Jump to content

Handri - Niva SUJALA - PHASE 2


sonykongara

Recommended Posts

  • Replies 443
  • Created
  • Last Reply

 

ఉంతకల్లు రిజర్వాయరుతో సస్యశ్యామలం 
సాగు, తాగునీటికి తొలగనున్న ఇబ్బంది

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే : బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లు గ్రామం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని ఉంతకల్లు గ్రామ సమీపంలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణ స్థలాన్ని మంత్రి సోమవారం పరిశీలించి మాట్లాడారు. ఈ రిజర్వాయర్‌ నిర్మిస్తే నియోజకవర్గం సస్యశ్యామలం కాగలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉంతకల్లు కొండ - నేమకల్లు కొండ మధ్యలో కట్టను నిర్మిస్తే 8 నుంచి 10 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంచడానికి అనువుగా ఉన్నట్లు ఇంజినీరింగ్‌ నిపుణులు నివేదికను ఇచ్చారన్నారు. 24 చదరపు కిలోమీటర్లలో రిజర్వాయర్‌ నిర్మించాలని సూచించినట్లు తెలిపారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌) తయారు చేయడానికి రూ.9.24 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతున్నట్లు తెలిపారు. బచావత్‌ అవార్డు మేరకు తుంగభద్రా జలాశయం నుంచి 32.5 టీఎంసీల నీరు రావలసి ఉండగా జలాశయంలో పూడిక, వర్షాభావం వల్ల 24 నుంచి 25 టీఎంసీల నీటికి రావడం లేదన్నారు. ఆంధ్రా సరిహద్దులోని హెచ్చెల్సీ 105 నుంచి 189వ కిలోమీటరు,  పీఏబీఆర్‌ వరకు మధ్యలో ఒక్క బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కూడా లేకపోవడంతో ఉంతకల్లు వద్ద 10 టీఎంసీల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించడానికి ప్రతిపాదించామన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో 1.90 లక్షల ఎకరాల సాగుకు ఉపయోగపడే భూమి ఉండగా ప్రస్తుతం బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల్లో 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రిజర్వాయర్‌ నిర్మాణం వల్ల రాయదుర్గం, డి.హీరేహాళ్‌, బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల్లో 2022 నాటికి 1.24 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. అంచెలంచెలుగా నియోజకవర్గంలోని వర్షాధార భూములకు సాగునీరందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ మోహన్‌మూర్తి, డీఈఈ రమణారెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ చంద్రహాస్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు మల్లికార్జున, కాంతారావు, మోహన్‌బాబు, మోహన్‌దాస్‌, ధనుంజయ, కెంచప్ప, సర్పంచులు సులేమాన్‌, హనుమంతరెడ్డి, శీనప్ప ఏఈఈలు షఫీ, సౌమ్య, తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...
తలచుకుంటే మీరు.. తరగనంత నీరు!
త్వరగా స్పందిస్తేనే అందరికీ జలాలు
వచ్చే సీజన్‌లో మడకశిరకు కృష్ణమ్మ
వేగంగా పనులు జరిగితేనే సాధ్యం
56వ ప్యాకేజీపై ఇంకా నిర్ణయమేదీ?
ఈనాడు - అనంతపురం
atp-top1a.jpg
‘‘కరవు సీమలో సుజల కాంతులు నింపుతా. జిల్లా అంతటా కృష్ణమ్మను బిరాబిరా పరుగులెట్టిస్తా. పల్లెల్లో తాగునీటి కష్టాలు దూరం చేస్తా. సాగుకు వెన్నుదన్నుగా నిలుస్తా. వలస మాటే లేకుండా ఉపాధి అవకాశాలు దరి చేరుస్తా. కసితీరా కరవును తరిమికొడతా.’’ - జిల్లా పర్యటనల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిన.

‘‘సంకల్ప బలం.. ప్రభుత్వ సమర్థ కృషికి.. కృష్ణమ్మ ఆశీస్సులు తోడైన శుభతరుణంలో గొల్లపల్లి జలాశయం.. ధర్మవరం.. బుక్కపట్నం.. రాప్తాడు పరిధిలో చెరువులకూ పుష్కలంగా జలాలు సమకూరాయి. భూగర్భ జలాలు పెరిగి సాగు ఊపందుకొంది. వలసలకు కొంత మేర అడ్డుకట్ట పడింది. కియా దరి చేరి ఉపాధిలో నవశకం మొదలైంది.’’

‘‘కానీ... హంద్రీనీవా పనుల పురోగతిలో నిర్లక్ష్యం ఇంతింతైంది. క్షేత్రస్థాయిలో పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవడంతో జిల్లాకు నీరొచ్చినా అన్ని ప్రాంతాలకు అందించ లేకపోతున్నారు. గత సీజన్‌లో మడకశిర బ్రాంచి కాల్వ పరిధిలో ఇదే జరిగింది. రెండో దశలో కూడా నీరు పుట్టపర్తి-బుక్కపట్నం వద్దే ఆగిపోయింది. వచ్చే సీజన్‌లో అయినా కృష్ణమ్మ ఆశీస్సులు అందరికీ అందాలంటే ముఖ్యమంత్రి గట్టిగా దృష్టి పెట్టాల్సిన తరుణమిది.’’
నిరుడు వర్షాకాలం సీజన్‌ చివర్లో కురిసిన వర్షాలతో శ్రీశైలం జలాశయం నిండింది. దీంతో హంద్రీ-నీవా ద్వారా గతంలో ఎన్నడూ లేనంత నీరొచ్చింది. వీటిని జీడిపల్లి, తర్వాత గొల్లపల్లికి కూడా తీసుకొచ్చారు. అయితే గొల్లపల్లి నుంచి దిగువకు మడకశిర బ్రాంచి కాల్వలో చివరకు నీటిని తరలించాలనే లక్ష్యం మాత్రం నెరవేరలేదు. సకాలంలో పనులు కాకపోవడంతో.. చివర్లో ఆపసోపాలు పడి లేపాక్షి వరకే నీటిని తీసుకెళ్లారు. హంద్రీనీవా రెండో దశలో భాగంగా జీడిపల్లి నుంచి జిల్లాలో ప్రధాన కాల్వ మొదలవుతుంది. ఇందులో 320వ కి.మీ. వద్ద నుంచి మడకశిర బ్రాంచి కాల్వ ఉంది. అక్కడి నుంచి మూడు ఎత్తిపోతల పథకాలు దాటిన తర్వాత 10వ కి.మీ. వద్ద వచ్చే గొల్లపల్లి జలాశయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో 2016 చివర్లోనే కృష్ణా జలాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏడాదిన్నర అవుతున్నా సరే ఇప్పటి వరకు మడకశిర బ్రాంచి కాల్వలో పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. కొన్ని ప్యాకేజీల్లో గుత్తేదారులు నత్తతో పోటీపడేలా పనిచేస్తుండటమే కారణం.

నీరు విడిచాక ఆపసోపాలు..
మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించ తలపెట్టిన లేపాక్షి ఉత్సవాల నాటికి మడకశిర బ్రాంచి కాల్వలోని 70వ కి.మీ. వద్ద లేపాక్షి చెరువుకు నీరివ్వాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత లేపాక్షి ఉత్సవాలు వాయిదా పడుతూ చివరకు మార్చి చివర్లో నిర్వహించారు. అయినా సరే అప్పటికీ పనులు పూర్తికాలేదు. మరోవైపు మార్చి 16న గొల్లపల్లి నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో.. వాటిని లేపాక్షి వరకు పంపేందుకు గుత్తేదారులు, ఇంజినీర్లు ఆపసోపాలు పడ్డారు. గొల్లపల్లి నుంచి లేపాక్షి వరకు నీరు చేరాలంటే ఆరు ఎత్తిపోతల పథకాలను కృష్ణమ్మ దాటాల్సి ఉంది. వీటిలో పలు ఎత్తిపోతల పథకాల వద్ద సమస్యలు తలెత్తడం, ఇంతలో కాల్వ నిండిపోయి నీరు బయటకు పోయింది. పొలాలు, వివిధ ప్రాంతాలను ముంచెత్తడం, కొన్నిచోట్ల గండ్లు పడటం.. అబ్బో ఇలా రోజుకో హడావిడి జరిగింది. అయినా సరే... చివరకు ఎలాగోలా లేపాక్షి ఉత్సవాల తర్వాత ఆ చెరువుకు నీరిచ్చారు. గుత్తేదారులు సకాలంలో పనులు చేయకపోవడం, ప్రధానంగా కాల్వపై కట్టడాల విషయంలో నిర్లక్ష్యం తదితరాలన్నింటితో ఈ సమస్యలన్నీ వచ్చాయి.

నిర్ణయంలో జాప్యం...
త్వరలో మడకశిరకు కృష్ణా జలాలు తరలిస్తామని అంతా చెబుతున్నారు.. అయితే అందుకు తగినట్లుగా ఆయా ప్యాకేజీల్లో పనులు శరవేగంగా జరిగేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలి. ప్రధానంగా మడకశిర బ్రాంచి కాల్వలోని 118 నుంచి 143వ కి.మీ. వరకు ఉన్న 56వ ప్యాకేజీ, 145 నుంచి 172వ ప్యాకేజీ వరకు ఉన్న 57వ ప్యాకేజీలో పనులు జరగాల్సి ఉంది. వీటన్నింటిలో పదుల సంఖ్యలో వంతెనలు, ఇంకా వాగులు వంకలు దాటే చోట ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ముఖ్యంగా 56వ ప్యాకేజీలో పనులు నిలిచిపోయాయి. గతంలో ఈ పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ క్రాంతి కన్‌స్ట్రక్షన్స్‌ వీటిని చేసే అవకాశం లేకపోవడంతో ఆ సంస్థను తప్పించారు. ఇప్పుడు ఈ ప్యాకేజీలో దాదాపు రూ.32 కోట్ల మేర పనులు జరగాల్సి ఉంది. వీటికి టెండరు పిలవాలా? ఇప్పటికే ఈ కాల్వలో పనులు చేస్తున్న ఇతర గుత్తేదారు సంస్థలు వేటికైనా అప్పగించాలా? అనేది నిర్ణయించలేదు. మడకశిర వరకు నీరు వెళ్లాలంటే ఈ ప్యాకేజీయే చాలా కీలకం.

ప్రత్యామ్నాయంపై శ్రద్ధ...
సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టారు. ఒకటి, రెండు నెలల్లో ఈ పనులను కొలిక్కి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సొరంగం దాటిన తర్వాత నుంచి 360 కి.మీ. నుంచి 380వ కి.మీ. వరకు 11వ ప్యాకేజీ ఉంది. ఈ పనులు కూడా పి.లక్ష్మిరెడ్డి-క్రాంతి కన్‌స్ట్రక్షన్స్‌ తీసుకుంది. వీటిలో పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఆ గుత్తేదారు సంస్థలు కూడా పనులు చేసే పరిస్థితి లేకపోవడంతో.. వేరే సంస్థలతో పెండింగ్‌ పనుల్లో కొంత వరకు అయినా పూర్తి చేయించాలని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఈ అవరోధాలన్నీ అధిగమిస్తేనే వచ్చే వర్షాకాలంలో కృష్ణా జలాలు ప్రధాన కాల్వ ద్వారా మారాల జలాశయానికి, ఆ తర్వాత పుంగనూరు బ్రాంచి కాల్వపై కదిరి పరిధిలో ఉన్న చెర్లోపల్లి జలాశయానికి చేరే వీలుంది. ముఖ్యంగా సకాలంలో పనులు చేయని గుత్తేదారు సంస్థలపై ఇంజినీర్లు కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలున్నాయి. వారి విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే పనులు వేగంగా సాగే అవకాశం ఉందని ఇంజినీర్లే పేర్కొంటున్నారు.

ప్రత్యేక పర్యవేక్షణతోనే...
అలాగే మొత్తం ఈ కాల్వలో 17 ఎత్తిపోతల పథకాలు ఉండగా, ప్రస్తుతం 9వ ఎత్తిపోతల పథకాన్ని కృష్ణమ్మ దాటింది. ఇంకా 8 ఎత్తిపోతల పథకాలు వచ్చే సీజన్‌లో సిద్ధంగా ఉండాలి. వీటిలో మిగిలిన ఎత్తిపోతల పథకాల పనులు దాదాపు పూర్తికావస్తున్నా, 10, 17 ఎత్తిపోతల పథకాలు మాత్రం వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మడకశిర నుంచి 32 కి.మీ. మేర అగళి మైనర్‌, 26కి.మీ మేర అమరాపురం మైనర్‌ కాల్వ ఉన్నాయి. వీటి పనులు కూడా పూర్తయితే జిల్లా సరిహద్దు వరకు నీరు చేరి, అక్కడి నీటి కష్టాలు తీరతాయి. ఇవన్నీ సవ్యంగా సాగాలంటే పనుల ప్రగతిపై దృష్టిపెట్టడంతోపాటు, ప్రత్యేక పర్యవేక్షణ చేయాల్సి ఉంది. లేకపోతే మళ్లీ వచ్చే సీజన్‌లో నీరొచ్చినా సరే.. ఈ ఏడాది లేపాక్షికి నీరు తరలించినప్పుడు వచ్చిన ఇబ్బందులే పునరావృత్తం అవుతాయనే భావన వ్యక్తమవుతోంది.

సొరంగమే సమస్య...
మరోవైపు హంద్రీ-నీవా రెండో దశ ప్రధాన కాల్వలోని మొన్నటి వరకు కృష్ణమ్మ పరవళ్లు సొరంగాన్ని దాటడమే గగనమైంది. 10వ ప్యాకేజీ పరిధిలో కమ్మవారిపల్లె వద్ద ఏర్పడిన భూసేకరణ సమస్య, భూ యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఇబ్బందులు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఎలాగైనా నీటిని పుట్టపర్తి దాటించి మారాలకు తీసుకెళ్లాలని భావించారు. ఈనేపథ్యంలో పుట్టపర్తి వద్ద భూమి విషయంలో సానుకూల నిర్ణయం రావడంతో, వెనువెంటనే కాల్వ పనులు పూర్తిచేసి నీటిని పుట్టపర్తి దాటించారు. ఇప్పుడు కృష్ణా జలాలు బుక్కపట్నం మండలంలో నిలిచిపోయాయి. ఇక్కడ కీలకమైన సొరంగం పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితేనే నీరు ముందుకు వెళ్లేందుకు వీలుంటుంది. అయితే సొరంగం పనులు వేగంగా చేయాలని భావించినా ఒక చోట పైనుంచి మట్టి పడిపోతుండటంతో సమస్య ఏర్పడుతోంది. దాదాపు 10 మీటర్ల మేర ఈ సమస్య ఉంది. దీనిని అధిగమించేందుకు వివిధ ప్రయత్నాలు చేసినా సరే... మళ్లీ మట్టి పడుతూనే ఉంది.

 
 

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...