Jump to content

benz circle flyover & vijayawada -bandar highway


sonykongara

Recommended Posts

  • Replies 308
  • Created
  • Last Reply

OK. . Elections time ki complete ayite baguntuntundi.

 

2sides okesari start chestunnara..lekapote oka side complete chesi other side start chestara...

బెంజిసర్కిల్ ప్లై ఓవర్ కు శ్రీకారం... రేపు ఉదయం 9:30 నిమషాలకు ముహూర్తం...

 

 
benz-circle-flyover-11062017.jpg
share.png

విజయవాడ వాసుల చిరకాల కల బెంజిసర్కిల్ ప్లై ఓవర్.... విశాఖపట్నం-విజయవాడ-చెన్నై, విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారులను అనుసంధానం చేసే కీలకమైన కూడలి. విజయవాడ నగరంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం.. ఇప్పడు బెంజిసర్కిల్ పై నిర్మిస్తున్నప్లై ఓవర్ కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోనే రెండో అతిసుందరమైన ప్లై ఓవర్ గా దీనిని నిర్మించబోతున్నారు. రేపు (జూన్ 12 ) ఉదయం 9 .30 కు ప్లై ఓవర్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. బెంజ్ సర్కిల్ యెస్ వి యెస్ కల్యాణ మండపం వద్ద,(జ్యోతి మహల్ ఎదురుగా) కార్యక్రమం జరగునుంది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో, చిరకాల కల తీరనుంది.

ఇదీ నేపధ్యం:

బెంజిసర్కిల్ నిత్యం రద్దీగా ఉంటుంది. రోజూ సుమారు లక్ష వాహనాలు ఈ కూడలి మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. జాతీయ రహదారి, జాతీయ రహదారి, నగరంలో ప్రయాణించే వాహనాలు రెండూ బెంజిసర్కిల్ వద్ద కలుస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు అవసరాల దృష్యా జాతీయ రహదారి పై రద్దీని నియంత్రించేందుకు కూడలిలో ప్లై ఓవర్ నిర్మాణం ఒక్కటే మార్గమైంది.

విజయవాడ-బందరు జాతీయ రహదారి నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. బెంజిసర్కిట్ ప్లై ఓవర్ నిర్మాణ పనులు రెండిటికి కలిపి ఒక ప్యాకేజీగా టెండర్లను పిలిచారు. ఈ ప్యాకేజీలో 64.611 కిలోమీటర్ల బందరు రోడ్డు విస్తరణలో నాలుగు మేజర్, ఐదు చిన్న, మరో ఐదు పాదచారుల బ్రిడ్డిలతో పాటు బెంజిసర్కిల్ ప్లై ఓవర్ ను నిర్మించనున్నారు. ఈ పనులను దిలీప్ బిల్డ్కాన్ సంస్థ రూ.740.10 కోట్ల అంచనాతో టెండర్డు దక్కించుకుంది.

 

మొదట ఆనుకున్నట్టగా జ్యోతిమహల్ నుంచి నిర్మల కాన్వెంట్ వరకూ 618 మీటర్ల పొడవునా ఫ్లై ఓవర్ నిర్మాణానికి డిజైన్లు రూపొందించారు. దీనికి రూ.82 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత నిర్మల కాన్వెంట్ నుంచి రమేష్ ఆస్పత్రి వరకూ ఈ ప్లై ఓవర్ నిర్మాణాన్ని అదనంగా మరో 820 మీటర్లకు పెంచారు. ఇందు కోసం సుమారు రూ.120 కోట్ల వ్యయం అంచనా. రెండు వైపులా కలిపి మొత్తం 96 పిల్లర్లు నిర్మించనున్నారు.

సూపర్ ఫాస్ట్ గా నిర్మాణం:

త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులను రెండువైపులా మొదలు పెట్టనున్నారు. జ్యోతిమహల్ నుంచి ఓ వైపు, నిర్మల కాన్వెంట్ నుంచి మరో వైపు పిల్లర్ పనులు ప్రారంభిస్తారు. ఒక్కో పిల్లర్ నడుమ 30 మీటర్ల దూరం ఉంటుంది. ఇలా 5, 6 పిల్లర్ల నడుమ ఇటు సర్వీస్ రోడ్డు, అటు జాతీయ రహదారిపై 20 అడుగుల మేర బారికేడింగ్ ఏర్పాటు చేసి ఒకేసారి వీటిని నిర్మించనున్నారు. రెండువైపులా పిల్లర్ల నిర్మాణం మొదలవుతుంది. ఈ సందర్భంగా బారికేడింగ్ ప్రాంతంలో జాతీయ రహదారి 20 అడుగులు, సర్వీసు రోడ్డు 14 అడుగులు మాత్రమే వినియోగంలో ఉంటుంది. బారికేడింగ్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో రద్దీని నియంత్రించడానికి ట్రాఫిక్ను మళ్లిస్తారు. పిల్లర్ల ఎత్తు ఐదున్నర అడుగులు వచ్చాక ఆయా ప్రాంతాల్లో బారికేడింగ్ను తొలగిస్తారు.

నూతన డిజైన్లతో నిర్మాణం:

నూతన డిజైన్ల ప్రకారం బెంజిసర్కిల్ ప్లై ఓవర్ 1.438 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. ఉజ్జయినిలో ఉన్న ప్లై ఓవర్ తరహాలో దీని డిజైన్ల రూపొందించారు. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. జ్యోతిమహల్ నుంచి విశాఖపట్నం వైపు వాహనాలు వెళ్లేందుకు ఒక ఫ్లై ఓవర్, ఎగ్జిక్యూటివ్ క్లబ్ నుంచి చెన్నై వైపు వెళ్లేందుకు ఒక ప్లై ఓవర్ను నిర్మిస్తారు. రాకపోకలకు విడిగా రెండు ప్లై ఓవర్లను సమాంతరంగా (ఒక్కో ఫై ఓవర్ మూడు లేన్లతో) నిర్మిస్తాడు. మొత్తం ఆరు లేన్లు ఉంటాయి. రెండు ఫ్లై ఓవర్ల మధ్య ఖాళీ ఉంటుంది. అలాగే ప్లై ఓవర్కు ఇరు వైపులా సర్వీసు రోడ్డు ఉంటుంది.

2018 జూన్ నాటికి పనులు పూర్తి చెయ్యటానికి టార్గెట్ పెట్టుకున్నారు.

Link to comment
Share on other sites

2018 జూన్ నాటికి పనులు పూర్తి చెయ్యటానికి టార్గెట్ పెట్టుకున్నారు.

 

Konchem late ayina elections time ki complete ayipotundi :super:

Link to comment
Share on other sites

Guest Urban Legend

vja ki orr or bypass vesthey asala traffic undadhu.....why dont they do that?

 

antha easy ah annai,,,paisal evi

avvani next term ke ..not anytime sooner

BTW enni vesina city lo traffic vuntundhi ...city perugutundhi roju rojuki

andharu car lu teestunnaru

Link to comment
Share on other sites

antha easy ah annai,,,paisal evi

avvani next term ke ..not anytime sooner

BTW enni vesina city lo traffic vuntundhi ...city perugutundhi roju rojuki

andharu car lu teestunnaru

yes but ah lorrys valla chala traffic agipotundi adi main problem,pushkaralu appudu route marcharu lorrys ni city loki allow cheyyala,ah 12days traffic chala takkuva undedi

Link to comment
Share on other sites

Annai vij lo land pooling ante paisal chala kavali.I think govt ki anta seen ledanukonta

 

vijayawada bypass ki 90% land acquisition complete ayyindi long time ago. those farmers are still waiting for the project to take off. Gaman vallu dramalu aadaru innallu. recent ga valla contract cancel chestunnatulu vacchindi news.

Link to comment
Share on other sites

బెంజ్‌సర్కిల్‌లో ఫ్లైఓవర్‌ పనులు ప్రారంభం

విజయవాడ: విజయవాడ నగరానికి ట్రాఫిక్‌ కష్టాలు తీర్చే బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది నాటికి పైవంతెన పనులు పూర్తవుతాయని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతో కలిసి ఆయన వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.220కోట్ల వ్యయంతో రమేష్‌ ఆస్పత్రి నుంచి స్కూబ్రిడ్జి వరకు.. రూ.1.47కిలోమీటర్ల మేర ఆరు వరుసల్లో పైవంతెన నిర్మించనున్నట్లు మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఫ్లైఓవర్‌ నిర్మాణంతో విజయవాడ ప్రజల చిరకాల వాంఛ తీరుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4వేల కోట్లతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ వంతెన అమరావతి నగరానికి గేట్‌ వేగా మారుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

బెజవాడకు మణిహారం..బెంజ్‌ సర్కిల్ ఫ్లై ఓవర్‌
13-06-2017 07:38:21
 
636329364233537866.jpg
  • వచ్చే ఏడాదికి సాకారం..
  • బెంజ్‌ సర్కిట్‌ ఫ్లై ఓవర్‌ పనులకు భూమి పూజ
  •  వచ్చే ఏడాది ఆగస్టుకు పూర్తి చేయాలని మంత్రి ఉమా ఆదేశం 
  • డిసెంబర్‌ వరకు గడువు కోరిన కంపెనీ
  •  స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ప్రారంభించాలని యోచన 
  • స్ర్కూబ్రిడ్జి వద్ద అండర్‌ పాస్‌ వే
  • ఫ్లైఓవర్‌ పూర్తయితే  18 వరుసల రహదారిగా రూపాంతరం
ఆంధ్రజ్యోతి, విజయవాడ: నిత్యం వాహనాల రద్దీ! ఒకవైపు వాహనాలు ముందుకు కదిలితే మిగిలిన మూడు వైపులా ఆగిపోవాల్సిందే!! పాదచారులు అడుగు వేయడానికి వీల్లేని పరిస్థితి!!! ఇదీ విజయవాడలోని బెంజ్‌సర్కిల్‌ రూపం. దీన్ని పూర్తిగా మార్చడానికి అడుగులు ముందుకు పడ్డాయి. రూ.220 కోట్లతో నిర్మించే ఫ్లైఓవర్‌ పనులకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌మీరా, మేయర్‌ కోనేరు శ్రీధర్‌ సోమవారం శ్రీకారం చుట్టారు. ముందుగా ఇక్కడున్న ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయలు కొట్టారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఎక్సకవేటర్‌ ఎక్కి స్విచ్ఛాన్‌ చేశారు. ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న బిల్డ్‌కాన్‌ కంపెనీ రూపొందించిన ఫ్లైఓవర్‌ మ్యాప్‌ను వారు పరిశీలించారు.
 
అభివృద్ధిని ఎవరూ ఆపలేరు
విజయవాడ అభివృద్ధిని 60 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారు. బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ పూర్తయితే ఇక విజయవాడ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. రూ.220 కోట్లతో ఈ వంతెనలను నిర్మిస్తున్నారు. జాతీయ రహదారిపై రెండు వైపులా ఆరు లైన్ల రహదారులతో కూడిన వంతెనలు వస్తాయి. వీటితోపాటు సర్వీసు రహదారులు అన్నీ కలిపి 18 వరుసల రహదారులు ఉంటాయు. 1.47కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్‌ వస్తుంది. మొదట్లో ఈ ఫ్లైఓవర్‌కు 81మీటర్ల వరకు మాత్రమే అనుమతిచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో శంకుస్థాపన చేయించి దాన్ని ఒక కిలోమీటరకు పెంచేలా కృషి చేశారు. 16 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులకు చెప్పాం. దుర్గగుడి ఫ్లైఓవర్‌ అసాధ్యమన్నారు. దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాం. త్వరలో 47 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విజయవాడకు రాబోతున్నాయి. దేశంలో ఏ నగరంలోనూ ఇలా పెట్టుబడులు రావడం లేదు. భవిష్యత్తులో బెజవాడ అభివృద్ధి పరుగులు తీస్తుంది.

- కేశినేని నాని, ఎంపీ
 
ఫ్లైఓవర్‌ గేట్‌ వే ఆఫ్‌ అమరావతి
విజయవాడ వాసుల దీర్ఘకాలిక కోరిక బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌. దీనికి రెండు వైపులా మొక్కలను పెంచి పచ్చదనంతో సుందరీకరిస్తాం. ఈ ఫ్లైఓవర్‌ అమరావతికి ‘గేట్‌ వే ఆఫ్‌ అమరావతి’గా ఉంటుంది.

- గద్దె రామ్మోహనరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే
 
వచ్చే ఏడాది ఆగస్టు 15నాటికి
ప్రారంభించాలనుకుంటున్నాం

ఎందరో మహానుభావులు ఇక్కడి నుంచి పోరాటాలు చేశారు. ఈ ఫ్లైఓవర్‌ను 2018 నవంబర్‌ లేదా డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15నాటికి సీఎంతో ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని చెప్పాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈ ఫ్లైఓవర్‌ను పొడిగించారు. మొదటి, రెండు దశల్లో ఈ పనులు పూర్తవుతాయి. రూ.740 కోట్లతో బందరు రోడ్డు విస్తరణ, రూ.100 కోట్లతో ఆరు లైన్ల ఫ్లైఓవర్‌ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. నాడు అధికారంలో ఉండగా వీటి గురించి పట్టించుకోని కొంతమంది ఇప్పడు మాపై రాళ్లు వేస్తున్నారు. పెద్ద, చిన్న తేడా లేకుండా మాట్లాడుతున్నారు. అయినా ప్రజలకు అన్ని విషయాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది.

- దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ మంత్రి
 
ఇదీ వంతెన
  •  బెంజ్‌సర్కిల్‌ వద్ద జాతీయ రహదారిపై రెండు వైపులా రెండు ఫ్లైఓవర్లు నిర్మిస్తారు.
  •  ఒక్కో ఫ్లైఓవర్‌పై మూడు లేన్ల రహదారి ఉంటుంది.
  •  ఈ వంతెనలు స్ర్కూబ్రిడ్జి వద్ద ఆరంభమై రమేష్‌ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారితో కలుస్తాయి.
  •  స్ర్కూబ్రిడ్జి వద్ద ఉన్న కూడలి వద్ద సర్వీసు రహదారుల నుంచి వచ్చే వాహనాలకు అంతరాయం లేకుండా ఇక్కడ అండర్‌ పాస్‌ వే నిర్మిస్తారు.
  • దీని వల్ల నాలుగు ప్రధాన కూడళ్లలో ఉన్న ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది.
  • ఈ రెండు ఫ్లైఓవర్లకు మధ్యన రహదారిని మొక్కలతో సుందరీకరిస్తారు.
Link to comment
Share on other sites

శరవేగంగా బెంజ్‌సర్కిల్ ఫ్లై ఓవర్ పనులు
 
 
636345844019066185.jpg
  • ఫ్లై ఓవర్‌.. ఒక వరుసలో 40 శాతం ఎర్త్‌ పిల్లరింగ్‌ పూర్తి
  • రాత్రికి రాత్రే ఎర్త్‌హోల్‌ పనులు..
  • వేగంగా బారికేడ్ల మధ్య పనులు
  • ముఖ్యమంత్రి ఆదేశాలతో రెండవ భాగంలో ట్రీ రీప్లేస్‌మెంట్‌
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎస్‌వీఎస్‌ కల్యాణమండపం నుంచి నిర్మలా కాన్వెంట్‌ జంక్షన్‌ వరకు ఒక వరసలో కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ ఫ్లై ఓవర్‌ పనులకు శ్రీకారం చుట్టింది. అత్యంత బిజీ కూడలి కావటంతో జాతీయ రహదారి మీద పనులకు ఎలాంటి అవాంతరం కలగకుండా ఉండటానికి ఒక వరసన ప్రవేశం లేకుండా బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేసి మరీ పనులు చేపడుతున్నారు. ఫ్లై ఓవర్‌ పిల్లర్స్‌, దానిపైన వయాడక్ట్‌ నిర్మించటం ఒక ఎత్తు అయితే.. భూమిలో వేసే ఎర్త్‌ పిల్లరింగ్‌ పనులు మరో ఎత్తు. ఎర్త్‌ పిల్లరింగ్‌ పనులు పూర్తి చేయటానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎర్త్‌పిల్లరింగ్‌ పనులను కాంట్రాక్టు సంస్థ వేగంగా చేపడుతోంది.
 
ఎర్త్‌పిల్లరింగ్‌కు అవసరమైన హోల్స్‌ వేస్తున్నారు. బెంజిసర్కిల్‌ ఆంజనేయస్వామి టెంపుల్‌ సమీపంలో పిల్లర్‌ హోల్స్‌లో ఐరన్‌ఫ్రేమ్‌లను ఏర్పాటు చేయటానికి చర్యలు చేపట్టారు. భూమిలోకి ఐరన్‌ ఫ్రేమ్స్‌ను దింపటానికి వీలుగా బ్యారికేడ్ల మధ్య అవరణలో రెండు క్రేన్లను అందుబాటులో ఉంచారు.
 
బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పేరుతో అడ్డగోలుగా చెట్లను కొట్టివేయటంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. చెట్లను నరికివేయటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. ఇటీవల జరిపిన సమీక్షలో చెట్లను తొలగించాల్సి వస్తే రీ ప్లేస్‌మెంట్‌ చేయమని అర్బన్‌ గ్రీనరీ శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో నిర్మలా జంక్షన్‌ నుంచి రమేష్‌ హాస్పిటల్‌ వరకు పార్ట్‌ - 2 ఫ్లై ఓవర్‌ పనుల నేపథ్యంలో చెట్లను నరికివేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అర్బన్‌గ్రీనరీ శాఖ రంగంలోకి దిగింది. గ్రీన్‌బెల్టులో ఉన్న చెట్ల కొమ్మలను కొంత వరకు తొలగించి... చెట్టు మొదలు ఒక సర్కిల్‌గా మార్కింగ్‌ చేసి మూడు అడుగుల వెడల్పున తవ్వుతున్నారు. ఆ విధంగా చెట్టును సజీవంగా తొలగించి ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. సజీవంగా చెట్లను తొలగించటం మంచి విషయమైనా ఈ చెట్లను ఎక్కడ నాటుతున్నారన్నదానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...