Jump to content

Digital classrooms, biometric system in all govt


sonykongara

Recommended Posts

  • Replies 188
  • Created
  • Last Reply
సర్కారీ బడి.. సూపర్‌
14-06-2018 03:07:00
 
636645424330035812.jpg
  • చీరాలలో అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాల
  • కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాలు
  • రూ.రెండు కోట్లతో బడికి రూపకల్పన
  • 450మంది పిల్లలు కూర్చునేలా డైనింగ్‌ హాల్‌
  • శుద్ధ జలాల కోసం ఆరు లక్షలతో వాటర్‌ ప్లాంట్‌
  • క్రీడల కోసం విశాలమైన మైదానం
రాష్ట్రమంతటా బడిగంటలు మోగాయి. బిలబిలమంటూ పిల్లలు, వారిని వదిలిపెట్టడానికి వచ్చే తల్లిదండ్రులతో పాఠశాలల పరిసరాల్లో కోలాహలం నెలకొంది. అడ్మిషన్లు దాదాపు పూర్తయ్యాయి. అయినా, ఆ స్కూలుకు మాత్రం దరఖాస్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రవేశం కోసం రోజంతా పాఠశాల ప్రాంగణంలో పడిగాపులు పడుతున్నారు. ‘బాబ్బాబు.. ఒక్క సీటూ..’ అన్న విజ్ఞప్తులు, ‘మాకు తెలిసిన ఫ్యామిలీ అది. కాస్త చేసి పెట్టండి’ అన్న రికమండేషన్‌ ఫోన్లతో రోజంతా హడావుడిగానే ఉంటుంది. ఇంతా చేసి ఈ స్కూలు ఏదో ప్రైవేటు లేక కార్పొరేట్‌ స్కూలు కాదు. అదొక ప్రభుత్వ బడి. అయితే, కార్పొరేటును తలదన్నేలా సిద్ధమవుతుండటం, అదేస్థాయిలో టీచర్లు వినూత్న ప్రచా రం చేపట్టడమే ఇప్పుడు ఈ స్కూలుకు డిమాండ్‌ను పెంచేసింది.
 
ప్రకాశం జిల్లా చీరాలలోని కొత్తపేటలో ప్రస్తుతం ఈ స్కూలు నిర్మాణంలో ఉంది. ఈ నెల 19వ తేదీనాటికి ఒకమేరకు నిర్మాణ పనులను పూర్తిచేసుకొని క్లాసులు జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ‘మా దగ్గర సీట్లు అయిపోయాయి. ఇక రావద్దు’ అని చెబుతున్నా, ఈ జెడ్‌పీ స్కూలుకు పోటెత్తె తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 1000 మంది ప్రవేశాలకు అవకాశం ఉండగా, ఇప్పటికే 1500 దరఖాస్తులు వచ్చాయట! ఇంతలా తల్లిదండ్రులను ఆకర్షిస్తున్న విషయం ఏమిటీ? ఎకరా 20 సెంట్లలో దాదాపు రూ.రెండు కోట్ల వ్యయంతో ఈ నూతన పాఠశాల సిద్ధమవుతోంది. పదిరకాల క్రీడలను ఒకేసారి నిర్వహించగలిగినంత విశాలమైన మైదానాన్ని, కోర్టులను సిద్ధం చేస్తున్నారు. ఆరు లక్షల వ్యయంతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో బోధించనున్నారు. ఇక్కడి డైనింగ్‌ హాల్‌లో ఒకేసారి 450మంది పిల్లలు భోజనం చేయొచ్చు. దూర ప్రాంతాలనుంచి వచ్చే వారికి ఉచిత రవాణా. విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు అందించనున్నారు. అంటే ఈ స్కూలులో అడ్మిషన్‌ పొందితే చాలు, ఏ సౌకర్యం, వసతికి విద్యార్థులు వెతుక్కోనక్కర్లేదు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తన కుమారుడికి ఎనిమిదో తరగతి కోసం ఈ స్కూలులో అడ్మిషన్‌ తీసుకోవడం మరో విశేషం.
 
9ong8363.jpg 
 
 
అక్షరానికి బీజమిలా..
కొత్తపేటలో రెండు ప్రాథమికొన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిని కలిపి ఒక హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌గా చేయాలన్న ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. ఆ ఆలోచన ఇటీవల ఆమంచి ముందుకు వచ్చింది. ఒక్క కొత్తపేట ప్రాంతంలోనే దాదాపు ఐదువేలమంది పిల్లలు ప్రైవేటుబాట పట్టినట్టు ఆమంచి దృష్టికి వచ్చింది. దేనికీ లోటు లేకుండా నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తే, పేద తల్లిదండ్రులకు బాసటగా ఉంటుందని ఆయన ఆలోచించారు. దానికోసం కొత్తపేటలోని యూపీ స్కూళ్లను అప్‌గ్రేడ్‌ చేసి అన్ని హంగులతో హైస్కూలును ఏర్పాటుచేస్తే బాగుంటుందని అనుకొన్నారు. ఈ ఆలోచన చేసిన వారంలోపే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గత ఏప్రిల్‌ 26వ తేదీన పనులు మొదలయ్యాయి. ఈ విషయంలో ఆయనకు టీచర్లు పూర్తిగా సహకరించారు. మరోవైపు, మంత్రి గంటా శ్రీనివాసరావు, విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, డీఈవో సుబ్బారావు అన్నివిధాల కలిసివచ్చారు. దాతలూ స్వచ్ఛందంగా ముందుకువచ్చారు.
 
 
పక్కా నిర్వహణకు ట్రస్ట్‌
ఈ స్కూలు నిర్వహణ కోసం ప్రత్యేకంగా ట్రస్టును ఏర్పాటుచేశారు. ఈ ట్రస్టు ఆర్థిక కార్యకలాపాలను చక్కబెడుతుంది. ముందు జేబులో డబ్బులతో పనులు చేసి, ఆ తరువాత ప్రభుత్వం నుంచి తీసుకొనే లక్ష్యంతో ఈ ట్రస్టు పని చేస్తుంది. దీనికోసం సైకిల్‌ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ట్రస్టు తరఫున ఎమ్మెల్యే ఆమంచి స్కూలు నిర్వహణకు రూ. 5లక్షల చందా ఇచ్చారు. అలాగే.. స్కూలు నిర్మాణం కోసం వ్యక్తిగతంగా రూ. 25 లక్షలు ఆయన అందించారు. అలాగే, కేంద్రం నుంచి ఆర్‌ఎంఎ్‌సఏ పథకం కింద రూ. కోటి, జిల్లా మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) నుంచి రూ. 44 లక్షలు, జెడ్పీ నిధుల నుంచి ప్రహరీ నిర్మాణానికి రూ. 15 లక్షలు, ఉపాధి హామీ నిధుల నుంచి రూ.5 లక్షల కేటాయింపు జరిగింది. మినరల్‌ ప్లాంట్లు, ఫ్యాన్లు, బల్లలు సహా ఇతరేతర స్కూలు సౌకర్యాల కోసం దాతలు విరివిగా సాయం అందించారు. బుధవారానికి ఈ స్కూలు భవనం మొదటి అంతస్థు పూర్తయింది. అందులో తరగతులు నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్‌ మంత్రి లోకేశ్‌ ఈ నెల 19వ తేదీన స్కూలును ప్రారంభించనున్నారు.
 
9ong4363.jpg 
 
ఎంతెంత సంతోషమంటే...
‘‘కొత్తపేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు నా జీవితంలో గుర్తుండిపోయే సంఘటన. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా లేని ఆనందం ఈ పాఠశాల పనులతో వచ్చింది. విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందాలన్నదే నా అభిమతం. అందుకోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తా. త్వరలో మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను ‘కొత్తపేట’ మోడల్‌లో తీర్చిదిద్దుతా’’
- ఆమంచి కృష్ణమోహన్‌, చీరాల ఎమ్మెల్యే
 
 
 
 
- చీరాల
Link to comment
Share on other sites

పాఠశాలలకు మౌలిక కళ
4,848 కోట్లతో యాన్యూటీ విధానంలో పనులు
బ్యాంకు వడ్డీ 6.50%, నిర్వహణ 3%తో గుత్తేదారు సంస్థలకు చెల్లింపులు
ముగిసిన టెండర్ల ప్రక్రియ
24 నెలల్లో పనులు పూర్తి చేసేలా నిబంధనలు
2ap-main6a.jpg

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో మౌలికవసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైబ్రిడ్‌ యాన్యూటీ విధానంలో అన్ని బడుల్లోనూ సదుపాయాలు కల్పించనున్నారు. దేశంలోనే మొదటిసారిగా యాన్యూటీ విధానాన్ని పాఠశాల విద్యాశాఖలో అమలు చేస్తున్నారు. ఈ విధానంలో పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థలకు మొదటి 24 నెలల్లో ప్రభుత్వం 40% నిధులు చెల్లిస్తుంది. మిగతా 60 శాతాన్ని వడ్డీతో కలిపి 2024-2025 వరకు చెల్లిస్తుంది. గుత్తేదారులే మొత్తం వ్యయాన్ని భరించి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటు ప్రకారం వడ్డీని చెల్లించడంతోపాటు నిర్వహణ కింద అదనంగా 3% చెల్లిస్తారు. ప్రస్తుతం బ్యాంకు వడ్డీ 6.50%గా ఉన్నట్లు ప్రతిపాదించారు. పనులు దక్కించుకున్న సమయం నుంచి 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని పనులు చేపట్టేందుకు మొత్తం రూ.4,848 కోట్లు వ్యయం కానున్నట్లు ఇప్పటికే సర్వశిక్ష అభియాన్‌ ఇంజినీర్లు అంచనా వేశారు.

ముగిసిన టెండర్ల ప్రక్రియ
యాన్యూటీ పనులకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం పనులను ఆరు ప్యాకేజీలుగా విభజించి బిడ్లు ఆహ్వానించారు. తొమ్మిది సంస్థలు ముందుకు వచ్చాయి. టెండర్లు దాఖలు చేసిన అన్ని సంస్థలు నిర్ణీత మొత్తం కంటే ఎక్కువకే దాఖలు చేశాయి. గుత్తేదారు సంస్థల ఎంపికకు మరో నాలుగైదు రోజుల సమయం పట్టనుంది. య్యాన్యూటీ టెండర్ల కమిటీ గుత్తేదారు సంస్థలను ఎంపిక చేస్తుంది. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వాలని గుత్తేదారు సంస్థలు కోరుతుండగా.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. అన్ని పాఠశాలల్లో ప్రహరీలు నిర్మించాలని మొదట్లో అంచనాలు రూపొందించగా.. వీటిని ఉపాధి హామీ నిధులతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించడంతో ప్రతిపాదనల్లో వీటిని తొలగించారు. వీటి స్థానంలో ప్రాథమిక పాఠశాలల్లో విభిన్న ప్రతిభావంతులకు భవిత భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రతిపాదించారు.

Link to comment
Share on other sites

మౌలిక సదుపాయాల టెండర్లు రద్దు : గంటా
06-07-2018 03:04:26
 
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో రూ.4,848 కోట్ల వ్యయంతో ‘హైబ్రిడ్‌ యాన్యుటీ’ విధానంలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పిలిచిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కాంట్రాక్టర్లు టెండర్లను ప్రీమియం రేట్ల కంటే ఎక్కువ ధరకు కోట్‌ చేసినందున, ప్రభుత్వంపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకొన్నామని వివరించారు. త్వరలోనే మళ్లీ హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలోనే టెండర్లు ఆహ్వానిస్తామని గురువారం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 100ు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు దేశంలోనే మొదటిసారి విద్యాశాఖలో హైబ్రిడ్‌ యాన్యుటీ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...