Jump to content

Akhanda Godavari tourism project


Recommended Posts

http://www.nandamurifans.com/forum/index.php?/topic/376215-hope-island/

 

Akhanda Godavari tourism project: ‘extend help to consultancy’
 
 

Highlighting the need for commencing the ‘Akhanda Godavari’ tourism project works at the earliest, District Collector H. Arun Kumar on Wednesday asked the officials of the Tourism Department to extend support to the consultancy that was appointed to prepare the detailed project report (DPR).

Addressing a meeting with the officials and the representatives of the JLL Consultancy here, Mr. Arun Kumar said that a sum of Rs. 100 crore would be spent on developing infrastructure and facilities at tourist spots in and around Rajamahendravaram and the funds were already sanctioned by the government. He said that the banks of the Godavari at Rajamahendravaram, island villages in the river, Havelock Bridge across the Godavari, nurseries at Kadiyam, ancient temples and historic monuments would be given a facelift, besides constructing resorts and arranging facilities like river cruise for the domestic and international tourists.

Mr. Arun Kumar advised the representatives of the consultancy firm to visit all the spots to be developed before preparing the DPR. He also asked the officials of the Tourism Department to accompany the consultants and ensure that the works would be completed in time.

Referring to the Kakinada-Hope Island-Konaseema Tourism Circuit Project, he said that an extent of 50 acres of land at Kakinada Beach had been allocated to the Andhra Pradesh Tourism Development Corporation, where the construction works were in progress.

Special officer of the Akhanda Godavari project Bhima Sankaram and other officials were present.

East Godavari Collector says Rs. 100 crore will be spent on developing infrastructure at tourist spots

Link to comment
Share on other sites

గోదావరి నది, బాగా దట్టం గా ఉండే అడవులు..పూర్తిగా పల్లెటూరి వాతావరణం..ఇప్పటికీ దగ్గర్లో దొరికే కలపతోనే వంటలు చేసే కొంతమంది జనం..ఒక ఆహ్లాదకరవాతావరణాన్ని చూడాలి అని అనుకునేవారందరికీ పాపికొండలుస్వాగతం చెప్తాయి..

పాపికొండలు ఒక్కటే కాదు అక్కడే ఉండే పేరంటాలపల్లి..కొల్లూరు బేంబూ హట్స్,పోలవరం ప్రాజెక్ట్,కొరటూరు కాటేజెస్ అన్నీ చూడాల్సిన ప్రదేశాలే..ఇంకా ఇక లాంచీలమీద ప్రయాణం మర్చిపోలేని మధురానుభూతినిస్తుంది..

ఇవన్నిటికోసం అసలు ప్రయాణం ఎలా మొదలుపెట్టాలి.. పాపికొండలకి రెండు మార్గాలున్నాయి ఒకటి రాజమండ్రినుండి ..రెండు హైద్రాబాద్ నుండి..

రాజమండ్రి నుండి చూద్దాం..రాజమండ్రిలోని పట్టిసీమ రేవు, పోలవరం రేవు, పురుషోత్తపట్టణం రేవు నుండి పాపికొండల యాత్ర మొదలుపెట్టచ్చు ..ఇక్కడ బోట్ ఎక్కితే పోలవరం ప్రాజెక్ట్, గండిపోచమ్మ గుడి మీదుగా దేవీపట్నం, పాపికొండలు, కొరటూరు కాటేజెస్,కొల్లూరు బాంబూ హట్స్ ను దాటుకుంటూ ఖమ్మం జిల్లాలోని పేరంటాల పల్లి దగ్గర ఆగుతుంది.లేదంటే రాజమండ్రిలో బయల్దేరి డైరెక్ట్ గా ‘పట్టిసం’ అదే ‘పట్టిసీమ’ వెళిపోయి అక్కడ గోదావరిదగ్గర బోట్ ఎక్కి వెళ్ళచ్చు ..

రాజమండ్రి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టిసీమ లేదా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురుషోత్తమ పట్నం వరకు ట్రావెల్ ఏజెన్సీ లేదా APSRTC బస్సులు లేదా మినీ వ్యానుల్లో ప్రయాణం చేస్తే, అక్కడ నుండి గోదావరి నదిలో లాంచిలో పాపికొండలు యాత్ర మొదలౌతుంది.

వీలైనంతవరకు ఉదయం 9:00 గంటల లోపుగా అక్కడికి చేరుకోవలసి ఉంటుంది. టిఫిన్, మధ్యాహ్న భోజనం లాంచీ లోనే ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు..

అసలు పాపి కొండల కి ఈ పేరు ఎలా వచ్చిందంటే..

కొండల మధ్య ప్రవహించే గోదావరి మనం జుట్టుకు తీసుకునే పాపిడిలా వుంటుందని పాపిడి కొండలు అన్నారట. అలా అలా పాపికొండలయ్యిందని అంటారు.అసలెలా వెళ్ళాలి, బోట్ కి టికెట్స్ ఎలా .. అనే ఆలోచనకి సమాధానం ఉంది రాజమండ్రిలో ఈ ప్రయాణానికి ఏర్పాటు చేసే టూరిస్టు అఫీసులు వున్నాయి. ఎ.పి. టూరిజం వారు కూడా ఏర్పాట్లు చేశారు.. చేస్తున్నారు..

ఎక్కడో మహారాష్ట్ర ,నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దగ్గర సముద్రంలో కలుస్తుంది..అటువంటి గోదావరిమీద, బోట్ లో అదే లాంచీలో ప్రయాణం చేస్తూ ఆ బోట్ పైన డెక్ మీదకు ఎక్కి ఆ గాలి, ప్రశాంతని అనుభవిస్తూ అడవులని పరిచయం చేసుకుంటూ వెళ్ళే ఈ ప్రయాణంలో ..గోదావరి నది వెడల్పులో మార్పులు గమనిస్తే రాజమండ్రి దగ్గర 6 కి.మీ.ల వెడల్పు వుండే గోదావరి కాస్తా పాపి కొండల మధ్య 2 కిలోమీటర్ల లోపు వెడల్పు మాత్రమే ఉంటుంది..అలా పాపికొండలమధ్యలో గోదావరి ఉంటుంది.

లాంచీ ప్రయాణం మొదలయ్యాకా ‘దెందూరు’ అనే గ్రామం దగ్గర ఆగుతుంది,అక్కడే ఉన్న గండి పోచమ్మ అమ్మవారిని చూశాకా, గట్టు మీద కనిపించే పూడిపల్లి అనే ఊరు గురించి గైడ్ చెప్తాడు ..త్రిశూలం సినిమాలో రావు గోపాలరావు ఇల్లు, అందాల రాముడు, ఆట, ఆపద్బాంధవుడు సినిమాలలో కొన్ని సీన్స్ అక్కడే తీసారని ఇంకా అల్లూరి సీతారామరాజు సినిమాలో చెప్పే..దేవీ పట్నం లోని పోలీసు స్టేషన్లని చూపిస్తారు. ఇంకా బ్రిటిషు కాలంనాటి పాత పోలీసు స్టేషన్ కూడా చూడచ్చు..ఇంకా సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు.

1-copy.jpg

ఇక తర్వాత వచ్చే ఊరు కొరుటూరు… ఇక్కడ ఎ.సి,నాన్ ఎ.సి. కాటేజస్ ఉంటాయి ..తర్వాత పేరంటాలపల్లి చేరుకుంటారు. ఇక్కడే శ్రీరాముని వాకిటం అనేక ఆశ్రమం ఉంది..ఇందులోనే శివాలయం కూడా ఉంటుంది.. ఒకసారి రాజమండ్రి నుంచి ఒక మునీశ్వరుడు బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి దగ్గరకి వచ్చేసరికి రాత్రి కావడంతో ఆయన అక్కడ నిద్రపోతే,
ఆ రాత్రికలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని చెప్పాడని.. అందుకు ఆయన ఇక్కడే ఉండిపోయి ఆలయాన్ని నిర్మించినట్లు ఈప్రాంతం లో ఉండేవాళ్ళు చెప్తారు. ఈ శివాలయం దగ్గరలోనే కొండలపై నుంచి జారే చిన్న జలపాతం ..చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలు కనిపిస్తాయి.

బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించి పచ్చని ఎత్తయిన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్లనుంచి పారే నీటి పరవళ్ళని చూసి తీరాల్సిందే..పేరంటాలపల్లిలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది…స్ధానికులు వెదురుతో చేసిన వివిధ రకాల అలంకరణ వస్తువులు ఇక్కడ అమ్ముతారు. అక్కడి నుంచి లాంచీలపై మరొక 5 కిలోమీటర్ల దూరం వెళ్తే పరవశింపజేసే పాపి కొండలు కనిపిస్తాయి.

పాపికొండలమధ్యలో గోదావరి వంపు సొంపులతో చిన్న ఏరులా కనిపించి మురిపిస్తుంది.. ఎత్తయిన కొండలు మధ్య లో వంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరి ఇవన్నీ చూస్తూ పర్యాటకులు పరవశించిపోతారు.

2-1.jpg

మూడు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పాపికొండల అందాలు చూడాల్సిన పర్యాటకప్రదేశం..పాపికొండల వెనుక భాగానికి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం దగ్గర కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవ్వచ్చు..

ఇక పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు కాబట్టి 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు విద్యుదుత్పాదన లక్ష్యం గా కడుతున్నా ఈ ప్రాజెక్ట్ వల్ల పాపి కొండలు సగం అంటే 100 అడుగుల మేర మునిగిపోవచ్చని ఒక అంచనా ఐతే ఉంది..
పేరంటాలపల్లి చేరుకోవటంతో యాత్ర ముగిసి తిరుగు ప్రయాణం మొదలౌతుంది. పట్టిసం నుండి పాపికొండలు యాత్ర, తిరుగు ప్రయాణం సమయం సుమారుగా 9:30 నుండి 10:00 గంటలు దాకా ఉంటుంది
చుట్టూ గోదావరి, పచ్చని ప్రకృతి సోయగాలు కనిపించే కొండలు చల్లటిగాలి ఇవన్నీ వర్ణించలేనివి… ఎవరికివారు అనుభవించి తీరాల్సిందే..

పచ్చని ప్రకృతి ని, పాపికొండలని చూడటానికి ఎపుడు వెళ్ళాలి… మంచి సమయం ఏదీ అంటే అక్టోబర్ నుండి జనవరి వరకూ అని చెప్పచ్చు..

Link to comment
Share on other sites

Akhanda Godavari Project project report in 15 days
 
   
 
Close ad X

Rajamahendravaram: The Akhanda Godavari Project taken up by the State government is taking concrete shape. JLL Consultancy would submit a comprehensive report within 15 days, following which, a master plan would be prepared. As part of tourism development, illumination of road-cum-rail bridge has already been completed and two beautiful punts have been constructed to conduct Nithya Harathi for Godavari.

Link to comment
Share on other sites

AP govt keen on developing Godavari islands as tourists spots

Rajahmundry: Andhra Pradesh Finance Minister Yanamala Ramakrishnudu has said that each island in Godavari area would be developed as a tourist centre under the Akhanda Godavari project in the state.

The minister who attended the concluding day of the five-day Konaseema Festival on Sunday which was held at Muramalla in I Polavaram mandal of the district, said, "the state government is keen to develop each island in Godavari area as tourism spots under Akhanda Godavari project."

All concerned departments have asked to prepare plans for this project, he said.

The minister also noted that since Konaseema area possesses natural resources, efforts have been made to develop tourism in this area.

Besides night safaris and eco tourism is also being planned in agency area in the district.

Festivals would make the people get together and the sales in the festivals period would promote economic activities, he added.

State Deputy Chief Minister N Chinarajappa said that Rs 350 crore is being spent for tourism projects in konaseema area.

Boats in river Godavari, food courts and cultural programs will attract more number of tourists during this festival.

Endowments Minister P Manikyala Rao said the state government was putting more thrust on tourism promotion in the coming days and appreciated the district administration for successfully organising the festival.

Link to comment
Share on other sites

కోనసీమ చూసొద్దాం
 
636050087285041827.jpg
  • స్వదేశ్‌ దర్శన్‌లో.. ఆంధ్రప్రదేశ్‌!
  • కోనసీమ, నెల్లూరు ఎంపిక..
  • రాష్ట్రానికి 130 కోట్లు మంజూరు
న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద 21 రాషా్ట్రలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25 ప్రాజెక్టులకు కేంద్ర పర్యాటక శాఖ అనుమతులు ఇచ్చింది. రూ.2,048 కోట్ల వ్యయంతో ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చి, పర్యాటకులకు అవసరమైన సదుపాయాలను సమకూర్చనుంది. ఈ పథకంలో భాగంగా.. 13 థీమ్‌ సర్క్యూట్లను కేంద్రం ఎంపిక చేయగా, అందులో రెండింటిని ఏపీ దక్కించుకొంది. రూ. 130 కోట్ల విలువైన ఈ కోస్తా సర్క్యూట్‌ల్లో కాకినాడ-హోప్‌ ఐలాండ్‌- కోనసీమ; పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోస్తా ప్రాంతాలను ప్రపంచ స్థాయి కోస్తాతీర, ఏకో టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. కోనసీమ సర్క్యూట్‌కు మొత్తం రూ.69.83 కోట్లు కేటాయించి, ఇప్పటి వరకూ రూ.13.96 కోట్లు విడుదల చేసింది. నెల్లూరు సర్క్యూట్‌కు రూ.60.38 కోట్లకు, రూ.12.08 కోట్లు విడుదల చేసింది. ఇవి పోను, ఈశాన్య భారతం, బౌద్ధం, హిమాలయ, ఎడారి, గిరిజన, ఏకో, వణ్యప్రాణి, గ్రామీణ, ఆథ్యాత్మిక, రామాయణ, వారసత్వ సర్క్యూట్లను అభివృద్ధి చేయనున్నారు. అలాగే.. ఈశాన్య భారతంలోని ఎనిమిది రాషా్ట్రల్లో తొమ్మిది ప్రాజెక్టులకు రూ.821 కోట్లు, నాగాలాండ్‌, ఛత్తీశ్‌గఢ్‌, తెలంగాణ రాషా్ట్రల్లోని గిరిజన ప్రాంతాల్లో మూడు ప్రాజెక్టులకు 282 కోట్లు, బీహార్‌, మధ్యప్రదేశ్‌ల్లోని బౌద్ధ సర్క్యూట్‌లోని రెండు ప్రాజెక్టులకు రూ.108 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించగల, పోటీతత్వాన్ని తట్టుకునే, సుస్థిరత గల సమగ్రమైన రీతిలో భాగస్వాములందరినీ చేర్చి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయనుంది. తద్వారా పర్యాటక అనుభూతులను మెరుగుపర్చటంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం.
Link to comment
Share on other sites

అఖండ గోదావరి ప్లాన్‌ సిద్ధం
 
636122609280516572.jpg
  •  రాజమహేంద్రవరంలో ప్రాజెక్టు కార్యాలయం 
  •  50 కోట్లతో ప్రాథమిక వసతుల కల్పనకు ప్రణాళిక 
  •  ప్రభుత్వం అనుమతించగానే పనులు ప్రారంభం 
ఆంధ్రజ్యోతి- రాజమహేంద్రవరం, అక్టోబరు16: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కల నెరవేరబోతోంది. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా లాంచీలో గోదావరిని, లంకలను స్వయంగా పరిశీలించిన సీఎం అఖండ గోదావరి ప్రాజెక్టుకు రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టు కార్యాలయం ఏర్పాటు చేసి, స్పెషలాఫీసర్‌గా జి.భీమశంకర్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో ముందుగా మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణకుమార్‌ రూ.50కోట్లతో ప్రతిపాదనలు చేసి, ప్రభుత్వానికి పంపించారు. ఈ నెలాఖరులోపు దీనికి పరిపాలనాపరమైన అనుమతి రావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం- కొవ్వూరు మధ్య ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి పట్టిసీమ వరకు ఉన్న విశాలమైన అఖండ గోదావరిలో లంకలు, ఏటిగట్టులు, ఘాట్లు, బ్రిడ్జిలు ఇక వినోదానికి ఆలవాలం కానున్నాయి. వీటితోపాటు ఉభయగోదావరి జిల్లాలను ఒక టూరిజం హబ్‌గా మార్చి, ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశం. అఖండ గోదావరి ప్రాజెక్ట్‌ స్పెషలాఫీసర్‌ జి.భీమశంకర్‌ కథనం ప్రకారం... రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్‌ రేవులో గోదావరి మధ్య ఫ్లోటింగ్‌ స్టేజీ, దాని వెనుక గ్రీన్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మీటింగ్‌లు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల వంటివి నిర్వహించుకోవచ్చు. ఇక ఘాట్‌ వద్ద గజబోలాలు(హట్స్‌) ఏర్పాటు చేస్తారు. ఇక్కడి ఏటిగట్టును ఈటింగ్‌ స్ర్టీట్‌గా మారుస్తారు. కోటిలింగాల ఘాట్‌ చివర నుంచి పుష్కరఘాట్‌ వరకూ నీటిలో గ్లాస్‌తో వాక్‌వే నిర్మిస్తారు. గోదావరి హారతికి కొత్త జెట్టీలు సిద్ధం అవుతున్నాయి. గోదావరి మధ్యలో ఉన్న కేతావారిలంక వంద ఎకరాలలో ఉంది. ఈ లంక చుట్టూ వాక్‌వే నిర్మిస్తారు. అక్కడి నుంచి ఏటిగట్టుదాకా రెండు సస్పెన్సన్‌ బ్రిడ్జిని నిర్మిస్తారు. ఈ లంకలో రెండు హెలిప్యాడ్‌లు నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి పాపికొండలకు 40 నిమిషాల పాటు హెలికాఫ్టర్‌ షికారు ఉంటుంది. ఇక్కడ గజబోలాలు, జెట్టీలు, బోటింగ్‌ ఏర్పాటు చేస్తారు. akhanda-godavari-office.jpgధవళేశ్వరం బ్యారేజ్‌ని ఆనుకుని ఉన్న 43 ఎకరాల పిచ్చుకలంకను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ని సుందరీకరించనున్నారు. పెయింటింగ్‌ వేయడంతోపాటు పర్యాటకులను ఆకర్షించేవిధంగా లైటింగ్‌ ఏర్పాటు చేస్తారు. దీనికి ధవళేశ్వరం నుంచి కడియపులంక వరకు జలరవాణా ఏర్పాటు చేస్తారు. కడియపులంకలో పాసింజర్స్‌ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. కడియపులంకలో 6 ఎకరాల్లో రిసార్ట్స్‌ నిర్మించనున్నారు. కాటన్‌ మ్యూజియం కూడా సందర్శకులకు వీలుగా సిద్ధం చేయనున్నారు. పట్టిసీమ నుంచి కొవ్వాడ కాలువ స్లూయీజ్‌ వరకు రోప్‌వే పీపీపీ పద్ధతిలో నిర్మించాలనే ఆలోచన ఉంది. ఇక పట్టిసీమ గుడి సమీపంలో 23 ఎకరాల్లో కాటేజీలు, రెస్టారెంట్‌లు నిర్మించనున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఇన్‌టేక్‌ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో డెలివరీ పాయింట్‌ వద్ద ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను కనీసం 6 నెలల్లో పూర్తిచేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ మౌలిక సదుపాయాలతో అక్కడ గోదావరికి ఒక లుక్‌ ఏర్పడిన తర్వాత రూ.600 నుంచి 800 కోట్ల వరకు పెట్టుబడులను ఆహ్వానించి ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ యోచన.
Link to comment
Share on other sites

  • 1 month later...

Ap Government Emphasis On Developing Tourist Spots Around Godavari Islands

godavari_1460433627m.jpg Photo by: Palavelliresorts

 

 

Andhra Pradesh Govt. Announced Development of Godavari Islands
Are you Planning your Trip?

Get Quotes to compare

Save TimeSave MoneyTrusted Network
Planning to travel
on or around

calendar-icon.png
for
along with

 having budget as

 

GO

Andhra Pradesh government announced the development of Godavari islands under its tourism development project in the state. As per Finance Minister Yanamala Ramakrishnudu, the state governments will emphasis on developing all the islands across Godavari to promote tourism in the state and provide best locations for visitors. The development will be undertaken under the project Akhanda Godavari project. The announcement of this project took place during the five-day Konaseema Festival at Muramalla in Polavaram Mandal district. He also added that the islands posses various natural resources and will definitely prove to be the best spots to attract tourist from India and foreign countries.

For this, every concerned department has to make dedicated projects to turn this idea into action. Along with it, night safaris and eco tourism will also be the area of concern and efforts will be made to introduce in the tourism of this area. He added that festive season would be the best time when tourism in the city will be high and will gain attention of large number of visitors to these newly developed tourist spots in the state. Boats, food courts and various cultural programs will be introduced to attract more visitors.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఉభయగోదావరి జిల్లాలో టూరిజం హబ్‌
 
రాజమహేంద్రవరం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాలను టూరిజం హబ్‌గా రూపొందించనున్నామని పర్యాటక శాఖ ఎండీ ఎం.గిరిజాశంకర్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా అఖండ గోదావరి ప్రాజెక్టును ఆధ్యాత్మిక(టెంపుల్‌), ఇకో టూరిజంగా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. రాజమహేంద్రవరంలోని రివర్‌బే హోటల్‌లో గురువారం టూరిజం ఇన్వెస్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజాశంకర్‌ మాట్లాడుతూ..సీఎం చంద్రబాబునాయుడు అమరావతి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం రీజియన్లలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి నిర్ణయించారన్నారు. ఇప్పటికే చాలా మంది ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారని, వారితో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నామని తెలిపారు. మరింత మందిని ప్రోత్సహించడం కోసం అన్ని రీజియన్లలో ఇన్వెస్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నామని వివరించారు. భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట, పట్టిసీమ దేవాలయం, పిఠాపురం శక్తిపీఠం వంటి వాటిని ఆధ్యాత్మిక విభాగంగా,మారేడుమిల్లి, రాజమహేంద్రవరం రివర్‌ఫ్రంట్‌, కోనసీమ లోకల్‌ టూరిజం వంటివన్నీ ఇకో టూరిజంగా అభివృద్ధిచేస్తామన్నారు. రాజమహేంద్రవరంలోని గోదావరిపై ఉన్న హేవలాక్‌ బ్రిడ్జిని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయడానికి నివేదిక తయారు చేస్తున్నామని చెప్పారు. అలాగే కోనసీమలోని ద్వీపాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరిజిల్లా కలెక్టర్‌ హెచ్‌. అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ..కాకినాడ, కోనసీమ ప్రాంతాలను కలుపుతూ రూ.85కోట్లతో స్వదేశీదర్శనం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. మొదటి దశను వచ్చేనెలలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. సమావేశంలో ఎపీ చాంబర్‌ ప్రతినిధులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఔత్సాహికులు, అఖండగోదావరి ప్రాజెక్టు ఈడీ జీ.భీమశంకర్‌ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

godavari-dredging-03012017.jpgగోదావరిలో ఎట్టకేలకు మొదలైన డ్రెడ్డింగ్

గోదావరిలో ఇసుక మేటల డ్రెడ్డింగ్ కు రంగం సిద్ధమైంది. త్వరలోనే ప్రారంభించడానికి యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నది. ధవళేశ్వరం బ్యారేజి ఎగువ భాగంలో ఇసుక మేటలు తొలగించాలనే డిమాండు ఎట్టకేలకు నెరవేరింది. రబీలో నీటి ఎద్దడి ఏర్పడినప్పడల్లా ఇక్కడి ఇసుక మేటలు గుర్తుకు వస్తాయి. వీటిని తొలగిస్తే అఖండ గోదావరి పాండ్ లెవల్ పెరుగుతుందనేది రైతులు, నాయకుల వాదన. అసలు ఈ బ్యారేజీ పాండ్ సామర్ధ్యం మూడు టీఎంసీలు.

ఎట్టకేలకు అఖండ గోదావరి నదిలో పూడికతీత పనులు మొదలయ్యాయి. నదిలో ఇసుక దిబ్బలు, మేటల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వద్ద దాదాపు 3 మీటర్ల లోతు పెరిగే అవకాశం ఉంది. 3 టిఎంసిల జలాలు నిల్వ సామర్ధ్యంతో ఉన్న కాటన్ బ్యారేజి, దశాబ్దాలుగా పూడిక తొలగింపు ప్రక్రియ చేపట్టకపోవడంతో 1.5 టి.ఎం సిల సామర్థ్యానికే పరిమితమైంది. దీంతో ప్రతీ ఏడాది రబీ సీజన్ లో సాగు జలాలకు కటకటలాడాల్సిన దుస్థితి. జీవ నది గోదావరి నవంబర్, డిసెంబర్ మాసాల్లో నీటి లభ్యత క్రమేణా క్షీణించిపోతోంది. దీంతో సీలేరు నుంచి జలాలను గోదావరి నదికి మళ్ళించుకుని ప్రతీ రబీ సీజన్ లో గట్టెక్కే పరిస్థితి.

నిరంతరం డ్రెడ్డింగ్ పనులు నిర్వహిస్తే మాత్రం బ్యారేజి వద్ద నదీ గర్భం లోతు పెరిగి నీటి నిల్వలు అవసరం మేరకు సమృద్దిగా ఉండే అవకాశం ఉండేది. ఎట్టకేలకు అఖండ గోదవరి నదిలో డ్రెడ్డింగ్ పనులకు శ్రీకారం చుట్టడంతో, ఇప్పటికే గుర్తించిన దాదాపు 20 మేటలు, ఇసుక దిబ్బలు తొలగించడానికి జలవనరుల శాఖ చర్యలు చేపట్టింది. రూ.16.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన డ్రైడ్డింగ్ పనులను రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సోమవారం కోటిలింగాల ఘాట్ సమీపంలో ప్రారంభించారు.

 

దిబ్బలను తొలగించిన ఇసు కను అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు అవసరాల నిమిత్తం పిచ్చుకలంక వద్ద ప్రాంతాన్ని ఎత్తు చేసేందుకు ఉపయోగిస్తు న్నారు. పిచ్చుకలంక ప్రాంతాన్ని అఖండ గోదావరి నది పర్యాటక ప్రాజెక్టులో ప్రధానమైన భూభాగం. దీనిని డ్రెడ్డింగ్ ద్వారా వచ్చిన ఇసుకతో గత మూడు నెలల నుంచి పూడ్చుతున్నారు. దీంతో సుమారు 6 మీటర్ల ఎత్తు పెంచినట్టు అధికారులు తెలియజేశారు.

టూరిజం ప్రాజెక్టులో పిచ్చుకలంక ప్రాంతాన్ని నిర్మాణాలకు అనువైన రీతిలో ఎత్తు చేసేందుకు దాదాపు రూ. 40 కోట్ల ఖర్చవతుందని అంచనా వేశామని, చేపట్టిన డ్రెడ్డింగ్ వల్ల ఇసుక మేటలు తొలగించి ఎత్తు చేయడం వల్ల పర్యాటక శాఖకు రూ.40 కోట్ల నిధులను ఆదా చేసినట్టేనని జలవనరుల శాఖ హెడ్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారావు చెప్పారు. అఖండ గోదావరి నదిలో ఇసుక దిబ్బలను, మేటలు, లంకలు తదితర పూడికతీత వల్ల దాదాపు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించాల్సి ఉందని, మొదటి విడతలో 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించనున్నారు. సుమారు 6 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను పిచ్చుకలంక పర్యాటక ప్రాజెక్టుకు వినియోగిస్తున్నారు.

Link to comment
Share on other sites

 

 

 
 

godavari-dredging-03012017.jpg

గోదావరిలో ఇసుక మేటల డ్రెడ్డింగ్ కు రంగం సిద్ధమైంది. త్వరలోనే ప్రారంభించడానికి యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నది. ధవళేశ్వరం బ్యారేజి ఎగువ భాగంలో ఇసుక మేటలు తొలగించాలనే డిమాండు ఎట్టకేలకు నెరవేరింది. రబీలో నీటి ఎద్దడి ఏర్పడినప్పడల్లా ఇక్కడి ఇసుక మేటలు గుర్తుకు వస్తాయి. వీటిని తొలగిస్తే అఖండ గోదావరి పాండ్ లెవల్ పెరుగుతుందనేది రైతులు, నాయకుల వాదన. అసలు ఈ బ్యారేజీ పాండ్ సామర్ధ్యం మూడు టీఎంసీలు.

ఎట్టకేలకు అఖండ గోదావరి నదిలో పూడికతీత పనులు మొదలయ్యాయి. నదిలో ఇసుక దిబ్బలు, మేటల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వద్ద దాదాపు 3 మీటర్ల లోతు పెరిగే అవకాశం ఉంది. 3 టిఎంసిల జలాలు నిల్వ సామర్ధ్యంతో ఉన్న కాటన్ బ్యారేజి, దశాబ్దాలుగా పూడిక తొలగింపు ప్రక్రియ చేపట్టకపోవడంతో 1.5 టి.ఎం సిల సామర్థ్యానికే పరిమితమైంది. దీంతో ప్రతీ ఏడాది రబీ సీజన్ లో సాగు జలాలకు కటకటలాడాల్సిన దుస్థితి. జీవ నది గోదావరి నవంబర్, డిసెంబర్ మాసాల్లో నీటి లభ్యత క్రమేణా క్షీణించిపోతోంది. దీంతో సీలేరు నుంచి జలాలను గోదావరి నదికి మళ్ళించుకుని ప్రతీ రబీ సీజన్ లో గట్టెక్కే పరిస్థితి.

నిరంతరం డ్రెడ్డింగ్ పనులు నిర్వహిస్తే మాత్రం బ్యారేజి వద్ద నదీ గర్భం లోతు పెరిగి నీటి నిల్వలు అవసరం మేరకు సమృద్దిగా ఉండే అవకాశం ఉండేది. ఎట్టకేలకు అఖండ గోదవరి నదిలో డ్రెడ్డింగ్ పనులకు శ్రీకారం చుట్టడంతో, ఇప్పటికే గుర్తించిన దాదాపు 20 మేటలు, ఇసుక దిబ్బలు తొలగించడానికి జలవనరుల శాఖ చర్యలు చేపట్టింది. రూ.16.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన డ్రైడ్డింగ్ పనులను రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సోమవారం కోటిలింగాల ఘాట్ సమీపంలో ప్రారంభించారు.

 

దిబ్బలను తొలగించిన ఇసు కను అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు అవసరాల నిమిత్తం పిచ్చుకలంక వద్ద ప్రాంతాన్ని ఎత్తు చేసేందుకు ఉపయోగిస్తు న్నారు. పిచ్చుకలంక ప్రాంతాన్ని అఖండ గోదావరి నది పర్యాటక ప్రాజెక్టులో ప్రధానమైన భూభాగం. దీనిని డ్రెడ్డింగ్ ద్వారా వచ్చిన ఇసుకతో గత మూడు నెలల నుంచి పూడ్చుతున్నారు. దీంతో సుమారు 6 మీటర్ల ఎత్తు పెంచినట్టు అధికారులు తెలియజేశారు.

టూరిజం ప్రాజెక్టులో పిచ్చుకలంక ప్రాంతాన్ని నిర్మాణాలకు అనువైన రీతిలో ఎత్తు చేసేందుకు దాదాపు రూ. 40 కోట్ల ఖర్చవతుందని అంచనా వేశామని, చేపట్టిన డ్రెడ్డింగ్ వల్ల ఇసుక మేటలు తొలగించి ఎత్తు చేయడం వల్ల పర్యాటక శాఖకు రూ.40 కోట్ల నిధులను ఆదా చేసినట్టేనని జలవనరుల శాఖ హెడ్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారావు చెప్పారు. అఖండ గోదావరి నదిలో ఇసుక దిబ్బలను, మేటలు, లంకలు తదితర పూడికతీత వల్ల దాదాపు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించాల్సి ఉందని, మొదటి విడతలో 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించనున్నారు. సుమారు 6 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను పిచ్చుకలంక పర్యాటక ప్రాజెక్టుకు వినియోగిస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 4 months later...

Posted Today, 09:56 PM

sonykongara, on 22 May 2017 - 11:37 PM, said:snapback.png

 

సుందర దృశ్యం..అద్భుతం ఆవిష్కృతం
weg-sty1a.jpg

ఎత్తైన కొండలు.. దట్టమైన చెట్ల మధ్యలో నుంచి గోదారమ్మ పరవళ్లు, హోయలు, పచ్చని పాపికొండల అందాలు చూడాలని ఉందా? తొందరపడితే కుదరదు మరి.. కొన్నాళ్లు ఆగాలి. అదీ ఎక్కడనుకుంటున్నారు? మన పోలవరం మండలం కొరుటూరులో. మరెందుకు ఆలస్యం. ఆ అవకాశం ఎలా కలుగుతుందో చూద్దామా..

 

పోలవరం: నవ్యాంధ్ర మణిహారం పర్యాటకం. అందునా గోదావరి అందాలు చెప్పాలా. అందుకే కలెక్టరు కాటంనేని భాస్కర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరం మండలం కొరుటూరులో తేనె కొండ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా మొట్టమొదట పర్యటక శాఖ నుంచి కాటేజ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం కలెక్టరు రూ.80 లక్షలు విడుదల చేశారు. ఆ నిధులతో ప్రస్తుతం ఐదు కాటేజ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దాదాపు 30 - 40 ఎకరాల విస్తీర్ణంలో మరిన్ని కాటేజ్‌లు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించాలనేది ఉన్నతాధికారుల ఆలోచన. దానికి అవసరమైన రెండో విడత నిధులు త్వరలో విడుదల చేస్తారు.

ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్థాయికి 50 మీటర్లు పైన
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో కొరుటూరు గ్రామంతో పాటు గోదావరి ఒడ్డున తేనెకొండపై నిర్మించిన బ్రిటీషు కాలం నాటి కట్టడాలు మునిగిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం అనంతరం మునిగిపోయే ప్రాంతం నుంచి 50 మీటర్ల ఎగువన కొండపై నుంచి పర్యాటకులు నేరుగా పాపికొండలు అందాలు కనిపించే విధంగా కాటేజ్‌లు నిర్మిస్తున్నారు.

అంతా కలపతోనే
ఫ్లాట్‌ఫాం, మరుగుదొడ్ల నిర్మాణం, కాటేజ్‌ల పైన మంగుళూరు పెంకు తప్ప మిగిలిన నిర్మాణం అంతా స్పూస్‌ కలపతోనే చేపట్టారు. ఈ కలప కెనడా నుంచి తీసుకొచ్చారు. ఈ స్పూస్‌ కలప ప్రత్యేకమైంది. దీనిని రసాయనాల్లో కొద్ది రోజుల పాటు ఉంచి చెన్నై తీసుకొస్తున్నారు. అక్కడ కాటేజ్‌ల నిర్మాణానికి వీలుగా కోసి కొరుటూరు తీసుకొస్తున్నారు. ఈ కలపకు చెద పట్టే అవకాశం ఉండదు.

సౌర విద్యుత్తుతో నీటి సరఫరా
పర్యాటకులకు అవసరమైన నీటి కోసం సౌర పంపుసెట్‌ (10 హార్స్‌పవర్‌) తిరిగేది ఏర్పాటు చేశారు. కొండపై నుంచి వచ్చే నీరు వల్ల కాటేజ్‌లకు ఎలాంటి ముప్పు జరగకుండా మూడు విడతల్లో రక్షణ గోడ నిర్మిస్తున్నారు. పర్యాటకులు కొంతసేపు వాటిపై కూర్చునేందుకు వీలుగా మెట్లు కింద నిర్మిస్తున్నారు.

ముమ్మరంగా పనులు
భవిషత్తులో పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మరిన్ని కాటేజ్‌ల నిర్మాణం చేపట్టే ఆలోచన ఉంది. ప్రస్తుతం కాటేజ్‌ల నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి ఆన్న దానిపై జిల్లా కలెక్టరు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకూ గోదావరి ఒడ్డు నుంచి పాపికొండల అందాలను తిలకిస్తున్న పర్యాటకులు ఇకపై దట్టమైన చెట్ల మధ్య నిర్మిస్తున్న కాటేజ్‌ల నుంచి చూసే వీలు కలుగుతుంది. దానికి సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

- ఎన్‌.దావీద్‌రాజు, పోలవరం అటవీ శాఖ అధికారి
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...