Jump to content

Bhavani IslandTourism Corporation

sonykongara

Recommended Posts

  • Replies 348
  • Created
  • Last Reply

భవానీ అందాలు చిందనీ

భవానీ ఐలాడ్‌ టూరిజం కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయం

పీపీపీ పద్ధతిలో నిర్వహణ

ఈనాడు, అమరావతి

image.jpg

ఇక రాజధాని ప్రాంతంలో ప్రధాన పర్యటక కేంద్రంగా భవానీ ద్వీపం అభివృద్ధి చెందనుంది. ప్రకాశం బ్యారేజీ జలాశయం మధ్యలో ఉన్న ఈ ద్వీపం పర్యటకులను విశేషంగా ఆకట్టుకొంటోంది. వారంతపు సెలవు దినాలను ఉత్సాహంగా, ఆహ్లాదంగా గడపాల్సిన వారికి చక్కటి విడిది ప్రాంతంగా ఉంది. కృష్ణాలో సహజసిద్ధంగా వెలిసిన ఈద్వీపం ఇకపై అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్భుత పర్యటక ప్రాంతంగా మారనుంది. భవానీ ఐలాండ్‌ టూరిజం కార్పొరేషన్‌ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆద్వర్యంలో ఇది కొనసాగుతుండగా ఇకపై అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యటక ప్రాంతంగా రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏపీటీడీసీ అనుబంధంగా ఇది పనిచేస్తుంది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో భవానీ ద్వీప పర్యాటక సంస్థ(కార్పొరేషన్‌) ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా దీన్ని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. రాష్ట్రంలో ప్రత్యేకంగా టూరిజం కార్పొరేషన్‌ ఏర్పాటు ఇదే ప్రథమం కావడం విశేషం.

పీపీపీ పద్ధతిలో..!

భవానీ ద్వీపం అభివృద్ధికి ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్య పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. దీని కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు ప్రత్యేక అధికారులను నియమిస్తారు. దీనికి ప్రజాప్రతినిధిని నామినేటెడ్‌ పోస్టు కింద ఇచ్చే అవకాశం ఉంది.

* ఆధునికీకరణలో భాగంగా భవానీ ద్వీపంలో పిల్లలను, పెద్దలను ఆకర్షించే ప్యాకేజీలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా వసతులు పెంపొందించాలని నిర్ణయించారు.

* భవానీ ద్వీపంలో రోప్‌వేను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం బోటు ద్వారా పర్యాటకులు భవానీ ద్వీపానికి చేరుకుంటున్నారు. జలక్రీడలు, జెయింట్‌ వీల్‌, హంటింగ్‌ గేమ్స్‌ లాంటివి ఏర్పాటు చేస్తారు.

* డిస్నీ లాండ్‌ తరహాలో కొత్త క్రీడలు రూసపొందిస్తారు. వినోదాత్మక కార్యక్రమాలు, ఎమ్యూజ్‌మెంటు పార్కులు ఉంటాయి. కాటేజీల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 24ను 100 వరకు పెంచాలనేది ప్రణాళిక. అంతర్గతంగా రోడ్లు ఏర్పాటు చేస్తారు.

* సమావేశాలు, విందు వినోద కార్యక్రమాల నిర్వహణకు తగిన సౌకర్యాలు కల్పిస్తారు. ప్రస్తుతం కార్తీక మాసం వనభోజనాలకు ప్యాకేజీ రూపొందించారు.

* భవానీ ద్వీపంతో పాటు పరిసరాల్లో ఉన్న మూడు నాలుగు ద్వీపాలను కార్పొరేషన్‌కు అనుబంధగా చేర్చి వాటిని అభివృద్ధి చేయనున్నారు.

* ఒక వైపు ఇంద్రకీలాద్రి, మరో వైపు ఉండవల్లి గుహలు ఉన్నాయి. కొండపై బుద్దుని విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

* భవానీ ద్వీపం ముందుగా కృష్ణానదిపై ఒక వంతెన ఏర్పాటు చేయనున్నారు. దీంతో అక్కడ రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. పున్నమి, భవానీ ఘాట్‌ల ప్రాంతాలను ఏపీటీడీసీ అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాంతాలను బీఐటీసీలో కలుపనున్నారు.

ప్రధాన పర్యటక కేంద్రంగా..!

* దీని విస్తీర్ణం దాదాపు 150 ఎకరాలు ఉంది. పచ్చని చెట్లతో ఆహ్లాదవాతావరణంలో ఉంటుంది. కృష్ణానది ఒడ్డునే ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గ దేవాలయం ప్రసిద్ధి చెందింది.

* ప్రస్తుతం భవానీ ద్వీపం పిల్లలు ఆడుకొనే క్రీడా పరికరాలు స్పైడర్‌ నెట్‌, వాటర్‌ స్పోర్ట్సు, బోటింగ్‌ రెస్టారెంటు, ఏపీటీడీసీ కాన్ఫరెన్సు హాలు, కాటేజీలు 24వరకు ఉన్నాయి. రోజుకు 300 మంది నుంచి 500 వరకు పర్యాటకులు భవానీ ద్వీపం వెళుతున్నారు. వారంతపు దినాల్లో వెయ్యి మంది వరకే ఉంటున్నారు. రాత్రి బస చేసేవారు తక్కువగా ఉంటున్నారు.

* భవానీ ద్వీపంలో ఒక ఓపెన్‌ఎయిర్‌ థియేటర్‌ ఉంది. కానీ పెద్దగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో భవానీ ద్వీపాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకీకరించి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవాలని తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంపొందించాలనేది ప్రణాళిక.

* ప్రస్తుతం ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవానీ ద్వీపానికి నెలకు రూ.15లక్షల ఆదాయం కూడా రావడంలేదు. దీంతో నిర్వహణ ఖర్చులు అధికంగా ఉన్నట్లు తెలిసింది. పర్యాటకులను ఆకర్షించే విధంగా రూపొందించగలిగితే ఆదాయం మరింత పెరగనుందని భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

ఆహా అనేలా...!

అమరావతిలో పర్యటకంపై దృష్టి

రిసార్టుల ఏర్పాటుకు టెండర్లు

భవానీ ద్వీపం కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు

కోటప్పకొండకు తీగల మార్గం..!

ఈనాడు, అమరావతి

amr-top1a.jpg

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటక రంగాన్ని అభివృద్ధి పర్చేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రణాళికలు రూపొందించింది. అమరావతి ప్రాంతంలో రిసార్టులు, కృష్ణా నది తీరంలో జెట్టీల నిర్మాణానికి ప్రకటనలు జారీ చేసింది. దీంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ వద్ద తీగ మార్గం (రోప్‌వే) ఏర్పాటు చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో దీన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 24 ప్రాంతాల్లో నక్షత్ర హోటళ్లు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. ఇందులో భాగంగా అమరావతి ప్రాంతంలో పలు ప్రాజెక్టులకు ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో పర్యటక రంగం ద్వారా సేవారంగానికి ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని సర్క్యూట్‌లను మంజూరుచేసింది. తీర ప్రాంతంలో పర్యటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. పుణ్య క్షేత్రాలు ఉన్న ప్రాంతాల్లోనూ వివిధ రకాల హోటళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అమరావతి పర్యటకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

అమరావతిలో రిసార్ట్సు..!

అమరావతి ప్రాంతంలో రిసార్టుల ఏర్పాటుకు పర్యటక అభివృద్ధి సంస్థ ప్రకటన జారీ చేసింది. మూడు నక్షత్రాల హోటల్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. నవ్యాంధ్ర ప్రాంతంలో కృష్ణానది తీరంలో రిసార్టులను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. దీనికి ఆసక్తి గల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అమరావతి ప్రాంతంలో ఉన్న ఉండవల్లి గుహలు, అమరావతి పట్టణంలో అమరేశ్వరాలయం ప్రాంతాలను అభివ¿ృద్ధి చేయనున్నారు. దీనికి ప్రణాళికలు రూపొందించారు. ఉండవల్లి సమీపంలో భారీ బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. రిసార్ట్సులలో అన్ని వసతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వినోద కార్యక్రమాలు, విహార యాత్రలు, సాహస క్రీడల వంటివి ఏర్పాటు చేస్తారు. యాత్రికులు బస చేసందుకు అన్నివసతులున్న కాటేజీలు నిర్మిస్తారు.

భవనీ ద్వీపానికి రూ.50 కోట్లు!

విజయవాడ నగరంలో ఉన్న భవానీ ద్వీపం అభివృద్ధికి కార్పొరేషన్‌ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. భవానీ ద్వీపం పర్యటక సంస్థ (బీఐటీసీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీనికి మూల ధనంగా రూ.50 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. భవానీ ద్వీపంతో పాటు పరిసరాలలో ఉన్న ద్వీపాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కార్పొరేషన్‌కు పాలక వర్గం ఏర్పాటు చేసి భవానీ ద్వీపాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కూడా కృష్ణా నది ఒడ్డునుంచి రోప్‌వే ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. ఇప్పటికే భవానీ ద్వీపంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కార్తీక మాసం సందర్భంగా పలు ప్యాకేజీలను ప్రకటించింది. అయితే ఇటీవల ప్రవేటు సంస్థ బోటింగ్‌ నిర్వహణ వివాదస్పదంగా మారింది. విజిలెన్సు దాడులు చేసింది. అనుమతులు లేకుండా వివిధ రకాల జల క్రీడలు, బోటింగు ఏర్పాటు చేసిన సంస్థపై విచారణ జరుపుతున్నారు. పర్యటక సంస్థ కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి రాబట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలను టెండర్ల ద్వారా నిర్ణయించాలని విజిలెన్సు అధికారులు పర్యాటక సంస్థకు సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం కార్పొరేషన్‌ ఏర్పాటుతో భవానీ ద్వీపానికి మహర్ధశ పట్టనుంది. అమరావతి ప్రాంతంలో దశలవారీగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.

Link to comment
Share on other sites

Bhavani Island gets a boost

With the objective of developing Bhavani Island and other islets on the Krishna into major tourist destinations and giving a much-needed push to water sports, river cruises and other water-based activities in the region, the Government has decided to form a Special Purpose Vehicle and gave orders to set up Bhavani Island Tourism Corporation.

The key objectives of BITC will be development and maintenance of tourism infrastructure and tourism services at the islands in Krishna river near Vijayawada and Amaravati, river front development on both sides of the Krishna i.e. alongside Vijayawada and Amaravati, water sports, river cruises and other water based activities/ attractions.

BITC shall be incorporated with Andhra Pradesh Tourism Development Corporation Limited (APTDC) as the sole promoter. Based on the need of the project, additional promoters like CRDA and Vijayawada Municipal Corporation (VMC) may be included as promoters after the infusion of appropriate capital. The equity share holding of APTDC shall be at least 50 per cent at any given point time in BITC.

Functions of the BITC will be to exercise development control and regulate development of the lands under relevant Acts, to raise required finances including from market if required by mortgaging the lands, promote and develop tourism infrastructure and tourism experiences, to maintain municipal services to coordinate the government departments in execution of common infrastructure.15202529_1438773039484891_55315758557818
Link to comment
Share on other sites

ఆహా అనేలా...!

అమరావతిలో పర్యటకంపై దృష్టి

రిసార్టుల ఏర్పాటుకు టెండర్లు

భవానీ ద్వీపం కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు

కోటప్పకొండకు తీగల మార్గం..!

ఈనాడు, అమరావతి

amr-top1a.jpg

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటక రంగాన్ని అభివృద్ధి పర్చేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రణాళికలు రూపొందించింది. అమరావతి ప్రాంతంలో రిసార్టులు, కృష్ణా నది తీరంలో జెట్టీల నిర్మాణానికి ప్రకటనలు జారీ చేసింది. దీంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ వద్ద తీగ మార్గం (రోప్‌వే) ఏర్పాటు చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో దీన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 24 ప్రాంతాల్లో నక్షత్ర హోటళ్లు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. ఇందులో భాగంగా అమరావతి ప్రాంతంలో పలు ప్రాజెక్టులకు ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో పర్యటక రంగం ద్వారా సేవారంగానికి ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని సర్క్యూట్‌లను మంజూరుచేసింది. తీర ప్రాంతంలో పర్యటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. పుణ్య క్షేత్రాలు ఉన్న ప్రాంతాల్లోనూ వివిధ రకాల హోటళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అమరావతి పర్యటకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

అమరావతిలో రిసార్ట్సు..!

అమరావతి ప్రాంతంలో రిసార్టుల ఏర్పాటుకు పర్యటక అభివృద్ధి సంస్థ ప్రకటన జారీ చేసింది. మూడు నక్షత్రాల హోటల్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. నవ్యాంధ్ర ప్రాంతంలో కృష్ణానది తీరంలో రిసార్టులను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. దీనికి ఆసక్తి గల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అమరావతి ప్రాంతంలో ఉన్న ఉండవల్లి గుహలు, అమరావతి పట్టణంలో అమరేశ్వరాలయం ప్రాంతాలను అభివ¿ృద్ధి చేయనున్నారు. దీనికి ప్రణాళికలు రూపొందించారు. ఉండవల్లి సమీపంలో భారీ బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. రిసార్ట్సులలో అన్ని వసతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వినోద కార్యక్రమాలు, విహార యాత్రలు, సాహస క్రీడల వంటివి ఏర్పాటు చేస్తారు. యాత్రికులు బస చేసందుకు అన్నివసతులున్న కాటేజీలు నిర్మిస్తారు.

భవనీ ద్వీపానికి రూ.50 కోట్లు!

విజయవాడ నగరంలో ఉన్న భవానీ ద్వీపం అభివృద్ధికి కార్పొరేషన్‌ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. భవానీ ద్వీపం పర్యటక సంస్థ (బీఐటీసీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీనికి మూల ధనంగా రూ.50 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. భవానీ ద్వీపంతో పాటు పరిసరాలలో ఉన్న ద్వీపాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కార్పొరేషన్‌కు పాలక వర్గం ఏర్పాటు చేసి భవానీ ద్వీపాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కూడా కృష్ణా నది ఒడ్డునుంచి రోప్‌వే ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. ఇప్పటికే భవానీ ద్వీపంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కార్తీక మాసం సందర్భంగా పలు ప్యాకేజీలను ప్రకటించింది. అయితే ఇటీవల ప్రవేటు సంస్థ బోటింగ్‌ నిర్వహణ వివాదస్పదంగా మారింది. విజిలెన్సు దాడులు చేసింది. అనుమతులు లేకుండా వివిధ రకాల జల క్రీడలు, బోటింగు ఏర్పాటు చేసిన సంస్థపై విచారణ జరుపుతున్నారు. పర్యటక సంస్థ కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి రాబట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలను టెండర్ల ద్వారా నిర్ణయించాలని విజిలెన్సు అధికారులు పర్యాటక సంస్థకు సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం కార్పొరేషన్‌ ఏర్పాటుతో భవానీ ద్వీపానికి మహర్ధశ పట్టనుంది. అమరావతి ప్రాంతంలో దశలవారీగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.

Antha bane undi gani better start hip-hop mini bus services or use cabs

min. cab 1 litre = 15 kms distance veltundi package cabs ravali.

8rs-10rs/km cabs ni rent ki ivali

If 100 kms total up and down ayithe 800rs charge cheyali AP tourism

4 seats ante per km 2rs charging per customer so no issues

Mini buses kuda start cheyali appude use

Link to comment
Share on other sites

కృష్ణా నదిలో అడ్వంచర్ స్పోర్ట్స్ ప్రారంభం
 
water-sports-vijayawada-07122016.jpg

APTDC చైర్మెన్ జైరాం రెడ్డి, కృష్ణానదిలో అడ్వంచర్ వాటర్ స్పోర్ట్స్ బుధవారం ప్రారంభించారు. సింపుల్ ఇండియా పైవేట్ లిమిటెడ్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. పర్యాటక శాఖ చైర్మన్ జయరామరెడ్డి, ఎండీ గిరిజాశంకర్, సింపుల్ వాటర్ స్పోర్ట్స్ సంస్థ ఈడీ తరుణ్ కాకాని పరంభోత్సవలో పాల్గున్నారు. ఇప్పటికే సింపుల్ ఇండియా సంస్థ మచిలీపట్నం, రాజమండ్రిలో అడ్వంచర్ వాటర్ సోర్స్ నిర్వహిస్తోంది.

ఈ అడ్వంచర్ వాటర్ స్పోర్ట్స్, భవానీ ఐలాండ్, పన్నమి ఘాట్, సీతానగరం, కృష్ణవేణి మోటెల్ నుంచి నిర్వహిస్తారు. వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ లో భాగంగా ఉపయోగించే బోట్లను ఫ్లోరిడా, యూఎస్ఏల నుంచి దిగుమతి చేసుకుంది, సింపుల్ ఇండియా.

లివింగ్ స్టోన్ క్రూయిజ్ బోటు, పోర్జా బోటు, హోబీ కాయాకాస్ తో పాటు స్పీడ్ బోటు కూడా ఉన్నాయి. మొత్తంగా 25 వివిధ రకాల బొట్లు ఉన్నాయి. ఈ తరహా బొట్లు భద్రతా పరంగా కూడా అత్యున్నతమైనవిగా చెబుతున్నారు

Link to comment
Share on other sites

పర్యాటక ప్రాంతంగా కృష్ణానదీ తీరం
 
636167739491024197.jpg
విద్యాధరపురం(విజయవాడ) : విజయవాడ నగరంలోని కృష్ణానదీ తీరాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ జయరామిరెడ్డి అన్నారు. బుధవారం భవానీపురం పున్నమి ఘాట్‌ వద్ద ఏపీ టూరిజం, వాటర్‌ స్పోర్ట్స్‌ సింపుల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న వాటర్‌ స్పోర్ట్స్‌ బోట్లను జయరామిరెడ్డి, సంస్థ ఎండీ గిరిజాశంకర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా చైర్మన జయరామిరెడ్డి మాట్లాడుతూ నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భవానీ ఐలాండ్‌కు వచ్చే పర్యాటకులకు ఆనందం, ఆహ్లాదం, సంతోషం కలిగించేందుకు వాటర్‌ స్పోర్ట్స్‌ బోట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. దక్షిణ భారతదేశంలో అరుదుగా కనిపించే రకరకాల బోట్లను వాటర్‌ స్పోర్ట్స్‌ ఇండియా పున్నమి ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిందని, నవ్యాంధ్రప్రదేశలో ఈ వాటర్‌ స్పోర్ట్స్‌ ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి బోట్లను రానున్న రోజుల్లో మరికొన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గిరిజాశంకర్‌ మాట్లాడుతూ నవ్యాంధ్రలో యువతకు, పిల్లలకు కొత్తరకం ఆహ్లాదాన్ని అందించాని వినూత్నంగా వాటర్‌ స్పోర్ట్స్‌ని ప్రారంభించినట్టు తెలిపారు. వాటర్‌ స్పోర్ట్స్‌ సింపుల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తరుణ్‌కాకాని మాట్లాడుతూ వాటర్‌ స్పోర్ట్స్‌ బోటులు అత్యాధునిక టెక్నాలజీతో తయారైనవని, వీటితో ఆహ్లాదంతో పాటు భద్రతను దృష్టిలో పెట్టుకుని డిజైన చేసినట్టు చెప్పారు. సుశిక్షితులైనవారు ఈ వాటర్‌ స్పోర్ట్స్‌ బోట్లను నడుపుతారని, గజ ఈతగాళ్లు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఫౌండేషన సీఈఓ ఆర్‌.విజయ్‌కుమార్‌, సీఐఐ వైస్‌ చైర్మన జేఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, పర్యాటక వాటర్‌ స్పోర్ట్స్‌ జనరల్‌ మేనేజర్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

పర్యాటకం ..దేద్వీపం
 
636170405939523210.jpg
  • భవానీ ఐల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన ఏర్పాటు
  • సీఈవోగా హిమాన్షు శుక్లా
  • రూ.50 కోట్ల నిధుల కేటాయింపు
  • పలు సూచనలు అందిస్తున్న పర్యాటకులు
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : భవానీ ద్వీపంతో పాటు సమీపంలోని దీవులన్నింటినీ పర్యాటకంగా అభివృద్ధి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బీఐటీసీను ఏర్పాటు చేసిందే. ఈ కార్పొరేషనకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా ఐఏఎస్‌ అధికారి హిమాన్షు శుక్లాను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేషనకు రూ.50 కోట్ల నిధులను కూడా సర్దుబాటు చేసింది. కార్పొరేషన ప్రధాన కార్యాలయం ఎక్కడ అనేది ఇంకా స్పష్టత రాలేదు. పర్యాటకశాఖ (ఏపీ టూరిజం), పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కార్యాలయాలు ఆటోనగర్‌లో ఉన్నాయి. హిమాన్షు శుక్లా ప్రస్తుతం పర్యాటకశాఖలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ బాధ్యతలతో పాటు భవానీ ఐల్యాండ్‌ టూరిజం కార్పొరేషన కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బీఐటీసీ బాధ్యతలు సమర్ధంగా నిర్వహించాలంటే స్థానికంగా ఉంటేనే బాగుంటుంది. హరిత బెర్మ్‌పార్క్‌లో కార్యాలయం ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా నూతన సీఈఓ ఆలోచన చేయాల్సి ఉంది.
 
రోడ్‌మ్యాప్‌ అవసరం..
భవానీ ద్వీపాన్ని సింగపూర్‌ సెంతోసా తరహాలో అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పంగా ఉంది. దీంతో పాటు ఇతర దీవుల అభివృద్ధికి బీఐడీసీ నిర్దిష్ట రోడ్‌మ్యాప్‌కు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. రాజధాని అభివృద్ధిలో భాగంగా స్విస్‌ చాలెంజ్‌ విధానం కొలిక్కి వచ్చిన తర్వాత.. పర్యాటకంగా కూడా అభివృద్ధికి ప్రణాళికలు జరుగుతాయి. 2009లో వచ్చిన భారీ వరదలకు కాటేజీల గ్రౌండ్‌ ఫ్లోర్‌ అంతా వరదలో చిక్కుకుంది. వరదపోయిన తర్వాత భవానీ ఐల్యాండ్‌ అస్తవ్యస్తంగా ఉంది. బండ్‌ కొట్టుకు పోయింది. ఇసుక పెద్ద ఎత్తున పోగు పడింది. కాటేజీలు పాడైంది. కాటేజీల అభివృద్ధికి ప్రతి పాదనలు ఎప్పుడు చేసినా.. పెద్దగా ఆమోదం వచ్చేది కాదు. ద్వీపంలో 28 కాటేజీలు ఉన్నాయి. వీటిలో సింహభాగం ఏసీ కాగా, మిగిలినవి నాన ఏసీ కాటేజీలు . నాలుగు ట్రీ టాప్‌ కాటేజీలు ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు టేకుతో తయారు చేసినవి. వరదలకు దెబ్బతినటంతో ఇనుప మెటీరియల్‌తో వీటిని బలోపేతం చేయటంతో పాటు అత్యాధునీకరించటానికి వీలుగా పదేపదే ప్రతిపాదనలు పంపిస్తే కేవలం ఎనిమిది కాటేజీల అభివృద్ధికి మాత్రమే నిధులు మంజూరయ్యాయి. కాటేజీల ద్వారా ఏపీటీడీసీకి చక్కటి ఆదాయం వస్తోంది. బోటింగ్‌ యూనిట్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
  • కృష్ణానదిలో విస్తారమైన ఏపీటీడీసీ బోటింగ్‌ పాయింట్స్‌ ఉన్నాయి. ఏపీటీడీసీకి భారీ బోట్లు ఉన్నాయి కానీ, వాటర్‌ స్పోర్ట్స్‌ క్రూయిజర్స్‌ లేవు. ప్రైవేటు విధానంలో కాకుండా కార్పొరేషన తరఫున బోటింగ్‌ నిర్వహించే అవకాశాన్ని కల్పించాల్సి ఉంది. భవానీ ఐల్యాండ్‌ 120 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. కేవలం 40 ఎకరాల లోపు మాత్రమే వినియోగంలో ఉంది. మిగిలిన ప్రాంతాన్ని కూడా వినియోగంలోకి తీసుకు రావాల్సి ఉంది. గార్డెన్స, అందమైన లాన్స వంటివి అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అడ్వెంచర్‌ గేమ్స్‌కు భవానీ ద్వీపం మంచి వేదికగా ఉంటుంది.
  • భవానీ ఐల్యాండ్‌ ఇప్పటివరకు పేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉంది. ఇక మీదట కూడా అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కార్పొరేషన మీద ఉంది. పీపీపీ విధానంలో అవకాశాలు దక్కించుకున్న సంస్థలు ఉన్నత వర్గాలనే దృష్టిలో ఉంచుకుని భారీ రేట్లను నిర్దేశిస్తున్నాయి. ప్రైవేటు సంస్థల దోపిడీని నిలువరించి.. ప్రభుత్వం నేతృత్వంలో వీలైనంత వరకు పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
కుటుంబసభ్యులతో బోటు షికారు చేసిన చంద్రబాబు
 
636184651776251595.jpg
విజయవాడ : ఎడతెరిపిలేని బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కాసేపు సేదతీరారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణానదిలో బోటులో విహరించారు. కుమారుడు లోకేష్, మనవడు దేవాన్ష్‌తో కలిసి షికారు చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...