Jump to content

Vykuntapuram Barrage


sonykongara

Recommended Posts

  • 1 month later...
  • Replies 235
  • Created
  • Last Reply
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
 
636171193557719062.jpg
  • జలమార్గంతో దగ్గరవుతున్న కృష్ణా, గుంటూరు జిల్లాలు
  • రాజధాని నుంచి నిత్యం లాంచీ ప్రయాణం 
  • జల రవాణాకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం 
  • లంకల అభివృద్ధితో పర్యాటకానికి కొత్త హంగు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జల రవాణాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే రాయపూడి నుంచి ఫెర్రీ వరకు జలమార్గం గుంటూరు - కృష్ణా జిల్లాలను కలుపుతోంది. గతంలో ప్రతిపాదించిన విధంగా నదిపై మూడు వంతెనల నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. దీంతోపాటు కృష్ణా పరీవాహక ప్రాంతంలోనూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయనుంది. తుళ్ళూరు : జలమార్గంతో కృష్ణా, గుంటూరు జిల్లాలు దగ్గరవుతున్నాయి. నిత్యం రాజధాని నుంచి లాంచీ ప్రయాణం కొనసాగుతుండంతో వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ సమయంలో సులభంగా కృష్ణా జిల్లాకు చేరుకుంటున్నారు. అదేవిధంగా ప్రయాణం సైతం ఎంతో సులువుగా ఉంది. రాజధాని గ్రామం రాయపూడి రేవు నుంచి కృష్ణా జిల్లా ఫెర్రీ వరకు రోజు లాంచీ నాలుగుసార్లు ప్రయాణం సాగిస్తోంది. ప్రైవేటు పడవలు లంకల్లో వ్యవసాయ ఉత్పత్తులను కృష్ణా జిల్లాకు తరలించేందుకు ఉపయోగపడుతున్నాయి. కృష్ణా జిల్లా వ్యవసాయ ఉత్పత్తులు రాజధానికి జలమార్గంలో రానున్నాయి.
జల మార్గానికి ప్రాధాన్యం...
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జల రవాణాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లోనూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనుంది. అందుకు సింగపూర్‌ ప్రతినిధులు ఇచ్చిన రాజధాని మ్యాప్‌లో కృష్ణానది ఒడ్డున రెస్టారెంట్లు, రిక్రియేషన్‌ క్లబ్‌లు, ఏర్పాటు చేయటానికి ప్రదేశాలను గుర్తించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అమరావతిలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
వాగుల అభివృద్ధితో జల రవాణా..
రాజధానిలో ప్రధాన వాగుల్లో ఒకటైన కొండవీటి వాగును అభివృద్ధి చేయడానికి ఇప్పటికే సీఆర్‌డీఏ చర్యలు చేపట్టింది. దానికి అనుబంధంగా ఉన్న కోటేళ్ల వాగు, పాలవాగు, చీకటివాగు, ఐయ్యన్న వాగులను అభివృద్ధి చేసి.. బకింగ్‌హామ్‌ కెనాల్‌కు ఈ వాగులను కలిపి జల రవాణా అభివృద్ధి చేయనున్నారు.
పర్యాటక కేంద్రాలుగా లంకలు..
లంక భూములను లాండు పూలింగ్‌ కింద తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో సాగు చేసుకుంటున్న రైతుల వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. వారికి కూడా ప్లాట్లు కేటాయింపు చేయనున్నారు. కృష్ణానదిలో పెదలంక, చినలంక, పందులలంక.. ఇలా ఏడు లంకలు ఉన్నాయి. వీటిని పర్యాటక కేంద్రాలుగా మార్చటానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఓ లంకలో పర్యాటక కేంద్రంగా భవానీ ఐలాండు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదే మాదిరిగా మిగిలిన వాటిని కూడా తయారు చేయనుంది. జల రవాణాను అభివృద్ధి చేస్తే పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మూడు బ్రిడ్జిలు..
రాజధాని అమరావతి, కృష్ణా జిల్లాలను దగ్గర చేసేటందుకు కృష్ణానదిపై మూడు బ్రిడ్జిలను నిర్మించాలని ప్రతిపాదించారు. రాజధాని రాక మునుపే నేషనల్‌ హైవే అధారిటీ వెంకటపాలెం వద్ద ఒక బ్రిడ్జ్జి నిర్మించటానికి రైతుల నుంచి భూమిని సేకరించారు. రాజధాని రావటంతో ఆ పనులను ప్రస్తుతం పక్కన బెట్టారు. అమరావతి నగర మ్యాప్‌లో చూపించిన విధంగా వెంకటపాలెం, రాయపూడి - బోరుపాలెం మధ్యలో, వైకుంఠపురం వద్ద మొత్తం మూడు వంతెనలు నిర్మించాల్సి ఉంది. త్వరలో ఆయా బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

  I too feel the same okkasari edi na state kadu ani vfeel vachinaka Mulla meeda unnatlu vundi.

 

 House ammeyangane vellipovalani vundi.

 

Guntur lo open plot vundi chakkaga akkada house kattukovachu.

 

Kani ammudamante sagam rate kuda vachetattu ledu

Link to comment
Share on other sites

  I too feel the same okkasari edi na state kadu ani vfeel vachinaka Mulla meeda unnatlu vundi.

 

 House ammeyangane vellipovalani vundi.

 

Guntur lo open plot vundi chakkaga akkada house kattukovachu.

 

Kani ammudamante sagam rate kuda vachetattu ledu

 

Ekkada brother property? Details cheppu..

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...

eedi bondha...muneru nunchi vache water samudram lo kalisipotundanta vrudha gaa....asalu delta ki ivvataniki saalatam ledu ra devudaa ante.

 

Patti seema vachaka konchem better.....

 

you misunderstood the article brother. You are right abour scarcity and so is the article about waste. Sagar nunchi chukka krindaki rakapoyina, pulichintala nunchi vadalakapoyina, munneru catchment lo pade varsham 33 TMC ayithe andulo 3 TMC matrame store chesuko galugutunnam prastutam prakasam barrage daggara. so rest is going waste in to sea. this is possible if there were no rains under musi river catchment (for pulichintala) but it rains in Munneru catchement. and there is historic evidence for this happening. 

Link to comment
Share on other sites

you misunderstood the article brother. You are right abour scarcity and so is the article about waste. Sagar nunchi krindaki chukka krindaki rakapoyina, pulichintala nunchi vadalakapoyina, munneru catchment lo pade varsham 33 TMC ayithe andulo 3 TMC matrame store chesuko galugutunnam prastutam prakasam barrage daggara. so rest is going waste in to sea. this is possible if there were no rains under musi river catchment (for pulichintala) and rains in Munneru catchement. and there is historic evidence for this happening. 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...

కృష్ణాపై కొత్త కట్ట!

ప్రకాశం బ్యారేజి దిగువనే మరొకటి

నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం

జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రానికి వినతి

కేంద్ర మంత్రి ఉమాభారతికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ

ఈనాడు - హైదరాబాద్‌

11ap-main1a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిపై మరో కొత్త బ్యారేజి నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజి దిగువన మరొక ఆనకట్టను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆనకట్ట నిర్మాణాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు.

చంద్రబాబు లేఖ సారాంశమిదీ...

కృష్ణానదిపై ఉన్న నిర్మాణాల్లో ప్రకాశం బ్యారేజి చివరిది. ఈ బ్యారేజి నుంచి విడుదల చేసే నీరు సముద్రంలోకి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్‌ తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొంటోంది. మరోవైపు నిల్వ చేసుకొనే సౌకర్యం లేక వరద నీరు సముద్రంలోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రకాశం బ్యారేజికి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో కొత్త బ్యారేజీని ప్రతిపాదించింది. దీని వెడల్పు 1.2 కి.మీ. ఉంటుంది. మూడు నుంచి మూడున్నర మీటర్ల ఎత్తుతో ప్రత్యేకంగా స్మార్ట్‌ గేట్లు ఏర్పాటు చేస్తాం. ఈ గేట్లు ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. ఈ బ్యారేజీకి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీలో ఉంది. బ్యారేజి నిర్మాణం వల్ల సుమారు 1.7 టీఎంసీలు నిల్వ చేయవచ్చని, తాగు, సాగు నీటికి ఉపయోగపడుతుంది. ఇది విజయవాడకు ఆనుకొని ఉంటుంది. నీటి అవసరాలు తీరడంతో పాటు జల క్రీడలకు, ఆహ్లాదకర వాతావరణ సృష్టికి అవకాశం ఉంటుంది. నదీ ప్రవాహానికి అడ్డంకి తక్కువగా ఉండేందుకు పూర్తి స్థాయిలో గేట్లు ఏర్పాటు చేస్తాం. ప్రకాశం బ్యారేజీ-కొత్త బ్యారేజీల నిర్వహణ సమీకృతంగా జరుగుతుంది. దీని వల్ల కొత్తగా నిల్వ చేసే నీటి వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. వరుసగా ఇలా రెండు బ్యారేజీలు నిర్మించడం వినూత్నమైంది.. దేశంలోనే మొదటిది. ప్రకాశం బ్యారేజి నుంచి వదిలే వరద నీరు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని అనేక నదులపై వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కొత్తగా చేపట్టిన ఈ బ్యారేజి నిర్మాణానికి జాతీయ హోదా కల్పించాలని విన్నవిస్తున్నాం. ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి, రాజధానికి ఎంతో ఉపయోగకరం... అని చంద్రబాబు ఉమాభారతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

 

బోర్డు అభిప్రాయం కోరిన కేంద్రం

ముఖ్యమంత్రి ప్రతిపాదించిన బ్యారేజి నిర్మాణంపై అభిప్రాయం చెప్పాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ కోరింది. ఈ మేరకు జలవనరుల మంత్రిత్వశాఖ అధికారి ఆర్‌.కె.కనోడియా బోర్డుకు లేఖ రాశారు. దీనిపై బోర్డు తెలంగాణ అభిప్రాయాన్ని కోరే అవకాశం ఉంది. కొత్తగా ప్రతిపాదించిన బ్యారేజి కాబట్టి బోర్డుతో పాటు అపెక్స్‌ కౌన్సిల్‌కు కూడా వెళ్లాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
  • 1 month later...
  • 2 weeks later...

e barrage kattalante chala open questions unnai

 

- what do they do with Narukullapadu vagu?

 

If they don't address properly then it creates Prakasam barrage similar Kondaveedu vagu problem there

Basically creation of barrage backflushes vagu water

Same backflush problem munneru ki kooda vastundi if not addressed well like Prakasam barrage time

 

- How do they build "katta" till temple".....TEmple&steps area etla handle chestaru?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...