Jump to content

Vykuntapuram Barrage


sonykongara

Recommended Posts

  • Replies 235
  • Created
  • Last Reply
7 minutes ago, sonykongara said:

govt rates saripodu nastam vasthundi ani mununde chepparu bro,dini oka lift kuda add chesaru Amarvati ki drinking water kosam konchem perigindi, matti katta kuda bag ethuga unchalai anta.

400 crores ante ok le, antha pedda project ki, but lasst 6 months nundi takers evaru leru, appude start ayyi unte e patiki entho kontha works jarigevi kada ani na feeling.

Link to comment
Share on other sites

3 minutes ago, Bollu said:

400 crores ante ok le, antha pedda project ki, but lasst 6 months nundi takers evaru leru, appude start ayyi unte e patiki entho kontha works jarigevi kada ani na feeling.

edi fix ayyi chala days ayyindi, cbn vallaki nayam chesadu anthe

Link to comment
Share on other sites

1 hour ago, AnnaGaru said:

if I am not wrong..

Iconic Bridge at Pavitra sangamam-IbrahimPatnam / UddandrayuniPalem-Capital 

InnerRing Bridge = Barraiage at VaikuntaPuram/Damuluru (which meets NH9/65 near Kachavaram ant stops? there, goes around capital and meets NH16 Guntur/Vij near NagarjunaUniversity)

OuterRing Bridge at Amaraavti(old village) / Chevitikallu (which meets NH9/65 near Kanchikacherla) (passes near to pedakurapadu goes around guntur, another bridge on krishna river downstream)

 

This is what I was presuming. Hope we get more clarity by the time of laying foundation stone

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

vyakuntapuram barrage tho sagar link ki ippudu avsarame ledu,harichandrapuram nundi lift chestharu

vyakuntapuram barrage katteka appudu dani back water nundi lift chestharu,prasthutham harichandrapuram nundi lift chestharu ibbandi emi ledu

Link to comment
Share on other sites

5 minutes ago, ravikia said:

This is what I was presuming. Hope we get more clarity by the time of laying foundation stone

inka miku ardam kaleda,ippudu katedi only vykuntapuram_damuluru barrage matrame,diniki irr ki link pettvadu,irr start ayyaka 6 lane bridge asthundi appudu.

Link to comment
Share on other sites

వైకుంఠపురం బ్యారేజీకి.. రూ.3,278.60 కోట్లు
09-02-2019 07:59:01
 
  • నిధులు కేటాయిస్తూ మంత్రివర్గ నిర్ణయం
  • ప్రకాశం బ్యారేజ్‌కి 23 కి.మీ ఎగువన మరో బ్యారేజ్‌
  • పశ్చిమకృష్ణాకు ఇక జలసిరి
విజయవాడ (ఆంధ్రజ్యోతి): ప్రజా రాజధానిలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే ‘వైకుంఠపురానికి’ ప్రభుత్వం రైట్‌రైట్‌ అన్నది. భవిష్యత్తులో రాజధానిలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని వైకుంఠపురం వద్ద నిర్మించబోయే కొత్త బ్యారేజ్‌కు అడుగులు చురుగ్గా పడుతున్నాయి. ఇంతకుముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే బ్యారేజ్‌ను నిర్మించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానికి రూ.3,278.60కోట్లను కేటాయిం చాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణపు బాధ్యతలను నవయుగ కనస్ట్రక్షన్‌ కంపెనీ మోయనుంది. టెండర్ల ప్రక్రియలో ఆ సంస్థ పనులను దక్కించుకుంది. ఇక త్వరలోనే ఆ పనులు మొదలవుతాయి. ప్రకాశం బ్యారేజ్‌కి 23కిలోమీటర్ల ఎగువన, పులిచింతల ప్రాజెక్టుకు 60 కిలోమీటర్ల దిగువన వైపుకుంఠపురం వద్ద కొత్త బ్యారేజ్‌ను నిర్మించబోతున్నారు.దీని పొడవు 3..068 కిలోమీటర్లు. వాస్తును పరిశీలించిన తర్వాత ప్రభుత్వం వైకుంఠపురాన్ని ఎంపిక చేసింది. ప్రజారాజధానిలో ఉండేవారికి తాగునీటిని పుష్కలంగా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రాజధానికి నీటి వనరులను తరలించాలంటే ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా కెనాల్‌ , గుంటూరు చానల్‌ మీదుగా మళ్లించాలి. దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి తీసుకెళ్లడం కంటే ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి తరలించడం సులభం. దీన్ని దృష్టిలో ఉంచుకుని జలవనరుల శాఖ అధికారులు వైకుంఠపురం దగ్గర బ్యారేజీని ప్రతిపాదించారు.
 
రాష్ట్రంలో ఐదో బ్యారేజ్‌
వైకుంఠపురం వద్ద నిర్మించబోయే బ్యారేజీ రాష్ట్రంలో ఐదోది. ప్రస్తుతం కృష్ణానదిపై శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్‌తోపాటు పులిచింత ప్రాజెక్టు ఉన్నాయి. గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజ్‌ ఉంది. తాజాగా నిర్మించబోయే వైకుంఠపురం అయిదో ప్రాజెక్టు అవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 178.74 టీఎంసీల సామర్ధ్యం కలిగి ఉంది. ఇక్కడి నుంచి 260 కిలోమీటర్ల దూరంలో కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల సరిహద్దున పులిచింతల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పారుతుంది. పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం 45 టీఎంసీలు. ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల మేర ప్రయాణించే కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజికి చేరుతుంది.
 
 
రెండో ఉత్తర వాహిని
మహారాష్ట్రలో పుట్టిన కృష్ణమ్మ పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి నవ్యాంధ్ర ప్రదేశ్‌లోకి ప్రవేశించిన తర్వాత కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర కలుస్తుంది. జగ్గయ్యపేట దగ్గర ముక్త్యాల ప్రాంతం దగ్గర కృష్ణమ్మ ఉత్తరం వైపున దిగువకు ప్రవహించడంతో ఉత్తర వాహినిగా ఈ ప్రాంతానికి పేరు ఉంది. ముక్త్యాల ప్రాంతం ఆధ్యాత్మిక ధామంగా మారింది. ఇది మొదటి ఉత్తర వాహిని. అమరావతి సమీపంలో వైకుంఠపురం దగ్గర మరోమారు కృష్ణమ్మ ఉత్తరవైపునకు ప్రవహిస్తుంది. వైకుంఠపురానికి రెండో ఉత్తర వాహినిగా పేరు ఉంది.
 
పశ్చిమ కృష్ణాకు జలసిరి
పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా ఉన్నా పశ్చిమ కృష్ణాకు తాగు,సాగు నీటి కోసం కటకటే. ప్రకాశం బ్యారేజ్‌ తూర్పు కృష్ణా సాగునీటి అవసరాలను తీరుస్తోంది. వాటితోపాటు పట్టిసీమ నీరు జిల్లాలోని ‘తూర్పు’ ప్రాంత తీరును మార్చేసింది. పంటలు సకాలంలో రైతు చేతికి వచ్చేలా చేస్తోంది. కృష్ణా డెల్టాలో తూర్పు కృష్ణా సస్యశ్యామలమవుతున్నా, పశ్చిమ కృష్ణా మాత్రం సాగునీటి కోసం నానా పాట్లు పడుతోంది. చింతలపూడి రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయితే పశ్చిమ కృష్ణాలోని మెట్ట ప్రాంతానికి మంచి రోజులు వచ్చినట్టే. దీనితోపాటు వైకుంఠపురం వద్ద కొత్త బ్యారేజ్‌ నిర్మాణం పూర్తయితే తాగునీటి అవసరాలు తీరతాయి.
 
వైకుంఠపురం చరిత్ర ఇదీ
వైకుంఠపురం కొండకు మరోపేరు క్రౌంచగిరి. దీనిపై అలివేలి మంగమ్మ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయం ఉండడంతో క్రౌంచగిరి వైకుంఠపురంగా పేరుగాంచింది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ కొండకు ఎనలేని శోభ వచ్చింది. వైకుంఠపురం కొండపై వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించాలని ఆలిండియా పంచాయతీ పరిషత్‌ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ప్రభుత్వం టీటీడీకి లేఖ రాసింది. తిరుమలలో ఉన్న ఆలయ నమూనాలో ఇక్కడ వేంకటేశ్వరుని ఆలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిశ్చయించింది.
 

Advertisement

Link to comment
Share on other sites

* వైకుంఠపురం ఎత్తిపోతల పథకానికి రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో.. పరిమితికి మించి కోట్‌ చేసినా టెండర్‌ ఖరారు చేసేందుకు నిర్ణయం.
* వైకుంఠపురం వద్ద కృష్ణా నదిపై రూ. 3,278.60 కోట్ల వ్యయంతో మూడేళ్లలో 3 కి.మీ. పొడవైన బ్యారేజి నిర్మాణం

Link to comment
Share on other sites

రాజధానికి జలసిరి
12-02-2019 04:00:15
 
636855408161635027.jpg
  • రేపు వైకుంఠపురం బ్యారేజీకి శంకుస్థాపన
అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరం ఆమరావతికి జలసిరిని తెచ్చే వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో కృష్ణానదిపై నూతనంగా నిర్మించనున్న బ్యారేజీకి ఈనెల 13న ఉదయం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. వైకుంఠపురం కొండ దిగువ భాగాన ఎత్తిపోతల పథకం వద్ద శంకుస్థాపనకు సంబంధించిన పైలాన్‌ను నిర్మిస్తున్నారు.
 
సభా ప్రాంగణానికి స్థలాన్ని చదును చేస్తున్నారు. వేంకటేశ్వర స్వామి కొలువైన కొండకు ఉత్తర భాగాన ప్రారంభమై 3.3కి.మీ. పొడవుతో బ్యారేజీ నిర్మాణం జరగనుంది. అధికారులు సోమవారం బ్యారేజీ ప్రాంతాన్ని పరిశీలించారు. 10.5టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ బ్యారేజీ పనులను రూ.2,169కోట్లతో చేపట్టేందుకు నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ టెండర్లను దక్కించుకుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన మున్నేరు వాగుతో సహా ఇతర వనరుల నుంచి 10.5టీఎంసీల జలాలు వైకుంఠపురం వద్దకు చేరుతాయి. మార్గమధ్యంలోని లంకల్లో పేరుకుపోయిన పూడికను తీసివేస్తే మరో 3టీఎంసీల వరకూ నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ బ్యారేజీ నిర్మాణంతో అమరావతి నీటి అవసరాలు దాదాపు తీరిపోతాయని భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

వైకుంఠపురం బ్యారేజికి 13న సీఎం శంకుస్థాపన

 

వైకుంఠపురం, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి దాహార్తిని తీర్చడానికి అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం వద్ద కృష్ణా నదిపై పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ప్రభుత్వం వైకుంఠపురం బ్యారేజిని నిర్మిస్తుంది.  ఈ నెల 13న ముఖ్యమంత్రి భూమిపూజ చేసి పనులను ప్రారంభించనున్నారు.

Link to comment
Share on other sites

రాజధానికి వరం.. మరో జలహారం
12-02-2019 08:50:46
 
636855582470656743.jpg
  • వైకుంఠపురం బ్యారేజీకి రేపే శ్రీకారం
  • రూ.3,278 కోట్లు మంజూరు.. 3.068 కి.మీ. పొడవున నిర్మాణం
  • శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
  • నిర్మాణం పూర్తయితే ఇరు జిల్లాలకు జలసిరి
నవ్యాంధ్ర రాజధానిలో మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఉత్తరవాహిని పుణ్యతీర్ధంగా పేరుగాంచిన వైకుంఠపురం గ్రామంలో కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత నూతనంగా నిర్మించనున్న బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా జరగనుంది. ఇది నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి ‘వైకుంఠపురం’ మణిహారంగా.. నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాలకు జలసిరిని అందించబోతోంది. నాలుగు రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకోసం రూ.3,278.60 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3.068 కిలోమీటర్లు పొడవున ఈ బ్యారేజీ నిర్మాణం రాజధానికే తలమానికంగా నిలవనుంది.
 
 
అమరావతి/గుంటూరు: ఉత్తరవాహిని పుణ్యతీర్ధంగా పేరుగాంచిన వైకుంఠపురం గ్రామంలో కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుని పాదాల చెంత నూతనంగా నిర్మించనున్న బ్యారేజీ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 13న ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇరిగేషన్‌ అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. కొండ దిగువన ఎత్తిపోతల పథకం వద్ద శంకుస్థాపన పైలాన్‌ను నిర్మిస్తున్నారు. తూర్పువైపున నదీతీరంలో సభాప్రాంగణానికి స్థలాన్ని చదును చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌కి 23 కిలోమీటర్ల ఎగువన, పులిచింతల ప్రాజెక్టుకు 60 కిలోమీటర్ల దిగువన వైకుంఠపురం 3.068 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మించనున్నారు. ప్రజా రాజధానిలో ఉండేవారికి తాగునీటిని పుష్కలంగా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా బ్యారేజీకి 1.5 కి.మీ. సిమెంట్‌ వర్క్‌ కాగా 1.5 కి.మీ ఎర్త్‌ సపోర్ట్‌ వాల్‌ నిర్మాణం జరుగుతుంది. నాలుగు రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకోసం రూ.3,278.60కోట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణపు బాధ్యతలను నవయుగ కనస్ట్రక్షన్‌ కంపెనీ మోయనుంది.
 
 
రాష్ట్రంలో ఐదో బ్యారేజి
వైకుంఠపురం వద్ద నిర్మించబోయే బ్యారేజీ రాష్ట్రంలో ఐదోది. ప్రస్తుతం కృష్ణానదిపై శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్‌తోపాటు పులిచింత ప్రాజెక్టు ఉన్నాయి. గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజ్‌ ఉంది. తాజాగా నిర్మించబోయే వైకుంఠపురం ఐదో ప్రాజెక్టు అవుతుంది. రాజధానికి నీటి వనరులను తరలించాలంటే ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా కెనాల్‌, గుంటూరు చానల్‌ మీదుగా మళ్లించాలి. దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి తీసుకెళ్లడం కంటే ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి తరలించడం సులభం. దీన్ని దృష్టిలో ఉంచుకుని జలవనరుల శాఖ అధికారులు వైకుంఠపురం దగ్గర బ్యారేజీని ప్రతిపాదించారు. ఈ బ్యారేజీ నిర్మాణం వలన 10 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. దీంతో రాజధానికి. తాగునీటితోపాటు భూగర్భజలాలు పెరుగుతాయి. అంతేగాక నదిలో నీటిమట్టం పెరగడం వలన అమరావతి ఎగువ ప్రాంతం వరకు నదిలో నీరు నిండుకుండలా దర్శనమిస్తుంది. దీంతో పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అమరావతిలో మరింత అభివృద్ధి చెందనుంది. వైకుంఠపురం కొండకు మరోపేరు క్రౌంచగిరి. దీనిపై అలివేలి మంగమ్మ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండడంతో క్రౌంచగిరి వైకుంఠపురంగా పేరుగాంచింది.
 
 
ఏర్పాట్ల పరిశీలన
శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సోమమవారం అధికారులు పరిశీలించారు. గుంటూరు జేసీ హిమాన్ష్‌ శుక్లా, ఆర్డీవో వీరాస్వామి వైకుంఠపురాన్ని సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు. అంతకు ముందు ఇరిగేషన్‌ ఎస్‌ఈ కేవీఎల్‌ఎన్‌పీ చౌదరి, ఈఈ ఎ.రాజారావు, నవయుగ కంపెనీ డైరెక్టర్‌ రమేష్‌ తదితరులు శంకుస్థాపన జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు.
 
 
3.068 కి.మీ.
బ్యారేజీ నిర్మాణం పొడవు
రూ.3,278 కోట్లు
తొలి దశగా నిధుల విడుదల
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...