Jump to content

benz circle flyover & vijayawada -bandar highway


sonykongara

Recommended Posts

  • Replies 308
  • Created
  • Last Reply
డెడ్‌లైన్‌ మే 15
11-03-2019 09:36:34
 
636878937951726792.jpg
  • ఎన్‌హెచ్‌65 విస్తరణ, బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పూర్తి చేయాల్సిందే
  • బెంజిసర్కిల్‌ - కానూరు విస్తరణ యుద్ధప్రాతిపదికన జరగాలి
  • కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ను అప్రమత్తం చేసిన ఎన్‌హెచ్‌ అధికారులు
  • కంకిపాడు, పామర్రు బైపాస్‌ పనులు వేగవంతం చేయాలి
  • అప్రోచ్‌ పనులతో పాటు నోవాటెల్‌ హోటల్‌ పాస్‌ మూసివేత
 
విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ, బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులను పూర్తి చేయటానికి జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌), కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌కు డెడ్‌లైన్‌ విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశించిన గడువు లోపు రెండింటిని పూర్తి చేయటానికి యాక్షన్‌ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. బెంజిసర్కిల్‌ నుంచి కానూరు వరకు యుద్ధ ప్రాతిపదికన విజయవాడ నగర పోర్షన్‌ విస్తరణ పనులు చేపట్టడానికి సంసిద్ధంగా ఉండాలంటూ కాంట్రాక్టు సంస్థను, ఎన్‌హెచ్‌ అప్రమత్తం చేసింది. కంకిపాడు, పామర్రు బైపాస్‌ పనుల్లో వేగం తీసుకువచ్చి గడువు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో కాంట్రాక్టు సంస్థ పనులను వేగవంతం చేయటానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ - మచిలీపట్నం నాలుగు వరసల రోడ్డు విస్తరణ, బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల తాజా పరిస్థితిపై కథనం.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ-మచిలీ పట్నం, బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణాలకు సం బంధించి ఇప్పటి వరకు నెలకొన్న జాప్యాన్ని నివా రించటానికి జాతీయ రహదారుల సంస్థ రంగంలోకి దిగింది. కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌ కాన్‌ తమకు మరో నాలుగు నెలల సమయం కావాలని చేసిన ప్రతిపాదనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం ఇప్పటివ రకు తీసుకోలేదు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పను లు పూర్తిచేయటంలో జాప్యం జరుగుతోంది. ఈ నేప థ్యంలో కాంట్రాక్టు సంస్థ వేగంగా పనులు చేపట్టేందుకు జాతీయ రహదారుల సంస్థ డెడ్‌ లైన్‌ నిర్దేశించింది. మే 15 నాటికి పనులు పూర్తి చేయా లని స్వయంగా డెడ్‌లైన్‌ను నిర్ణయించింది.
 
విజయవాడ - మచిలీపట్నం రోడ్డు విస్తరణపై అప్రమత్తం
విజయవాడ - మచిలీపట్నం నాలుగు వరసల రోడ్డు విస్తరణకు సంబంధించి నగర పోర్షన్‌లో బెంజి సర్కిల్‌ నుంచి కానూరు వరకు విస్తరణ పనులను ప్రారంభించటానికి కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌ కాన్‌ ఏ క్షణంలో అయినా సంసిద్ధంగా ఉండాలని జాతీయ రహదారుల సంస్థ అప్రమత్తం చేసింది. విజయవాడ పోర్షన్‌ పను లను చేపట్టడానికి ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆక్రమణల తొలగింపు పనులను యుద్ధ ప్రాతి పదికన చేపట్టాల్సి ఉంటుందని అప్రమత్తం చేసింది. విజయవాడ నగర పోర్షన్‌లో బెంజిసర్కిల్‌ నుంచి కానూరు వరకు భవ నాల యజమానులకు నష్ట పరిహారాన్ని నగదుగా అందించ లేని పరిస్థితిలో విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఉంది. దీంతో టీడీఆర్‌ బాండ్లు ఇవ్వటానికి మునిసిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఇటీవలే భవన యజమానులతో కార్పొరేషన్‌ అధి కారులు సమావేశం నిర్వహించి బాండ్లు ఇస్తామని చెప్పారు. భవన యజమానుల నుంచి కూడా దాదాపుగా సానుకూలంగానే స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, ఎన్‌హెచ్‌ ఉన్నతాఽ దికారుల దృష్టికి తీసుకు వచ్చారు. బెంజిసర్కిల్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు 120 అడుగులు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి కానూరు వరకు 100 అడుగుల రోడ్డుగా విస్తరించటానికి వీలుగా భవ నాల తొలగింపునకు మార్కింగ్‌ చేపట్టారు. ఈ క్రమం లో భవనాల తొలగింపు పనులను చేపట్టవలసి ఉంది.
 
 
 బైపాస్‌ పనులు వేగవంతానికి ఆదేశం
విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్‌- 65 నాలుగు వరసల రోడ్డు విస్తరణలో ప్రధానమైన బైపాస్‌ పను లు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. వీటిలో ముఖ్యంగా కంకిపాడు, పామర్రు బైపాస్‌లను పూర్తి చేయటా నికి అన్ని ఇబ్బందులు తొలిగాయి. పనులు మాత్రం నత్తనడకన జరుగుతున్నాయి. పామర్రు బైపాస్‌కు సంబంధించి మరో రెండు బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చే యాలని కాంట్రాక్టు సంస్థను ఎన్‌హెచ్‌ నిర్దేశించింది.
 
బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ అప్రోచ్‌లకు కార్యాచరణ
బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌కు సంబంధించి ప్రధానమైన వయాడక్ట్‌ నిర్మాణం పూర్తయింది. ఒకే ఒక్క శ్లాబు పని మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో శ్లాబు పనిని త్వ రగా పూర్తి చేయాలని ఆదేశించింది. వయాడక్ట్‌కు రెం డు వైపులా అనుసంధానంగా అప్రోచ్‌లను నిర్మిం చాలి. అప్రోచ్‌ల నిర్మాణంతో పాటు సర్వీసు రోడ్డును కూడా విస్తరించాలి. సర్వీసు రోడ్డు విస్తరణకు సంబం ధించి ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ వైపు, రమేష్‌ హాస్పిటల్స్‌ జంక్షన్‌ వైపు భూముల అవసరం ఉండగా.. యజ మానులతో చర్చించారు. ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ వైపు భూ, భవన యజమానులంతా అంగీకార పత్రాలు ఇచ్చారు. రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌వైపు కొందరు మాత్రమే అంగీకార పత్రాలు ఇచ్చారు. వారి నుంచి కూడా త్వరగా తీసుకుని పరిహారం ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఎన్‌హెచ్‌ చూస్తోంది. ఈ పనులను కూడా మే 15వ తేదీ నాటికి పూర్తి కావ టానికి చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్దేశించింది.
 
 
నోవాటెల్‌ హోటల్‌ వైపు పాస్‌ మూసివేత
రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌వైపు అప్రోచ్‌ పనుల సందర్భంగా నోవాటెల్‌ హోటల్‌ వైపు జాతీయ రహదారికి ఇచ్చిన పాస్‌ను మూసివేయాలని ఎన్‌హెచ్‌ భావిస్తోంది. ఎన్‌హెచ్‌ అనుమతి లేకుండా ఈ ప్రాంతంలో పోలీసుశాఖ పాస్‌ ఇచ్చింది. హోటల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో ఈ పాస్‌ను ఇచ్చారు. తర్వాత దీనిని మూసి వేయలేదు. ఈ పాస్‌ను మూసివేయటానికి పోలీసులు ట్రాఫిక్‌ సమస్య గురించి చెబుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అప్రోచ్‌ దిగే ప్రాంతంలో పాస్‌ ఉంటే ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్‌ ఇబ్బందులు వస్తాయని ఎన్‌హెచ్‌ భావిస్తోంది. అప్రోచ్‌ పనులతో పాటే అదే సందర్భంలో పాస్‌ను కూడా మూసి వేయించాలని ఎన్‌హెచ్‌ భావిస్తోంది.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...
బెంజ్‌ ఫ్లై వోవర్‌ డెడ్‌లైన్‌ మే 20
18-04-2019 07:24:40
 
636911690896462414.jpg
  • అప్రోచ్‌ పనులు ప్రారంభం
  • సర్వీసు రోడ్డు విస్తరణకు శ్రీకారం
  • భూ పరిహారం చెల్లింపుపై నిర్ణయం
నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలకు త్వరలోనే చెక్‌ పడనుంది. ప్రజల చిరకాలవాంఛగా రూపొందుతున్న బెంజిసర్కిల్‌ ఫ్లైవోవర్‌ నిర్మాణపనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. నగరానికి మణిహారంగా భావించే ఈ పై వంతెనను మే 20 నాటికి పూర్తిచేయాలని డెడ్‌లైన్‌ విధించింది. గడువులోపే పూర్తిచేసి అప్పగిస్తామని కాంట్రాక్ట్‌ సంస్థ కూడా హామీ ఇచ్చింది.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లలో ఒకటైన బెంజ్‌ ఫ్లై ఓవర్‌ మే 20 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది. ఈ ఫ్లైఓవర్‌ను పూర్తి చేసేందుకు డెడ్‌లైన్‌ మే 20గా జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) నిర్దేశించింది. ఈ గడువు లోపే పూర్తిచేసి అప్పగిస్తామని కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌ కాన్‌ కూడా స్పష్టం చేసింది. దీంతో నూతన ప్రభుత్వం కొలువు తీరే నాటికే పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి పాలన సాగించే నాటికి బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ కిందభాగంలో సర్వీసు రోడ్డు పనులు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ముస్తాబు చేయాలన్న లక్ష్యంతో ఎన్‌హెచ్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు.
 
ఎప్పుడెప్పుడా ? అని ఎదురు చూస్తున్న బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ మరో నెల రోజులలో పూర్తి కాబోతోంది. జాతీయ రహదారుల సంస్థ, కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌కు మే 20 లోపు పూర్తి చేయాలని డెడ్‌లైన్‌ను విధించింది. బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ప్రస్తుతం వయాడక్ట్‌ నిర్మాణం పూర్తయింది. ఫ్లై ఓవర్‌కు మధ్యమధ్యలో ఒకటి రెండు చోట్ల సైడ్‌వాల్స్‌ తప్ప దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. అప్రోచ్‌ పనులే మిగిలి ఉన్నాయి. పక్షం రోజులుగా రెండువైపులా అప్రోచ్‌ పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి కొంత జాప్యం జరిగినప్పటికీ ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. సోమవారం నుంచి పతాక స్థాయిలో పనులు జరుగుతాయని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) పీడీ విద్యాసాగర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. అప్రోచ్‌ పనులు ఒక వైపు రమేష్‌ హాస్పిటల్స్‌ జంక్షన్‌ వైపు, ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ల వైపు సమాంతరంగా పనులు ప్రారంభించారు. క్వారీ డస్ట్‌ను మొదటగా డంప్‌ చేసి వదిలేయడం వల్ల పక్కనే ఉన్న రోడ్డు మీదకు కొట్టుకు వచ్చేస్తోంది. స్థానికంగా వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన వాల్‌ నిర్మాణ పనులు చేపట్టడంతో సమస్య తగ్గింది. వాల్‌ నిర్మాణ పనులను రెండువైపులా చేపడుతున్నారు. సిమెంట్‌ అచ్చులను తీసుకువచ్చి ఒకదాంట్లో మరొకదానిని ఇరికిస్తున్నారు. అప్రోచ్‌ వాల్స్‌ పనులు 35 - 40 శాతం మేర జరిగాయి. మధ్యలో ఎర్త్‌ ఫిల్లింగ్‌ పనులు మిగిలి ఉన్నాయి. సోమవారం నుంచి ఈ పనుల మీదనే దృష్టి సారించనుంది.
 
భూ పరిహారం చెల్లింపుపై త్వరలో నిర్ణయం
బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌తో పాటుగా దిగువన సర్వీసు రోడ్డు విస్తరించే విషయంలో కూడా ఈ నెలాఖరు లోపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్‌వీఎస్‌, రమేష్‌ హాస్పిటల్స్‌ జంక్షన్స్‌ వైపు రోడ్డు వెంబడి ఉన్న భవనాలను సర్వీసు రోడ్డు కోసం కొంత మేర తొలగించాల్సి వస్తోంది. ఈ క్రమంలో నెల రోజుల కిందట భూ సేకరణ నోటీసును కూడా ఇవ్వటం జరిగింది. జాతీయ రహదారుల సంస్థ ఇప్పటికే రెండువైపులా ఎంత వరకు భూమి అవసరమో పెగ్‌మార్కింగ్‌ చేసింది. రెవెన్యూ శాఖ సర్వే నిర్వహించింది. ఏ యజమానికి ఎంత భూమి పోతుందన్నదానిపై కూడా స్పష్టత వచ్చింది. భూ బాధితులంతా తమ భూములు ఇవ్వడానికి జాతీయ రహదారుల సంస్థకు అంగీకార పత్రాలు ఇచ్చారు. దీంతో భూమిని స్వాధీనం చేసుకోవడానికి , పరిహారాన్ని నిర్ణయించడానికి మార్గం సుగమమైంది. విజయవాడ సబ్‌ కలెక్టర్‌ నేతృత్వంలో భూ యజమానులు, రెవెన్యూ, ఎన్‌హెచ్‌ అధికారుల స్థాయిలో సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల వల్ల జాప్యమైంది. మరో వారం రోజులలో దీనిపై సబ్‌ కలెక్టర్‌ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...