Jump to content

Chandranna Bima


Recommended Posts

రైతుకు బీమా
27-06-2018 01:46:18
 
636656644589732698.jpg
  • చంద్రన్న రైతు బీమా పేరిట 10.75 లక్షల మందికి భరోసా
  • ఇప్పటికే ఉన్నవారితో కలిపితే 50 లక్షల మంది రైతులకు లబ్ధి
  • సహజ మరణానికి 30 వేల నుంచి రూ.2 లక్షలు
  • ప్రమాద మృతికి 5 లక్షలు పరిహారం
  • ఆదాయం 2.5 లక్షల లోపు ఉండాలి
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం
  • ఏరువాక సందర్భంగా రేపు ప్రకటన!
అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుకు కూడా బీమా భరోసా దక్కనుంది. దేశంలో పంటలకు బీమా కల్పనే ఇంకా అంతంతమాత్రంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో రైతులకు వ్యక్తిగతంగా బీమా భద్రత కల్పించనున్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఇప్పటికే చంద్రన్న బీమా పథకం అమలవుతోంది. పింఛన్లతోపాటుగా అత్యంత సంతృప్తినిస్తున్న పథకంగా చంద్రన్న బీమా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అదే తరహాలో రైతు కుటుంబాలకు కూడా రక్షణ ఉండేలా బీమా సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
 
ఏరువాక సందర్భంగా గురువారం దీనిపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. 18 నుంచి 70 ఏళ్లు మధ్యనున్న రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. వారి వార్షిక ఆదాయం రూ.2.5లక్షలు మించి ఉండకూడదు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 50లక్షల మంది రైతులకు బీమా దన్ను లభిస్తుంది. చంద్రన్న రైతు బీమా పథకం కోసం కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికంగా భరిస్తుంది. మొత్తం ప్రీమియంలో రూ.21.91కోట్లు రాష్ట్ర ప్రభుత్వం.. రూ.18.70కోట్లు కేంద్రం చెల్లిస్తుంది.
 
ఈ పథకానికి చంద్రన్న రైతు బీమా అనే పేరు పెట్టాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. పాలసీదారు చనిపోతే వారి కుటుంబానికి రూ.30వేల నుంచి రూ.5లక్షలు పరిహారం ఇస్తారు. 18-50 ఏళ్లు వయసున్న రైతు సహజ మరణం పొందితే రూ.2లక్షలు ఇస్తారు. 50-60 ఏళ్లు వారైతే రూ.30వేల పరిహారం ఇస్తారు. 18-70 ఏళ్లు మధ్యవయసులోని వారు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబాలకూ రూ.5లక్షల పరిహారం అందిస్తారు.
 
శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.5లక్షలు చెల్లిస్తారు. పాక్షిక అంగవైకల్యమైతే రూ.2.5లక్షలు ఇస్తారు. ఆయా కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలుంటే వారికి ఏడాదికి రూ.1200లు ఉపకార వేతనం ఇస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ చదివే పిల్లలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్రంలో చంద్రన్న రైతు బీమా ద్వారా ప్రయోజనం పొందనున్న 10.75లక్షల మంది రైతుల్లో ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారన్న లెక్కలను ప్రభుత్వం సేకరించింది.
 
ఇప్పటికే అత్యధిక రైతుల ప్రజాసాధికార సర్వేలో ఉన్నారు. సర్వేలో నమోదు కానివారికీ మరో అవకాశ ం ఇస్తారు. ఈ పథకం అమలులో కార్మికశాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. చంద్రన్న బీమా తరహాలోనే ఈ పథకంలో కూడా మరణించినవారి కుటుంబానికి 10 రోజుల్లోనే పరిహారం అందేలా నిబంధనలను రూపొందించారు. ఇప్పటికే సెర్ప్‌ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు చంద్రన్న బీమాను బాగా అమలుచేస్తుండడంతో వారికే దీని అమలును కూడా అప్పగించాలని నిర్ణయించారు.
Link to comment
Share on other sites

చంద్రన్న బీమా' ప్రీమియం చెల్లించిన ఏపీ ప్రభుత్వం
28-06-2018 20:13:24
 
636658136051245264.jpg
అమరావతి: ఈఏడాది 'చంద్రన్న బీమా' ప్రీమియం మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం చెల్లించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ 'చంద్రన్న బీమా' ప్రీమియం కోసం రూ.466 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. చంద్రన్న బీమా భద్రత ద్వారా 2.49 లక్షల మందికి లబ్ధి పొందుతున్నారని ఆయన అన్నారు. ఈ ప్రీమియం కాలపరిమితి వచ్చే ఏడాది మే 31 ముగియనుంది. ఏపీలో 18 నుంచి 69 ఏళ్ల వయసు ఉన్న వారందరికీ 'చంద్రన్న బీమా'తో భద్రత భరోసా లబిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...