Jump to content

Handri - Niva SUJALA - PHASE 2


sonykongara

Recommended Posts

nice implementation and good execution.  but still lot to do, the main canal still 160 km is pending in chittor dist, it will take another 1-2 years to finish completely. canal ki cement ling ledu. max we can draw water from srisilam is 25 tmc. rojuki 2k cusec draw chesthunnaru. month ki 4 anukunna 6 months ki 24 tmc.  at least anathapur raithulu varuku ki inko kaluva tavvithe most benifit ga untadi vallaki. at least inko 20 tmc draw cheyachhu.

Link to comment
Share on other sites

  • Replies 443
  • Created
  • Last Reply
14 minutes ago, Bollu said:

nice implementation and good execution.  but still lot to do, the main canal still 160 km is pending in chittor dist, it will take another 1-2 years to finish completely. canal ki cement ling ledu. max we can draw water from srisilam is 25 tmc. rojuki 2k cusec draw chesthunnaru. month ki 4 anukunna 6 months ki 24 tmc.  at least anathapur raithulu varuku ki inko kaluva tavvithe most benifit ga untadi vallaki. at least inko 20 tmc draw cheyachhu.

there is a plan to interlink galeru nagari and handri neeva , which will solve chittoor water problem.

 

Link to comment
Share on other sites

3 minutes ago, ravindras said:

@Bollu kukka edupu edche vaallani ignore cheyyandi. vaalla videos manaku vaddhu.  we can't change people with wrong intention. we have to ignore them. 

neutral people will vote to us after seeing the development.

vallu quote cheyatam  andhra vallu water seema lo projects kattakunda water ni srisailam nundi tesukelthunnaru ani regional feelings chepthunte mandutundi

Link to comment
Share on other sites

రాళ్లసీమలో కృష్ణమ్మ జలధార 

 

కరవు రైతుకు కొంత ఉపశమనం 
హంద్రీ నీవా, గాలేరు నగరిలతో నిండిన జలాశయాలు 
తీవ్ర వర్షాభావంలోనూ నిండిన చెరువులు 
అనంతపురం, కడప జిల్లాలో భిన్నమైన దృశ్యాలు

22AP-main4a.jpg

కరవుతో అతలాకుతలమవుతున్న సీమలో కొన్ని ప్రాంతాలను కృష్ణా జలాలు సుసంపన్నం చేశాయి. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాక సాగులో నానా అవస్థలు పడుతున్న రైతాంగం కాసింత ఉపశమనం పొందారు. అనంతపురం, కడప జిల్లాల్లో అనేక జలాశయాలు నేడు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. హంద్రీనీవా సుజల స్రవంతి పరుగులు తీస్తూ చెర్లోపల్లి జలాశయాన్ని నింపి చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టింది. గాలేరు నగరి అవుకు టన్నెలు దాటి గండికోటను సుసంపన్నం చేసి మరిన్ని జలాశయాలకు చేరింది. చెరువులు నీటితో నిండి దాహార్తి తీరుస్తున్నాయి. భూగర్భ జలమట్టాలు పెరిగి భవిష్యత్తుకు భరోసా కలిగిస్తున్నాయి. ట్యాంకర్లపైన ఆధారపడి  నీటి అవసరాలు తీర్చుకునే ప్రాంతాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చీనీ, అరటి తోటలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. కరవు కష్టాలను తీర్చిన కృష్ణమ్మ  అన్నపూర్ణగా తన పేరు సార్థకం చేసుకుంది.

 

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌, ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

న్యూస్‌టుడే బృందంతో కలిసి

అవి ఎనభైల నాటి రోజులు.  శ్రీశైలం జలాలను కరవు సీమకు మళ్లించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కోసం క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు సర్వే చేస్తున్న సమయం. ప్రముఖ ఇంజినీరింగు నిపుణుడు శ్రీరామకృష్ణయ్య ఈ కృషిలో  భాగస్వాములయ్యారు. అందరూ వారిని చూసి ఈ రాళ్ల సీమలో నీళ్లు పారిస్తారా అంటూ నవ్వుకునేవారట. శ్రీరామకృష్ణయ్య శిష్యుడిగా పేరొందిన విశ్రాంత ఇంజినీరు కంభంపాటి పాపారావు ఈ సంగతులు చెబుతుంటారు. ఇప్పుడు  ఆ కరవు జిల్లా రైతులు  కిలోమీటర్ల దూరం కాలువ వెంబడి నడిచి .. ప్రవహిస్తున్న నీళ్లను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కరవు సీమ కదిరి సమీప ప్రాంతాలకు కూడా కాలువల నీళ్లు ప్రవహిస్తున్నాయి. 
నిరంతరం ప్రవహిస్తున్న కాలువల నీళ్లు...సమీప జలాశయాల్లో నిలబెట్టిన నీళ్లు... అనేక గ్రామాల్లో భూగర్భజలాలను సుసంపన్నం చేస్తున్నాయి. నీటికి ఒక భరోసా ఏర్పడింది. ఒక్క వర్షాధారమే కాదు...కాలువల ఆధారంగాను కాసిన్ని నీళ్లు గొంతులు నింపుతాయని, ఇంకా అవకాశం ఉంటే పొలాలు తడుపుతాయనే విశ్వాసం పాదుకుంది. కృష్ణమ్మతో నిండిన చెరువులు, జలాశయాల చెంత ఇప్పుడు పచ్చదనం సంతోషాల సంక్రాంతి చేస్తోంది.

ధర్మవరం చెరువు

22AP-main4d.jpg

మూడు వేల ఎకరాల్లో వరి కళకళ... 
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ధర్మవరం చెరువు నిండింది. అర టీఎంసీ నీటిని ఇందులో నింపారు. అనంతపురం జిల్లాలో 1922 ఎకరాల్లో  విస్తరించి ఉన్న ఈ చెరువు కర్ణాటకలో వర్షాలు కురిస్తేనే నిండుతుంది. 2000లో  ఒకసారి, 2010లో మరోసారి నిండింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ సాగూ లేదు. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలు శ్రీశైలం జలాశయం నుంచి తీసుకొచ్చిన నీళ్లతో ఈ చెరువును 2017లో నింపారు. అప్పట్లో ఈ చెరువు నీరు సాగుకు ఇవ్వలేదు. కేవలం బోరుబావులు రీఛార్జి అయ్యేందుకు మాత్రమే నాడు ఆ నీటిని వినియోగించారు. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలం జలాశయం నుంచి కాలువలో వచ్చిన నీళ్లతో ఈ చెరువును నింపటంపై  ప్రజలు సంతోషపడుతున్నారు.  చెరువు కింద దాదాపు మూడువేల ఎకరాల ఆయకట్టులో  వరి సాగు చేశారు. ఎకరానికి 44 నుంచి 52 బస్తాల వరకు పంట తీశారు. పెరిగిన భూగర్భ జలమట్టాలు ధర్మవరం మండలంలోని  42 గ్రామాల్లో తాగునీటి సమస్య  లేకుండా ఆదుకుంటున్నాయి.ఈ ఏడాది వేసవిలో కూడా ఇబ్బంది ఉండదనే గ్రామస్థులు భావిస్తున్నారు.

 

తోటలకూ తీరిన నీటికష్టాలు.. 

GARELU.jpg

గాలేరు నగరి సుజల స్రవంతి నీటిని అవుకు టన్నెల్‌ దాటించారు. బైపాస్‌ టన్నెల్‌ సాయంతో ఎక్కువ నీటిని గండికోటకు తరలించే ఏర్పాట్లు చేశారు. గత రెండు సంవత్సరాలుగా గండికోట నుంచి మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ జలాశయం, వామికొండ, సర్వారాయసాగర్‌, పైడిపాలెం జలాశయాలకు నీటిని మళ్లిస్తున్నారు. గండికోట నుంచి నీటిని ఎత్తిపోసి ఈ జలాశయాలకు మళ్లిస్తున్నారు. ఆ ప్రభావం కడప జిల్లాలో చీనీ, అరటితోటల సాగుపైనా కనిపిస్తోంది. గతంలో ట్యాంకర్ల సాయంతో చీనీ తోటలకు నీటిని సరఫరా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భూగర్భజలాలు పెరిగి ఆ శ్రమ, వ్యయభారమూ తగ్గిందని రైతులు చెబుతున్నారు. తోటలను కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్తగా బోర్లు వేసుకుని నీరు ఎలా దొరుకుతుందా అని రైతులు రూ.లక్షలు ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు కృష్ణమ్మ జలాలు రావడంతో ఆ భారం తగ్గిపోయింది.

22AP-main4c.jpg

శ్రీశైలం జలాశయం నుంచి అనంతపురం, కడప జిల్లాలకు కృష్ణమ్మ జలాలు పరుగులు తీశాయి. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించి గోదావరి వరద జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించటంతో శ్రీశైలం నుంచి సీమ జిల్లాలకు నీటి తరలింపు సాధ్యమైంది.  పట్టిసీమ నుంచి గత సంవత్సరం, ఈ సంవత్సరం దాదాపు 172 టీఎంసీలు కృష్ణా డెల్టాకు మళ్లించారు. దీంతో పురాతన డెల్టా వ్యవస్థగా పేరొందిన కృష్ణా డెల్టా ఆయకట్టుకు శ్రీశైలం నుంచి నీటిమళ్లింపు అవసరం లేకుండా సీమకు వినియోగించుకునే ఆస్కారం ఏర్పడిందని జలవనరులశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు.

 

అనంతపురం జిల్లాకు తీరిన దాహార్తి 
అనంతపురం జిల్లాలో అన్ని గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సి వచ్చేది. ఈసారి  గొల్లపల్లి జలాశయం, జీడిపల్లి జలాశయం, మారాల జలాశయం, చెర్లోపల్లి జలాశయాలకు శ్రీశైలం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి సాయంతో నీటిని మళ్లించారు. ధర్మవరం, కొత్తచెరువు, రాప్తాడు పెద్ద చెరువులను నింపారు. అలుగు పారించారు. దాదాపు వందల కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువలో నీళ్లు ప్రవహిస్తూ వస్తున్నాయి.  పెద్ద సంఖ్యలో బోర్లు రీఛార్జి అయ్యాయి. జలాలు ఎగబాకాయి. దీంతో ఇప్పుడు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన గ్రామాల సంఖ్య కేవలం 60 గ్రామాలకే పరిమితమయింది. చాలా చోట్ల తాగునీటికి ఇబ్బందులు లేకుండా అయింది. హంద్రీనీవా ప్రధాన కాలువ కింద 52 చెరువులు, మడకశిర బ్రాంచి కాలువ కింద 36 చెరువులను నీటితో నింపడంతో మొత్తం 88 చెరువులకు నీటిని ఇచ్చారు. జిల్లాలోని 21 మండలాలకు కృష్ణమ్మ జలాలు పరుగులు తీసి దాహార్తిని తీర్చిన దృశ్యం కనిపిస్తోంది.

కడపలో భూగర్భజలాల వృద్ధి 
శ్రీశైలం జలాలు కుందూ ద్వారా పెన్నా నదికి మళ్లించి సోమశిలకు ఈ ఏడాది దాదాపు 50 టీఎంసీలకు పైగా మళ్లించారు. కుందూ, పెన్నాల్లో నిరంతరం నీటి ప్రవాహాల వల్ల కడప జిల్లాలోని దువ్వూరు, రాజుపాలెం, కాజీపేట, చాపాడు, కమలపురం, వల్లూరు, చెన్నూరు మండలాల్లో నదికి ఇరువైపులా ఉన్న విస్తీర్ణంలో పెద్ద ఎత్తున భూగర్భజలాలు వృద్ధి చెందాయి 

20 ఏళ్ల తర్వాత మళ్లీ సాగు! 

22AP-main4e.jpg

మైలవరం జలాశయం కింద ఉత్తరకాల్వ, దక్షిణ కాల్వల పరిధిలో 72 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అనేక సంవత్సరాలుగా వర్షాధారమే. ఎప్పుడో 1999లో ఈ ఆయకట్టు సాగు అయింది. ఈ ఏడాది మైలవరం జలాశయాన్ని ఆరు టీఎంసీలతో నింపారు. చాలా ఏళ్ల తర్వాత జలాశయం కళకళలాడింది. మైలవరం నుంచి కొత నీటిని పెన్నా రీఛార్జి కోసం మళ్లించారు. దీంతో జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల తాగునీటికి ఇబ్బందులు తీరాయి. మరో వైపు మైలవరం, పెద్ద మొడియం, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మండలాల్లో ఆయకట్టుకు నీళ్లందాయి. పత్తి, మిరప, పప్పుశనగ పంటలు ఈ ఆయకట్టులో సాగు చేశారు. పప్పు శనగ దాదాపు చేతికి వచ్చింది. మిరప, పత్తికి కొన్ని తడులు అవసరమని రైతులు చెబుతున్నారు. మైలవరం మండలంలో మొత్తం 42 గ్రామాలు ఉంటే ఈ కృష్ణమ్మ నీటితో దిగువ పల్లెలకు దాహార్తి తీరింది. ఇవే మండలాల్లో ఎగువ ప్రాంతాలకు మాత్రం నీటి సమస్య ఉంది.

చీనీ, అరటితోటలకు మేలు 
కృష్ణా జలాల వల్ల కడప జిల్లాలో సింహాద్రిపురం, తొండూరు, పులివెందుల, లింగాల, వేంపల్లి, వేముల మండలాల్లో చీనీ, అరటి తోటలకు ప్రయోజనం కలుగుతోంది. ఈ ప్రాంతంలో 40 వేల ఎకరాలకు పొద్దుతిరుగుడు, పప్పు శనగ సాగుకు నీళ్లు అందాయి. లింగాల మండలంలో చీనీ, అరటి తోటలకు నీటి సరఫరా మెరుగుపడింది. గతంలో నీళ్లు చాలక, బోర్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసేవారు. ఇప్పుడు కృష్ణా జలాలతో బోర్లు రీఛార్జి అయ్యాయి. వంద అడుగులకే నీరు అందుబాటులోకి వస్తోందని రైతులు చెబుతున్నారు. 

22AP-main4g.jpg


 బుక్కపట్నం చెరువు 

22AP-main4h.jpg

హంద్రీనీవా నీటితో కొత్తవెలుగు 

బుక్కపట్నం చెరువు దశాబ్దకాలంగా నీటికి నోచుకోలేదు. అనంతపురం జిల్లాలోని బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో గత ఏడాది, ఇప్పుడూ నింపారు. ఈ చెరువు సమీపంలో మారాల జలాశయం 0.4 టీఎంసీల నీటితో నింపారు. రామసాగరం, అగ్రహారం చెరువులు దాదాపు సగం మేర నిండాయి. దీంతో చుట్టు పక్కల 30, 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బోరు బావుల్లో నీళ్లు ఎగదన్నాయి. బుక్కపట్నం, రెడ్డివారిపల్లె తండాల నుంచి వలసలు వెళ్లినవారు  దాదాపు 40శాతం మంది తిరిగి ఇళ్లకు వచ్చి వ్యవసాయ పనులు ప్రారంభించారని స్థానికులు చెబుతున్నారు 
 
రైతు సంబరం 22AP-main4f.jpg
రెండేళ్ల క్రితం వరకూ చినీ తోటలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయవలసి వచ్చేది. ఖర్చులో 70 శాతం ప్రభుత్వం రాయితీ కింద చెల్లించింది కూడా. ఇప్పుడు కాలువల్లో కృష్ణా నీరు ప్రవహించడంతో బోర్లు పెద్ద ఎత్తున రీఛార్జి అయ్యాయి. నీళ్లు ఎగువకు వచ్చాయి. దీంతో పెట్టుబడి ఖర్చులు తగ్గిపోయాయి.

 

 

 
 
 
 
- రేవంత్‌కుమార్‌ రెడ్డి, చినీ రైతు, కడప జిల్లా సింహాద్రిపురం మండలం బలపనూరు

.

 

 

 

 

 

 ABC_Digital_2.jpg

Link to comment
Share on other sites

20 hours ago, Bollu said:

nice implementation and good execution.  but still lot to do, the main canal still 160 km is pending in chittor dist, it will take another 1-2 years to finish completely. canal ki cement ling ledu. max we can draw water from srisilam is 25 tmc. rojuki 2k cusec draw chesthunnaru. month ki 4 anukunna 6 months ki 24 tmc.  at least anathapur raithulu varuku ki inko kaluva tavvithe most benifit ga untadi vallaki. at least inko 20 tmc draw cheyachhu.

Due to nature of the terrains in that area it’s taking longer to dig the canals itself. Most of the places they are using detonators for excavation. 

Ika lining antara, oka 5 years marchi povatam best. Ground water recharge kosam anna. Future lo heavy losses vunna areas ni Target chesi appudu start cheyyotchu. 

Rememember sagar left canal, still  lining works are going on

Link to comment
Share on other sites

20 hours ago, Bollu said:

nice implementation and good execution.  but still lot to do, the main canal still 160 km is pending in chittor dist, it will take another 1-2 years to finish completely. canal ki cement ling ledu. max we can draw water from srisilam is 25 tmc. rojuki 2k cusec draw chesthunnaru. month ki 4 anukunna 6 months ki 24 tmc.  at least anathapur raithulu varuku ki inko kaluva tavvithe most benifit ga untadi vallaki. at least inko 20 tmc draw cheyachhu.

On 11/28/2018 at 1:45 PM, sonykongara said:

f4R7iNX.jpg

 

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

 

nenu kooda chusanu, e second process toughest to draw water. CBR lo 5 pumping stations sariga work cheyavu. e year just 2 tmc kooda draw cheyalekapoyaru. inko dani meeda 4 pumping stations  ante max 5 tmc kante draw cheyaleremo.

Link to comment
Share on other sites

Hindupuram surrounding cheruvulu anni fill chesinatlu vunnaru

: Handri - Neeva lo madakasira branch canal kinda vasthayi

 

చంద్రన్న దీక్ష.. కృష్ణమ్మ రక్ష!
 

కరవు నేలపై నీటి గలగలలు
పరవశిస్తున్న పల్లె సీమలు...
హలధారి మోమున చిరునవ్వు
న్యూస్‌టుడే, హిందూపురం

atp-gen4a_29.jpg

ఒకవైపు తీవ్ర వర్షాభావం. మరోవైపు కరవు తాండవం. ఎటు చూసినా ఎండిపోయిన చెరువులు.. కుంటలు.. బీడువారిన భూములు. ఇదీ అనంత జిల్లాలో ఏటా కనిపించే దుర్భర పరిస్థితులు. ఏ పల్లెకు వెళ్లినా క‘న్నీటి’ గాథలే.. ఏ బోరు చూసినా.. బావులను వెతికినా చుక్క నీరు లభించని దైన్యం. నీరు లేక పంటలు పండించలేని దయనీయం. పనుల్లేక.. పస్తులు ఉండలేక వలస వెళ్లిన కుటుంబాలు.. గుక్కెడు నీటి కోసం గగ్గోలు పెట్టే గ్రామీణులు.. వీటన్నింటిని చూసి చలించిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కరవు జిల్లాను సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకున్నారు. అపర భగీరథుడిలా కృష్ణాజలాలను జిల్లాకు తెప్పించారు. బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెట్టగా.. పల్లె వాకిట సంతోషాలు విరబూశాయి. చెరువులు.. కుంటలు జలకళను సంతరించుకొన్నాయి. బోర్లు, బావులు ఊటతో నీటిని విరజిమ్ముతున్నాయి. నెర్రెలిచ్చిన భూములు నవ్వుతున్నాయి. అన్నదాతల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తమ ఊళ్లను పలకరిస్తూ పారుతున్న కృష్ణాజలాలను చూసేందుకు కాలువల వెంట రైతులు వరుస కడుతున్నారు. వలస వెళ్లిన కుటుంబాలు ఊళ్లకు చేరుతున్నాయి.. బీడు వారిన భూముల్లో పంటల సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. ప్రధానంగా పెనుకొండ, సోమందేపల్లి, హిందూపురం, లేపాక్షి మండలాల్లోని చెరువు.. కల్పతరువుల్లా అండగా నిలుస్తున్న సుజల పథంపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

Link to comment
Share on other sites

స్వప్నం.. సాకారం!
 

atp-top1a_46.jpg

ఆదరించిన అనంత రుణం తీర్చుకుంటానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణతో అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేేశారు. జిల్లాలోని సుదూర ప్రాంతమైన మడకశిరకు కృష్ణా జలాలు తెస్తానని హామీ ఇచ్చిన ఆయన దశాబ్దాల కల సాకారం చేశారు. బుధవారం మడకశిర పరిధిలోని సి.కొడిగేపల్లి వద్దకు కృష్ణా జలాలు చేరడంతో ఆ ప్రాంతవాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎమ్మెల్సీ తిప్పేస్వామి.. మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చి కృష్ణమ్మకు నీరాజనం పలికారు. ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం 122 కిమీ వద్ద గండి పడటంతో నీటి సరఫరా తాత్కాలికంగా ఆపారు. ఒకటి రెండు రోజుల్లో సరఫరా పునరుద్ధరించనున్నారు.

కరవు నేలలో కృష్ణమ్మ పరవళ్లు
మడకశిరకు  చేరుకున్న జలాలు
సి.కొడిగేపల్లి(మడకశిరగ్రామీణం), న్యూస్‌టుడే: కృష్ణమ్మ రాకతో మడకశిరవాసుల ఏళ్లనాటి కల నెరవేరింది. ఇప్పటివరకు ఖాళీ కాలువలు చూసిన ప్రజలు ఒక్కసారిగా కృష్ణాజలాలు రావడంతో ఆనందంతో చిందులు వేశారు. బుధవారం హిందూపురం నుంచి పరిగి, కొటిపి, మోదా మీదుగా మడకశిర మండలం నల్లాయనపల్లి వద్దకు చేరుకుని సి.కొడిగేపల్లికి ఉదయం 9గంటలకు కృష్ణా జలాలు ప్రవహించాయి. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు, మహిళలు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కృష్ణా జలాలను చూసి రైతులతో కలిసి కొద్దిసేపు ఈల వేసి చిందులు వేశారు. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, జడ్పీటీసీ శ్రీనివాసమూర్తి నాయకులతో కలిసి మధ్యాహ్నాం 1:30కు జలాలకు జలహారతి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్‌ ఆశయం, నేడు ముఖ్యమంత్రి కృషి ఫలితమే మడకశిరకు కృష్ణా జలాలు ప్రవహించాయన్నారు. ఈ ప్రాంతంలో పచ్చదనంతో కళకళలాడనుందన్నారు. అనంతరం కృష్ణా జలాలను తీసుకెళ్లి పట్టణంలోని ఎన్టీఆర్‌, వాల్మీకి, అంబేడ్కర్‌ విగ్రహాలకు జలాభిషేకం చేశారు. కృష్ణా జలాల్లో యువకులు కేరింతలు కొడుతూ పండుగ జరుపుకొన్నారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి రాధాకృష్ణ, మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ ఓబుళేశు, మాజీ ఎంపీపీ బొజ్జప్ప, నాయకులు రామకృష్ణయాదవ్‌, మద్ధనకుంటప్ప, రామాంజనేయులు, మనోహర్‌, పుల్లయ్యచౌదరి, రాజా, భక్తర్‌, తెదేపా యువత నాగరాజు, హనుమంతేగౌడ, తిమ్మరాజు, ఉమాశంకర్‌, ఫయాజ్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

ఆగిన నీటి ప్రవాహం..
మడకశిర బ్రాంచి కాల్వ ద్వారా కృష్ణా జలాలు మడకశిర మండలానికి చేరిన కొద్దిగంటల్లోనే మళ్లీ ఆగాల్సి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 133వ కి.మీ వరకు నీరు చేరింది. కాల్వలోని నల్లనాయినిపల్లె సమీపంలోని 122వ కి.మీ. వద్ద కాల్వకు సాయంత్రం రంధ్రంపడి నీరు బయటకుపోవడం మొదలైంది. ఎక్కువ నీరు బయటకుపోతుండటంతో ఇంజినీర్లు ఈ కాల్వలో నీటి ప్రవాహాన్ని, ఎగువున అన్ని పంపులను ఆపేశారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో కర్ణాటకకు మదికెర నుంచి పావగడకు అధిక వోల్టేజీ విద్యుత్‌లైన్‌ వెళ్తోంది. ఈ లైన్‌కు చెందిన రెండు స్తంభాలు మడకశిర కాల్వ గట్టుపై ఉన్నాయి. కర్ణాటక అధికారులతో మాట్లాడి వాటిని అక్కడి నుంచి మార్చేలా చూడటంలో అధికారులు విఫలమయ్యారు. మరోవైపు కాల్వలో ఎలాగైనా నీటి ప్రవాహాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతో స్తంభాలు ఉన్న చోట ఇబ్బందులు రాకుండా కాల్వకు ఇరువైపులా కాంక్రీట్‌ గోడ నిర్మించారు. ఇపుడు ఆ గోడ దిగువన రంధ్రపడి నీరు బయటకు పోతోంది. వెంటనే నీటి ప్రవాహం నిలిపేసిన నేపథ్యంలో గురువారం అక్కడ రంధ్రాన్ని పూడ్చి, కాల్వలో మళ్లీ నీటి ప్రవాహం కొనసాగించనున్నారు.

Link to comment
Share on other sites

మడకశిర మురిసింది

 

సీమలో కృష్ణమ్మ పరుగులు
అనంతపురంలో సంబరాల హోరు

23AP-main12a.jpg

ఈనాడు, అనంతపురం: తరాల కరవును కసితీరా తరిమికొట్టేలా కృష్ణమ్మ బిరబిరా పరుగులెత్తింది. బీడు వారిన భూముల్లో సిరులు కురిపించేలా గలగలా కదిలి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్ప దీక్ష.. అధికారుల నిరంతర పర్యవేక్షణ ఫలించింది. అనంతపురం జిల్లాకు చిట్ట చివరన, ఎక్కడో మూలకు విసిరేసినట్లు, కర్ణాటక రాష్ట్రానికి ఆనుకొని ఉండే మడకశిర నియోజకవర్గానికి కృష్ణమ్మ బుధవారం తరలివచ్చింది. దశాబ్దాల స్వప్నం సాకారమై.. లోగిళ్లు సస్యశ్యామలం కానున్న శుభ తరుణంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.

23AP-main12b.jpg

11 ఎత్తిపోతలు దాటి..
హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశలో భాగమైన మడకశిర బ్రాంచి కాల్వలో చివరి ప్రాంతానికి కృష్ణమ్మ చేరుతోంది. అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా ప్రధాన కాల్వలోని 304.400 కి.మీ.వద్ద మడకశిర బ్రాంచి కాల్వ మొదలవుతుంది. ఇది మొత్తం 171.015 కి.మీ.ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ అక్కడ అగళి మైనర్‌ కాల్వ (33.340 కి.మీ.లు), అమరాపురం మైనర్‌ కాల్వ (25.100 కి.మీ.)గా విడిపోతుంది. మొత్తంగా ఈ మడకశిర బ్రాంచి కాల్వ ద్వారా 275 చెరువులను నింపడంతోపాటు 43 వేల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీరివ్వడం, ఈ కాల్వ పరిధిలో ఉన్న గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీర్చాలనేది లక్ష్యం. మడకశిర బ్రాంచి కాల్వపై మొత్తం 17 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ కాల్వపై 8.65 వ కి.మీ. వద్ద గొల్లపల్లి జలాశయం ఉంది. అక్కడి నుంచి గత ఏడాది లేపాక్షి వరకు కృష్ణా జలాలు తీసుకెళ్లగలిగారు. మరికొన్ని చోట్ల పనులు పూర్తికాకపోవడంతో, మడకశిర వరకు నీరు చేరలేదు. ఈసారి మాత్రం ఎలాగైనా నీరివ్వాల్సిందే అని హంద్రీనీవా ఇంజినీర్లకు ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నిర్దేశించడమే కాకుండా, ప్రతి సోమవారం దీనిపై సమీక్ష జరుపుతూనే ఉన్నారు. దీంతో గుత్తేదారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి చివరకు మడకశిర నియోజకవర్గ కేంద్రం వరకు కాల్వ పనులు పూర్తిచేయగలిగారు. ప్రస్తుతం ఈ కాల్వలో 11 ఎత్తిపోతల పథకాలు దాటి మడకశిర మండలంలోని 127వ కి.మీ. వద్ద సి.కొడిగేపల్లిలోకి బుధవారం ఉదయం నీరు చేరింది. దిగువన పుంగనూరు బ్రాంచి కాల్వ ద్వారా చిత్తూరు జిల్లాలోని మదనపల్లి వరకు కూడా నీటిని తరలిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుతం మడకశిర బ్రాంచి కాల్వకు 150 క్యూసెక్కుల చొప్పున మాత్రమే నీటిని వదులుతున్నారు. మరో వారంలో ఈ కాల్వకు నీటి ప్రవాహం పెంచనున్నారు. దీంతో పది రోజుల్లో మడకశిర వద్ద (148 కి.మీ వద్ద) ఉన్న చెరువుకు కృష్ణమ్మ చేరనుంది. అక్కడికి నీరు చేరిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చే నెల ఈ చెరువులో కృష్ణమ్మకు హారతి ఇవ్వనున్నారు.

తాత్కాలిక నిలిపివేత
బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో 122 కి.మీ. వద్ద గండిపడి నీరు వృథాగా పోవడంతో ఎగువ నుంచి నీటి సరఫరాను తాత్కాలికంగా ఆపి వేశారు. ఒకటి లేదా రెండు రోజుల్లో చక్కదిద్ది నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...