Anne 945 Posted October 14, 2016 Vijayawada extension pedda biscuit anukunta. http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=151666 requesting to extend up to vja.. kani mana vallu start aipoyinatu rasar 1 Prasadr reacted to this Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted October 15, 2016 విజయవాడకు హైస్పీడ్ రైలు! మైసూరు నుంచి బెంగుళూరు, చెన్నై మీదుగా విజయవాడకు త్వరలో హై స్పీడ్ రైలు రానుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, జర్మనీ దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. వచ్చే సంవత్సరం జనవరి నుంచి జర్మనీ ప్రభుత్వం అధ్యయనం ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి నిధులను జర్మనీ ప్రభుత్వం సమకూర్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. హైస్పీడ్ రైలు ఏర్పాటుపై జర్మనీ ప్రభుత్వం వచ్చే ఏడాది అధ్యయనం ప్రారంభిస్తుంది. ప్రత్యేక కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఏడాదిలోగా అధ్యయనం పూర్తి చేసి ఆ తర్వాత రెండేళ్లలో హైస్పీడ్ రైలును నడుపుతామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు శుక్రవారం వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ నుంచి ఆగ్రా వరకూ ప్రవేశపెట్టిన గతిమాన్ ఎక్స్‌ప్రెస్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. గతిమాన్ ఎక్స్‌ప్రె్‌సకు రెట్టింపు వేగంతో మైసూరు - విజయవాడ హైస్పీడ్ రైలు నడవనుంది. నిజానికి ఈ హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదన మొదట మైసూరు నుంచి చెన్నై వరకే ఉంది. సురేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడంతో హైస్పీడ్ కారిడార్‌ను విజయవాడ వరకూ పెంచాలని ఆయన భావించారు. ఈమేరకు జర్మనీ ప్రభుత్వానికి సూచించడంతో వారు అంగీకారం తెలిపారు. మైసూరు - విజయవాడ హైస్పీడ్ కారిడార్‌పై శుక్రవారం జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు జరిపింది. జర్మనీ రవాణాశాఖ మంత్రి అలెగ్జాండర్ డోబ్రింట్, కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభుతో రైల్ భవన్లో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా రైల్వే రంగంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల నడుమ అంగీకారం కుదిరింది. హైస్పీడ్ రైల్వే కారిడార్‌తో దక్షిణాది రాష్ర్టాల్లోని ముఖ్యమైన నగరాలన్నీ అనుసంధానమవుతాయని, ఇది ప్రాంతీయాభివృద్ధికి మరింత దోహదపడుతుందని సురేశ్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు. జర్మనీ ప్రభుత్వం హైస్పీడ్ కారిడార్‌పై మక్కువ చూపుతుందని తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా సురేశ్ ప్రభుతోపాటు ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచారు. హైస్పీడ్ కారిడార్‌ను విజయవాడ, విశాఖపట్నం వరకూ పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. మొదట విజయవాడ వరకూ హైస్పీడ్ కారిడార్ పనులు పూర్తి చేసి రెండో దశలో విశాఖపట్నం వరకూ పొడిగించే అంశంపై దృష్టి సారించాలని సురేశ్ ప్రభు జర్మనీ ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా సురేశ్ ప్రభు తెలియజేశారు. మైసూరు-విజయవాడ హైస్పీడ్ కారిడార్‌తో పాటు సరుకు, ప్రయాణికుల రవాణా, మౌలిక సదుపాయాల కల్పన, రైల్వే సంస్థల ఆధునికీకరణ, మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో ఐటీ సేవలు తదితర అంశాలపై సహకారానికి ఇరు దేశాల నిపుణులతో కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడంపై కూడా ఒప్పందం కుదిరినట్లు రైల్వేశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted October 15, 2016 విజయవాడ వరకు హైస్పీడ్ రైలు నడవా చెన్నై, బెంగళూరు, మైసూర్‌లతో అనుసంధానం 2017 నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభం చంద్రబాబుకు చెప్పిన రైల్వేమంత్రి సురేష్‌ప్రభు విశాఖకు పొడిగిస్తే ప్రజలకు సౌకర్యం: బాబు ఈనాడు-అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి పొరుగు రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాలతో అనుసంధానించేందుకు హైస్పీడ్ రైలు ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. మైసూరు-బెంగళూరు-చెన్నై నడవాను విజయవాడ వరకు పొడిగించనుంది. ఈ కారిడార్‌లో గంటకు 300కి.మీ వేగంతో నడిచే హైస్పీడ్ రైలు ఇస్తామని రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పారు. హైస్పీడ్ రైలు నడవాతో అమరావతి దక్షిణాదిలోని ప్రధాన నగరాలతో అనుసంధానితమై, ప్రాంతీయ అభివృద్ధి జోరందుకుంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో విజయవాడను చేర్చుతూ అధ్యయనం చేసేందుకు జర్మన్ మంత్రి, శుక్రవారం దిల్లీలో తమతో జరిగిన చర్చల్లో అంగీకరించినట్లు సీఎం చంద్రబాబుకు సురేష్‌ప్రభు ఫోన్లో తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను జర్మన్ ప్రభుత్వం ఇస్తుందని, 2017 జనవరి నుంచి పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. విశాఖను అనుసంధానించాలి.. బాబు: హైస్పీడ్ రైలు కారిడార్‌ను విజయవాడ వరకు పొడిగించడాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. అయితే దాన్ని విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు పొడిగించాల్సిన అవసరముందన్నారు. అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన పూర్తిస్థాయిలో ప్రారంభమైందని.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు విజయవాడకు చేరుకునేందుకు వేగవంతమైన రైలు కావాలని కోరారు. హైస్పీడ్ రైలుతో విజయవాడకు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted October 15, 2016 బెజవాడకి హైస్పీడ్ రైల్ ఓకే చేసింది కేంద్రం. జర్మనీ ప్రభుత్వం ఓకే అయిన ప్రాజెక్టుపై సర్వే మరో మూడు నెలల్లో మొదలు కాబోతోంది. అటు తర్వాత 2017 నాటికి పనులు ప్రారంభించి మరో రెండేళ్లలో పూర్తి చేయాలన్నది టార్గెట్. అంటే 2019 నాటికి ఏపీ బుల్లెట్ ట్రైన్ చూడబోతోంది. బుల్లెట్ ట్రైన్ వస్తే బెజవాడకి ఏంటి ? చాలా ఉంది. మైసూర్ నుంచి విజయవాడ వరకూ హైస్పీడ్ రైలు నడపాలన్నది ప్లాన్. గంటకి స్పీడు 300 కిలో మీటర్లు. ప్రస్తుతం మన దేశంలో హయ్యెస్ట్ స్పీడుతో నడుస్తున్న రైలు గతిమాన్ ఎక్స్ ప్రెస్. గంతకి 150 కిలోమీటర్లు. అంటే అమాంతం రెట్టింపు వేగంతో వస్తోంది హైస్పీడ్ రైలు. ఏపీ నుంచి రాజ్యసభకి వెళ్లిన సురేశ్ ప్రభు చొరవతోనే ఈ ప్రాజెక్టు ఓకే అయ్యింది అంటున్నారు. మొదట విజయవాడ వరకూ అటు తర్వాత విశాఖ వరకూ పొడిగించే అవకాశాలు ఉన్నాయ్ అంటున్నారు. ఎలాగంటే… మొదట హైస్పీడు రైలు మైసూర్ టు చెన్నై అనుకున్నారు. కానీ ప్రభు చొరవతో విజయవాడ వరకూ వచ్చింది. ఇటు నుంచి మరో నాలుగు వందల కిలోమీటర్లు విశాఖ వరకూ పెరిగే అవకాశం కనిపిస్తోంది కచ్చితంగా ! కనెక్టివిటీ సౌకర్యం… హైస్పీడు రైలు వచ్చిన ఇమేజ్ వరకూ సరే. దాంతోపాటు హైస్పీడు రైలు బెజవాడకి మరో ప్రత్యేకత కూడా తెస్తోంది. అటు మైసూరు, బెంగళూరు, ఇటు చెన్నైతో డైరెక్ట్ కనెక్టివిటీ వచ్చేస్తోంది. ఇపుడు చెన్నైతో పాత సంబంధాలు ఉన్నాయ్. అటు హైద్రాబాద్ కి దగ్గర కాబట్టి సరే. ఇపుడు మైసూర్, బెంగళూరు కూడా వస్తే… దక్షిణాదిలో 90 శాతం ఏరియా కవర్ అయిపోతుంది. బెజవాడతో కనెక్ట్ అయిపోతుంది. అందుకే హైస్పీడు రైలుపై బెజవాడ అంత ధీమాతో ఉంది. Share this post Link to post Share on other sites
Yaswanth526 7,837 Posted October 16, 2016 ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని పొరుగు రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాలతో అనుసంధానించేందుకు హైస్పీడ్ రైలు ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. మైసూరు-బెంగళూరు-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ ను విజయవాడ వరకు పొడిగించనుంది. ఈ కారిడార్‌లో గంటకు 300కి.మీ వేగంతో నడిచే హైస్పీడ్ రైలు ఇస్తామని రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో విజయవాడను చేర్చుతూ అధ్యయనం చేసేందుకు జర్మన్ మంత్రి, శుక్రవారం దిల్లీలో తమతో జరిగిన చర్చల్లో అంగీకరించినట్లు సీఎం చంద్రబాబుకు సురేష్‌ప్రభు ఫోన్లో తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను జర్మన్ ప్రభుత్వం ఇస్తుందని, 2017 జనవరి నుంచి పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. హైస్పీడ్ రైలు కారిడార్‌ను విజయవాడ వరకు పొడిగించడాన్ని స్వాగతించిన చంద్రబాబు... దాన్ని విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు పొడిగించాల్సిన అవసరముందన్నారు. అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన పూర్తిస్థాయిలో ప్రారంభమైందని.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు విజయవాడకు చేరుకునేందుకు వేగవంతమైన రైలు కావాలని కోరారు. హైస్పీడ్ రైలుతో విజయవాడకు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. Share this post Link to post Share on other sites
Anne 945 Posted December 6, 2016 Still no clarity adi only survey anukunta. Share this post Link to post Share on other sites
NatuGadu 1,360 Posted December 6, 2016 day dreams... inko 20 years ki vachhina vachhinatle.... Share this post Link to post Share on other sites
Nfan from 1982 193 Posted December 6, 2016 day dreams... inko 20 years ki vachhina vachhinatle.... No....we will see below 10 years Share this post Link to post Share on other sites