Jump to content

Digital classrooms, biometric system in all govt


sonykongara

Recommended Posts

  • Replies 188
  • Created
  • Last Reply

మరో 450 డిజిటల్‌ తరగతి గదులు

రూ. 7 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక

ప్రవాసాంధ్రుల సాయంతో ఏర్పాటు

13ap-state3a.jpg

ఈనాడు అమరావతి: ప్రవాసాంధ్రుల సాయంతో రాష్ట్రంలో మరో 450 డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నెలాఖరులోగా వీటిని సిద్ధం చేసే అవకాశాలున్నాయి. విశాఖ జిల్లాలో గతేడాది

ప్రయోగాత్మకంగా 302 డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రుల నుంచి చక్కని స్పందన రావడంతో ఈ ఏడాది అన్ని జిల్లాల్లోనూ తరగతి గదులు ఏర్పాటుచేస్తున్నారు. రూ.6.75 కోట్లు వెచ్చించే ఈ ప్రాజెక్టులో 30 శాతం నిధులు ప్రవాసాంధ్రులు, 70 శాతం నిధులు ప్రభుత్వం సమకూర్చుతున్నాయి. డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటులో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేసేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఐ విభాగాన్ని ఏర్పాటుచేసింది. దీని ఆధ్వర్యంలో అమెరికాలో రాష్ట్రం తరఫున 35 మంది సమన్వయకర్తలు సేవలందిస్తున్నారు. ఈ విభాగం ప్రయత్నం ఫలితంగా హుద్‌హుద్‌ తుపానుతో దెబ్బతిన్న విశాఖలో 302 డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు దృశ్యరూపకంగా బోధిస్తున్నారు.

అంగన్‌వాడీలపైనా ఆసక్తి

అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధిపైనా ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపుతున్నారు. గత నెల 26 నుంచి వారం రోజులకుపైగా అమెరికాలో పర్యటించిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక అధికార బృందం ప్రవాసాంధ్రులతో సమావేశాలు నిర్వహించినపుడు అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం వేసిన అంచనాల్లో 30 శాతం నిధులు సమకూర్చేందుకు ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. దీంతో ఈ ఏడాది 33 కేంద్రాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక్కో కేంద్రానికి రూ.పది లక్షల చొప్పున వెచ్చించనున్నారు. మొత్తం రూ.3.30 కోట్లలో ప్రవాసాంధ్రులు 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం నిధులు కేటాయిస్తుంది. అంగన్‌వాడీ కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మాణంతోపాటు స్మార్ట్‌ టీవీ, ఐపాడ్‌, పిల్లలకు ఆట వస్తువులు సమకూర్చనున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
  • 4 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 4 weeks later...
  • 1 month later...
  • 2 months later...
  • 2 weeks later...

* ప్రపంచ విద్యావిధానంలో మార్పులకు అనుగుణంగా ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడులశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2017లో రూ.160 కోట్లతో వర్చువల్‌ తరగతి గదుల విధానాన్ని ప్రవేశపెట్టింది. తొలుత 4వేల ప్రభుత్వ/పురపాలక పాఠశాలల్లో వీటిని ఆరంభించింది. దీన్నిప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వ్యవస్థీకృతం చేయాలనే ఉద్దేశంతో ఏపీ వర్చువల్‌ క్లాస్‌రూమ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది ప్రైవేటు కంపెనీగా ఉంటుంది. పండిట్‌ నెహ్రూ బస్టాండులోని ఎన్టీఆర్‌ పరిపాలనా సముదాయంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. రూ.10 ముఖ విలువ కలిగిన రూ.10వేల ఈక్విటీ షేర్లతో (రూ.లక్ష మూలధనం) ఈ కార్పొరేషన్‌ను నెలకొల్పుతారు. విద్యాలయాల్లో వర్చువల్‌ తరగతిగదులు ఏర్పాటుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుంది. జిల్లా రాష్ట్ర స్థాయిల్లో వర్చువల్‌ బోధనకు ఉపయోగపడే కేంద్రీకృత స్టూడియోలను ఏర్పాటు చేస్తుంది. వర్చువల్‌ తరగతి గదుల సేవలను ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా అందిస్తారు. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి కొంత రుసుము వసూలు చేస్తారు.

Link to comment
Share on other sites

 ఏపీ వర్చువల్‌ క్లాస్‌రూమ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్‌ తరగతి గదుల ప్రారంభం. రూ. 10 ముఖ విలువతో, రూ. 10వేల ఈక్విటీ షేర్లతో, రూ. లక్ష మూలధన వ్యయంతో కార్పొరేషన్‌ ఏర్పాటవుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా, ప్రైవేటుకు కొంత రుసుము వసూలు చేసి సేవలు అందిస్తారు

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...