Jump to content

benz circle flyover & vijayawada -bandar highway


sonykongara

Recommended Posts

  • Replies 308
  • Created
  • Last Reply
  • 2 weeks later...
ఫ్లై ఓవర్‌ పనుల స్పీడ్‌ పెరగాలి!
17-09-2017 09:29:33
 
636412373904205226.jpg
బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనుల స్పీడ్‌ పెరగాలి! ఇప్పటివరకు జెట్‌ స్పీడ్‌గా పనులు ప్రారంభించిన కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కొద్దిగా స్లో అయింది. నెల రోజుల విలువైన సమయం వృధా అయింది. ఫైల్‌ టెస్టింగ్‌, లోడ్‌ టెస్టింగ్‌ వంటి కారణాల వల్ల కూడా పనులు జాప్య మయ్యాయి. ప్రస్తుతం 20 శాతం మేర పూర్తయ్యాయి. ట్రాఫిక్‌ అత్యంత రద్దీ ఉండే ఈ ప్రాంతంలో నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేపట్టకపోతే సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఎన్‌హెచ్‌ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత లక్ష్యాల మేరకు కాంట్రాక్టు సంస్థ పనులు చేపట్టాల్సి ఉంది.
  • ప్రస్తుతం 20శాతం పనులు పూర్తి
  • ఎర్త్‌పిల్లర్స్‌, బేస్‌మెంట్‌ దాదాపు పూర్తి
  • ఫైల్‌ టెస్టింగ్‌, లోడ్‌ టెస్టింగ్‌ వల్ల నెల రోజుల జాప్యం
  • పిల్లర్‌ పనులు ప్రారంభించిన కాంట్రాక్టు సంస్థ
  • వచ్చే నెల మొదటి, రెండవ వారం నుంచి రెండో వరుస పనులు
విజయవాడ: బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనుల స్పీడ్‌ పెరగాలి! ఇప్పటివరకు జెట్‌ స్పీడ్‌గా పనులు ప్రారంభించిన కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కొద్దిగా స్లో అయింది. నెల రోజుల విలువైన సమయం వృధా అయింది. దేశంలోని రెండు ప్రధాన జాతీయ రహదారుల కూడలి ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ పనులు చేపట్టడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ట్రాఫిక్‌ అత్యంత రద్దీ ఉండే ఈ ప్రాంతంలో నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేపట్టకపోతే సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇప్పటికే బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనుల వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులతో పాటు ఇతర అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నా.. కాంట్రాక్టు సంస్థ పనులు వేగవంతంగా చేపడుతుందన్న కారణంతో ఎవరూ ఏమీ అనటం లేదు. వర్షం కురిస్తే.. సర్వీసు రోడ్ల వెంట నడవాలంటే దుర్భరంగా మారుతోంది. మురికినీళ్లలో నడవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. గోతుల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కాంట్రాక్టు సంస్థ చేపడుతున్న పనుల తీరును చూసి ఏ ఒక్కరు కూడా అభ్యంతరం పెట్టకుండా మౌనంగా చూస్తూ సహకరిస్తున్నారు. ఇప్పటివరకు కాంట్రాక్టు సంస్థ ఓ పద్ధతి ప్రకారం పనులు చేస్తోంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా నిర్ణీత లక్ష్యాల మేరకు కాంట్రాక్టు సంస్థ పనులు చేపట్టాల్సి ఉంది. కొద్దిరోజుల వరకు పనులు చాలా స్పీడ్‌గా చేపట్టిన సంస్థ నెలన్నరకు పైగా సమయాన్ని వృధా చేయటం గమనార్హం. ఫైల్‌ టెస్టింగ్‌, లోడ్‌ టెస్టింగ్‌ వంటి కారణాల వల్ల కూడా పనులు జాప్యమయ్యాయి. సమయాన్ని వృధా చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాంట్రాక్టు సంస్థ పనులు మరింత వేగంగా చేపట్టి సమయాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
 
20 శాతం మేర పనులు పూర్తి
బెంజిసర్కిల్‌ పార్ట్‌-1 మొదటి వరుస ఫ్లై ఓవర్‌ పనుల్లో ప్రస్తుతం 20 శాతం పూర్తి కావటం గమనార్హం. మొత్తం 600 మీటర్ల పొడవున నిర్మలా కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి, ఎస్‌వీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌ జంక్షన్‌ వరకు పూర్తిగా ఏర్పాటు చేసిన బ్యారికేడింగ్‌ మధ్యన పనులు జరుగుతున్నాయి. అతి కష్టమైన కాలాతీతమైన ఎర్త్‌హోల్‌ పనులను కాంట్రాక్టు సంస్థ నిర్ణీత సమయంలో పూర్తి చేసి ఔరా అనిపించింది. ఎర్త్‌హోల్స్‌ పనులతో సమాంతరంగా ఎర్త్‌పిల్లర్స్‌ పనులు చేపట్టింది. ఎర్త్‌ పిల్లర్‌ ్స పూర్తయిన తర్వాత, కాంక్రీట్‌ బీమ్స్‌లను కూడా ప్రారంభించింది. కాంక్రీట్‌ బీమ్స్‌ పూర్తి చేసిన వాటికి సంబంధించి పిల్లర్‌ పను లకు కూడా ఐరన్‌ ఫ్రేమింగ్‌ చేసి రెడీగా ఉంది. వచ్చే నెల మొదటి, రెండు వారాల్లో జ్యోతి కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి మైనేని జంక్షన్‌ వరకు రెండవ వరుస పనులను కాంట్రాక్టు సంస్థ చేపడుతుంది. ఈ వరుసలో కూడా సర్వీసు రోడ్డును అనుకుని బారికేడింగ్‌ ఏర్పాటు చేసిన ఎర్త్‌హోల్స్‌, ఎర్త్‌పిల్లరింగ్‌, కాంక్రీట్‌ బీమ్స్‌, పిల్లర్‌ పనులను కాంట్రాక్టు సంస్థ చేపడుతుంది.
 
          ఫ్లై ఓవర్‌ పార్ట్‌-2 పనులకు నవంబర్‌ రెండవ వారంలో టెండర్లు పిలవనున్నారు. ఇప్పటికే ఆర్వీ కన్సల్టెన్సీ నుంచి డీపీఆర్‌ వచ్చింది. దీనికి సంబంధించి సరికొత్త అంచనాలు సిద్ధమయ్యాయి. ఫీజిబిలిటీ రిపోర్టును కూడా ఆర్వీ కన్సల్టెన్సీ అంద చేసింది. ప్రస్తుతం జాతీయ రహదారుల సంస్థ అధికారులు వీటిని పరిశీలిస్తున్నారు. ఈ నెలలోనే కేంద్రానికి పంపి అనుమతులు తీసుకుని నవంబర్‌ రెండవ వారంలో టెండర్‌ నోటిఫికేషన్‌ వెలువరించనున్నారు.
Link to comment
Share on other sites

  • 5 weeks later...
  • 1 month later...

Vijayawada-Machilipatnam cities lo Last 70 years lo jaragani development jaruguthundi. 

Krishna-Guntur-Tenali (Even 4-5 Constituencies in Prakasam & West Godavari) ki Pattiseema is biggest thing happened in last 2-3 years.

IT & Other Industries, Airport expansion are other big things happening for Krishna-Guntur regions.

Hope Durga Gudi Flyover, Benz circle Flyover, Bandar Port, Polavaram (60 TMC by Gravity), Chintalapudi 2 phases will be completed by 2018 end.

TDP should sweep all seats Krishna-Guntur-Godavari region.

Jaffas/Congress adhikaaram loki vachhi vunte pai vaatilo okka pani kooda ayyedi kaadu. Indulo 1% kooda chese vaallu kaadu.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ ముందుకే..
16-12-2017 08:08:42
 
636490085271898297.jpg
  • మరో రెండు ఫ్లైఓవర్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు
  • బందరు రోడ్డుపై బెంజ్‌సర్కిల్‌ నుంచి కానూరు వరకు..
  • రమేష్‌ హాస్పిటల్‌ నుంచి రామవరప్పాడు రింగ్‌ వరకు పొడిగింపు
  • రామవరప్పాడు - ఎనికేపాడు ప్రతిపాదిత ఫ్లైఓవర్‌కు అనుసంధానం
  • రూ.1300 కోట్ల వ్యయ అంచనా
 
బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ మెగా విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది! దీనిపై కృష్ణాజిల్లా యంత్రాంగం అంచనాలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. రామవరప్పాడు రింగ్‌ - ఎనికేపాడు వరకు ఇంతకు ముందు ప్రతిపాదించిన రెండవ ఫ్లై ఓవర్‌ ప్రతిపాదనకు కొనసాగింపుగా ... రమేష్‌ హాస్పిటల్‌ నుంచి రామవరప్పాడు రింగ్‌ వరకు బెంజ్‌ ఫ్లై ఓవర్‌ను పొడిగించాలన్నది ఒక ప్రతిపాదన. బెంజిసర్కిల్‌ జంక్షన్‌ నుంచి బందరు రోడ్డుపై కానూరు వరకు నూతనంగా మరో ఫ్లైఓవర్‌ను బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు అనుసంధానంగా నిర్మించాలన్నది రెండవ ప్రతిపాదన. ఈ రెండు ప్రతిపాదనలకు సంబంధించి సుమారుగా రూ.1300 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ప్రభుత్వానికి కలెక్టర్‌ లక్ష్మీకాంతం తాజాగా నివేదిక పంపించారు. దీనిపై ప్రభుత్వం కూడా చర్చించాలని నిర్ణయించింది. త్వరలో నిర్వహించే సమావేశంలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ముఖ్యమంత్రి చంద్రబాబు నగర ంలో ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంలో రామవరప్పాడు జంక్షన్‌ను అభివృద్ధి చేయటంతో పాటు జాతీయ రహదారిని విస్తరించాలని సూచించారు. అంతకు ముందే బెంజిసర్కిల్‌ నుంచి కానూరు వరకు బందరు రోడ్డును 150 అడుగుల రోడ్డుగా విస్తరించటానికి అంచనాలు రూపొందించమని సూచించారు. రామవరప్పాడు జంక్షన్‌ దగ్గర ఇన్నర్‌ రింగ్‌ కలిసే చోట నుంచి జాతీయ రహదారి విస్తరణకు అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందిస్తే భూ సేకరరణ, రోడ్డు నిర్మాణ వ్యయం కలిపి మొత్తంగా రూ. 1700 కోట్ల మేర అవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫ్లై ఓవర్‌ ఏర్పాటు చేయటం మంచిదన్న ఉద్దేశంతో ఇటీవలే రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై రెండవ ఫ్లై ఓవర్‌ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు.
 
తాజాగా దీనికి కొనసాగింపుగా బెంజిసర్కిల్‌ ప్లై ఓవర్‌ విస్తరణకు మరో రెండు ప్రతిపాదనలు చేశారు. బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను రెండు వరుసల విధానంలో మూడేసి లేన్లుగా జ్యోతి కన్వెన్షన్‌ నుంచి రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వరకు జాతీయ రహదారుల సంస్థ నేతృత్వంలో పనులు జరుగుతున్నాయి. ఇక్కడితో ఫ్లై ఓవర్‌ ఆగిపోకుండా నేరుగా రామవరప్పాడు - ఎనికేపాడు వరకు పొడిగించాలన్న ఆలోచనను జిల్లా యంత్రాంగం చే స్తోంది. ఇలా చేయటం వల్ల రామవరప్పాడు జంక్షన్‌ దగ్గర కలిసే ఏలూరు రోడ్డుకు సంబంధించి కూడా ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చేయాలన్నది ప్రణాళికగా ఉంది. రామవరప్పాడు నుంచి ఎనికేపాడు వరకు ఫ్లై ఓవర్‌ను ఎలాగూ ప్రతిపాదించటం జరిగింది కాబట్టి ఈ చిన్న ముక్కను కూడా అనుసంధానం చేస్తే రూ. 300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
 
దీంతో పాటు బందరు రోడ్డును కానూరు వరకు 150 అడుగులుగా విస్తరించాలంటే నష్ట పరిహారంగానే రూ.1500 కోట్ల ఖర్చు అవుతుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది. బెంజిసర్కిల్‌ జంక్షన్‌ నుంచి కానూరు వరకు ఐదు కిలోమీటర్ల దూరంలో రెండులేన్ల ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తే రూ. 500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా చూస్తే రూ. 1300 కోట్ల వ్యయంతో బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను విస్తరించవచ్చని ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదిక పంపింది. ఈ ప్రతిపాదన పట్ల ప్రభుత్వం కూడా సీరియస్‌గానే దృష్టి సారించింది. త్వరలో నిర్వహించే సమావేశంలో చర్చిద్దామని ప్రభుత్వం నిర్ణయించటంతో బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ఏ విధంగా మార్పులు, చేర్పులు జరుగుతాయో వేచి చూడాల్సిందే.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
Guest Urban Legend

మోక్షమెప్పుడో..! 
బెంజి సర్కిల్‌ వంతెన రెండో భాగంపై ప్రతిష్ఠంభన 
ఆర్థిక శాఖ ఆమోదం కోసం వెళ్లిన దస్త్రం 
రెండో వైపు అంచనా వ్యయం రూ.124 కోట్లు 
ఆమోదం తర్వాతనే ఈపీసీ టెండర్లు 

amr-top1a.jpg

నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా ఉన్న విజయవాడ నగరంలో నడిబొడ్డు బెంజి సర్కిల్‌ వద్ద ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేస్తున్న పైవంతెన రెండో పార్టు (భాగం)పై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఐదు నెలలు గడిచినా ఇంకా టెండర్లను పిలవలేదు. రెండో పార్టు పైవంతెనకు సంబంధించిన అంచనాలను పూర్తి చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌) ఆర్థిక అనుమతుల కోసం ఆశాఖకు పంపినట్లు తెలిసింది. రెండో పార్టు వ్యయం దాదాపు రూ.124 కోట్ల వరకు అంచనా వేశారు. ఈ విషయాన్ని జాతీయ రహదారుల సంస్థ అధికారులు వెల్లడించడం లేదు.

ఈనాడు, అమరావతి

దిల్లీలో కేంద్ర కార్యాలయం టెండర్లను పిలిచి గుత్తేదారులతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇక్కడికి పంపించనున్నారని తెలిసింది. ముందుగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి రావాలి. సగభాగం బీఓటీ (నిర్మించు, నిర్వహించు, బదిలీ చేయు) కింద నిర్మాణం చేపడుతున్నందున మిగిలిన సగభాగం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగామారింది. ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినందున ఉన్నతాధికారులు పరిశీలనకు అంచనాల ప్రతిపాదనలు పంపారు. దీంతో బెంజి సర్కిల్‌ పైవంతెన రెండో పార్టుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మాత్రం బీఓటీ కింద గుత్త సంస్థ నిర్మాణం ముమ్మరంగా సాగిస్తోంది. ఒకవైపు నిర్మాణం వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యంగా ఉంది. నవనిర్మాణ దీక్ష సందర్భంగా  బెంజి సర్కిల్‌ పైవంతెన నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. ఈలోగా రెండో పార్టు అనుమతులు వస్తాయా రాదా అనేది ఉత్కంఠగా మారింది.

చురుగ్గా నిర్మాణం..! 
బెంజి సర్కిల్‌ వద్ద నిర్మాణం చేపట్టిన పైవంతెన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒకవైపు మాత్రమే రెండు వరసల వంతెన నిర్మాణం జరుగుతోంది. విజయవాడ నగరంలో బెంజిసర్కిల్‌కు విశిష్టత ఉంది.  బెంజి సర్కిల్‌ స్వరూపం ఏమాత్రం చెడిపోకుండా జాతీయ రహదారిపై పైవంతెన ఏలూరు రోడ్డుకు నిర్మాణం చేయాలని సీఎం ప్రతిపాదించారు. మొదట సాధారణ పైవంతెన ప్రతిపాదించి బందరు-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్యాకేజీలో చేర్చారు. దీనిపై సీఎం ఆలోచనలకు అనుగుణంగా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆకృతులను రూపొందించారు. ఉజ్జయినిలో ఉన్న పైవంతెన తరహాలో ఇక్కడ నిర్మాణం చేసేందుకు ఆకృతులను రూపొందించారు. దీనికి సీఎం ఆమోద ముద్ర వేశారు. జాతీయ రహదారికి పైభాగంలో రెండు వైపులా పైవంతెన రానుంది. కింది నుంచి వాహనాలు, పైనుంచి వాహనాలు వెళ్లే విధంగా ఆకృతులు రూపొందించారు. ఈ ఆకృతులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. రాష్ట్రంలో సరికొత్త తరహాలో నిర్మాణం చేసే వంతెనగా గుర్తింపు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే, భూసేకరణ అవసరం లేకుండానే బెంజి సర్కిల్‌ పైవంతెన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రణాళికలు రూపొందించింది. సర్వీసు రోడ్డు 1.5 మీటర్ల చొప్పున కుదించుకుపోనుంది. 2018 లక్ష్యంగా బెంజి సర్కిల్‌ పైవంతెన పూర్తి చేయాలనేది ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. ప్రస్తుతం పాత టెండర్‌ ప్రకారం గుత్త సంస్థ పనులు ప్రారంభించింది. బెంజి సర్కిల్‌ పైవంతెన అదనంగా పొడిగించిన దానికి మళ్లీ ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవడంలో జాప్యం జరుగుతోంది. ఒకవైపు పనులు జరుగుతుండగానే రెండో పార్టుకు ఈపీసీ టెండర్లను పిలవనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు వెల్లడించారు. ఐదు నెలలు గడిచినా టెండర్లను పిలవకపోవడంతో రెండో పార్టు మాత్రం 18 నెలల్లో ఈ పనులు పూర్తికావడం అసాధ్యంగా చెబుతున్నారు. బెంజి  సర్కిల్‌ పైవంతెన ఆకృతులను ఆర్‌కే అసోసియేట్స్‌ రూపొందించింది. బందరు రోడ్డు నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణ, బెంజి సర్కిల్‌ పైవంతెన కలిపి ఒక ప్యాకేజీగా టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. దీనిలో 64.6 కి.మీ బందరు రోడ్డుకు రూ.740.70 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనిలో నాలుగు మేజర్‌ వంతెనలు, అయిదు చిన్న వంతెనలు, అయిదు పాదచారుల వంతెనలు నిర్మాణం చేయనున్నారు. మొదట రూపొందించిన ఆకృతుల ప్రకారం బెంజి సర్కిల్‌ పైవంతెన 618 మీటర్లు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి రూ.82 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఆకృతుల ప్రకారం పైవంతెన నిర్మాణం 1.4 కి.మీ దూరం నిర్మాణం చేయనున్నారు. జ్యోతిమహల్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌ వరకు పైవంతెన నిర్మాణం ఉంటుంది. అదనంగా 820 మీటర్లు పొడిగించారు. దీనికి అంచనా వ్యయం దాదాపు రూ.100కోట్ల నుంచి రూ.124 కోట్లు అవుతుందని అధికారులు తెలిపారు. ఈ మిగిలిన పార్టుకు ఈపీసీ టెండర్లను పిలవాల్సి ఉంది. కొత్త ఆకృతుల ప్రకారం పైవంతెన రెండు భాగాలుగా ఉంటుంది. రాకపోకలకు విడిగా రెండు వంతెనలు సమాంతరంగా నిర్మాణం చేస్తారు. ఒక్కో వంతెన మూడు వరసలతో నిర్మాణం చేస్తారు. అంటే మెత్తం ఆరు వరసల వంతెనగా నిర్మాణం ఉంటుంది. ఒక్కవైపు దాదాపు 7.5మీటర్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం మనుగడలో ఉన్న జాతీయ రహదారి యధావిధిగా ఉంటుంది. డివైడర్‌ మినహా ఒకవైపు 7.5మీటర్లు చొప్పున ఆరు వరసల రహదారిగానే ఉంటుంది. దానికి ఇరువైపులా రెండు వరసల సర్వీసు రోడ్డు నిర్మాణం చేస్తారు. ఇరువైపులా కలిపి నాలుగు వరసల సర్వీసు రోడ్డు ఉంటుంది. ప్రస్తుతం 5.50మీటర్ల చొప్పున సర్వీసు రోడ్లు ఉన్నాయి. ఇరువైపు 1.50 మీటర్ల చొప్పున మొత్తం 3మీటర్ల రోడ్డు కుదించుకుపోతుంది. నిర్మాణం అనంతరం కేవలం 4మీటర్ల సర్వీసు రోడ్డు ఉంటుంది. రెండు పైవంతెనల మధ్యలో జాతీయ రహదారి ఉంటుంది. జాతీయ రహదారి మీదుగా వాహనాలు వెళ్తాయి. పైవంతెన మీదుగా నేరుగా వెళ్లే వాహనాలు వెళతాయి. అయితే రెండు పైవంతెన మధ్యలో ఖాళీ ఉంటుంది. 
* ఒప్పందం ప్రకారం గుత్త సంస్థ బెంజిసర్కిల్‌ పైవంతెన నాలుగు వరసలు 618 మీటర్లు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంది. కానీ మారిన ఆకృతుల ప్రకారం రెండు వైపులా రెండు పార్టులుగా వంతెన నిర్మాణం చేయాలని నిర్ణయించారు. 1.4 కి.మీ పెంచారు. దీంతో బీఓటీ కింద టెండర్‌ దక్కించుకున్న దిలీప్‌కాన్‌ సంస్థ ఒకవైపు పార్టు పూర్తి చేసేందుకు అంగీకరించింది. 
* రెండోవైపు రెండో భాగం వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ మళ్లీ అంచనాలను వేసింది. దీన్ని ఈపీసీ కింద అప్పగించాలని నిర్ణయించింది. దీనికి ఇటీవల అంచనాలు పూర్తి చేసి సవివర నివేదికను (డీపీఆర్‌) కేంద్ర కార్యాలయానికి పంపింది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం రెండో పార్టు ట్రెండ్‌సెట్‌ మాల్‌ వైపు నిర్మాణం చేసేందుకు రూ.124కోట్లు అంచనా వేశారు. 
* దీనికి ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉంది. అంచనాలు వేసి డీపీఆర్‌ పంపినా ఇంతవరకు ఆమోదం పొందలేదు. ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత టెండర్లను పిలువనున్నారు. 
* బెంజి సర్కిల్‌ పైవంతెన నిర్మాణం తీరు ఇలా ఉంటే నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తట్టుకునేందుకు నిడమానూరు వరకు పొడవైన వంతెన నిర్మాణం చేయాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న బెంజిసర్కిల్‌ పైవంతెనను అక్కడి వరకు పొడిగించాలనేది ప్రతిపాదన. 
* ఈ ప్రతిపాదన తమ దృష్టిలో లేదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో రెండో పార్టుపై గందరగోళం నెలకొంది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
బెంజ్‌ చకచకా..
30-01-2018 09:06:59
 
636529000202947642.jpg
  • వేగంగా ఫ్లై ఓవర్‌ పనులు
  • డెడ్‌ లైన్‌ నవంబర్‌..టార్గెట్‌ ఆగస్టు
  • 242 ఫైల్స్‌ పూర్తి
  • 18 ఫైల్‌ క్యాప్స్‌ 11 పిల్లర్లు పూర్తి
  • 93 గడ్డర్లు పూర్తి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మరో ఏడె నిమిది నెలల్లోనే అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మే నెల్లో పనులు ప్రారంభించటానికి అపాయిం ట్‌ డేట్‌ ఇచ్చినా.. పనులు ప్రారంభించడానికి నెల జాప్యం జరిగింది. ప్రస్తుతం ఆరు నెలలుగా పనులు జరుగుతున్నాయి. మరో తొమ్మిది నెలలు ఉంది. కానీ, ఏడు నెలల్లోనే అంటే ఆగస్టు, సెప్టెంబర్‌ నాటికి ఫ్లైఓవర్‌ను అప్పగిస్తామని కాంట్రాక్టు సంస్థ ఎన్‌హెచ్‌ అధికారులకు చెబుతోంది.
 
ఈ ఫ్లై ఓవర్‌ పనుల తీరు తెన్నులను చూస్తే.. అర్ధ సంవత్సర కాలంలో 22 శాతం మేర పనులు పూర్తయ్యాయి. అన్ని పనులను సమాంతరంగా ఒకేసారి ప్రారంభించటం వల్ల పనుల్లో పురోగతి శాతం తక్కువుగా కనిపిస్తున్నా.. చాలా ఎక్కువుగా చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిడివి 1440 మీటర్లు. జ్యోతి కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన పనులు రమేష్‌ హాస్పటల్‌ జంక్షన్‌ వరకు కొన సాగుతున్నాయి. ఒక వరసలో మూడు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ప్రస్తు తం జరుగుతున్నాయి. రెండో వరుసలో పనులు వచ్చే నెల్లో ప్రారంభిస్తారు. అది వేరే లైన్‌ అయినం దున ప్రస్తుతం ఫ్లైఓవర్‌ను పూర్తి చేయటానికి నవంబర్‌ వరకు సమయం ఉంది. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి మొత్తంగా 354 ఫైల్స్‌ వేయా ల్సి ఉంది. ఇప్పటి వరకు 242 ఫైల్స్‌ వేశారు. ఫైల్స్‌ అన్నవి భూమిలో వేసే పిల్లర్లు. ఫైల్స్‌ తర్వాత దశలో వీటన్నిం టినీ కలిపి భూమి నుంచి పైకి మొత్తం 49 ఫైల్‌ క్యాప్స్‌లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 18 ఫైల్‌ క్యాప్స్‌ పనులను పూర్తి చేశారు.
 
ఫ్లైఓవర్‌కు ప్రధాన మైన పియర్స్‌ (పిల్లర్లు) మొత్తం 49 కాగా.. ఇప్పటి వరకు 11 పూర్త య్యాయి. పియర్స్‌ క్యాప్స్‌ అంటే పిల్లర్ల మీద వేసే తలలు మొత్తం 49 కాగా ఇప్పటి వరకు రెండు పూర్తయ్యాయి. మరో 10 తలల నిర్మాణానికి ఐరన్‌ ఫ్రేమింగ్‌ చేశారు. ఆ తర్వాత దశలో గడ్డర్ల తయారీ జరగాలి. మొత్తం 240 గడ్డర్లను తయారు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 93 గడ్డర్లు పూర్తయ్యాయి. పెనమలూరు మండలం గోసాల సమీపంలో క్యాస్టింగ్‌ డిపోలో గడ్డర్లు తయారవుతున్నాయి. ఎస్వీఎస్‌ కల్యాణ మండపం నుంచి పిల్లర్ల మధ్యలోనే గడ్డర్ల పనులు ప్రారంభించారు.
 
కీలకమైన పనులన్ని సమాంతరంగా జరగటం వల్ల ఇప్పటికే ఫ్లై ఓవర్‌ రూపు సంపాదించుకుంది. మరో రెండు నెల్లో మరింత స్పష్టంగా ప్లై ఓవర్‌ రూపు కనిపించటంతో పాటు గడ్డర్ల పని కూడా జరిగే అవకాశం ఉంది.
 
బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులు పతాక స్థాయిలో రేయింబవళ్లు జరుగు తున్నాయి. కీలకమైన పియర్స్‌, క్యాప్స్‌ పనుల ఘట్టం ప్రారంభమైంది! నిర్మాణ పనులు ఈ ఏడాది నవంబర్‌ నాటికి పూర్తి కావాల్సి ఉండగా రెండు నెలలు ముందుగానే ఆగస్టు నాటికి అప్పగించటానికి కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌ కాన్‌ సమాంతర పనులు ప్రారంభిం చింది. పనులు నెమ్మదించకుండా అధికారు లు పర్యవేక్షణ జరుపుతున్నారు. పనుల ప్రారంభమై ఆరు నెలలైన సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
Link to comment
Share on other sites

హైదరాబాద్‌‌లో మాదిరిగా విజయవాడలో..: చంద్రబాబు
30-01-2018 21:06:27

అమరావతి: ఏపీలోని రహదారులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌ను నిడమానూరు వరకు పొడిగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌ తరహాలో విజయవాడలో కీలకమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని సీఎం అధికారులకు వివరించారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌ను నవంబర్‌నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. విజయవాడ-గుండుగొలను, గుండుగొలను-రాజమండ్రి రహదారులను రెండు దశలలో పూర్తిచేయాలని అధికారులకు చంద్రబాబు వివరించారు.
 
సమీక్షలోని ముఖ్యాంశాలు..
"అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే పనుల్లో వేగం పెరగాలి. జూన్ నాటికి భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి. సవరించిన అలైన్‌మెంట్ ప్రకారం 189 కిలోమీటర్ల మేర అమరావతి బాహ్యవలయ రహదారి నిర్మాణం ఏర్పాటు చేయాలి. నెల్లూరు-తడ మార్గాన్ని 6 వరుసలుగా మార్చాలి. విశాఖ-రాయపూర్ రహదారికి అక్టోబరు నాటికి డీపీఆర్ సిద్ధం చేయాలి. వైకుంఠమాల రహదారిని నాయుడుపేట, చిత్తూరు, మదనపల్లి తదితర ప్రాంతాలకు అనుసంధానమయ్యేలా చూడాలి. సమగ్ర ప్రతిపాదనలను వచ్చే సమావేశంలోగా రూపొందించాలి" అని అధికారులను సీఎం ఆదేశించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌.. రెండో వరస ఎప్పుడో?
26-03-2018 08:09:59
 
636576486000607774.jpg
  • డీపీఆర్‌ సమర్పించి కాలం గడుస్తున్నా.. టెండర్లు పిలవని పరిస్థితి
  • రూ.110 కోట్ల వ్యయంతో ఇప్పటికే ప్రతిపాదనలు
  • జాప్యంతో మరింత పెరగనున్న అంచనా వ్యయం
 
విజయవాడ: బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ రెండోవరస పనుల విషయంలో జాప్యం జరుగుతోంది. ఫ్లై ఓవర్‌ రెండు వరసలను సమాంతరంగా చేట్టాల్సిన పనుల్లో ఇప్పటికే జాప్యం జరిగిందనుకుంటే.. రెండో వరసకు టెండర్ల విషయంలో మరింత జాప్యం నడుస్తోంది. దీనివల్ల ఇప్పటికే రూ.25 కోట్లమేర వ్యయం పెరిగింది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌) కేంద్రానికి సమర్పించి రెండునెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఆమోదంగానీ, టెండర్లుగానీ పిలవలేదు. జాప్యం జరిగితే అంచనా వ్యయం మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది. బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ రెండో వరస ప్రతిపాదన ఇంకా స్టాండింగ్‌ ఫైనాన్స్‌ కమిటీ (ఎస్‌ఎఫ్‌సీ) వద్దే ఉంది.
 
   ఎస్‌ఎఫ్‌సీ ఆమోదంతోనే టెండర్లకు అవకాశం ఉంటుంది. డీపీఆర్‌ ఆమోదంలో జాప్యం వల్లే సమస్య తలెత్తుతోంది. 16 నెంబర్‌ జాతీయ రహదారిపై బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను ఐకానిక్‌లా రూపొందించాలన్న ఉద్దేశ్యంతో గ్రీన్‌బెల్ట్‌ల స్థానంలో రెండు వరసల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు డిజైన్లను రూపొందించి కేంద్రం అనుమతులు తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకముందే ఫ్లైఓవర్‌ నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ టెండర్లు పిలిచింది. రెండువరసల విధానంలో నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో, రెండో వరసకు ప్రత్యేకంగా టెండర్లు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో మొదటి వరస పనులను కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ చేపట్టింది. ఈ ఏడాది నవంబర్‌ నాటికి మొదటివరస పనులను పూర్తిచేయాల్సి ఉంది. ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. నెలలోగా రెండో వరస పనులు కూడా ప్రారంభించాల్సిన తరుణంలో.. డీపీఆర్‌లో జాప్యం జరిగింది. మొదటి వరసను రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించగా.. రెండో వరసకు డీపీఆర్‌ రూపొందిస్తే రూ.110కోట్ల వ్యయం అయింది.
 
   ఈ కొద్ది సమయానికే రూ.25 కోట్లు పెరిగింది. మొదటి వరసను మరో ఎనిమిది నెలల్లో కాంట్రాక్టు సంస్థ పూర్తిచేయాల్సి ఉంది. ఇంకా రెండోవరస పట్టాలెక్కకపోతే మున్ముందు మరింత సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే బెంజిసర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగాయి. భారీ వాహనాలను రాత్రివేళల్లో మాత్రమే అనుమతిస్తుండటం వల్ల కొంత మెరుగ్గా ఉంది. రెండో వరుస పనులు ప్రారంభించి పూర్తిచేయటానికి ఏడాది సమయాన్ని నిర్దేశించే అవకాశం ఉంటుంది. ఈలోగా వాహన సాంద్రత మరింత పెరగటం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. టెండర్లు పిలిచాక.. కొన్ని సంస్థలు ముందుకు వచ్చిన తర్వాత టెక్నికల్‌, ఫైనాన్షియల్‌ బిడ్లను పరిశీలించి కాంట్రాక్టు సంస్థను ఖరారు చేయటానికి, అపాయింట్‌ డేట్‌ ఇవ్వటానికి సమయం పడుతుంది. ఈ క్రమంలో మరింత జాప్యం అయ్యే పరిస్థితి ఉంటుంది.
Link to comment
Share on other sites

కీలకంగా మారిన ఆ రెండు పిల్లర్ల నిర్మాణం..!
06-04-2018 08:01:01
 
636585984626762231.jpg
  • బెంజ్‌ రింగ్‌ దగ్గర రెండు పిల్లర్ల నిర్మాణం
  • ఎన్‌హెచ్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌ తర్జన భర్జన
  • ఒక రోడ్డు అంతా బ్లాక్‌ చేయాల్సిన పరిస్థితి
  • రెండు నెలల పాటు వాహనదారులకు తప్పని చిక్కులు
  • ట్రాఫిక్‌ పోలీసులతో సంయుక్త పరిశీలన తర్వాత డైవర్షన్‌ నిర్ణయం
 
బెంజిసర్కిల్‌ రింగ్‌ దగ్గర రెండు ఫ్లై ఓవర్‌ పిల్లర్ల నిర్మాణం జాతీయ రహదారుల శాఖ (ఎన్‌హెచ్‌)ను, కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ను వణికిస్తోంది. రింగ్‌ దగ్గర రెండు వైపులా పిల్లర్ల నిర్మాణం వల్ల ఓ వైపు ఎన్‌హెచ్‌-16ను పూర్తిగా బ్లాక్‌ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. పోలీసు శాఖతో ఎన్‌హెచ్‌, కాంట్రాక్టు సంస్థల అధికారులు ఈ డిజైన్‌పై చర్చించిన తర్వాత క్షేత్రస్థాయిలో సంయుక్త పరిశీలన చేసిన తర్వాత మాత్రమే సంయుక్తంగా డైవర్షన్‌ ప్లాన్‌ అమలు చేయనున్నారు. దీంతో నగర ప్రజలకు రెండు నెలలపాటు ట్రాఫిక్‌ కష్టాలు ఏర్పడనున్నాయి.
 
 
 
విజయవాడ: విజయవాడ నగరానికి ప్రతిష్ఠాత్మకమైన ఫ్లై ఓవర్లలో రెండవ దైన బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులు పతాక స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్‌ నెలాఖరుకు ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న ఎన్‌హెచ్‌ అధికారులకు బెంజిసర్కిల్‌ రింగ్‌ దగ్గర వేయాల్సిన రెండు పిల్లర్ల నిర్మాణ పనులు కీలకంగా మారనున్నాయి. నగరంలోనే అత్యంత రద్దీ కూడలి అయిన బెంజిసర్కిల్‌ రింగ్‌ దగ్గర ఎన్‌హెచ్‌ - 16, ఎన్‌హెచ్‌ - 65 , బందరు రోడ్డులు అనుసంధానమౌతాయి. సరిగ్గా రింగ్‌ దగ్గర ఎదురెదురుగా రెండు పిల్లర్ల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది.
 
   ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు ఈ రెండు చోట్ల పిల్లర్ల నిర్మాణం చేపట్టలేదు. కాంట్రాక్టు సంస్థ నిర్దేశించుకున్న యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా ఈ నెలలోనే రింగ్‌ దగ్గర రెండువైపులా పిల్లర్ల నిర్మాణం చేపట్టవలసి ఉంది. ఫ్లై ఓవర్‌ అలైన్‌మెంట్‌ ప్రకారం కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ గత రెండు రోజులుగా మార్కింగ్‌ పనులు చేపడుతోంది. ఈ మార్కింగ్‌ ప్రకారం చూస్తే.. ఆంజనేయస్వామి గుడి ఎగువన ఒక పిల్లర్‌ , తొలగించిన సబ్‌ పోలీసు కంట్రోల్‌ పాయింట్‌ దగ్గర మరో పిల్లర్‌ నిర్మాణం చేపట్టవలసి వస్తోంది. ఈ రెండు ప్రాంతాల్లో ముందుగా పిల్లర్‌ మార్కింగ్‌ చేపట్టారు. జాతీయ రహదారి మీద నిర్మించే పిల్లర్లు కాబట్టి కాంట్రాక్టు సంస్థ వాహన రాకపోకలకు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐరన్‌ బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేస్తోంది. బెంజిసర్కిల్‌ రింగ్‌ దగ్గరకు వచ్చేసరికి పిల్లర్లు సమీపంలోకి వస్తున్నాయి.
 
    దీనికి అనుగుణంగా బ్యారికేడింగ్‌ మార్కింగ్‌ను చేశారు. ఈ మార్కింగ్‌ ప్రకారం చూస్తే.. జాతీయ రహదారిపై ఒక వైపు వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారనుంది. దాదాపుగా వాహనాలను నడపటం అసాధ్యమనే చెప్పాలి. జాతీయ రహదారిపై ఒక వైపు వాహనాలను డైవర్షన్‌ చేయాల్సిన పరిస్తితి ఏర్పడుతోంది. ఎన్‌హెచ్‌ అధికారులు, కాంట్రాక్టు సంస్థ కలిసి దీనికి సంబంధించి ఒక డిజైన్‌ను రూపొందించి పోలీసు శాఖతో చర్చించాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్‌ అధికారులు దీనికి సంబంధించిన డి జైన్‌ను సిద్ధం చేశారు. ఈ డిజైన్‌ను బహిర్గతం చేయటానికి ఎన్‌హెచ్‌ అధికారులు అంగీకరించకపోయినా... నగర ప్రజలు త్యాగం చేసే పరిస్థితి కొద్దిరోజులు ఉంటుందని తెలుస్తోంది. ఆంధ్రజ్యోతి సేకరించిన సమాచారం మేరకు.. ఒక వైపు పూర్తిగా బ్లాక్‌ చేయాల్సి వస్తోంది.
 
   ట్రాఫిక్‌ వెళ్ళటానికి వీలుగా మార్కింగ్‌ చేయాలనుకున్నా.. ఎన్‌ హెచ్‌, కాంట్రాక్టు సంస్థల అధికారులకు వీలుపడలేదని తెలు స్తోంది. ట్రాఫిక్‌ చిక్కుముడిని చేధించేలా మార్కింగ్‌ చేపడదామని నిర్ణయించినా ఆచరణలో అమలు సాధ్యం కాకపోయినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్‌ చిక్కుముడి వ్యవహారం ఎన్‌హెచ్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థలతో పాటు పోలీసులకు కూడా తలనొప్పిగా మారుతోంది. మరోవైపు పోలీసులు కూడా ద్రోన్‌ కెమెరాతో బెంజిసర్కిల్‌ ప్రాంతాన్ని వీడియో, ఫొటో షూట్‌ చేయించారు. పిల్లర్ల మార్కింగ్‌ ఏరియాను కూడా ఫొటోలు తీయించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత డైవర్షన్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
 
24 భూగర్భ పిల్లర్లు .. రెండు పిల్లర్లు
ప్రతిపాదితర బెంజిసర్కిల్‌ రింగ్‌ ప్రాంతంలో కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ ముందుగా భూగర్భ పిల్లర్లు వేయాల్సి ఉంటుంది. ఒక్కో చోట నాలుగు వరసలలో మొత్తం 12 భూగర్భ పిల్లర్లు వేయాలి. ఇలా రెండు చోట్ల కలిపి మొత్తం 24 భూగర్భ
 
పిల్లర్లు వేయాలి. ఆ తర్వాత వీటిపై రెండు చోట్ల ఒకటి చొప్పున పై పిల్లర్లు వేయాల్సి ఉంటుంది. పై పిల్లర్లు వేసిన తర్వాత వీటిమీద తలలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తలలు వెడల్పున కింద బారికేడింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ దిశగా కాంట్రాక్టు సంస్థ మార్కింగ్‌ చేపట్టవలసి వచ్చింది.
 
 
డైవర్షన్‌ ఎటు చేస్తారు..?
డైవర్షన్‌ మహానాడు రోడ్డు మీదుగా చేస్తారా? నిర్మలా కాన్వెంట్‌ రోడు, పంటకాల్వ రోడ్డు మీదుగా చేస్తారా? ఎటు నుంచి చేస్తారన్నది ప్రశ్నగా ఉంది. నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు నుంచి పంటకాల్వ మీదుగా డైవర్షన్‌ చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ దగ్గర ట్రాఫిక్‌ పద్మవ్యూహం ఏర్పడుతుంది కాబట్టి.. మహానాడు రోడ్డు నుంచి ఆటోనగర్‌, పాత చెక్‌పోస్టు ఏరియా, సిరీస్‌ రాజు రోడ్డు మీదుగా కరకట్ట రోడ్డుకు అనుసంధానం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కరకట్టకు అనుసంధానం చేయటం ద్వారా తిరిగి ఎన్‌హెచ్‌ - 65 పై స్కూ బ్రిడ్జి ఎగువున ఈ వాహనాలన్నీ కలిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల మీద ఎలాంటి ఎఫెక్ట్‌ పడుతుందన్నది కూడా సర్వే చేయాలి. ఒకటి రెండు రోజులు అనుకుంటే భారీ వాహనాలను నిలుపుదల చేయవచ్చు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...