Jump to content

Handri - Niva SUJALA - PHASE 2


sonykongara

Recommended Posts

  • Replies 443
  • Created
  • Last Reply

క‌ర్నూలు: గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న కృష్ణమ్మ మళ్లీ ఉరకలేస్తోంది.ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. జూరాల నుంచి 62,500 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 49,100 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుండడంతో నీటిమట్టం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 871.40 అడుగు ల‌కు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 3వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 2,025 క్యూసెక్కులు  తాగు, సాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్తుకు డిమాండ్‌ లేకపోవడంతో లోడ్‌ డిస్పాచ్‌ ఆదేశాల మేరకు ఉత్పత్తి నిలుపుదల చేశామని జెన్‌కో అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

అనంతను తాకిన కృష్ణా జలాలు 
 
 
గుంతకల్లు: రాయలసీమకు ప్రాణాధారమైన హంద్రీనీవాకు విడుదల చేసిన కృష్ణా జలాలు మంగళవారం రాత్రి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించాయి. మల్యాల వద్ద 5 పంపులతో నీటిని తోడుతుండగా బుధవారం గుంతకల్లు మండలంలోని బుగ్గసంగాల, కసాపురం, జీ-కొట్టాల, వజ్రకరూరు మండలంలోని ఛాయాపురం, పొట్టిపాడు మీదుగా ఎనిమిదో పంప్‌ హౌస్‌కు చేరాయి. రాగులపాడు లిఫ్టు వద్ద మూడు పంపులతో నీటిని తోడగా నీరు ఉరవకొండ మండలంలోకి ప్రవేశించాయి. బుధవారం రాత్రి 11 గంటలకు గమ్యస్థానమైన జీడిపల్లి రిజర్వాయరుకు నీరు చేరుతుందని హంద్రీనీవా గుంతకల్లు సర్కిల్‌ ఈఈ రాజశేఖర్‌బాబు తెలిపారు. ప్రస్తుతానికి 6 టీఎంసీల నీరు కేటాయించినట్టు తెలిపారు. తర్వాత కోటాను పెంచుతారని వెల్లడించారు. old news ne oka chota veddam ani vesa
Link to comment
Share on other sites

సొరంగానికి బదులు ఎత్తిపోత

హంద్రీనీవా రెండో దశ 20వ ప్యాకేజీలో..

టన్నెల్‌ నిర్మిస్తే రూ.138 కోట్లు

ఎత్తిపోతలకు రూ.270 కోట్లు

త్వరగా పూర్తి చేసేందుకు ఎత్తిపోతలకే మొగ్గు

నామినేషన్‌పై అప్పచెప్పేందుకు రంగం సిద్ధం!

ఈనాడు - హైదరాబాద్‌

హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశలో పెదమాణ్యం సొరంగం (టన్నెల్‌) నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడుతుండటంతో ఇందుకు ప్రత్యామ్నాయంగా నీటిని ఎత్తిపోయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇందుకు దాదాపు రూ.270 కోట్లు వ్యయమవుతుందని అంచనాలు రూపొందించారు. ఎత్తిపోతలను ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్ర మంత్రిమండలి అనుమతి కోరుతూ జలవనరులశాఖ ఒక ప్రతిపాదన తీసుకురానుంది. వచ్చే మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

రెండు కంపెనీలు మారినా..

హంద్రీనీవా రెండో దశలో భాగంగా 216వ కిలోమీటరు నంచి 554 కి.మీ వరకు ప్రధాన కాలువ తవ్వి కొన్ని చోట్ల నీటిని ఎత్తిపోస్తూ అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు ప్రయోజనం కలిగించేలా పనులు చేపట్టారు. 26 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటూ 4.04 లక్షల ఎకరాలకు నీరివ్వడం దీని ఉద్దేశం. ఇందులో 506వ కిలోమీటరు నుంచి 511వ కిలోమీటరు వరకు 20వ ప్యాకేజీగా 5 కిలోమీటర్ల మేర టన్నెల్‌ తవ్వకం చేపట్టాల్సి ఉంది. 2006 ధరల ప్రకారం రూ.47.57 కోట్ల అంచనాతో టెండర్లు ఆహ్వానించారు. ఏకేఆర్‌ కోస్టల్‌ కంపెనీ ఈ పనులు దక్కించుకుంది. వారు 800 మీటర్లు మాత్రమే పని పూర్తిచేసి నిలిపేశారు. అనంతరం 60సి కింద వారిని తొలగించి అదే ధరలకు ఆర్‌.కె.ఇన్‌ఫ్రాం కంపెనీ ఈ పనులు అప్పగించారు. వారు 600 మీటర్ల మేర పని చేశారు. తేలికపాటి రాయి ఉండటంతో ఇక్కడ టన్నెల్‌ తవ్వకం కష్టమని తేల్చారు.

తాజాగా టెండర్లు పిలిచినా..

3.6కిలోమీటర్ల పనినుంచి 2 కిలోమీటర్ల మేర పని విడదీసి రూ.70 కోట్ల అంచనా వ్యయంతో తాజాగా టెండర్లు పిలవగా ఈ పని చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. షాపూర్‌ పల్లోంజి సంస్థ పరిశీలించి ఈ టన్నెల్‌ తవ్వకం రెండేళ్లలో పూర్తి చేయడం సాధ్యం కాదని తేల్చింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యామ్నాయాలు చూడమని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకుపోవాలని, 5 కిలోమీటర్ల మేర పైపులైను వేసి మొత్తం 60 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుందనే ప్రతిపాదన రూపొందించారు. ఈ ప్యాకేజీ మొత్తంలో 3.6 కిలోమీటర్ల మేర టన్నెల్‌ తవ్వకం లైనింగ్‌తో కూడా కలిపి చేస్తే తాజా ధరల ప్రకారం రూ.138 కోట్లు ఖర్చవుతుందని లెక్కించారు. ప్రస్తుతం అక్కడ ఎత్తిపోతలకు రూ.270 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. మిగిలిన పనులు దాదాపు పూర్తికానుండటం.. టన్నెల్‌ నిర్మాణం కారణంగా ఈ ప్యాకేజి పని ఒక్కటే ఆలస్యమవుతుండటంతో ఆరునెలల్లోనే ఎత్తిపోతల విధానలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.

స్టాండింగ్‌ కమిటీలో చర్చించకుండానే..

ఈ పనులకు టెండర్లు పిలవకుండా నామినేషన్‌ ప్రాతిపదికన అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. హంద్రీనీవా పథకంలో ఇప్పటికే 38 చోట్ల ఎత్తిపోతల పనులను చేపడుతున్న మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీకి నామినేషన్‌పై ఈ పనులు అప్పచెప్పేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయి స్టాండింగు కమిటీలో చర్చించకుండానే మంత్రిమండలి ఆమోదం మేరకు ఈ పనులు అప్పచెప్పే ప్రయత్నాలు సాగుతున్నాయి.

Link to comment
Share on other sites

హంద్రీనీవా కాలువను పరిశీలించిన మంత్రి సునీత
 
బద్దలాపురం: అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం బద్దలాపురంలో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి మంత్రి పరిటాల సునీత శనివారం శంకుస్ధాపన చేశారు. అనంతరం హంద్రీనీవా కాలువను పరిశీలించి, చెరువు వద్ద గంగపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హంద్రీనీవా ఫేజ్-2 ద్వారా 18 చెరువులకు నీటిని విడుదల చేశామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి పరిటాల సునీత తెలిపారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

All those who said CBN ignores Rayalaseema have to swallow back their words after watching these aerial images. Thanks to Pattiseema, water from Srisailam project is being lifted into the Handri Neeva project changing the barren landscapes of drought hit Rayalaseema region into green lands. These pictures were shot at Uravakonda and Raptadu where farmers are jumping with joy seeing so much water after close to 70 years.

14563288_1422742671072653_73413657441950

14522783_1422743364405917_29490794122141

14494886_1422742874405966_82423522690240

14520620_1422743137739273_32069424225492

 

 

 

https://www.facebook.com/TDP.Official/posts/1422747247738862

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...