Jump to content

benz circle flyover & vijayawada -bandar highway


sonykongara

Recommended Posts

  • Replies 308
  • Created
  • Last Reply
Guest Urban Legend

Gadde rammohan ki 2019 lo majority perigina krishna lanka area nundi manaku votes padavu,ah soma company valla,of course krishna lanka vallu eppudu veyyaru manaki

 

soma vadu rod pedutunnadu

ah klanka road works chaala delay chestunnadu

ah sagam kattina underpass deggara people facing too many problem

anyways pk batch picha lite

Link to comment
Share on other sites

soma vadu rod pedutunnadu

ah klanka road works chaala delay chestunnadu

ah sagam kattina underpass deggara people facing too many problem

Yes,gadde ah soma vallaki roju cheptunnadu work complete cheyyamani but no use,inka light tisukunnadu klanka area ni,but other areas lo one side voting untadi esari gadde ki
Link to comment
Share on other sites

soma vadu rod pedutunnadu

ah klanka road works chaala delay chestunnadu

ah sagam kattina underpass deggara people facing too many problem

 

Mundu emo Soma thopu builder annam... problem ekkada, Approvals lo naa or Govt funds release cheyadam lo naa??? :blink:

 

2nd de problem ayyi untadi... 

Link to comment
Share on other sites

Guest Urban Legend

Mundu emo Soma thopu builder annam... problem ekkada, Approvals lo naa or Govt funds release cheyadam lo naa??? :blink:

 

2nd de problem ayyi untadi... 

 

ledhu

Soma tho ne problem

 

http://www.business-standard.com/article/companies/highway-developer-soma-enterprise-heads-for-cdr-113052101088_1.html

 

http://www.deccanchronicle.com/140123/news-businesstech/article/infrastructure-companies-deep-crisis

Link to comment
Share on other sites

 

itta ayithe... inka ee flyover ayinatte :blink:

 

ee bridge anukunna deadline lo complete cheyalekapothe.. remove chese chance unda mari?

Link to comment
Share on other sites

  • 4 weeks later...

  నిర్మాణాలు తొలగించకుండానే పైవంతెన?

అదనపు పనులకు త్వరలో టెండర్లు

మరోసారి మట్టి పరీక్షలు

ఈనాడు, అమరావతి

kri-gen1a.jpg

ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే, భూసేకరణ అవసరం లేకుండానే బెంజిసర్కిల్‌ పైవంతెన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రణాళికలు రూపొందించింది. భూసేకరణ లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న సర్వీసు రోడ్లు కొంత తగ్గించే అవకాశం ఉంది. ఒకవైపు 1.5 మీటర్ల చొప్పున సర్వీసు రోడ్డు కుంచించుకుపోనుంది. భవిష్యత్తులో దీన్ని విస్తరించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. బెంజి సర్కిల్‌ పైవంతెన ఆకృతులు ఖరారు కావడంతో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మరోసారి మట్టి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టరు సురేష్‌ ‘ఈనాడు’తో చెప్పారు. ఒకవైపు నిర్మాణం ప్రారంభిస్తూనే మరోవైపు ఈపీసీ టెండర్లను పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి చేయాలనేది ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికరంగా ఉన్నారు. విజయవాడ నగరానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న బెంజి సర్కిల్‌ రూపురేఖలు మారకుండానే అపురూపమైన పైవంతెన నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి డిజైన్లు దాదాపు ఖరారయ్యాయి. కేవలం 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేశంలోనే రెండో సుందర పైవంతెనగా దీన్ని నిర్మాణం చేయాలన్నారు.

అదనంగా టెండర్లు..! : బెంజి సర్కిల్‌ పైవంతెన అదనంగా పొడిగించిన దానికి మళ్లీ ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఒకవైపు నిర్మాణం చేపట్టి మరోవైపు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. పూర్తిస్థాయి పనులకు ఆకృతులు రూపొందించారు. ప్రస్తుతం ఎలాంటి భూసేకరణ, భవనాల తొలగింపు లేకుండానే ఈ పైవంతెన నిర్మాణం చేయడం విశేషం. బెంజిసర్కిల్‌ పైవంతెన ఆకృతులకు ఆర్‌కే అసోసియేట్స్‌ రూపొందించింది. ఉజ్జయిని నగరంలో ఉన్న పైవంతెన తరహాలో దీని ఆకృతులు రూపొందించారు. బందరు రోడ్డు నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణ, బెంజి సర్కిల్‌ పైవంతెన కలిపి ఒక ప్యాకేజీగా టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. దీనిలో 64.6 కిలోమీటర్ల బందరు రోడ్డుకు రూ.740.70 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనిలో నాలుగు మేజర్‌, అయిదు చిన్న, అయిదు పాదచారుల వంతెనలు నిర్మాణం చేయనున్నారు.

* మొదట రూపొందించిన ఆకృతుల ప్రకారం బెంజి సర్కిల్‌ పైవంతెన 618 మీటర్లు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి రూ. 82 కోట్లు కేటాయించారు. బందరు రోడ్డు విస్తరణ ప్యాకేజీలోనే దీన్ని చేర్చారు. ఈ పనులను దిలీప్‌కాన్‌ సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం పైవంతెన పనులను ఆ సంస్థ ప్రారంభించనుంది.

* ప్రస్తుతం సమర్పించిన ఆకృతుల ప్రకారం పైవంతెన నిర్మాణం 1.40 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయనున్నారు. జ్యోతిమహల్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌ వరకు పైవంతెన నిర్మాణం ఉంటుంది. అదనంగా 820 మీటర్లు పొడిగించారు. దీనికి అంచనా వ్యయం దాదాపు రూ.100 కోట్లు అవుతుందని అధికారులు తెలిపారు.

* ఈ మిగిలిన పార్టుకు ఈపీసీ టెండర్లను పిలవాల్సి ఉంది. త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలిసింది. దిలీప్‌కాన్‌ సంస్థకే దక్కకపోతే ఏంచేస్తారనేదానిపై అధికారుల వద్ద సమాధానం లేదు.

* కొత్త ఆకృతుల ప్రకారం పైవంతెన రెండు భాగాలుగా ఉంటుంది. రాకపోకలకు విడిగా రెండు వంతెనలు సమాంతరంగా నిర్మాణం చేస్తారు. ఒక్క వంతెన మూడు వరసలతో నిర్మాణం చేస్తారు. అంటే మెత్తం ఆరు వరసల వంతెనగా నిర్మాణం ఉంటుంది. ఒక్కవైపు దాదాపు 7.5మీటర్ల వరకు ఉంటుంది.

* ప్రస్తుతం మనుగడలో ఉన్న జాతీయ రహదారి అలాగే ఉంటుంది. డివైడర్‌ మినహా ఒకవైపు 7.5 మీటర్ల చొప్పున ఆరు వరసల రహదారిగానే ఉంటుంది. దానికి ఇరువైపులా రెండు వరసల సర్వీసు రోడ్డు నిర్మాణం చేస్తారు. ఇరువైపులా కలిపి నాలుగు వరసల సర్వీసు రోడ్డు ఉంటుంది.

* భూసేకరణ, భవనాల తొలగింపు వద్దని నిర్ణయించుకోవడంతో ప్రస్తుతం ఉన్న సర్వీసు రోడ్డు కొంత తగ్గించే అవకాశం ఉంటుంది. సర్వీసు రోడ్డు విస్తరించాలంటే ప్రస్తుతం ఉన్న భవనాలను, ప్రైవేటు భూములను సేకరించాల్సి ఉంటుంది. దీనికి రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే భూసేకరణ, పరిహారం జోలికి వెళ్లడం లేదు.

* భవిష్యత్తులో ట్రాఫిక్‌ను బట్టి సర్వీసు రోడ్డును విస్తరించే అవకాశాలను పరిశీలిస్తారు. ట్రాఫిక్‌ అంతగా లేకపోతే అలాగే వదిలివేసే అవకాశం ఉంది.

* రెండు పైవంతెనల మధ్యలో జాతీయ రహదారి ఉంటుంది.

* ఇంతకు ముందే మట్టి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. నల్లరేగడి నేల కావడంతో ఫైల్‌ఫౌండేషన్‌ పటిష్టంగా ఉండాలని నిర్ణయించారు. దీనిపై అనుమానాలు నివృత్తి చేసేందుకు మరోసారి మట్టి నమూనాలు సేకరించి పంపుతున్నామని పీడీ సురేష్‌ చెప్పారు.

టెండర్లు పిలుస్తాం..! : బెంజి సర్కిల్‌ పైవంతెన పనులు వారంలో ప్రారంభిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ సురేష్‌ వెల్లడించారు. ఆకృతులు ఖరారు చేశామని, చెట్లను తొలగించేందుకు నిరభ్యంతర పత్రాల కోసం దరఖాస్తు చేశామని అనుమతులు రాగానే పనులు చేపడతామని వివరించారు. ప్రస్తుతం 618 మీటర్లకు రూ.82 కోట్లు కేటాయించామని దీనికి దిలీప్‌కాన్‌ సంస్థ చేపడుతుందని అన్నారు. అదనంగా మరో 820 మీటర్లకు రూ.100 కోట్లు అవుతుందని దీనికి టెండర్లను పిలవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఎలాంటి భూసేకరణ, భవనాల తొలగింపు, పరిహారం చెల్లింపులు లేకుండానే పైవంతెన నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Bandar road 4 lanes eppatiki avutayi any idea. How will it impact prices near poranki tadigadapa ashok nagar. Gajam 40k chebutunaru currently inka perige chance unda?

ippudu ammevalle kani konevadu evadu ledu... oka 5 yrs real estate anta sleeping mode..

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

అంచనాల అవరోధం

బెంజిసర్కిల్‌ పైవంతెన నిర్మాణంలో మతలబు

అదనపు పనులు తమకే ఇవ్వాలని గుత్త సంస్థ వాదన

టెండర్లను పిలవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల ప్రయత్నం

ఈనాడు, అమరావతి

ప్రాజెక్టు పేరు: బెంజి సర్కిల్‌ పైవంతెన

వంతెన దూరం: 1.40కి.మీ

ఆకృతులు: రెండు సమాంతర వంతెనలు, నాలుగు వరసలు

ప్రస్తుత అంచనా వ్యయం: సుమారు రూ.182 కోట్లు

గుత్త సంస్థకు ఇచ్చిన ధర: రూ.82 కోట్లు

టెండర్‌ నాటికి దూరం: 0.618 కిలోమీటర్లు

గుత్త సంస్థ: దిలీప్‌కాన్‌

విజయవాడలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఐకానిక్‌ పైవంతెన నిర్మాణ పనులపై మతలబు నెలకొంది. టెండర్లు పిలిచేనాటికి ఉన్న పరిస్థితులు ప్రస్తుతం మారడంతో పెరిగిన అంచనా వ్యయాన్ని ఎలా సర్దుబాటు చేయాలనేదానిపై జాతీయ రహదారుల సంస్థ మల్లాగుల్లాలు పడుతోంది. మరోవైపు పెరిగిన అంచనా వ్యయానికి అదనపు పనిగా పేర్కొంటూ టెండర్లను పిలవాలన్న ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల తీరుపై గుత్త సంస్థ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అదనపు పనులను తమకే అప్పగించాలని కోరుతోంది. లేని పక్షంలో న్యాయపోరాటం చేయాలని భావిస్తోంది. జాతీయ రహదారుల సంస్థ అధికారులు మాత్రం టెండర్లను పిలవాలనే ఆలోచనతో ఉన్నారు. దీంతో ఈ పనులు చేపట్టేందుకు స్పష్టత కావాలని ప్రస్తుత గుత్త సంస్థ కోరుతోంది. బెంజిసర్కిల్‌ పైవంతెన ఆకృతులు ఖరారు కావడంతో నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆప్రాంతంలో మార్కింగ్‌ ఇచ్చారు. మట్టి నమూనాలను పరీక్షలు చేశారు. నల్లరేగడి మట్టి రావడంతో పునాదులు పటిష్టంగా నిర్మాణం చేయాలని, ఫైల్‌ పౌండేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. స్తంభాలు ఏర్పాటు చేసే ప్రాంతంలో వృక్షాలను నరికివేతకు అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకున్నారు. ఈ అనుమతులు వివాదస్పదమయ్యాయి. వృక్షాలను మరో ప్రాంతానికి తరలించాలని రీప్లాంటేషన్‌ విధానంలో నాటాలని సీఎం అధికారులకు సూచించారు. కానీ ఇప్పటికే భారీ వృక్షాలపై వేటు పడింది. అయితే ప్రస్తుతం పనులపై స్పష్టత కొరవడింది.

ఒకే ప్యాకేజీ..!

బెంజి సర్కిల్‌ పైవంతెన, బందరు-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను ఒకే ప్యాకేజీ కింద చేర్చి టెండర్లను పిలిచారు. దీనికి అప్పట్లో రూ.1200 కోట్లు వరకు అంచనా వేశారు. భూసేకరణ మినహా నాలుగు వరసల బందరు రోడ్డు విస్తరణ, బెంజి సర్కిల్‌ పైవంతెన కలిపి రూ.740.70 కోట్లుగా నిర్ణయించి టెండర్లను అప్పగించారు. మొదట మధుకాన్‌ కంపెనీ టెండర్లను దక్కించుకుని పనులను వదిలివేసింది. తర్వాత దిలీప్‌కాన్‌ సంస్థ టెండర్లను దక్కించుకుంది. నాడు టెండర్లను ఖరారు చేసే సమయంలో బెంజి సర్కిల్‌ వద్ద కేవలం 0.618 కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి నాడు అంచనా వ్యయం రూ.82 కోట్లుగా నిర్ణయించారు. తరువాత 1.40 కిలోమీటర్లు దూరం ఖరారు చేశారు. 64.6కిలోమీటర్ల బందరు రోడ్డుకు రూ.740.70కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనిలో నాలుగు మేజర్‌ వంతెనలు, అయిదు చిన్న వంతెనలు, అయిదు పాదచారుల వంతెనలు నిర్మాణం చేయనున్నారు. పెంచిన దానికి దాదాపు రూ.100 కోట్లు అవుతుందని అధికారులు తెలిపారు. అదనపు పనులను కొత్తగా టెండర్లను పిలిచి అప్పగించాలనే ఆలోచనలో జాతీయ రహదారుల సంస్థ ఉంది. అదనపు పనుల పేరుతో కొత్తగా టెండర్లను ఎలా పిలుస్తారని గుత్త సంస్థ ప్రశ్నిస్తోంది. తమకు టెండర్‌ ధరలకే ఇవ్వాలని లేకుంటే మొత్తం పనిని రద్దు చేసి మొత్తానికి టెండర్‌ పిలవాల్సి ఉంటుందని గుత్త సంస్థ వాదిస్తోంది. బెంజిసర్కిల్‌ పైవంతెన పనులు త్వరలో ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం వెల్లడించారు. దీనిపై పలుమార్లు సమీక్షలుల నిర్వహించామని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు గుర్తించామని చెప్పారు. పెరిగిన దూరం వరకు టెండర్లను పిలిచి అప్పగిస్తారా.. లేక అదే సంస్థకు ఇస్తారా అనే విషయం తేలాల్సి ఉందని ఆయన చెప్పారు. నిబంధనల ప్రకారం జాతీయ రహదారుల సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటారని వివరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...