Jump to content

benz circle flyover & vijayawada -bandar highway


sonykongara

Recommended Posts

  • Replies 308
  • Created
  • Last Reply

బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌కు 5 డిజైన్లు
విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద నిర్మించే ఫ్లైఓవర్‌ డిజైన్‌పై రెండ్రోజుల్లో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని సీఎం ఈ సమావేశంలో పేర్కొన్నారు. అధికారులు ఐదు డిజైన్లను చూపించగా సీఎం సంతృప్తి చెందలేదు. ఈ ఫ్లైఓవర్‌ నగర సౌందర్యాన్ని పెంచేదిగా ఉండాలన్నారు. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని ముందే చెప్పినట్లు ఆగస్టు 15వ తేదీకి పూర్తిచేయాలని ఆదేశించారు. విజయవాడ-ఏలూరు మధ్య జాతీయ రహదారి-16కు తక్షణం మరమ్మతులు నిర్వహించాలన్నారు.

Link to comment
Share on other sites

అమరావతికి ముఖ ద్వారంగా, బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం

 

 
benz-circle-flyover-09022017.jpg

బెంజిసర్కిల్ వద్ద నిర్మించబోతున్న ఫ్లైఓవర్ ను ఇంటిగ్రేటెడ్ ఫ్లైఓవర్ గా మార్పు చేయడానికి సర్కారు నిర్ణయించింది. ఫ్లైఓవర్ ను చూసి అంతా అబ్బురపడేలా డిజైన్ లో మార్పులకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. కాంట్రాక్టు సంస్థ దిలీప్ బిల్డ్ కాన్ ఇప్పటికే మట్టి నమూనాల విశ్లేషణ కోసం ఆరు చోట్ల శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్ పంపింది. నివేదిక వచ్చాక పనులు చేపట్టే అవకాశమున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిజైన్ లో మార్పులు చేపట్టాలని సూచించారు.

విజయవాడ నగరంలో అత్యంత రద్దీగల ప్రాంతం బెంజిసర్కిల్, ఈ కూడలి మీదుగా జాతీయ రహదారి 16 (చెన్నై- కోల్కతా) వెళుతుంది. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలు ఈ కూడలి దాటాల్సిందే. కనీసం 80 నుంచి 90 వేల వాహనాలు ఇక్కడ తిరుగుతాయి అని అంచనా. ఇదే కూడలికి బందరు నుంచి వచ్చే రహదారి కలుస్తుంది. దీంతో అక్కడ నిత్యం ట్రాఫిక్ కష్టాలే. ఈ కూడలి దాటాలంటే కనీసం 30 నిమిషాలు పడుతుంది. అమరావతి రాజధాని కావటం, భవిషత్తు అవసరాలు పరిగణలోకి తీసుకుని, అక్కడ ఫైఓవర్ నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది.

 

అమరావతికి ముఖ ద్వారంగా, ఫ్లైఓవర్ నిర్మాణం

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంగా విజయవాడ గుర్తింపు పొందడం, జనాభా పెరగడం, భవిష్యత్తులో మహా నగరంగా విస్తరించనున్న నేపథ్యంలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఫైఓవర్ నగరానికి ఓ మణిహారంగా ఉండేలా నిర్మించాలని ప్రభుత్వ భావిస్తోంది. అందువల్లే డిజైన్లను మార్చడానికి సిద్ధమైంది. అనతర్జాతీయ స్థాయిలో డిజైన్ ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం తన నిర్ణయాన్ని వెల్లడించారు.

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ఎంత దూరం ఉండాలన్న దానిపై ఇప్పటికి రెండుసార్లు మార్పులు జరిగాయి. మొదట్లో 200 మీటర్లుగా నిర్ణయించిన ఫ్లైఓవర్‌ను ఆ తర్వాత 600 మీటర్లకు పొడిగించారు. ఎంపీ కేశినేని నాని కృషితో మరో 800 మీటర్లకు పొడిగించారు. దీంతో మొత్తం 1.4 కిలోమీటర్ల మేర బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి నూతన డిజైన్‌ రూపొందించాల్సి ఉంది.

Link to comment
Share on other sites

బెంజ్‌సర్కిల్ ప్లై ఓవర్‌కు సరికొత్త డిజైన్
 
636245517364694172.jpg
బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సరికొత్త డిజైన్ రూపుదిద్దుకుంటోంది. అత్యంత సుందరంగా కనిపించేలా ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఫ్లై ఓవర్‌ నిర్మాణం జరగనుంది. రెండు వంతెనలుగా ఫ్లై ఓవర్‌ను తీర్చిదిద్దనున్నారు. మంగళవారం రాత్రి జాతీయ రహదారుల శాఖ, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జరిపిన సమీక్షా సమావేశంలో ఫ్లై ఓవర్‌ నూతన డిజైన్లకు సంబంధించి వీడియో ఎఫెక్ట్స్‌ ప్రజంటేషనను వీక్షించి, పలు సూచనలు చేశారు.

విజయవాడ : బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సరికొత్త డిజైన్ రూపుదిద్దుకుంటోంది. బెంజిసర్కిల్‌ ఒక ఐకానిక్‌గా అత్యంత సుందరంగా కనిపించేలా ఉండాలన్న సీఎం చంద్రబాబు అకాంక్ష మేరకు ఫ్లై ఓవర్‌ నిర్మాణం జరగనుంది. బెంజిసర్కిల్‌ దగ్గర రెండు వంతెనలలుగా ఫ్లై ఓవర్‌ను అందంగా తీర్చిదిద్దబోతున్నారు. మంగళవారం రాత్రి జాతీయ రహదారుల శాఖ, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు జరిపిన సమీక్షా సమావేశంలో బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ నూతన డిజైన్లకు సంబంధించి వీడియో ఎఫెక్ట్స్‌ ప్రజంటేషనను వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్లై ఓవర్‌ కింద, పైన ఎక్కడ పడితే అక్కడ.. అవకాశం ఉన్న ప్రతి చోట పచ్చదనంతో కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
 
జాతీయ రహదారుల సంస్థ (ఎనహెచ) రూపొందించి ఇచ్చిన ఐదు ప్రతిపాదిత డిజైన్లలో ముందుగా ఎంపిక చేసిన డిజైనకే సీఎం ఇంతకు ముందు పలు మార్పులకు ఆదేశించిన సంగతి తెలిసిందే. నూతన డిజైన ప్రకారం బెంజిసర్కిల్‌ కూడలి దగ్గర రెండు బ్రిడ్జిలు వస్తాయి. ఈ రెండు బ్రిడ్జిలు కర్వ్స్‌గా ఒంపులు తిరిగిఉంటాయి. కన్సల్‌టెంట్‌ సంస్థ మొత్తం 618 మీట్లకు పొడవుతో కూడిన ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి వీడియో ఎఫెక్ట్స్‌ ప్రదర్శించారు. వీటి పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. మార్పులకు ఇంకా ఆమోద ముద్ర పడలేదు. మరోవిడత నిర్వహించే సమీక్షలో నూతన డిజైన్‌‌కు అమోద ముద్ర వేసే అవకాశం ఉంది.
 
నాలుగులేన్ల విస్తరణకు రూ.740.70 కోట్లు
నగరానికి ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ - మచిలీపట్నం నాలుగులేన్ల రోడ్డుకు సంబంధించి తుది అంచనా వ్యయాన్ని జాతీయ రహదారుల సంస్థ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర వివరాలను సీఎం చంద్రబాబు దృష్టికి జాతీయ రహదారుల సంస్థ అధికారులు తీసుకు వెళ్ళారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నాలుగు మేజర్‌ బ్రిడ్జిలు, ఐదు మైనర్‌ బ్రిడ్జిలు, ఐదు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు, అవసరమైన చోట కల్వర్టులు నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా ఎనహెచ పీడీ సురే్‌షకుమార్‌, సీఎం దృష్టకి తీసుకు వచ్చారు.
 
Link to comment
Share on other sites

 

 


amaravati Hanging iconic  Bridge kuchipudi  design ni kuda ok chesaru anata.

 

CBN kavalani venkatapalem flyover meda koncham calm ga unadu till now except once in while reviews..

 

NHAI given report that Benz circle flyover is not required if Venkatapalem is done. Also Kanakadurga varadhi to Capital SEED road via manipal hospital,tadapalli also there are objections if Venkatapalem is done.

 

CBN wanted ALL for future. Otherwise it's not easy to get them done later.

 

So first he targeted BENZ flyover and then given proposal to Gadkari/NHAI to bear "ICON bridge" extra cost for design change(250+ or so roughly extra).

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...