకృష్ణారెడ్డి స్పందిస్తూ తమ ప్రాజెక్టు కూడా 100 కిలోమీటర్ల నిడివి ఉంటుందని, స్పీడ్‌కు సంబంధించి తాము ఇంకా మార్గనిర్దేశనం చేసుకోలేదన్నారు. ఈ సందర్భంగా సీఆర్‌ఆర్‌సీ బృంద సభ్యులు హై స్పీడ్‌ రైల్‌కు సంబంధించిన ఒక మోడల్‌ను , ఏఎంఆర్‌సీ రామకృష్ణారెడ్డికి బహుకరించారు.
 
చర్చలు సఫలం
హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టుపై ఏఎంఆర్‌సీ, సీఆర్‌ఆర్‌సీ బృంద సభ్యుల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రాజెక్టు అంకుర దశలో చైనాకు చెందిన ప్రతిష్ఠాత్మక సీఆర్‌ఆర్‌సీ సంస్థ ముందుకు రావటంతో ఏఎంఆర్‌సీ ఆ సంస్థను తమ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్టు ఏఎంఆర్‌సీ ఎండీ ఆంధ్రజ్యోతికి చెప్పారు. ఒక వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నా.. విదేశీ ఆర్థిక సంస్థల అవసరం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఆర్‌ఆర్‌సీ సంస్థను భాగస్వామ్యం చేయాలని ఏఎంఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ప్రాజెక్టును ఆ సంస్థకు అప్పగించేందుకు చ ర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
 
నేడు యుఎంటీసీతో సమావేశం
హై స్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపకల్పన చేస్తున్న అర్బన మాస్‌ ట్రాన్సపోర్టు కంపెనీ (యుఎంటీసీ) తో గురువారం సీఆర్‌ఆర్‌సీ బృందం భేటీ కావాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌ఆర్‌సీ బృందం ఢిల్లీ వెళుతోంది. డీపీఆర్‌కు సంబంధించి తమ దేశంలో అవలంభించిన విధానాలను ఆ సంస్థతో పంచుకునే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

  • 3 months later...
  • 8 months later...
  • 8 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...