Jump to content

benz circle flyover & vijayawada -bandar highway


sonykongara

Recommended Posts

  • Replies 308
  • Created
  • Last Reply
  • 1 month later...
Guest Urban Legend

A total of 272 trees have been transplanted for the first time in the state. The corporation for the first time took up tree transplantation and transplanted 272 trees which are going to be affected by the Benz Circle flyover works in Vijayawada.

Ddzt7cgUwAM7lMe.jpg

Link to comment
Share on other sites

9 hours ago, Urban Legend said:

A total of 272 trees have been transplanted for the first time in the state. The corporation for the first time took up tree transplantation and transplanted 272 trees which are going to be affected by the Benz Circle flyover works in Vijayawada.

Ddzt7cgUwAM7lMe.jpg

Great ? work 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
Guest Urban Legend

Main Phase of Benz Circle Flyover is Going to start Today/Tomorrow

- Placing of Viaduct's b/w Pillars

- Construction of Pillar No 9 & 10 Near Benz Circle Junction

- Approach Near Screw Bridge

- Underground Piling of all 49 Pillars Completed

- 30 Pillars Fully Completed with Caps

Link to comment
Share on other sites

Guest Urban Legend
2 minutes ago, Yaswanth526 said:

Avvadhu durga gudi flyover ithe goppa

benz circle works chaala speed ga jarugutunnayi ...

 

Link to comment
Share on other sites

బెంజి’కి వంతెన రూపు
11-06-2018 09:27:28
 
636643060600354922.jpg
  • రాత్రి 11 గంటలకు ట్రాఫిక్‌ డైవర్షన్‌
  • హైవేపై వన్‌వే అమలు
  • క్యాస్టింగ్‌ డిపో నుంచి ట్రాలీల మీద గడ్డర్ల తరలింపు
  • అర్ధరాత్రి తర్వాత 1-3 మధ్యలో గడ్డర్ల ఏర్పాటు
విజయవాడ (ఆంధ్రజ్యోతి): బెంజిసర్కిల్‌కు ‘కళ’ వచ్చింది! ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో ఇప్పటివరకు నిలువెత్తు పిల్లర్లే దర్శనమిచ్చాయి. తాజాగా పై వంతెన రూపు సంతరించుకోవటంతో బెంజిసర్కిల్‌కే అందంగా కనిపిస్తోంది. ఫ్లై ఓవర్‌ పిల్లర్లకు అనుసంధానంగా కీలకమైన వయాడక్ట్‌ నిర్మాణంలో భాగంగా గడ్డర్ల పనులను అర్ధరాత్రి కాంట్రాక్టు సంస్థ చేపట్టింది. ఇప్పటికి నాలుగు గడ్డర్లను అమర్చారు. ప్రతిరోజూ రెండు గడ్డర్ల చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు భారీ క్రేన్లతో అర్థరాత్రి సమయంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా గడ్డర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో తెల్లవారుఝామున చూసే సరికి కొత్తగా కనిపిస్తోంది. ఎస్‌వీఎస్‌ కళ్యాణమండపం దగ్గర పీ1-పీ2 పిల్లర్ల పై ప్రస్తుతం గడ్డర్ల ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి వరుసగా రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వరకు పిల్లర్ల మీద క్రమంగా గడ్డర్లను ఏర్పాటు చేసుకుంటూ వెళతారు. పెనమలూరులోని క్యాస్టింగ్‌ డిపో నుంచి నిర్దేశించుకున్న రూట్‌ ప్లాన్‌ ప్రకారం ట్రాలీలపై గడ్డర్లను బెంజిసర్కిల్‌కు తీసుకు వస్తున్నారు. రాత్రి 11గంటల ప్రాంతంలో ట్రాఫిక్‌ను హైవే ఒక వైపుకు పరిమితం చేస్తున్నారు. హైవేను వన్‌వే చేశారు. ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగలేదు. అర్ధరాత్రి తర్వాత 1-3 గంటల మధ్యన గడ్డర్లను ఏర్పాటు చేస్తున్నారు. బెంజిసర్కిల్‌ నిర్మాణానికి సంబంధించి మొత్తం 240 గడ్డర్లను అమర్చాల్సి ఉంది.
 
క్యాస్టింగ్‌ యార్డులో రెడీగా బిగించటానికి 150 గడ్డర్లు సిద్ధంగా ఉన్నాయి. క్యాస్టింగ్‌ డిపో నిండిపోవటంతో వీటి బిగింపుతో అక్కడ ఖాళీ అవుతున్నాయి. ఈ క్రమంలో మిగిలిన 90 గడ్డర్ల పనులను కూడా చేపడుతున్నారు. బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి మొత్తం 49పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికి మొత్తం 30 పిల్లర్లు ఏర్పాటు చేశారు. ఇంకా 19 పిల్లర్లు వివిధ దశలలో ఉన్నాయి. జూలై నెలాఖరుకు ఇవి పూర్తవుతాయి. బెంజిసర్కిల్‌ దగ్గర కీలకమైన రెండు పిల్లర్ల పనులు చేపట్టవలసి ఉంది. ఆగస్టు నాటికి ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం గడ్డర్ల పనులు ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ నుంచి ఆంంజనేయ టెంపుల్‌ వరకు జరుగుతాయి. తిరిగి మళ్ళీ బెంజిసర్కిల్‌ నుంచి రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వరకు జరుగుతాయి. రెండు పిల్లర్ల మధ్య గడ్డర్లను ఏర్పాటు చేయటం పూర్తికాగానే గడ్డర్లన్నింటినీ అనుసంధానించేలా కాంక్రీట్‌ బీమ్స్‌ పోస్తారు. ప్రస్తుతం పైకి ఎక్కించిన గడ్డర్లు పడిపోకుండా ఉండటానికి వీలుగా పెద్ద పెద్ద చెక్కలు, భారీ ఐరన్‌ రాడ్లతో గట్టి సపోర్టు ఇచ్చారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
రవేగంగా... గడ్డర్లెక్కిన... ‘బెంజ్‌’!
05-07-2018 10:21:36
 
636663828971320928.jpg
  • పక్షం రోజుల్లోనే ఎస్‌వీఎస్‌ - ఆంజనేయ టెంపుల్‌ వరకు గడ్డర్ల ఏర్పాటు
  • నిర్మలా రోడ్డు - బెంజిసర్కిల్‌ వరకు గడ్డర్ల ఏర్పాటు
  • గడ్డర్ల క్రాస్‌ కాంక్రీటింగ్‌ పనులు ప్రారంభం
  • ఫ్లై ఓవర్‌ స్లాబ్‌ పనులకు సమాయత్తం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
బెంజ్‌ సర్కిల్‌ పనులు ముమ్మరమయ్యాయి. జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. శరవేగంగా బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌పై గడ్డర్లెక్కుతున్నాయి. పక్షం రోజులలోనే బెంజిసర్కిల్‌ నుంచి ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ వరకు ఒక వైపు గడ్డర్ల ఏర్పాటును పూర్తి చేశారు. రెండోవైపు కూడా గడ్డర్ల పనులు ప్రారంభించారు. ఇవికూడా పురో గతిలో ఉన్నాయి. బెంజిసర్కిల్‌ దగ్గర ఆంజనేయ స్వామి గుడి నుంచి ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ వరకు పిల్లర్ల మీద గడ్డర్లు ఏర్పాటుచేశారు. ఒక్కో పిల్లర్‌ తల మీద ఐదు వంతున గడ్డర్లను ఏర్పాటుచేశారు. ఈ గడ్డర్లు కింద పడకుండా ,జారిపోకుండా ఉండటానికి కాంట్రాక్టు సంస్థ పటిష్ఠ చర్యలు తీసుకుంది. గడ్డర్‌ కదలకుండా ఉండటానికి రెండువైపులా తలల మీద భారీపరిమాణంలో ఉండే చెక్కలను ఏర్పాటు చేశారు. గడ్డర్‌ జారకుండా ఉండటానికి ఐరన్‌ రాడ్లతో బలంగా వాటిని నొక్కి పట్టే విధంగా ఏర్పాట్లు చేశారు.
 
ఫ్లై ఓవర్‌ వెంబడి హైవే ఉండటంతో వాహనాల రాకపోకలు విపరీతంగా ఉంటాయి కాబట్టి గడ్డర్లు కుంగకుండా ఉండటానికి ఈ ఏర్పాట్లను చేశారు. బెంజిసర్కిల్‌ నుంచి ఒక భాగంగా గడ్డర్ల ఏర్పాటు పూర్తికావటంతో ప్రస్తుతం గడ్డర్ల క్రాస్‌ కాంక్రీట్‌ పనులు చేపడుతున్నారు. రెండు పిల్లర్ల తలల మీద ఉండే ఐదు గడ్డర్లపై ఐదు క్రాస్‌ గడ్డర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. క్రాస్‌ గడ్డర్లను రెడీమేడ్‌గా తీసుకువచ్చేదేమీ ఉండదు. గడ్డర్‌ గడ్డర్‌ మధ్యన ఐరన్‌ తీగలు ముందుగానే వదిలి ఉంటాయి. వీటిని జాయింట్‌ చేసి, మరో ఐరన్‌ ఫ్రేమ్‌ దీనికి జతకోర్చి కాంక్రీట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు పిల్లర్ల తలల వైపు క్రాస్‌గడ్డర్‌ కాంక్రీట్‌ పనులు చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే గడ్డర్లకు సపోర్టుగా ఉంచిన రాడ్లతో పాటు చెక్క దిమ్మెలను కూడా తొలగిస్తారు. ఆ తర్వాత నిలువు గడ్డర్ల మధ్యన క్రాస్‌ గడ్డర్ల పనులు చేపడతారు.
 
బెంజిసర్కిల్‌ రెండోవైపు నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు నుంచి సర్కిల్‌ వరకు కూడా గడ్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజులలో ఈ పనులు కూడా పూర్తవుతాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు నుంచి ఐదవ నెంబర్‌ రూట్‌ దాటే వరకు పిల్లర్ల తలలపై గడ్డర్లను ఏర్పాటుచేస్తారు. ఐదవ నెంబర్‌ రూట్‌ నుంచి రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వరకు పిల్లర్ల పనులు చేపడుతున్నారు కాబట్టి ఇవి పూర్తయిన తర్వాత మిగిలిన గడ్డర్లను ఏర్పాటు చేస్తారు. మధ్యలో బెంజిసర్కిల్‌ దగ్గర రెండు పిల్లర్ల నిర్మాణంపై కాంట్రాక్టు సంస్థ దృష్టి సారించాల్సి ఉంది. వీటి పనులు పూర్తి చేసే లోపే రమేష్‌ హాస్పిటల్‌ వరకు కూడా పిల్లర్లు పూర్తవుతాయి. ప్రస్తుతం బెంజిసర్కిల్‌కు ఒక వైపు ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ వరకు ఫ్లై ఓవర్‌పై స్లాబ్‌ పనులు కూడా చేపడుతున్నారు. స్లాబ్‌ వేయటానికి వీలుగా ఐరన్‌ను తెప్పించారు. క్రాస్‌ గడ్డర్‌ కాంక్రీట్‌ పూర్తయిన తర్వాత నిలువు గడ్డర్లపై ఐరన్‌ ఫ్రేమింగ్‌ చేసి కాంక్రీట్‌తో స్లాబ్‌ పోస్తారు.
Link to comment
Share on other sites

నాలుగు నెలల్లో
బెంజి పైవంతెన నవంబరులో ప్రారంభానికి సిద్ధం
ఈనాడు, అమరావతి
విజయవాడ నడిబొడ్డులో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బెంజిసర్కిల్‌ పైవంతెన మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి రానుంది. వచ్చే నవంబరులో దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం మీద 50శాతం నిర్మాణం పూర్తయింది. వాస్తవంగా ఆగస్టునాటికి పూర్తి కావల్సి ఉంది. కానీ నవంబరులో పూర్తి చేయనున్నట్లు జాతీయ రహదారుల సంస్థ పథక సంచాలకుడు విద్యాసాగర్‌ ‘ఈనాడు’తో చెప్పారు. ఒకవైపు నిర్మాణం శరవేగంగా పూర్తవుతుండగా.. మరోవైపు వంతెన ఇంకా ప్రతిష్టంభనలోనే ఉంది. దీనికి కేంద్రం నుంచి పరిపాలన అనుమతి, ఆర్థిక శాఖ ఆమోదం రావాల్సి ఉంది. త్వరలో టెండర్లను పిలవనున్నట్లు పీడీ వెల్లడించారు. రెండో దశ అంచనా వ్యయం రూ.110 కోట్లుగా నిర్థరించారు. ఒకవైపు   పూర్తి చేసినా... చాలావరకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.
amr-top1a.jpg

చకచకా నిర్మాణం పనులు..!
దిలీప్‌కాన్‌ సంస్థ మొత్తం రూ.740.70 కోట్ల అంచనా వ్యయంతో పైవంతెనను నిర్మిస్తోంది. దీనికి కంకిపాడు సమీపంలో టోల్‌గేట్‌ ఏర్పాటు చేసి వినియోగ ఛార్జీలు వసూలు చేయనున్నారు. పైవంతెనకు సీఎం ఆలోచనలకు అనుగుణంగా సరికొత్త ఆకృతులతో ఉజ్జయనిలో ఉన్న పైవంతెన తరహాలో ఇక్కడ నిర్మాణం చేసేందుకు రూపొందించారు. జాతీయ రహదారికి పైభాగంలో రెండు వైపులా పైవంతెన రానుంది. కింది నుంచి వాహనాలు, పైనుంచి వాహనాలు వెళ్లే విధంగా ఆకృతులు రూపొందించారు. ఈ ఆకృతులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. రాష్ట్రంలో సరికొత్త తరహాలో నిర్మాణం చేసే వంతెనగా గుర్తింపు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే, భూసేకరణ అవసరం లేకుండానే బెంజి సర్కిల్‌ పైవంతెన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రణాళికలు రూపొందించింది. సర్వీసు రోడ్లు 1.5మీటర్ల చొప్పున కుదించుకుపోనుంది. మొత్తం ఆరు వరసల పైవంతెన రెండు వైపులా మూడు వరసలతో నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. దీనికి రూ.82 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆకృతుల ప్రకారం పైవంతెన 1.45 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయనున్నారు. జ్యోతిమహల్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌ వరకు పైవంతెన నిర్మాణం ఉంటుంది. అదనంగా 820 మీటర్లు పొడిగించారు.కొత్త ఆకృతుల ప్రకారం పైవంతెన రెండు భాగాలుగా ఉంటుంది. రాకపోకలకు విడిగా రెండు వంతెనలు సమాంతరంగా నిర్మాణం చేస్తారు. ఒక్క వంతెన మూడు వరసలతో నిర్మిస్తారు. ఒకవైపు దాదాపు 7.5మీటర్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం మనుగడలో ఉన్న జాతీయ రహదారి యథావిథిగా ఉంటుంది. డివైడర్‌ మినహా ఒకవైపు 7.5మీటర్లు చొప్పున ఆరు వరసల రహదారిగానే ఉంటుంది.

* 1450 మీటర్ల దూరం పైవంతెన నిర్మాణంలో 49 పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లర్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం గడ్డర్ల నిర్మాణం జరుగుతోంది.

* మొత్తం 240 గడ్డర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటికే 50 గడ్డర్లను ఏర్పాటు చేశారు. రాత్రిపూట ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

* కంకిపాడు సమీపంలో ఫ్యాబ్రికేటెడ్‌ పనులు చేస్తున్నారు. స్పాన్లు, గడ్డర్లను అక్కడ నిర్మాణం చేసి భారీ వాహనాలు, క్రేన్లతో వాటిని తరలించి అమరుస్తున్నారు.

రెండోదశపై ఇంకా ప్రతిష్టంభనే..!
బెంజిసర్కిల్‌ పైవంతెన రెండోదశపై  ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎలాంటి ప్రాజెక్టులోనూ తలెత్తలేదని అంటున్నారు. రెండో పార్టుకు రెండు సార్లు సర్వే చేసి రూ.110 కోట్లు అంచనాలు వేశారు. దీని మంజూరుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొత్తం 1450 మీటర్ల దూరానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చినట్లు ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ వెల్లడించారు. త్వరలో దీనికి టెండర్లను పిలవనున్నారు. ప్రస్తుతం నిర్మాణం చేస్తున్న వంతెన కోసం రెండు వైపులా 300 మీటర్ల వరకు భూసేకరణ జరపాల్సి ఉంది. దీనికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. త్వరలో ఇది పూర్తయితే అప్రోచ్‌ రహదారి నిర్మాణం జరుగనుంది. షెడ్యూల్‌ ప్రకారం బెంజి సర్కిల్‌ పైవంతెన నిర్మాణం పూర్తి చేస్తామని పీడీ విద్యాసాగర్‌ వెల్లడించారు.

Link to comment
Share on other sites

రక్తచరిత్రకు ముగింపు
మరో నాలుగు నెలల్లో బందరు రహదారి సిద్ధం..!
రోడ్డు ప్రమాదాలకు చరమగీతం
amr-top1a.jpg

ఆ రహదారి అంటే వాహన చోదకుల వెన్నులో వణుకుపుడుతుంది. గత పదేళ్లలో దాదాపు 900 మంది వరకు మరణించారు. వందలమంది గాయాలపాలయ్యారు. రెండు వరసలే ఉండటం, మధ్యలో డివైడర్‌ లేకపోవడం, మలుపులు ఎక్కువగా ఉండటం, చీకటి మయంగా ఉండటం, సూచికలు లేకపోవడంతో తరచూ వాహనాలు ప్రమాదాలకు గురయ్యేవి. 64 కిలోమీటర్లకు దాదాపు 88 ప్రాంతాల్లో వేగ నిరోధకాలను ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉండేదో అంచనా వేయవచ్చు. జాతీయ రహదారిపై వేగ నిరోధకాలు ఏర్పాటు నిషేధం ఉంది. అయినా ఉన్నతాధికారులు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారంటే కారణం.. రోడ్డు ప్రమాదాలే! ఇప్పుడు ఆ రక్త చరిత్రకు తెరపడనుంది. బందరు రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావచ్చాయి. మరో నాలుగు నెలలో దీన్ని ప్రారంభించనున్నారు.

రోజుకు 1500 టిప్పర్లు చొప్పున పనిచేశాయి. భూసేకరణ, భవనాల తొలగింపు వివాదంగా మారి ఉద్రిక్తతలకు దారి తీసింది. రాత్రికి రాత్రే నిర్మాణాలు తొలగించారు.  మండల స్థాయిలో గ్రామాల వారీగా భూసేకరణకు అవార్డు ప్రకటించారు. గజానికి రూ.35 వేల నుంచి రూ.45 వేలకు ధరలు నిర్ణయించారు. కొంతమంది గజానికి రూ.60వేలు కావాలని డిమాండ్‌ చేశారు. ఎకరాకు దాదాపు రూ.16.50 కోట్లు పరిహారం చెల్లిస్తున్నారు. కానూరు పంచాయతీ పరిధిలో మొత్తం 50 మంది నిర్వాసితులు ఉన్నారు. పోరంకిలో మొత్తం 293 మంది నష్టపోతున్నారు. వీరికి రూ.40వేలు చొప్పున అవార్డు నిర్ణయించారు. కంకిపాడు మండలంలోనూ పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇంకా 20శాతం భూసేకరణ పూర్తి కావాల్సి ఉంది. కంకిపాడు వద్ద ఒక భవనం ఇంకా తొలగించలేదు. దీనికి కారణం పరిహారం అందించలేదు. ఆర్బిట్రేషన్‌ పద్ధతిలో సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్‌ హామీ ఇచ్చారు. దాదాపు భూసేకరణ పూర్తి చేశారు. పరిహారం చెల్లించాల్సి ఉందని అధికారులు అంటున్నారు.

ఈనాడు, విజయవాడ

బందరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 65) విస్తరణ పనులు సకాలంలో పూర్తి కానున్నాయి. గత కొన్ని నెలలుగా  రేయింబవళ్లు నిర్మాణ పనులు సాగిస్తున్నారు. మరో నాలుగు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో గుత్తేదారు పనులు చేస్తున్నారు. న్యాయ కేసులు, చిక్కులు ఎదురుకావడంతో కొంతకాలం జాప్యమయ్యింది. ఈ సమయంలో ఇతర ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి చేశారు. కానూరు నుంచి పెనమలూరు వరకు ఉన్న న్యాయస్థానం కేసులు ఇటీవల ఉపసంహరించడంతో పనులు వేగవంతం చేసి పూర్తి చేశారు.  మొత్తం 64 కిలోమీటర్ల నాలుగు వరసల  విస్తరణ రహదారి 90శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 10శాతం పనులు ఉన్నాయి. బెంజి సర్కిల్‌ పైవంతెన పనులు కూడా నవంబరు నాటికి పూర్తి చేయాలని సంకల్పించారు. బందరు-విజయవాడ రోడ్డు విస్తరణకు రెండేళ్ల కిందట కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారు. రెండేళ్ల కాలపరిమితిలో పూర్తి చేయాల్సిన ఈ రోడ్డు ఏడాది వరకు నత్తనడకన సాగింది.  విజయవాడ, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, పమిడిముక్కల, పామర్రు, గూడూరు, బందరు మండలాలను కలుపుతూ జాతీయ రహదారి వెళ్తుంది. మొత్తం 64 కిలోమీటర్ల రోడ్డు నాలుగు వరసలుగా విస్తరించి నిర్మాణం చేయాల్సి ఉంది. గతంలో ఉన్న రెండు వరసల రోడ్డును ఆధునికీకరిస్తున్నారు. దీనికి కిలో మీటరుకు వ్యయం రూ.14.36 కోట్లు ఖర్చు అంచనా వేశారు. బెంజి సర్కిల్‌ పైవంతెనతో సహా మొత్తం 4 మేజర్‌ వంతెనలు, 5 మధ్యతరహా వంతెనలు, 5 అండర్‌పాస్‌లు నిర్మాణం చేయాల్సి ఉంది. వీటిలో బెంజి సర్కిల్‌ మినహా అన్ని పూర్తయ్యాయి. 22 కిలోమీటర్లు సర్వీసు రోడ్డు వస్తుంది. 107 ప్రాంతాల్లో కల్వర్టులు నిర్మించాలి. బస్‌బేలు 34 ప్రాంతాల్లో ఉంటాయి. కంకిపాడు దాటిన తర్వాత టోల్‌గేటు ఏర్పాటు చేయనున్నారు. కంకిపాడు, మంటాడ, పామర్రు, సుల్తాన్‌బాద్‌ గ్రామాల్లో 15.85 కిలోమీటర్ల వరకు బైపాస్‌ నిర్మాణం చేశారు. బైపాస్‌ మొత్తం సీసీ రోడ్డుగా నిర్మాణం చేశారు. రోడ్డు నిర్మాణానికి రూ.740 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పరిహారం చెల్లింపులకు భారీగా వ్యయం అవుతోంది. విజయవాడలో ప్రస్తుతం ఉన్న నాలుగు వరసలను యధాతథంగా ఉంచుతారు. పోరంకి వరకు 8.4 కిలోమీటర్లు 45 మీటర్ల (150అడుగులు) వెడల్పు, ఆ తర్వాత 60 మీటర్ల (200అడుగులు) వెడుల్పుతో రోడ్డునిర్మాణం చేశారు. ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది.

తూములు ఏర్పాటు..!
పలు ప్రాంతాల్లో కాలువల కోసం తూములు ఏర్పాటు చేయడం వివాదంగా మారుతోంది. పంట కాలువలు రోడ్డును దాటాల్సి ఉంది. సాంకేతికంగా అక్కడ కల్వర్టులు (వంతెనలు) ఏర్పాటు చేయాల్సి ఉంది. కాంక్రీట్‌ దిమ్మలతో ఈ వంతెనలు ఉంటాయి. కానీ తూములు ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహాన్ని బట్టి తూములు సామర్థ్యం సరిపోతుందని చెబుతున్నారు. ఈ రహదారిపై భారీ వాహనాలు వెళ్తుంటాయి. 10 టన్నుల నుంచి 50 టన్నులు వరకు వెళ్లే అవకాశం ఉంది. అలాంటి సమయంలో తూములు ధ్వంసం అయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ రహదారికి మధ్యన డివైడర్‌ ఏర్పాటు చేశారు. దీనిలో మొక్కలు పెంచాల్సి ఉంది. మెక్కలు పెంచేందుకు ఎర్రమన్ను పోయాల్సి ఉంది. కానీ రాళ్లు పోశారు. దీని వల్ల మొక్కలు పెరిగే అవకాశం లేదని అంటున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో సూచికల ఫలకాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ జాతీయ రహదారికి సర్వీసు రహదారి లేకపోవడం గమనార్హం. దీనికి కారణం సర్వే సమయంలో డీపీఆర్‌ అలాగే తయారు చేశారని అంచనాలు ఆవిధంగానే రూపొందించారని పీడీ చెబుతున్నారు.

టోల్‌ ఏర్పాటు..!
కంకిపాడు ప్రాంతంలో టోల్‌ ఏర్పాటు చేస్తున్నారు. నవంబరు తర్వాత టోల్‌ రుసుము వసూలు చేస్తారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో (ఎన్‌హెచ్‌ఏఐ) దీన్ని నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక టోల్‌ ఏర్పాటు చేయవచ్చు. అయితే 64 కిలోమీటర్లకు కలిపి ఒకటే ఏర్పాటు చేయనున్నారు. రుసుములు మాత్రం 64 కిలోమీటర్లకు నిర్ణయిస్తారు. ఈ రహదారిని గుత్త సంస్థ బీఓటీ కాకుండా ఈపీసీ పద్ధతిలోనే నిర్వహించినందున టోల్‌ వసూలు ఎన్‌హెచ్‌ఏఐ తీసుకుంది. నవంబరులో జాతీయ రహదారిని ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నామని జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ ‘ఈనాడు’తో చెప్పారు.

Link to comment
Share on other sites

బందరు రహదారి విస్తరణకు శ్రీకారం

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: నగరంలోని ఆటోనగర్‌ తపాలా కార్యాలయం నుంచి సిద్ధార్థ కళాశాల వరకు బందరు రహదారిని జోనల్‌ అభివృద్ధి ప్రణాళిక ప్రకారం.. 94 నుంచి 96 అడుగుల వెడల్పుతో ఉన్న ప్రస్తుత రహదారిని 120 అడుగుల మేరకు విస్తరించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఏపీసీఆర్‌డీఏ అధికారులు రోడ్డుకు రెండు వైపులా సమానంగా ఉండేలా మార్కింగ్‌ చేపట్టారు. ఈ విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి జీవో 223 ప్రకారం 1:4 నిష్పత్తిలో టీడీఆర్‌ బాండ్లు ఇస్తామని అధికారులు తెలిపారు. ఏపీసీఆర్‌డీఏ జోనల్‌ సహాయ సంచాలకుడు డైరెక్టర్‌ గుమ్మడి ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

బందరు రోడ్డు విస్తరణకు మార్కింగ్‌
11-07-2018 07:00:32
 
636668892318645148.jpg
అమరావతి: విజయవాడలోని బందరు రోడ్డు విస్తరణ ప్రక్రియలో మరొక అంకానికి అధికారులు మంగళవారంనాడు శ్రీకారం చుట్టారు. విడతలవారీగా ఈ రహదారిని విస్తరించడం ద్వారా విజయవాడ, పరిసర గ్రామాల వారు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ ఇబ్బందులకు అడ్డుకట్ట వేసేందుకుగాను ఇప్పటికే కంకిపాడు నుంచి కానూరు సెంటర్‌ వరకు 4 వరుసల రోడ్డును నిర్మిస్తున్న సంగతి విదితమే. తాజా గా కానూరు సెంటర్‌ నుంచి విజయవాడలోని ఆటోనగర్‌ పోస్టాఫీసు సెంటర్‌ వరకు బందరు రోడ్డును జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ ప్రకారం 120 అడుగులమేర విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సీఆర్డీయే అధికారులు మంగళవారంనాడు రోడ్డు మార్కింగ్‌ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రదేశాల మధ్య ప్రస్తుతం బందరు రోడ్డు 94 నుంచి 96 అడుగుల వెడల్పుతో ఉంది. దీనిని మరొక 24 నుంచి 26 అడుగుల మేర, ఇరువైపులా సమంగా విస్తరించేలా మార్కింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో స్థలాలు కోల్పోయే వారికి కొత్త జీవో 223 ప్రకారం 1:4 నిష్పత్తిలో టీడీఆర్‌ బాండ్లను జారీ చేయనున్నారు. కార్యక్రమంలో సీఆర్డీయే జోనల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గుమ్మడి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

తూచ్‌.. డ్రెయిన్‌ ఇక్కడ కాదు
11-07-2018 07:03:09
 
636668893886113642.jpg
  • 120 అడుగులకు విస్తరించకుండా నిర్మాణం
  • ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన సీఆర్డీఏ అధికారులు
  • సర్వే చేసి మార్కింగ్‌
కానూరు, కృష్ణా: కానూరు పరిధిలో బందరు రోడ్డుకు ఇరువైపులా డ్రెయినేజీ నిర్మాణం సందిగ్ధతలో పడింది. ఇదిలావుండగా టైమ్‌ హాస్పిటల్‌ వద్ద నుంచి డ్రెయినేజీ నిర్మాణం కోసం తమ భవనాల అంచుల వరకు తవ్వి వదిలేయడం వల్ల కోతకు గురై కూలిపో తున్నాయని యజమానులు ఆందోళన చెందుతున్నారు. డ్రెయినేజీ అస్తవ్యస్తం శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితంకావడంతో సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఆదేశాల మేరకు అధికా రులు రంగంలోకి దిగారు. తవ్వినచోట డ్రెయినేజీ నిర్మాణం చేపట్టకూడదని సర్వే చేయకుండా తవ్వకాలు జరిపారని, ప్రస్తుతం రహదారిని తవ్విన చోట నుంచి సుమారు 13 అడుగుల వరకు రహదారిని విస్తరిం చాల్సి ఉందని స్పష్టం చేశారు.
 
మచిలీపట్నం నుంచి కానూరు సిద్ధార్థ కళాశాల వరకు 150 అడుగుల వరకు బందరు రోడ్డును విస్తరించారు. అక్కడ నుంచి బెంజిసర్కిల్‌ వరకు 120 అడుగుల వరకు విస్తరించాల్సి ఉంది. కాని సీఆర్‌డీఏ అధికారులు మార్కిం గ్‌ ఇవ్వకుండానే 94 నుంచి 96 అడుగుల మధ్య డ్రెయిన్‌ నిర్మాణ పనులకు కాంట్రాక్ట్‌ సంస్ధ శ్రీకారం చుట్టేసింది. యంత్రాల ద్వారా రహదారిని తవ్వేసి సిరీస్‌ లేబరేటరీ వద్ద నుంచి కామయ్యతోపు జంక్షన్‌ వరకు అక్కడక్కడ డ్రెయినేజీ గోడలను నిర్మించే శారు. ఇపుడు మార్కింగ్‌ వరకు రహదారిని విస్తరించి డ్రెయినేజీ నిర్మాణ పనులను చేపట్టవలసి ఉంది. అయితే పాతచెక్‌ పోస్టు సెంటర్‌ నుంచి బెంజిసర్కిల్‌ వరకు కార్పొ రేషన్‌ అధికారులు 120 అడుగుల వరకు మార్కింగ్‌ వేసుకోవలసి ఉందని సీఆర్‌డీఏ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రసాదరావు తెలిపారు.
 
 
స్థల సేకరణలో ఇబ్బంది లేదు
రహదారికి ఇరువైపులా దాదాపు 26 అడుగుల వరకు విస్తరించాల్సి ఉంది. వీరిలో చాలామంది యజమానులకు గతంలోనే 1:4 పద్ధతిలో బాండ్లను అంద జేశాం. మిగతా వారికి అదే పద్ధతిలో అందజేస్తాం. 2006 తరువాత 120 అడు గులలోపు బందరు రోడ్డు ప్రక్కన కట్టడా లకు అనుమతులు ఇవ్వలేదు. అందుకే ఇటీవల నిర్మించిన భవన యజమానులు రహదారికి స్ధలాన్ని వదిలి నిర్మాణాలు చేసుకున్నారు. వారి వల్ల ఇబ్బంది లేదు. డ్రెయినేజీ నిర్మాణం కోసం రహదారి తవ్వేటపుడు మమ్మల్ని సంప్రదిం చలేదు. 120 అడుగులకు మార్కింగ్‌ వేయకుండా పనులు చేపట్టారు. మార్కింగ్‌ ప్రక్రియ బుధవారంతో ముగుస్తుంది.
నేషనల్‌ హైవే అధికారులకు అప్పగించి కాంట్రాక్టు సంస్థతో రహదారి విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది.
- ప్రసాదరావు, ఏడీ, సీఆర్డీఏ
Link to comment
Share on other sites

బెంజ్‌సర్కిల్‌ కూడలిలో కీలక పిల్లర్ల పనులు
18-07-2018 07:14:55
 
636674948958069332.jpg
  • ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పనులు
బెంజ్‌సర్కిల్‌ వద్ద సంక్లిష్టమనుకున్న పిల్లర్ల పనులు సునాయాసంగా జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా పనులు చేసేస్తున్నారు. ఇక్కడ పనుల కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతాయని భావించిన ప్రజలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తే విధంగా కీలక పిల్లర్ల పనులు జరుగుతుండడం విశేషం.
 
 
విజయవాడ: బెంజ్‌సర్కిల్‌ కూడలి వద్ద పిల్లర్ల పనులు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకూండా చేసేస్తున్నారు. ఫ్లై ఓవర్‌లో భాగంగా కూడలి వద్ద పిల్లర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నందున ట్రాఫిక్‌ సమస్యలు తప్పవని భావించిన ప్రజలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తే విధంగా ఎన్‌హెచ్‌ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పనులు చేపట్టడం విశేషమే.
 
బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌లో భాగంగా కూడలి వద్ద 9, 10 పిల్లర్ల ఏర్పాటు గురించి, నాలుగు నెలల క్రితమే నేషనల్‌ హైవే, పోలీసు, జిల్లా అధికారులు ఆందోళన చెందారు. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనుల సందర్భంగా ట్రాఫిక్‌ను నిలుపుదల చేయటం వల్ల ప్రజల నుంచి వచ్చిన తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో, ఈ ఫ్లై ఓవర్‌ దగ్గర కూడా అదే పరిస్థితి పునరావృతమౌతుందేమోనని భయపడ్డారు. ట్రాఫిక్‌ డైవర్షన్‌ ప్లాన్స్‌ చేశారు. సర్కిల్‌ ఐలాండ్‌ను తొలగించారు. వన్‌వే ట్రాఫిక్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. అనేక కసరత్తుల తర్వాత ఎట్టకేలకు సర్కిల్‌ దగ్గర పనులు ప్రారంభమయ్యాయి.
 
నిర్మలా కాన్వెంట్‌ వైపు ఇప్పటికే 10వ నెంబర్‌కు భూగర్భ పిల్లర్లు వేయటం పూర్తయింది. ఇది ట్రాఫిక్‌కు అంతగా ఇబ్బంది కలిగించదు కాబట్టి ప్రభావం ఎవరికీ కనిపించలేదు. తొమ్మిదో నెంబర్‌ పిల్లర్‌ మాత్రం ఆంజనేయస్వామి గుడిని దాటుకుని ముందుకు వస్తుంది. ఇక్కడ క్లిష్టంగా ఉండటం వల్ల సమస్యలు ఎదురవుతాయనుకున్నారు. మార్కింగ్‌ ప్రకారం సోమవారం రాత్రికి రాత్రే చాలా వరకు కుదించి బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నుంచి భూగర్భ పిల్లర్ల పనులు చేపట్టారు. వారం రోజుల్లో దీనిని పూర్తి చేసి, అనంతరం ప్రధాన పిల్లర్‌ లేపుతారు.
 
ఐలాండ్‌ తొలగించడమే కారణం
బెంజ్‌సర్కిల్‌ ఐలాండ్‌ను తొలగించకపోయి ఉంటే ట్రాఫిక్‌ను మళ్లించాల్సి ఉండేది. వన్‌వే నిబంధనలను అమలు చేయాల్సి వచ్చేది. కూడలి వద్ద ఐల్యాండ్‌ హైవే మీద ఒక మార్గాన్ని ఆక్రమించి ఉంటుంది. ఐలాండ్‌ను తాత్కాలికంగా తొలగించటం వల్ల ఒక మార్గం కలిసి వచ్చింది. ఐల్యాండ్‌కు దగ్గరగా మార్కింగ్‌ వచ్చింది. మార్కింగ్‌ను కూడా కుదించి లోపలికి బారికేడింగ్‌ ఏర్పాటు చేపట్టడం వల్ల మరికొంత స్థలం కలిసి వచ్చింది. దీంతో కూడలి దగ్గర క్లిష్టమైన తొమ్మిదో నెంబర్‌ పిల్లర్‌ వేయటానికి మార్గం సుగమమైంది.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...