Jump to content

సోము వీర్రాజుకి మంత్రి పదవి?.


Kiriti

Recommended Posts


సోము వీర్రాజుకి మంత్రి పదవి?.
 
బీజేపీ నాయకుడు సోము వీర్రాజు సౌమ్య వీర్రాజుగా మారారా ? చంద్రబాబుపై నిప్పులు కురిపించే వీర్రాజు చిరునవ్వుతో సీఎంకు పూల బొకే ఎందుకు ఇచ్చినట్టు? ప్రభుత్వంపై ఎప్పుడూ విరుచుకుపడే వీర్రాజు ఇప్పుడెందుకు సైలంటయ్యారు? వీర్రాజు సౌమ్యం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏమిటి...? కారణాలేంటో మీరే చదవండి.
 
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్వవస్థీకరణ త్వరలోనే ఉంటుందన్న వార్తలతో అధికార తెలుగుదేశం పార్టీలోనే కాదు.. మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీలోనూ సందడి వాతావరణం నెలకొంది. పునర్వవస్థీకరణలో తమకు కూడా అవకాశం దక్కకపోతుందా అన్న చిగురంత ఆశతో బీజేపీ నేతలు ఊహాలోకాలలో విహరిస్తున్నారు. సరే..మంత్రి పదవిపై బీజేపీ నేతలు ఆశపడటంలో ఏ తప్పూ లేదు. కాకపోతే చంద్రబాబుకు.. తెలుగుదేశం పార్టీకి బద్ధ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్న సోము వీర్రాజు కూడా మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారన్నదే ఆసక్తికరమైన అంశం.
 
మంత్రివర్గంలో స్థానం కోసం ఆయన ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట! ఇటీవల వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాంబర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు సీఎం చంద్రబాబును కలిశారు. ఆయనకు పూల బోకే ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కలవడం వెనుక మర్మం అదేనంటున్నారు కొందరు బీజేపీ నేతలు. పైగా ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీపైన కానీ, ఏపీ ప్రభుత్వంపై కానీ ఒక్క మాట కూడా అనకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ఊ అంటే ప్రభుత్వంపై విరుచుకుపడే వీర్రాజు సైలెంటయ్యారంటే మంత్రివర్గంలో చోటు కోసమేనని చెప్పుకొస్తున్నారు.
 
ధరల పెరుగుదల అంశం నుంచి మొదలు పెడితే.. రాజధాని నిర్మాణం వరకు ప్రతీ విషయంలోనూ సోము వీర్రాజు ప్రభుత్వాన్ని తప్పుపట్టిన సందర్భాలను చూశాం. మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రభుత్వాన్ని విమర్శించిన వైనాలను వీక్షించాం. అలాంటి సోము వీర్రాజు గత కొంతకాలంగా మౌనం పాటిస్తున్నారు. అసలు ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. సీఎం చాంబర్‌ ప్రారంభోత్సవానికి వెళ్లి మరీ సీఎంకు బోకే ఇచ్చి.. శాలువతో సత్కరించారంటే ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుందన్నది ఏపీ బీజేపీ నేతల భావన! చంద్రబాబును నవ్వుతూ పలకరించడంపై తలోమాట అనుకుంటున్నారు.
 
ఇప్పటి వరకు సోముతో పాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఇప్పుడు వాళ్లంతా సోము వీర్రాజుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేక గ్రూపు అన్న ముద్ర తమపై వచ్చేట్టుగా చేసి... ఇప్పుడే చల్లగా ఆయన చంద్రబాబు కోటరిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడమేమిటని మండిపడుతున్నారు. మొత్తంగా వీర్రాజుపై బీజేపీలోని ఓ వర్గం ఇప్పుడు గుర్రుగా ఉంది. అయితే వీర్రాజు ఓ వ్యూహం ప్రకారమే ఇదంతా చేశారన్నది ఆయన సన్నిహిత వర్గాల మాట! క్యాబినెట్‌ విస్తరణలో బీజేపీకి మరో మంత్రి పదవి ఇస్తే గిస్తే అది పార్టీలో సీనియర్‌ అయిన వీర్రాజుకే దక్కాలన్నది వారి అభిప్రాయం. మంత్రివర్గంలో ఆల్‌రెడీ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు చోటు దొరికింది. ఇప్పుడు మూడో మంత్రిపదవి కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నది ఇన్‌సైడ్‌ సమాచారం. ఇదే విషయాన్ని కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. మొన్నటి వరకు పార్టీలో అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేసిన సోము వీర్రాజు ఇప్పుడు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేయడం పార్టీలో పెద్ద చర్చగా మారింది.
Link to comment
Share on other sites

Enti eedu flowers ichada CBn ki?

 TEM secretariat lo CBN tana chamber vellina roju,  ade roju manikyala rao kuda tana chamber loki maredu  ayana tho patu sarayai kuda vacchadu taruvtha CBN ni kalasi flower bookey ichhadu.emadya shah, sarayi gadi ki gattiga ichhadu extralu cheyyaku ani adi entha nijamo theliyadu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...