swas Posted October 12, 2016 Share Posted October 12, 2016 ప్రస్తుతం మేటరంతా నల్లధనం చుట్టూ నడుస్తోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌కు చెందిన ఒక్కడే.. ఒకే ఒక్క వ్యక్తే రూ.10 వేల కోట్ల దాకా నల్లధనాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేశాడు. ఒక్క వ్యక్తి వద్దే అంత బ్లాక్ మనీ ఉంటే దేశం మొత్తం ఎంత ఉండి ఉండాలి? ఇక, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రధానంగా నల్లధనాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పే. ఈ నల్లధనం టాపిక్ ఎందుకంటే.. ఇప్పుడు ఓ హీరో కూడా నల్లధనం వెనక పరుగులు పెడుతున్నాడు. నల్లధనాన్ని నిర్మూలిస్తానంటున్నాడు. ఆ హీరో నందమూరి కల్యాణ్ రామ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ ఇజం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా 15 సినిమాలు చేసిన కల్యాణ్ రామ్ కెరీర్లో ఈ సినిమా ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత భిన్నంగా, కొత్తగా తన మునుపటి సినిమాల్లో కల్యాణ్‌రామ్ కనిపించలేదు మరి. సినిమాలో ఓ జర్నలిస్టు పాత్రను పోషిస్తున్న కల్యాణ్‌రామ్.. నల్లధనంపై ఫైట్ చేస్తాడట. సినిమాను ఎక్కువ భాగం స్పెయిన్‌లోనే తెరకెక్కించిన పూరి.. అంతర్జాతీయంగా నల్లధనాన్ని ఎలా తరలిస్తున్నారు? దానిని ఎలా నిర్వహిస్తున్నారు అన్నదానిపైనే సినిమాలో కాన్సన్ట్రేట్ చేసి చూపించాడట. ఈ నేపథ్యంలోనే నల్లధనం గ్యాంగ్‌ను కల్యాణ్‌రామ్ ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథాంశమట. మరి నల్లధనం గ్యాంగ్‌ను చేజ్ చేస్తున్న ఈ నందమూరి హీరో.. నల్లధనాన్ని, ఆ ముఠాను అరికట్టగలిగాడా? ఒకవేళ దానిని కొంత మేరైనా నిర్మూలించగలిగితే అతడు ఎంచుకున్న పంథా ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా ఆగాల్సిందే! Link to comment Share on other sites More sharing options...
MRP Posted October 13, 2016 Share Posted October 13, 2016 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.