Jump to content

benz circle flyover & vijayawada -bandar highway


sonykongara

Recommended Posts

  • Replies 308
  • Created
  • Last Reply
రోడ్డు విస్తరణకు యజమానుల సమ్మతి
09-11-2018 08:32:24
 
636773491461106132.jpg
 
(ఆంధ్రజ్యోతి, అమరావతి): విజయవాడలో కీలకమైన రోడ్లలో ఒకటైన బందరు రోడ్డు విస్తరణకు అవసరమైన భూములను ఇచ్చేందుకు అంగీకరించిన వారి సంఖ్య గురువారానికి మరింత పెరిగింది. ఈ విస్తరణ కారణంగా మొత్తం 193 ఆస్తులు ప్రభావితం కానుండగా, వాటి యజమానుల్లో ఇప్పటికి 106 మంది సీఆర్డీయేకు అంగీకార పత్రాలను అందజేశారు. వీరందరికీ ఆయా స్థలాల్లోని కట్టడాలను తొలగించాల్సిందిగా సూచించిన సీఆర్డీయే అధికారులు అలా చేసిన వాటిని క్రమంగా జాతీయ రహదారుల విభాగాధికారులకు స్వాధీనం చేస్తూ, విస్తరణకు మార్గాన్ని సుగమం చేస్తున్నారు. ఇప్పటికీ తమ స్థలాలను ఇవ్వాల్సి ఉన్న 87 మందికి వారంలోగా తమ డాక్యుమెంట్లు, అప్రూవ్డ్‌ ప్లాన్‌ కాపీలను సమర్పించాలని అధికారులు నోటీసులను జారీ చేస్తున్నారు.
 
విజయవాడ లోని మరొక ప్రధాన రహదారి అయిన మహానాడు రోడ్డు విస్తరణ వల్ల 103 మందికి చెందిన ఆస్తులు ప్రభావితమవుతుండగా వారిలో ఇప్పటి వరకు 83 మంది అంగీకార పత్రాలను ఇచ్చారు. మిగిలిన 20 మంది నుంచి పొందేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బందరు రోడ్డు, మహానాడు రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాలనిచ్చేందుకు అంగీకారపత్రాలను సమర్పించిన వారికి నిబంధనల ప్రకారం 1:4 నిష్పత్తిలో జారీ చేసే టీడీఆర్‌ బాండ్లను గురువారం సీఆర్డీయే డైరెక్టర్‌ కె.నాగసుందరి అందజేశారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంతో బందరు రోడ్డు విస్తరణ ప్రభావితులకు తొలి విడత, మహా నాడు రోడ్డు విస్తరణ బాధితులకు 2వ విడత బాండ్ల పంపిణీ ప్రారంభమైనట్లయింది. సీఆర్డీయే జోనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె.ధనుంజయరెడ్డి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గుమ్మడి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. విస్తరణకు అవసరమైన అంగీకారపత్రాల స్వీకరణ, నోటీసుల జారీ, ప్రభావితులను ఒప్పించే కార్యక్రమంలో జాతీయ రహదారుల విభాగం అధికారులతోపాటు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీలేఖ, కరుణకుమారి, వేంకటేశ్వర్లు, రుషేఖరరావు పాల్గొంటున్నారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
విజయవాడ బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌కు తొలగిన అడ్డంకి
31-12-2018 12:26:10
 
636818559708016239.jpg
  • సర్వీసు రోడ్డు, అప్రోచ్‌ విస్తరణకు స్థలాలు ఇవ్వడానికి యజమానుల సుముఖత
  • ఎన్‌హెచ్‌కు అంగీకార పత్రాలు
  • ‘బెంజి’సర్కిల్‌లో గడ్డర్ల ఏర్పాటు
ఆంధ్రజ్యోతి, విజయవాడ : బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ తుది దశ పనులకు అడ్డంకులు తొలగాయి! సర్వీసు రోడ్డు, అప్రోచ్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలాలు అప్పగించడానికి వాటి యజమానులు జాతీయ రహదారుల సంస్థకు అంగీకార పత్రాలు ఇస్తున్నారు. ప్రతిపాదిత సేకరణ జాబితాలో భవనాల కొలతలను ఆర్‌అండ్‌బీ బృందం సేకరించింది. రెండు రోజుల్లో రెవెన్యూ బృందం .. స్థల విస్తీర్ణంపై ఫీల్ట్‌ సర్వే చేయనుంది. జాతీయ రహదారి వెంట బెంజిసర్కిల్‌ జంక్షన్‌ దాటిన తర్వాత వేదిక కల్యాణ మండపం, సితార టవర్ల మీదుగా ఎస్వీఎస్‌ కళ్యాణ మండపం దాటే వరకు భూమిని సేకరించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న స్థలంలో అప్రోచ్‌ను పూర్తిగా నిర్మించలేని పరిస్థితి ఏర్పడుతోంది. సర్వీసు రోడ్డు, అప్రోచ్‌ కోసం ఎంత స్థలం అవసరమవుతుందో ఎన్‌హెచ్‌ మార్కింగ్‌ పనులు చేపట్టింది. వీటి వివరాలను ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ శాఖలకు అప్పగించారు. మొత్తం ఈ ప్రాంతంలో 25 మంది భవన, స్థల యజమానులు ఉన్నారు. వీరితో సంప్రదించి స్థల సేకరణ చేయాలని ఎన్‌హెచ్‌ నిర్ణయించింది.
 
యజమానుల నుంచి సానుకూల స్పందన
సంప్రదింపుల తర్వాత యజమానుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. భవన, స్థల యజమానులు నష్టపోకుండా ఉండడానికి జాతీయ రహదారుల సంస్థ ఐదేళ్లుగా ఈ ప్రాంతంలో నమోదైన అత్యధిక రిజిస్ర్టేషన్‌ విలువకు రెండు రెట్ల పరిహారాన్ని ఇవ్వాలని భావిస్తోంది. కొంతమంది పరిహారం పెంచాలని కోరుతున్నారు. ఈ అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. భవన, స్థల యజమానులు సుముఖంగా ఉండటంతో .. బెంజి సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ వయాడక్ట్‌ పూర్తి చేసే నాటికి సమాంతరంగా సర్వీసురోడ్డు, అప్రోచ్‌ పనులను కాంట్రాక్టు సంస్థ ‘దిలీప్‌ బిల్డ్‌ కాన్‌’తో చేయించాలని ఎన్‌హెచ్‌ అధికారులు భావిస్తున్నారు.
 
జంక్షన్లలో భారీ గడ్డర్లు
ఫ్లైఓవర్‌ దిగువన బెంజిసర్కిల్‌, నిర్మల, రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్లలో గడ్డర్ల ఏర్పాటుకు కాంట్రాక్టు సంస్థ పనులు ప్రారంభించింది. శనివారం అర్ధరాత్రి బెంజిసర్కిల్‌ జంక్షన్‌లో భారీ గడ్డర్ల ఏర్పాటును కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. రెండు రోజుల్లో బెంజిసర్కిల్‌ జంక్షన్‌లో గడ్డర్ల పని పూర్తి చేస్తుంది. తర్వాత నిర్మల కాన్వెంట్‌ జంక్షన్‌లో మూడు రోజుల్లో, చివరగా రమేష్‌ ఆస్పత్రి జంక్షన్‌లోమూడు రోజుల పాటు గడ్డర్ల ఏర్పాటు చేపడుతుంది. జంక్షన్ల వద్ద వీటి ఏర్పాటుతో ఫ్లై ఓవర్‌ వయాడక్ట్‌ పూర్తిగా అనుసంధా నమవుతుంది. సమాంతరంగా గడ్డర్లకు క్రాస్‌ బీమ్‌ల కోసం కాంక్రీట్‌ పనులతో పాటు శ్లాబ్‌ పనులు చేయనున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
ఇక మిగిలింది... అప్రోచ్‌ రహదారులే... 
 

భూసేకరణే కీలకం 
తుది దశకు బెంజి సర్కిల్‌ పైవంతెన

amr-gen1a_88.jpg

మరో రెండు నెలలు పెరిగిన గడువు 
ప్రాజెక్టు: బెంజి సర్కిల్‌ పైవంతెన 
అంచనా వ్యయం: రూ.82 కోట్లు 
పైవంతెన పొడవు: 1450 మీటర్లు 
వెడల్పు: మూడు వరసల రహదారి(20మీటర్లు) 
పిల్లర్లు: 49 
అప్రోచ్‌ రహదారి: 310మీ, 570మీ ఇరువైపులా 
నిర్మాణం పూర్తి: ఏప్రిల్‌ 30నాటికి

ఈనాడు అమరావతి

విజయవాడ నగర నడిబొడ్డున ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెంజి సర్కిల్‌ పైవంతెన నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఏప్రిల్‌ 30 నాటికి బెంజి సర్కిల్‌ పైవంతెన అందుబాటులోకి రానుంది. ఒకవైపు జాతీయ రహదారిపై వాహనాలు ఆటంకం లేకుండా రయ్యిమని దూసుకెళ్లనున్నాయి. ఇక మిగిలింది.. ఇరువైపులా అప్రోచ్‌ రహదారులను నిర్మాణం చేసి పైవంతెనకు అనుసంధానం చేయడమే తరువాయి. పైవంతెన స్లాబ్‌ల నిర్మాణం రెండు మినిహా మిగిలినవి పూర్తయ్యాయి. రాత్రింబవళ్లు పనులు చేస్తున్నారు. వాస్తవానికి 2019 జనవరిలో పైవంతెన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మరో నాలుగు నెలలు గడువు పొడిగించారు. ఏప్రిల్‌ చివరి నాటికి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంజి సర్కిల్‌ పైవంతెన నిర్మాణం పూర్తి చేస్తే ట్రాఫిక్‌ సమస్య చాలా వరకు తగ్గిపోనుంది. కీలకమైన కూడలి కావడంతో నిర్మాణంలో అనుకున్నంత వేగం పుంజుకోవడం లేదని అధికారులు అంటున్నారు. ట్రాఫిక్‌ మళ్లింపునకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో తరచూ ఇబ్బందులు  ఎదురవుతున్నాయి. మరో రెండు నెలలు సంయమనం పాటించాలని అధికారులు కోరుతున్నారు.

భూసేకరణకు అధికారుల కసరత్తు... 
పైవంతెన అప్రోచ్‌ రహదారుల నిర్మాణం మాత్రమే మిగిలిపోయింది. దీనికి భూసేకరణ కసరత్తు చేస్తున్నారు. చాలా తక్కువ మొత్తమే అయినా జాప్యం జరుగుతోంది. భూసేకరణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్వాసితులు భూమి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇంకా నిర్ణయించలేదు. బెంజిసర్కిల్‌ పైవంతెన ఒకవైపు పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. బందరు రహదారి విస్తరణలో భాగంగా దీని నిర్మాణం చేపట్టారు. దిలీప్‌కాన్‌ సంస్థ టెండర్‌ దక్కించుకుంది.మొత్తం రూ.740.70కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్యాకేజీ చేపట్టారు. తొలుత ఒప్పందం ప్రకారం 618మీటర్లు నిర్మాణం చేయాల్సి ఉంది. కానీ దీని దూరం పెంచాలని పలు దఫాలుగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. కానీ అంగీకరించలేదు. ఎట్టకేలకు ఎంపీలు విజ్ఞప్తి, సీఎం చంద్రబాబునాయుడు లేఖలతో 1450 మీటర్ల వరకు పొడింగించేందుకు అంగీకరించారు. కాంట్రాక్టు సంస్థతో జాతీయ రహదారుల సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పైవంతెన దూరం పెంచారు. దీని దూరం 1450 మీటర్లకు పెంచారు. బందరు రహదారి ప్యాకేజీలో భాగంగా 1450 మీటర్ల దూరం పైవంతెనను గుత్త సంస్థ ఒకవైపు మాత్రమే నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. దీనికి ఆకృతుల దృష్ట్యా రెండువైపులా వంతెన నిర్మాణం చేయాల్సి ఉంటుంది. పార్టు -1లో పైవంతెన నిర్మాణానికి సుమారు అంచనా వ్యయం రూ.82 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే, భూసేకరణ అవసరం లేకుండానే బెంజి సర్కిల్‌ పైవంతెన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రణాళికలు రూపొందించింది. సర్వీసు రోడ్లు 1.5 మీటర్ల చొప్పున కుదించుకుపోనున్నాయి. రాత్రి, పగలు నిర్మాణం చేయడంతో ఒక రూపు సంతరించుకుంది. మొత్తం 1450 మీటర్ల దూరం పైవంతెనలో 49 పిల్లర్లను నిర్మాణం చేశారు. ప్రస్తుతం రెండు స్లాబ్‌లు మినహా అన్నింటిని పూర్తి చేశారు. సాధారణ ఆకృతుల ప్రకారం పిల్లర్ల మధ్య నిడివి సుమారు 30 మీటర్లు ఉండాల్సి ఉంది. బెంజి సర్కిల్‌ జంక్షన్‌ వద్ద 42 మీటర్లు ఉండే విధంగా నిర్మాణం చేపట్టారు. బెంజి సర్కిల్‌ తరహాలోనే నిర్మల కాన్వెంట్‌, రమేష్‌ ఆసుపత్రి వద్ద పిల్లర్ల మధ్య దూరం పెంచాల్సి ఉంది సాధారణంగా ఎక్కడైనా పిల్లర్ల మధ్య సమాన దూరం ఉంటుంది. మొత్తం 240 గడ్డర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటికే 135 గడ్డర్లను ఏర్పాటు చేశారు. రాత్రిపూట ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కంకిపాడు సమీపంలో ఫ్యాబ్రికేటెడ్‌ పనులు చేస్తున్నారు. స్పాన్లు, గడ్డర్లను అక్కడ నిర్మాణం చేసి భారీ వాహనాలు, క్రేన్లతో వాటిని తరలించి నిర్మాణం చేస్తున్నారు. పైవంతెనకు రెండు వైపులా అప్రోచ్‌ రహదారి నిర్మాణం చేయాల్సి ఉంది. ఒకవైపు 310 మీటర్లు, మరోవైపు 570 మీటర్ల రహదారి ఉంటుంది.

జ్యోతి మహల్‌ వైపు (చెన్నై వైపు) 310 మీటర్ల అప్రోచ్‌ రహదారి ఉండాలి. దీనికి ఒకటో నెంబరు పిల్లర్‌ నుంచి సున్నా పాయింట్‌ వరకు రహదారి ఉంటుంది. దీని కోస ఇరువైపెలా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేయాల్సి ఉంది. దీన్ని ఇసుక లేదా గ్రావెల్‌తో నింపి రహదారి ఏర్పాటు చేయాలి. సిమెంట్‌ కానీ బీటీ రహదారి కాని నిర్మాణం చేయాల్సి ఉంది. 
జ్యోతి మహల్‌ వైపు ప్రస్తుతం ఒకటో నెంబరు పిల్లర్‌ తర్వాత ఫకీర్‌ గూడెం, పటమటలంకకు వెళ్లేందుకు జాతీయ రహదారి దాటేందుకు అనువుగా ఉంది. ప్రస్తుతం వాహనాలు అక్కడ అటు రోడ్డును క్రాస్‌ చేస్తుంటాయి. కానీ ప్రస్తుతం పైవంతెన అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం చేస్తే అక్కడ క్రాస్‌ చేసేందుకు అవకాశం లేదు. పైవంతెన అప్రోచ్‌ రహదారికి అండర్‌పాస్‌ వంతెన నిర్మాణం చేసే ప్రతిపాదన లేదు. దీంతో పటమటలంక వెళ్లేందుకు దారి దాదాపు మూసుకుపోనుంది. 
ఇక్కడ తమకు అండర్‌ పాస్‌ ఏర్పాటు చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. పటమటలంక మాత్రమే కాదు. అక్కడి నుంచి వాహనాలు పటమట మీదుగా రామలింగేశ్వర్‌నగర్‌, యనమలకుదురు మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రతిష్ఠంభన నెలకొంది. 
రెండో వైపు (ఏలూరువైపు) నోవాటెల్‌ దాటి అప్రోచ్‌ రహదారి వెళ్లింది. ఇటువైపు దాదాపుగా 570 మీటర్లు నిర్మాణం చేయాల్సి ఉంది. ఇక్కడ 49 పిల్లర్‌ తర్వాత రహదారి ప్రారంభం అవుతుంది. 49వ పిల్లర్‌ కూడా ఎత్తులోనే ఉంది. దీనికి రిటైనింగ్‌ గోడ నిర్మాణం చేసి రహదారి నిర్మాణం చేస్తారు. 
పైవంతెన 1450 మీటర్లు, చెన్నై వైపు 310 మీటర్లు, ఏలూరు వైపు 570 మీటర్లు వెరసి మొత్తం 2,330 మీటర్ల దూరం ఈ వెంతెన ఉంటుంది. ఇక్కడ రమేష్‌ ఆస్పత్రి కూడలి తర్వాత దీనికి అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేయడం లేదు. మొత్తం 510 మీటర్లు మూసుకుపోనుంది. 
రెండు వైపులా అప్రోచ్‌ రహదారుల నిర్మాణానికి నామమాత్రంగా 0.3 హెక్టార్ల భూసేకరణ అవసరం ఉంది. దీనికి నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. ఇంకా పరిహారం నిర్ణయించలేదు. దాదాపు 40 మంది నిర్వాసితులు ఉంటున్నారు. 
భూసేకరణకు నిర్వాసితులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కొన్ని భవనాలను తొలగించాల్సి ఉంది. దీనికి రహదారులు భవనాల శాఖ అంచనాలు వేయాల్సి ఉంది. ఇక్కడ సర్వీసు రహదారి విస్తరించాల్సి ఉన్నందున ఈ భూసేకరణ అవసరం. 
భూసేకరణకు అవసరమైన నిధులు జాతీయ రహదారుల సంస్థ భరించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఎంత ఖర్చు అవుతుందనేది ఇంకా నిర్ణయించలేదు. 
ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయాలు ఉండటంతో భూముల విలువ భారీగా ఉంది. దీంతో పరిహారం రూ.కోట్లలోనే ఉంటుందని అంచనా. వచ్చే నెలలో ఈప్రక్రియ పూర్తి చేస్తే నిర్మాణం ఒక నెలలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. 
ఇక బెంజి సర్కిల్‌ రెండో పార్టుకు రెండు సార్లు సర్వే చేసి రూ.110 కోట్లు అంచనాలు వేశారు. రెండోపార్టు కూడా 1450 మీటర్ల దూరం నిర్మాణం చేయాల్సి ఉంది. సమగ్ర వివరాలతో దస్త్రాన్ని పంపినా ఆర్థిక శాఖ ఇంకా ఆమోదం తెలపలేదని తెలిసింది. 
బెంజి సర్కిల్‌ పైవంతెన ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తామని జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ ఈనాడుతో చెప్పారు. భూసేకరణ కోసం కసరత్తు జరుగుతోందని, అవసరమైన భూమిని నేరుగా కొనుగోలు చేయాలని నిర్ణయించామని చెప్పారు.  రెండో పార్టుకు సంబంధించిన దస్త్రం ప్రాసెస్‌లో ఉందని వివరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...