Jump to content

Vykuntapuram Barrage


sonykongara

Recommended Posts

  • Replies 235
  • Created
  • Last Reply

Vykuntapuram barrage project to be awarded to Navayuga group

Vykuntapuram barrage, with a 10 TMC storage capacity, will be built to meet the drinking water needs of the people of the upcoming capital Amaravati.

Published: 10th February 2019 08:20 AM  |   Last Updated: 10th February 2019 08:20 AM   |  A+A-

Vykuntapur.jpg

Water Resources department official

By Express News Service

VIJAYAWADA:  Following the clearance from the cabinet, the Water Resources department is set to award the works of Vykuntapuram barrage project to Navayuga Group. The cabinet, on Saturday, decided to award the project, which did not receive any bids when tenders were initiated thrice in the past, to the lowest bidder since no other agency was coming forward. Speaking to TNIE, a senior official said, “We opened the bids a couple of days ago and Navayuga Group submitted the lowest bid. We have received a formal consent from the government. Now that the cabinet has cleared it, the formalities will be concluded soon.”

Vykuntapuram barrage, with a 10 TMC storage capacity, will be built to meet the drinking water needs of the people of the upcoming capital Amaravati. It will come up 23 km upstream ofPrakasam Barrage and 60 km downstream of Pulichintala project.

It maybe recalled that the officials had to revise the project’s Internal Benchmark (IBM) value thrice last year — from `898 crore to `1,025 crore and then to `1,069 crore — since no bidder evinced interest to execute it. However, even after the price revision, the agencies refrained from participating in the bidding process. With this, the officials, in December, relaxed the five per cent ceiling on the tender schedule, enabling the agency to quote a higher price.

Following the relaxation, two firms filed the bids. “Navayuga Group and SEW Infrastructure bid for 13 per cent and 16 per cent in excess. We chose the lowest bidder of the two and forwarded it to the officials concerned. The letter of award is under preparation,” another official explained. Repeated revision of the project cost resulted in criticism that the hike was deliberately done to favour the contracting agencies. However, the officials denied the allegation and said, “The nature of the work is complex as it has to be built in the catchment area of the river. That is why the agencies wanted a viable price.” 

 
 

 

 As per the administrative sanction accorded to the project, Vykuntapuram barrage is estimated to cost `2,169 crore, including the land acquisition cost component of `700 crore to `800 crore. Now that the agency has been finalised, the department is planning to have the foundation for the project laid by Chief Minister Chandrababu Naidu at the earliest. The officials said that the programme is expected to be held in February itself as election code would come into effect next month.

Project cost revised thrice
Repeated revision of the project cost resulted in criticism that the hike was deliberately done to favour the contracting agencies. However, officials denied the allegation and said, “The nature of the work is complex and that is why the agencies wanted a viable price.

Link to comment
Share on other sites

వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి.. నేడే శ్రీకారం
13-02-2019 08:28:32
 
636856433137420756.jpg
  • శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
  • సిద్ధమవుతున్న పైలాన్‌, హోమగుండం
  • ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికారులు, ఎమ్మెల్యే శ్రీధర్‌
 
ఉత్తరవాహిని పుణ్యతీర్థంగా పేరుగాంచిన గుంటూరు జిల్లా వైకుంఠపురం గ్రామంలో కలియుగదైవం వేంకటేశ్వరుని పాదాల చెంత నూతనంగా నిర్మించనున్న బ్యారేజీ నిర్మాణానికి బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేస్తారు.
 
అమరావతి/గుంటూరు: రాజధాని ప్రాంత ప్రజలకు తాగునీరు అవసరాలు తీర్చే లక్ష్యంతో తలపెట్టిన వైకుంఠపురం బ్యారేజీకి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 7.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శంకుస్థాపనకు ముందుగా స్థలశుద్ధి చేసి హోమం నిర్వహిస్తారు. బ్యారేజీ పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సమయం తక్కువగా ఉండడంతో వివిధ శాఖల అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. స్థానిక శాసనసభ్యుడు డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌, గుంటూరు జేసీ హిమాన్ష్‌ శుక్లా, రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌బాబు తమ సిబ్బందితో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ముందుగా హెలిప్యాడ్‌ పనులను పరిశీలించారు. అనంతరం పైలాన్‌, హోమగుండం, సభాస్థలి ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పైలాన్‌ సమీపంలో దక్షిణ దిక్కుగా ముఖ్యమంత్రి ప్రసంగానికి స్టేజీని ఏర్పాటు చేశారు. బుధవారం ముఖ్యమంత్రి పర్యటనలో బిజీ షెడ్యూల్‌ ఉండటంతో త్వరితగతిన శంకుస్థాపన పూర్తి చేసి వెళ్లనున్నారు.
 
ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్‌లు రూపొందించారు. బ్యారేజీ నిర్మాణ పనుల నిమిత్తం రూ.1,008 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. బ్యారేజ్‌లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే ఎగువున రెండు జిల్లాలో ఉన్న పలు గ్రామాలు నీట మునుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో నిర్వాసితుల భూములు సేకరించి వారికి వేరే ప్రదేశంలో ఇళ్ల నిర్మాణాలు చేసేదుకు మరో రూ.771 కోట్ల నిధులు అవసరమౌతాయని అంచనా వేశారు. జీఎస్‌టీ, లేబర్‌ సెస్‌, సీనరేజ్‌ ఛార్జీలు వంటి ఖర్చులన్ని కలిపి మొత్తం రూ.2,169 కోట్లు అవసరమౌతాయి. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లోనూ నిధుల కేటాయింపు జరిపారు. ఈ నేపథ్యంలో సీఎం పునాదిరాయిని వేయనున్నారు.
Link to comment
Share on other sites

మహా సంగమానికి శ్రీకారం

వైకుంఠపురం బ్యారేజీ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు

13brk-cbn1a.jpg

గుంటూరు: గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం స్ఫూర్తితో మహా సంగమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వైకుంఠపురం వద్ద కృష్ణా నదిపై నూతన ఆనకట్ట నిర్మాణానికి సీఎం బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

రాష్ట్రంలో ఐదు ముఖ్య నదుల అనుసంధానంతో ఏపీని కరవు రహితంగా మారుస్తామని ప్రకటించారు. 1954 ఫిబ్రవరి 13న అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ప్రకాశం బ్యారేజీకి శంకుస్థాపన చేశారని... 65 ఏళ్ల తర్వాత అదే రోజున వైకుంఠపురం బ్యారేజీకి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టులో పది టీఎంసీల నీటిని నిల్వ చేసి రాజధాని తాగునీటి అవసరాలతో పాటు మెట్ట భూములను సాగులోకి తెచ్చేందుకు వినియోగిస్తామన్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన చోడవరం వద్ద మరో బ్యారేజీ నిర్మిస్తామని సీఎం తెలిపారు. తద్వారా రాజధాని వెంట 97 కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉంటుందని, ఇలాంటి వాతావరణం ప్రపంచంలో ఏ నగరానికీ ఉండదన్నారు.

13brk-cbn1b.jpg

మునేరు, పాలేరు, కట్లేరు వంటి నదుల నుంచి కృష్ణా నదిలో కలిసే నీటిని వైకుంఠపురం ప్రాజెక్టులో నిల్వ చేయవచ్చని సీఎం తెలిపారు. బ్యారేజీ సమీపంలోనే వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయం, అమరావతిలో శివాలయం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అన్నీ కలిపి ఆధ్యాత్మిక పర్యాటకానికి అనువుగా ఉంటాయని వివరించారు. ఇక అమరావతి ప్రాంతంలో కృష్ణా నదిపై కట్టే ఐకానిక్ వంతెనలు చూసేందుకు కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

తీర్చేను.. తాగునీటి యాతన 
 

నేడు వైకుంఠపురం బ్యారేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన 
10 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మాణం 
ఈనాడు, గుంటూరు

amr-gen1a_77.jpg

నవ్యాంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నగరానికి తాగునీటి అవసరాలు తీర్చడానికి కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మిస్తున్నారు. 10టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో కృష్ణానదిపై నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రకాశంబ్యారేజీకి ఎగువన 23 కిలోమీటర్ల దూరం, పులిచింతల ప్రాజెక్టుకు దిగువన 62 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిపై గుంటూరు జిల్లా వైకుంఠపురం, కృష్ణా జిల్లా దాములూరు నడుమ వైకుంఠపురం బ్యారేజీ నిర్మిస్తారు. రాజధాని నగరం తాగునీటి అవసరాలు తీర్చడంతోపాటు పర్యటకంగా ఎంతో కీలకమైన ప్రాంతంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడే వైకుంఠపురం కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామి, పంచారామాలలో ప్రథమారామం అమరావతిలో అమరలింగేశ్వరస్వామి, అమరావతి స్థూపం, మ్యూజియంతోపాటు బుద్ధుని విశేషాలకు నిలయమైన ప్రాంతం, పచ్చదనంతో కూడిన ప్రకృతి ప్రసాదిత ప్రాంతాలు పర్యటకానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాజధాని నగరం జనాభా 2050 నాటికి 3.5 మిలియన్లకు పెరుగుతుందన్న అంచనాతో తాగునీటి అవసరాలు లెక్కించారు. ఈమేరకు 6.94టీఎంసీలు బ్యారేజీ నుంచి తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలనేది ప్రణాళిక. బ్యారేజీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం శంకుస్థాపన చేస్తారు.

amr-gen1b_6.jpg

జల వైకుంఠపురంబులో బ్యారేజీ ఆవశ్యకతను  ముందే చెప్పిన ‘ఈనాడు ’ 
అమరావతి రాజధానికి వైకుంఠపురం బ్యారేజీ జీవనాడిగా మారబోతోంది. హైదరాబాద్‌కు ఉస్మాన్‌సాగర్‌, గండిపేట మాదిరిగా.. అమరావతి నగర నీటి అవసరాలు తీర్చే కీలకమైన జలాశయంగా నిలవబోతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.2,169 కోట్లతో వైకుంఠపురం వద్ద బ్యారేజీని నిర్మించేందుకు ఆమోద ముద్ర వేసింది. ప్రకాశం బ్యారేజీకి పైభాగంలో 23 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త బ్యారేజీని నిర్మించనున్నారు. రాజధాని తాగు నీటి అవసరాలను తీర్చడంతో పాటు వేదాద్రికి దిగువన పశ్చిమ కృష్ణా మెట్ట ప్రాంతానికి జలసిరిని అందించే జలాశయంగానూ మారబోతోంది. ఏటా వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతున్న నీటికి అడ్డుకట్ట వేయొచ్చు. విజయవాడ, గుంటూరు నగరాల దాహార్తిని సైతం తీర్చనుంది. మూడేళ్లలోనే అందుబాటులోనికి రానున్న ఈ ప్రాజెక్టు.. అమరావతి రాజధానికి ఓ వరంగా మారబోతోందంటూ.. ప్రముఖ పర్యావరణ నిపుణులు, ఆంధ్ర లయోలా కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ తుమ్మల శ్రీకుమార్‌ వెల్లడించారు. రాష్ట్రంలో కృష్ణా నదీ జలాల సద్వినియోగానికి అవసరమైన కొత్త ప్రాజెక్టులపై సుదీర్ఘకాలంగా శ్రీకుమార్‌ అధ్యయనం చేస్తున్నారు.

- ఈనాడు, అమరావతి
 

 

 

 

amr-gen1c_1.jpg7.5 టీఎంసీలు 
విజయవాడ నగర జనాభా ప్రస్తుతం 15లక్షలు. గుంటూరు జనాభా మరో 8లక్షలు కలిపితే.. మొత్తం 23 లక్షల మంది ఉంటున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం.. 2029 నాటికి అమరావతి రాజధానిలో 40లక్షల మంది జనాభా ఉండనున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య కోటికి చేరనుందని అంచనా. అంటే.. తాగు నీటి అవసరాలు ప్రస్తుతం ఉన్న దానికంటే నాలుగు రెట్లు పెరగనున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం ఓ మనిషికి కనీసం 150 లీటర్ల చొప్పున నీటిని రోజుకు అందించాలి. ఈ లెక్కన రాజధానిలోని జనాభాకు 2050 నాటికి ఏటా కనీసం 7.5 టీఎంసీల నీరు అవసరమవుతుంది.

2016లోనే కథనం 
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఒక్కటే ఈ ప్రాంత నీటి అవసరాలను తీరుస్తోంది. విజయవాడ, మంగళగిరి, గుంటూరు నగరాలకే ప్రకాశం బ్యారేజీలోని నీరు చాలడం లేదు. కేవలం 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రకాశం బ్యారేజీలో వేసవి వచ్చిందంటే నీటి మట్టం పడిపోతోంది. దీంతో విజయవాడ, గుంటూరుకే నీరు అందించలేక సంక్షోభం ఏర్పడుతోంది. అమరావతి రాజధాని అవసరాలకు భవిష్యత్తులో పుష్కలంగా నీటిని అందించేందుకు ఓ పెద్ద జలాశయం అత్యావశ్యకం. వైకుంఠపురం రిజర్వాయర్‌ ద్వారా దీనికి పరిష్కారం చూపొచ్చంటూ ‘ఈనాడు’లో 2016లో ఓ ప్రత్యేక కథనం సైతం ప్రచురితమైంది.

రాజధాని నగరాల తాగు నీటి కష్టాలకూ చెక్‌ 
ప్రకాశం బ్యారేజీకి వెన్నుదన్నుగా... భవిష్యత్తుకు తాగు.. మెట్టకు సాగు.. 
అమరావతి రాజధానికి అవసరమైన తాగు నీటికి కొరత అనేదే లేకుండా వైకుంఠపురం బ్యారేజీలో నిరంతరం నీరు పుష్కలంగా అందుబాటులో ఉంటుంది. రాజధాని నగరానికి భవిష్యత్తులో నిరంతరాయంగా తాగునీటిని అందించే కల్పతరువుగా మారబోతోంది. వేసవిలో ప్రకాశం బ్యారేజీలో మట్టం ప్రమాదకర స్థాయికి పడిపోతే వెంటనే వైకుంఠపురం నుంచి నీటిని వదిలి విజయవాడ, గుంటూరు నగరాల దాహార్తిని తీర్చొచ్చు. బ్యాక్‌ వాటర్‌ ద్వారా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పెట్టుకుని పశ్చిమ కృష్ణాలోని మెట్ట ప్రాంతానికి సంవృద్ధిగా సాగు నీరు అందించడంతో ఆ ప్రాంతమూ సుభిక్షమవుతుంది. మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాలు సైతం పుష్కలంగా పెరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

వైకుంఠపురం బ్యారేజీతో పాటూ నీటిని బ్రహ్మలింగం, కంచికచర్ల వంటి పెద్ద చెరువుల్లో నింపి ఉంచుకోవాలి. దీనికోసం నాగార్జునసాగర్‌పై ఆధారాపడాల్సిన అవసరం లేకుండా మున్నేరు నీటిని వాడుకోవచ్చు. మున్నేరు వరదలు వచ్చినప్పుడు నీరు నిలువ ఉంచుకునేందుకు అక్కడ సైతం ఓ టీఎంసీ సామర్థ్యం ఉన్న చిన్న డ్యామ్‌ని నిర్మించుకోవాల్సి ఉంది. మున్నేరుపై డ్యామ్‌ను కట్టి.. నీటిని నిలువ ఉంచుకోగలిగితే అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. కంచికచర్ల, పరిటాల, చందర్లపాడు, నందిగామ, గుంటూరు వైపు కొన్ని చెరువుల్లో నీటిని నిలువ ఉంచుకుని వాడుకోవచ్చు. ఎగువ కృష్ణాలోని ప్రాంతాల తాగునీటి అవసరాలకు వాడుకోవచ్చు. ప్రస్తుతం చెరువులు నింపడానికి వాడుతున్న నాగార్జునసాగర్‌ నీటిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

అమరావతికి పక్కనే 10టీఎంసీలు.. 
వైకుంఠపురం రిజర్వాయర్‌, బ్యారేజీని కట్టడం వల్ల 10టీఎంసీల నీటిని నిలువ ఉంచేందుకు అవకాశం ఉంటుంది. దీనికితోడు బ్యారేజీ వల్ల వేదాద్రికి దిగువన ఉన్న పశ్చిమ కృష్ణాని అమరావతికి అనుసంధానం చేయడం ద్వారా ఆ ప్రాంతం కూడా అభివృద్ధికి నోచుకుంటుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23 కిలోమీటర్లు, పులిచింతలకు దిగువన 62 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం వద్ద ఈ బ్యారేజీ వస్తుంది. సరిగ్గా అమరావతి రాజధానికి ఎగువ ప్రాంతంలో వస్తుంది. దిగువున ఉన్న రాజధానికి ఎగువ ప్రాంతంలోని ఈ ప్రాజెక్ట్‌ ద్వారా అత్యంత తేలికగా నీటిని అందించొచ్చు. అదే.. దిగువ ప్రాంతంలో ఉన్న ప్రకాశం బ్యారేజీ నుంచి పైకి నీటిని పంపడం కష్టంతో కూడుకున్నది. ఇబ్రహీంపట్నం నుంచి పైకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కంచికచర్ల, వీరులపాడు, నందిగామ, చందర్లపాడు పరిధిలోని మెట్ట ప్రాంతాలను కలుపుతూ బ్యారేజీ వస్తుంది. వైకుంఠపురం బ్యారేజీని కట్టడం వల్ల వేదాద్రి వరకూ నీటిని నిలువ ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది.

వరద నీటిని వృథాగా వదలక్కర్లేదు... 
ప్రకాశం బ్యారేజీ ద్వారా అందించే నీరు విజయవాడ, మంగళగిరి, గుంటూరుకు సరిపోని పరిస్థితి ఏర్పడుతోంది. నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకవేళ ఎక్కువ నీరు వచ్చినా బ్యారేజీకి సామర్థ్యం లేక సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోంది. చిన్న వరద వచ్చినా ప్రకాశం బ్యారేజీలో నీటిని ఉంచుకోలేక సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోంది. గత డిసెంబర్‌లోనూ మున్నేరు వరద వచ్చినప్పుడు రెండు టీఎంసీలు సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. ఏటా ఇదే పరిస్థితి. దాచుకునే వీలులేక వదిలేసి వేసవిలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. వైకుంఠపురం బ్యారేజీ అందుబాటులోకి వస్తే 10 టీఎంసీల నీటిని నిలువ చేయొచ్చు. అంతంత మాత్రం వరదలొచ్చినా ఆ నీటిని వైకుంఠపురంలో దాచుకోవచ్చు. భారీగా వర్షాలు పడితే.. పైన పులిచింతల్లో 40-45 టీఎంసీలు, కింద వైకుంఠపురంలో 10 టీఎంసీలు, దాని తర్వాత ప్రకాశం బ్యారేజీలో 3 టీఎంసీలను నిలువ ఉంచుకోవచ్చు. ఇదే జరిగితే.. నీటికి ఇబ్బంది పడే పరిస్థితే భవిష్యత్తులో ఉండదు. వైకుంఠపురం బ్యారేజీ ఈ ప్రాంతానికి అందుబాటులోకి వస్తే నాగార్జునసాగర్‌లోని నీటిని ప్రకాశంకు ఇవ్వొచ్చు. శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని సైతం రాయలసీమలోని నాలుగు జిల్లాలకు హంద్రీనీవా లేదంటే ఎత్తిపోతల పథకం ద్వారా అందించేందుకూ వీలు కలుగుతుంది.

 

ఇదో శుభపరిణామం... 
వైకుంఠపురం బ్యారేజీ నిర్మించడం శుభపరిణామం. అమరావతి రాజధానికి భవిష్యత్తులో తాగునీటి కొరత అనేది లేకుండా చేయడంలో ఇది కీలకంగా మారనుంది. అందుకే ఎప్పటి నుంచో వైకుంఠపురం కట్టాలని మేం కోరుతూ వస్తున్నాం. ప్రభుత్వం దానిని ఆచరణ రూపంలోకి తీసుకురావడం మంచి పరిణామం. ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రకృతి పరంగా జీవిస్తూ.. భవిష్యత్తు తరాలు భద్రంగా బతకాలంటే ఇప్పుడు ఇలాంటి బ్యారేజీల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. కోస్తా ప్రాంతానికి అతిపెద్ద ముప్పు వెంటాడుతోంది. సముద్రపు జలాలు.. భూమిలోపలి నుంచి చొచ్చుకొస్తున్నాయి.  సారవంతమైన భూములు చౌడుగా మారి నిస్సారమైపోతాయి. నదులు, చెరువుల్లో నిరంతరాయంగా నీరు నిలువ ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే.. ఒక్క నాలుగైదేళ్లు దుర్భిక్షం వస్తే తట్టుకోవడం కష్టం. అందుకే ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే.. 2050 నాటికి ప్రపంచం మొత్తం నీటి కోసం కటకటలాడుతూ యుద్ధాలు చేసుకునే పరిస్థితి వచ్చినా.. మన తీరప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. కృష్ణా నదిలో నీరు నిరంతరం ప్రవహించేలా చేసుకునేందుకు చోడవరం వద్ద సైతం బ్యారేజీని కడితే.. దాని తర్వాత కిందన పులిగడ్డ యాక్విడక్ట్‌ ఎలాగూ ఉంది. దీంతో సముద్రపు జలం చొచ్చుకొచ్చేందుకు వీలుండదు. వైకుంఠపురం మాదిరిగానే స్థానికంగా దొరికే వనరులను సద్వినియోగం చేసుకుని 5టీఎంసీలు అయినా పర్వాలేదు, తక్కువ ఖర్చుతో నీటిని నిలువ చేసుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలి. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నింటినీ సద్వినియోగం చేసుకుంటే సముద్రంలోకి వృథాగా పోయే నీటికి అడ్డుకట్ట వేసి దాచుకోవచ్చు. తాగడంతో పాటు వ్యవసాయం, పర్యాటకం, మత్స్య వంటి రంగాలన్నీ నీటితోనే ముడిపడి ఉన్నాయి. భవిష్యత్తులో ఏపీ అభివృద్ధికి నీరే ప్రధాన పెట్టుబడిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

-డాక్టర్‌ తుమ్మల శ్రీకుమార్‌, ప్రొఫెసర్‌, ప్రముఖ పర్యావరణ నిపుణులు
 
 
 

 

 

వ్యవసాయం, పర్యటకం, మత్స్యరంగాలకు ఊతం 
పులిచింతల నుంచి వైకుంఠపురం వరకూ 62 కిలోమీటర్లు, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ 23 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి దిగువన చోడవరం వరకూ నీరు నిరంతరాయంగా నిలువ ఉండటం వల్ల పర్యటకంగానూ.. నదీ పరివాహక ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది. నదీ ప్రాంతాన్నంతటినీ సందర్శనకు వీలుగా అటూఇటూ పాదచారుల మార్గాలు, ఉద్యానాలుగా మార్చగలిగితే ప్రపంచంలోనే సుందరమైన ప్రాంతంగా మారుతుంది. నీటి ఆధారిత పర్యటకానికి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్‌ ఉంది. సుదీర్ఘమైన ఇక్కడి నదీ తీరప్రాంతంలో సందర్శకులు వచ్చి ఉండేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తే ఏటా లక్షల మంది వచ్చి హాయిగా సేదదీరి వెళ్లేందుకు వీలుకలుగుతుంది. మత్స్య సంపదకు సైతం ఈ నిరంతర జల నిలువతో మేలు జరుగుతుంది. ఈటీపీఎస్‌ వేడి నీటి వల్ల సూరాయపాలెం, తుమ్మలపాలెం సహా కృష్ణా జిల్లా వైపున ఉన్న జాలర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టిసీమ నీటిని తీసుకొచ్చాక చల్లని గోదావరి జలాలు కలిసి.. ఇక్కడి నీటి వేడి తగ్గిన తర్వాతే జాలర్ల కష్టాలు తీరాయి. మత్స్య సంపద పెరిగింది. రైతులకు సైతం 30 శాతం దిగుబడులు పెరిగినట్లు శ్రీకుమార్‌ బృందం అధ్యయనంలో తేలింది.

amr-gen1d_1.jpgపాల ఉత్పత్తికీ దోహదం... 
వైకుంఠపురం బ్యారేజీలోని నీటిని కాలువలు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా గుంటూరులోని మెట్ట ప్రాంతాలకు సైతం సరఫరా చేసుకోవచ్చు. చిలకలూరిపేట అవతల ఉన్న ప్రాంతాలకూ నీటిని ఇవ్వొచ్చు. అక్కడి చెరువుల్లోకి ఈ నీటిని పంపించి నిలువ ఉంచితే పశుగ్రాసానికి లోటు లేకుండా మారుతుంది. ఏడాదంతా పశుగ్రాసం కొరత లేకుంటే పాల వృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో రాజధానికి అవసరమైన పాలను సైతం ఇక్కడి నుంచే ఉత్పత్తి చేసుకునే వీలు కలుగుతుంది. ఇలా ఏ రకంగా చూసినా.. తాగునీరు, వ్యవసాయం, పర్యాటకం, మత్స్యసంపద, పాల వృద్ధి సహా రాజధానిలో అన్ని రంగాలకూ తోడ్పాటును అందించే జీవనాడిగా వైకుంఠపురం మారబోతోంది.

భవిష్యత్తులో ఆకాశహర్మ్యాలకూ.. 
కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో పట్టణీకరణ వల్ల చుట్టు పక్కల ప్రాంతాల్లో పుట్టుకొస్తున్న బహుళ అంతస్తుల ఆకాశహర్మ్యాలకు నీటిని అందించడం భవిష్యత్తులో కష్టతరమవుతుంది. కేవలం కృష్ణా నీటిపైనే ఆధారపడితే వీటన్నింటికీ అందించడం కష్టం. ఆ సమయంలో ఈ చెరువులు, మున్నేరు డ్యాం నీటిని వాడుకోవచ్చు.

ప్రకాశం బ్యారేజీకి ఎగువున వైకుంఠపురం కట్టినట్టే.. దిగువ ప్రాంతంలోనూ చోడవరం వద్ద బ్యారేజీని నిర్మించాల్సి ఉంది. ఇది కూడా సాకారమైతే.. అక్కడ కూడా 3 టీఎంసీల వరకూ నీటిని నిలువ చేసుకోవచ్చు. ఇప్పటికే కృష్ణా నదికి 15 అడుగుల మేర రివిటింగ్‌ వాల్‌ను యనమలకుదురు దగ్గర నుంచి కడుతున్నారు. ఈ వరద కట్టను సైతం ఉపయోగించుకుని చోడవరం బ్యారేజీతో పకడ్బందీగా ఇక్కడో మూడు టీఎంసీలను నిలువ ఉంచుకోగలిగితే ప్రకాశం బ్యారేజీపై సాగు నీటి భారం తగ్గుతుంది. దిగువన ఉన్న ప్రాంతాలకు తోట్లవల్లూరు వరకూ నీటిని పుష్కలంగా అందించొచ్చు. ఏలూరు కాలువకు సైతం దీని ద్వారా నీటిని అందించొచ్చు.

Link to comment
Share on other sites

వైకుంఠపురం పనులు నవయుగకు అప్పగింత

 

ఈనాడు, అమరావతి: కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజికి ఎగువన వైకుంఠపురం వద్ద రూ.1069 కోట్లతో చేపడుతున్న బ్యారేజి పనులు నవయుగ సంస్థకు అప్పగిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పనులకు మూడుసార్లు టెండర్లు ఆహ్వానించినా ఎవరూ ఆసక్తి చూపలేదు. ప్రభుత్వ సూచనపై కొన్ని నిబంధనలు తొలగించి నాలుగోసారి టెండర్లు పిలిచారు. ఐబీఎం కన్నా 13.91శాతం అదనపు ప్రీమియం మేరకు పని చేసేందుకు నవయుగ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసి ఎల్‌-1గా నిలిచింది. ఐబీఎం కన్నా 5 శాతానికి మించి అనుమతించకూడదనే నిబంధన జలవనరులశాఖ పనుల్లో అమలు చేస్తున్నారు. వైకుంఠపురం పనులకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ ధరకు పనులు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. రూ.1218.51 కోట్లకు ఈ పనులు అప్పగించారు. పోలవరం ప్రధాన పనులను చేపట్టిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు, ఆ సంస్థ సహకారం పొందిన ఇతర గుత్తేదారు సంస్థలకు మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.

Link to comment
Share on other sites

వైకుంఠపురం బ్యారేజీ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి
రూ.1218.51 కోట్ల పనులు నవయుగకు అప్పగింత
ఈనాడు - గుంటూరు

13ap-main5a_2.jpg

ప్రధాని నరేంద్ర మోదీకి, వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ‘మోదీని ఇంటికి పంపిస్తాం. మనకు ప్రత్యేకహోదా రావాలంటే మోదీ ఇంటికి పోవాలి. జగన్‌ చిత్తుచిత్తుగా ఓడిపోయి, చిరునామా గల్లంతు కావాలి. నేరాలు, ఘోరాలు చేసే వ్యక్తులు సమాజానికి ఉపయోగపడరు. రోడ్ల మీద వీళ్లెక్కడా ఉండటానికి అవకాశం లేదు. అలాంటి వ్యక్తిని మోదీ కాపాడుతున్నారు. హోదాపై గట్టిగా పోరాడటంలో దిల్లీని కదిలించాం. మనకు జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తానికి చాటిచెప్పాం. అన్ని రాజకీయ పార్టీలు మనకు సంఘీభావం తెలియజేశాయంటే అది ఈ ప్రభుత్వంపైన, నామీద ఉన్న విశ్వాసానికి నిదర్శనం’ అని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు హోమం, పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రైతులనుద్దేశించి మాట్లాడారు. ‘మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ప్రాజెక్టుగా ప్రకాశం బ్యారేజీ నిర్మాణానికి ఫిబ్రవరి 13, 1954న శంకుస్థాపన చేశారు. సరిగ్గా 65 ఏళ్ల తర్వాత అదేరోజు వైకుంఠపురం బ్యారేజీకి శంకుస్థాపన చేస్తున్నాం. రెండు తేదీలు ఒకటే కావడంతోపాటు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు కాగా నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా నేను వైకుంఠపురం బ్యారేజీకి శంకుస్థాపన చేయడం జీవితంలో మరచిపోలేని రోజు’ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో రూ.2.77 కోట్లు వెచ్చించగా వైకుంఠపురం బ్యారేజీకి రూ.2,169 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. అప్పటికంటే త్వరితగతిన బ్యారేజీ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

భూ సమీకరణకు రైతుల చొరవ
రాజధాని నిర్మాణానికి మోదీ డబ్బులివ్వలేదు. అమరావతి కోసం పిలుపునిస్తే రైతులు 34వేల ఎకరాలు భూసమీకరణ కింద ఇచ్చారంటే అది రైతుల స్ఫూర్తి, త్యాగం. దీంతో అభివృద్ధిలో ముందుకుపోతున్నాం. వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం, వడ్లమాను, పెదపరిమి గ్రామాల రైతులు భూ సమీకరణ కింద భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి భూమి ఇస్తామన్నా వీల్లేదని కుట్రతో జగన్‌ చెబుతారు. దాన్ని నరేంద్రమోదీ సమర్థిస్తారు. ఈరోజు అమరావతి, అహ్మదాబాద్‌లకు పోలికల్లేవు. తెలివి తేటలతో అభివృద్ధి చెందే సత్తా మనకు ఉంది. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.10వేలు ఇవ్వాలని మంత్రిమండలిలో నిర్ణయించాం. మోదీ కొందరు రైతులకే ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి ఇస్తుంది.

13ap-main5b_1.jpg

మహా సంగమంతో కరవు నివారణ
పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి జగన్‌ అన్నివిధాలా ప్రయత్నించారు. అడ్డం పడితే వదిలిపెడతానా... అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా చక్రాలు ఆగవు. గోదావరి-కృష్ణా అనుసంధానాన్ని పూర్తిచేసి పవిత్ర సంగమాన్ని సృష్టించాం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నాతోపాటు 140 పెద్దా, చిన్నా నదులను అనుసంధానం చేసే మహా సంగమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీన్ని పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్‌లో కరవు రాకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. రాబోయే జూన్‌లో వర్షాలు పడిన వెంటనే పోలవరం నుంచి నీటిని గ్రావిటీ ద్వారా కృష్ణా నదికి తీసుకువస్తాం. ఈ ఏడాది డిసెంబరు నాటికి పోలవరాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. దేశంలో మరెక్కడా లేని రీతిలో ఈ ప్రాజెక్టును శీఘ్రంగా పూర్తిచేసి శాశ్వతంగా పేరు నిలిచిపోయేలా చేస్తాం. ఇది నా జీవితాశయం. పోలవరం పూర్తయితే కరవు అనే మాట రాకుండా సంపద సృష్టికి అవకాశం కలుగుతుంది.

సామాజిక న్యాయానికి పోరాడిన నాకే కులాలు ఆపాదిస్తారా?
ఐదేళ్లు మీ కోసం కష్టపడ్డాను. నేను చేసిన పనుల్లో కులం, మతం, ప్రాంతం ఉన్నాయా? అందరికీ న్యాయం చేయాలని పనిచేశాను. తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు కులగజ్జి పట్టుకుని నాకు కులాలు ఆపాదిస్తున్నారు. 40 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం పోరాడి, అమలు చేసిన వ్యక్తిని. అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన, విశ్వసనీయతల్లో మాతో పోటీ పడలేక కులం, మతం పేరు చెప్పి అవి చేస్తాం... ఇవి చేస్తాం అని చెబుతారు. ప్రజలకు చేసేదేమీ లేదు. వచ్చిన తర్వాత అందరినీ జైలుకు పంపిస్తారు తప్ప చేయగలిందేమీ లేదు. ఐదేళ్లు మీకోసం కష్టపడ్డాను. 75 రోజులు మీరందరూ సమిష్ఠిగా నా కోసం, మీ భవిష్యత్తు కోసం, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పనిచేయండి. అభివృద్ధి చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇస్తున్నా’ అని చంద్రబాబు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్‌, జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ షేక్‌ జానీమూన్‌, జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

అద్భుత నగరంగా అమరావతి
‘పులిచింతల నుంచి 62 కి.మీ దూరంలో వైకుంఠపురం బ్యారేజీ, అక్కడ నుంచి 23 కి.మీ దూరంలో ప్రకాశం బ్యారేజీ, 12 కి.మీ దూరంలో చోడవరం బ్యారేజీ ఉంటాయి. మొత్తం 97 కిలోమీటర్ల మేర నదిలో ఇరువైపులా నీరుండేలా చూస్తాం. ఇలా ఉన్న ఏకైక నది కృష్ణా, ఏకైక రాజధాని అమరావతి అవుతుంది. మూడు బ్యారేజీల నిర్మాణం పూర్తిచేసి ‘ఎన్టీఆర్‌ సాగర్‌’గా రూపకల్పన చేసి నిరంతరం నీరుండేలా చూస్తాం. ప్రపంచంలో అందమైన నగరంగా అమరావతిని నిర్మిస్తాం. వైకుంఠపురం బ్యారేజీ నుంచి అమరావతి, వేంకటేశ్వరస్వామి ఆలయాలు, బాహ్య, అంతర వలయ రహదారులు, నదికి అటువైపు దుర్గమ్మ ఆలయం... ఇలా ఏ నగరానికి లేనటువంటి అత్యాధునిక సౌకర్యాలు అమరావతిలో కల్పించి ప్రపంచంలో ఐదు అగ్ర నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం. ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించి అద్భుతమైన రాజధానిని అభివృద్ధి చేస్తాం. కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెనల నిర్మాణం ద్వారా ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసేలా చేస్తాం.


రాజధానికి దివ్యాంగులు, వృద్ధుల విరాళాలు

13ap-main5c_1.jpg

వైకుంఠపురం(అమరావతి), న్యూస్‌టుడే: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి గుంటూరు జిల్లా అమరావతి మండలానికి చెందిన డ్వాక్రా సంఘాల సభ్యులు, మహిళలు, దివ్యాంగులు స్వచ్ఛందంగా విరాళాలిచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. వైకుంఠపురం బ్యారేజీకి శంకుస్థాపన నిమిత్తం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌తో కలసి వారు చెక్కులు అందజేశారు. అమరావతికి చెందిన ముక్కామల సామ్రాజ్యం రూ.లక్ష, జూపూడికి చెందిన కాశీ విశ్వనాథ మహిళా గ్రూపు రూ.1,05,000, మదర్‌ థెరిస్సా గ్రూపు రూ.లక్ష, యండ్రాయి, లింగాపురం గ్రామ సమాఖ్య సభ్యులు రూ.2 లక్షలు, మరికొందరు ఇతర మొత్తాలను విరాళంగా అందించారు. వైకుంఠపురం ఎంపీటీసీ సభ్యురాలు బండ్ల సుమతి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు మహిళలు రూ.1,40,000 సేకరించి అందించారు. వృద్ధులు, వికలాంగులు కలసి రూ.1,06,600 అందించారు. వారందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

 

Link to comment
Share on other sites

అమరావతికి జలసిరి
14-02-2019 09:17:13
 
636857326346225331.jpg
భవిష్యత్తు తాగునీటి అవసరాలకు...
వైకుంఠపురం బ్యారేజికి శంకుస్థాపన
మరోచరితకు శ్రీకారం
ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు
 
 
ప్రజా రాజధాని అమరావతి నగరానికి భవిష్యత్తులో తాగునీటి అవసరాలను తీర్చే వైకుంఠపురం బ్యారేజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. అమరావతికి జలహారంగా మరోచరిత్రకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన, పులిచింతల ప్రాజెక్టుకు 62 కిలోమీటర్ల దిగువన అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం వద్ద బ్యారేజీ నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. రూ.2,169 కోట్ల వ్యయ అంచనాతో 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు అమరావతికి అపురూప జలసిరి.
 
 
గుంటూరు (ఆంధ్రజ్యోతి): ప్రజారాజధాని అమరావతికి జలహారం అలంకరించనుంది. రూ.2,169 కోట్లతో కృష్ణానదిపై నిర్మించనున్న వైకుంఠపురం బ్యారేజికి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం నది ఒడ్డున బ్యారేజి నిర్మాణానికి నిర్ణయించిన స్థలం వద్దకు ముఖ్యమంత్రి ఉదయం 11.20 గంటలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి పండితులు వేదమంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత సీఎం శాంతిహోమం నిర్వహించారు. భూమిపూజ అనంతరం సంప్రదాయ పద్ధతిలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
 
అనంత రం కాలినడకన ప్రాంగణం అంతా తిరిగి నదీప్రవా హ తీరును పరిశీలించి బహిరంగ సభలో ప్రసంగించారు. బ్యారేజి నిర్మాణంతో రాబోవు కాలంలో ఈ ప్రాంతానికి మహర్దశ రానుందన్నారు. ఎక్కడ నీరుంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఆ బ్యారేజికి ఎగువన 62 కిలోమీటర్ల దూరంలో పులిచింత ప్రాజెక్ట్‌, దిగువన 23కిమీ దూరంలో ప్రకాశం బ్యారేజీలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజి దిగువన 12 కి.మీదూరంలో చోడవరం బ్యారేజిని కూడా నిర్మిస్తున్నందున, మొత్తం 97 కిమీ పరిధిలో కృష్ణా నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందడంతో పాటు పర్యాటకంగా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని సీఎం తెలిపారు.
 
 
అదే రోజున శంకుస్థాపన
‘తొలి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు 1954 ఫిబ్రవరి 13న ప్రకాశం బ్యారేజికి శంకుస్థాపన చేయగా, నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 2019 ఫిబ్రవరి 13న వైకుంఠపురం బ్యారేజికి నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోని ఐదు అగ్ర నగరాల్లో ఒకటిగా అమరావతి ఉంటుందని, అందుకనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రజారాజధాని అమరావతి నిర్మాణం చేపట్టామని చెప్పారు.
 
 
ఉత్సాహభరిత వాతావరణం...
సభకు పెద్దసంఖ్యలో గ్రామస్థులతోపాటు, రాజధాని ప్రాంత రైతులు హాజరయ్యారు. ఆసాంతం ముఖ్యమంత్రికి జేజేలు పలుకుతూ ప్రాంగణం అం తా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి సైతం రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకువచ్చి సుమారు 34 వేల ఎకరాల భూ ములు ఇచ్చిన రైతుల ఔదార్యాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరినీ అదుకోవాలనే సంకల్పంతో రూ.200 వున్న పింఛన్‌ను అధికా రంలోకి రాగానే ఐదు రెట్టు పెంచి రూ.వెయ్యి చేశా మని, ఇప్పుడు దానిని రూ.2వేలకు రెట్టింపు చేయ డంతోపాటు డ్వాక్రా సంఘాల సభ్యులను అర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో రెండు విడతలుగా రూ.10 వేల వంతున ‘పసుపు- కుంకుమ’ కింద ఆర్థిక సాయం అందించామని సీఎం వివరించారు.
 
 
ఆ ఇద్దరినీ చిత్తు చిత్తుగా ఓడించండి...
అక్కడ మోదీని, ఇక్కడ జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగువారికి జరిగిన అన్యాయాన్ని ఢిల్లీలో వివరించామని... దేశంలోని అన్ని పార్టీలు మద్దతిచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి మోదీ నిధులు ఇవ్వటం లేదని... కానీ ఇక్కడి రైతులు ఒక్క పిలుపుతో 33వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చారని కొనియాడారు. ఐదేళ్లలో దేశంలో ఏ నగరం అమరావతికి పోటీ రాకుండా అద్భుతంగా నిర్మిస్తామన్నారు. తాను అందరికీ సమన్యాయం చేస్తుంటే కొందరు కులగజ్జిని అంటించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో సామాజిక న్యాయం పాటిస్తున్నానని ఉద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం పెద్దన్నలా ఉంటూ ఆడపడుచులకు ‘పసుపు-కుంకుమ’తో అండగా నిలచానన్నారు.
 
కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అధ్యక్షత వహించగా, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఏఎస్‌ రామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జడ్పీ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్‌, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌ వెన్నా సాంబశివారెడ్డి, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌, కలెక్టర్‌ కోన శశిధర్‌, జేసీ హిమాన్ష్‌ శుక్లా, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, టీడీపీ నేతలు రాయపాటి రంగారావు, గుంటుపల్లి వీరభుజంగరాయలు, కనపర్తి శ్రీనివాస్‌, ఎంపీపీ నంబూరి చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.
 
 
ఫలించిన దేవినేని పుష్కర కాల నిరీక్షణ
అమరావతి, ఫిబ్రవరి 14: గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ అమరావతి, కంచికచర్ల మండల పరిధి గ్రామాల హద్దులో బ్యారేజి నిర్మించాలని 2007లో అప్పటి నందిగామ ఎమ్మెల్యే, నేటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. అప్పటి ఆయన ఆశయం బుధవారం జరిగిన వైకుంఠపురం బ్యారేజి శంకుస్థాపనతో నెరవేరిందని చెప్పవచ్చు. కృష్ణా జిల్లా మునేరు, వైరా, కట్టలేరు, ఖమ్మం జిల్లా పాలేరు, గుంటూరు జిల్లాలోని ఎద్దువాగు, కొండవీటి వాగుల నుంచి వరదలు ప్రవహించినపుడు ప్రకాశం బ్యారేజి ద్వారా సముద్రంలోకి నీరు వృధాగా పోతుంది.
 
ఈ వాగుల నుంచి వచ్చే జలాలను సంరక్షించుకుంటే భూగర్భ జలాలతోపాటు సాగునీరు, తాగునీరు కృష్ణా, గుంటూరు జిల్లాలకు అందించవచ్చునని వారసత్వ అమరావతి పంచాయతీరాజ్‌ వసతి గృహంలో 2007లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన డిమాండ్‌ చేశారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ బ్యారేజీ నిర్మాణానికి సుముఖత చూపలేదు. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్వారా జలవనరుల శాఖమంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు చిరకాల ఆశయాన్ని నెరవేర్చుకుంటున్నారు.
 
 
చంద్రబాబు పర్యటన సాగిందిలా...
అమరావతి, ఫిబ్రవరి 13: వైకుంఠపురం బ్యారేజి శంకుస్థాపన ఉదయం 9గంటలకు జరగాల్సివుండగా ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో ఉదయం 11.14 గంటలకు హెలిప్యాడ్‌ వద్ద దిగారు. 11.16 గంటలకు భవఘ్ని ఆరామం సందర్శించి గురువుల ఆశీర్వచనం పొందారు. రెండు నిమిషాల అనంతరం సీఎం కాన్వాయ్‌లో అక్కడనుంచి బయలుదేరి 11.20 గంటలకు శంకుస్థాపన ప్రదేశానికి చేరుకున్నారు. 11.23 గంటలకు వేదపండితులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి హోమం వద్దకు తీసుకెళ్లి పూర్ణాహుతి చేయించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. 11.28గంటలకు పైలాన్‌ ఆవిష్కరించారు. 11.30 సభావేదికపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి 25 నిమిషాలు ప్రసంగించారు. 11.55 గంటలకు వేదికపై నుంచి దిగుతూ మహిళా సంఘాల ప్రతినిధులు అందజేసిన విరాళాలను స్వీకరించారు. 11.58గంటలకు కాన్వాయ్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంది. 12.04 గంటలకు హెలికాప్టర్‌ బయలుదేరి వెళ్లింది.
Link to comment
Share on other sites

కృష్ణా నదిపై ఏపీ బ్యారేజి నిర్మాణం

 

  వైకుంఠపురం బ్యారేజిపై  కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన చట్టం-2014 ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై వైకుంఠపురం బ్యారేజి నిర్మాణం చేపడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) మురళీధర్‌ సోమవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్‌ఎంబీ) ఫిర్యాదు చేశారు. ప్రకాశం బ్యారేజికి ఎగువన 23 కిలోమీటర్ల దూరంలో 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ కొత్త బ్యారేజికి ఈ నెల 13న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వద్ద నిర్మించే బ్యారేజికి సంబంధించి గతేడాది జూన్‌ 8న జీవో ఎంస్‌.48 కింద పరిపాలన అనుమతులు జారీ చేశారని తెలిపారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం రూ.2169 కోట్లకు అనుమతులు మంజూరు చేసిందన్నారు. ‘‘ఏపీ విభజన చట్టం ప్రకారం కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టు నిర్మించాలంటే కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు తప్పనిసరి. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను పరిశీలన నిమిత్తం తొలుత సంబంధిత సంస్థలకు పంపాలి. తర్వాత తెలంగాణ ప్రభుత్వ అంగీకారంతోనే ఏపీకి అనుమతులివ్వాలి. దీంతోపాటు కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్‌-2లో కొనసాగుతున్న వ్యాజ్యాల నేపథ్యంలో నదిపై కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీల్లేదు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం బ్యారేజి నిర్మాణం చేపట్టింది’’ అని ఈఎన్‌సీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

Link to comment
Share on other sites

Telangana cries foul over construction of new barrage on Krishna by Andhra Pradesh

Telangana engineer-in-chief C Muralidhar informed the KRMB member-secretary that they came to know through news papers that AP CM N Chandrababu Naidu laid the foundation stone for the barrage.

Published: 26th February 2019 02:49 AM  |   Last Updated: 26th February 2019 02:53 PM   |  A+A-

Prakasam_Barrage_EPS6556.jpg

Prakasam Barriage. (File | EPS)

By Express News Service

HYDERABAD:  Telangana Irrigation officials have requested Krishna River Management Board (KRMB) to direct the AP government to not proceed with the construction of Vaikuntapuram barrage.Telangana engineer-in-chief C Muralidhar, in a letter, on Monday requested the KRMB to inform AP govt to place the detailed project reports (DPR) of Vaikuntapuram barrage being constructed by it before Central Water Commission (CWC), KRMB and the Apex Council for scrutiny and approval. 

“Until that time, AP may be directed not to proceed with the construction of any new project on river Krishna pending adjudication of the references by the KWDT-2 without the approval of KRMB and Apex Council as per the section 84(3) (ii) fit 85(8) (d) of AP Reorganisation Act, 2014”, Muralidhar said in his letter.

Muralidhar informed the KRMB member-secretary that they came to know through news papers that AP CM N Chandrababu Naidu laid the foundation stone for a barrage across Krishna. “AP is unilaterally taking up the construction of Vaikuntapuram barrage with a storage of 10 tmc on Krishna river, around 23 km upstream of the existing Prakasam barrage at Vaikuntapuram village in Amaravati mandal in Guntur district, in violation of AP Reorganisation Act, 2014”, the ENC said.

The AP Reorganisation Act stipulated that the planning or execution of new projects had to be appraised and recommended by KRMB and CWC and thereafter it required the sanction of the Apex Council, Muralidhar said.“It is not proper of AP to proceed with the construction of any new project without complying with guidelines stipulated in AP Reorganisation Act. Until all authorities duly grant their approval, considering view of Telangana on the said DPR, AP cannot execute the project,” Muralidhar told KRMB. 

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...