Jump to content

Handri - Niva SUJALA - PHASE 2


sonykongara

Recommended Posts

  • Replies 443
  • Created
  • Last Reply
On 2/13/2018 at 11:08 PM, swarnandhra said:

asalu ee stay icche evvaram ento mana court lu :donno: dispute compensation gurinche kada, alantappudu 23 lacs ippinchi land hand over chepinchi, case continue cheste, if courts decides higher compensation later, government ni difference with interest pay cheyyamani order cheyyocchu kada.

aa constituency palle raghunath reddy di. ayana chala slow to settle litigations. inka ilantivi ayithe 10 kms distance lo untadu.:P

handri-neeva ki prabhakar chowdary ni incharge ga vesi eepaati ki dummu dulipesi ekkadiko teesukelli undevadu. :D

Link to comment
Share on other sites

7 minutes ago, rk09 said:

Guess the place in the above picture - It was taken in Dec-2017.

Don't google :dancing:

aa cheruvu video. people seems full happy. vallaki 10 years tharuvatha water vochayi anta aa cheruvu loki due to handri-neeva. 

 

 

 

Link to comment
Share on other sites

ika migilindi Hindupur area okkate

almost all areas lo drinking water ki no issues

all big cheruvulu almost fill ayyayi, 

Ontimitta (not in HNSS), Bukkapatnam, Dharmavaram, 

Recent reservoirs 

Paidipalem, Gollapalli, Jeddipalli, 

inko couple of weeks lo water stop avuthundi

next season varaku (Sept-Oct) sarigga plan chesukovali

 

Link to comment
Share on other sites

11 minutes ago, AnnaGaru said:

Anantapur ki golden days vachai...very happy for them....inka inka manchi chustham akkada...

Days are not far that people migrate to Anantapur from delta too....

 

http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/1970-01-01/Drip-irrigation-a-boon-for-horticulture-farmers/360696

Avunu Annagaru, very fertile lands ..in fact, better than delta...Ikkada janalu bagupadi spending power peragali...It will boost the service sector.

 

Kaakapote most of the lands are held by Jagan batch...They still believe because of YSR only they are getting water.

 

 

 

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
On 2/19/2018 at 11:03 PM, LuvNTR said:

aa constituency palle raghunath reddy di. ayana chala slow to settle litigations. inka ilantivi ayithe 10 kms distance lo untadu.:P

handri-neeva ki prabhakar chowdary ni incharge ga vesi eepaati ki dummu dulipesi ekkadiko teesukelli undevadu. :D

send jc prabhakar reddy/jc diwakar reddy to handle these kind of people .

Link to comment
Share on other sites

నారావారిపల్లెకు.. నీవా ధార
చంద్రగిరి దాహార్తిని తీర్చేందుకు ప్రణాళికలు
రూ.44 కోట్లతో పనులు
నెలాఖరుకు టెండరు ప్రక్రియ

ctr-top1a.jpg

తిరుపతి: జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి జీవధారగా భావిస్తున్న హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు మరింత విస్తరించనున్నారు. ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో.. మరింత ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లెతో పాటు చంద్రగిరి మండలానికి సాగు, తాగు నీటి ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మండలంలోని మూలపల్లితో పాటు మరో నాలుగు చెరువులకు బ్రాంచి కాలువ ద్వారా నీటిని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు రూ.44 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. నెలాఖరులోగా టెండరు ప్రక్రియ చేపట్టి త్వరితగతంగా పనులు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

చిత్తూరు జిల్లాలోని కరవును పారదోలేందుకు సీఎం ఇప్పటికే పలు పెండింగ్‌ ప్రాజెక్టుల్లో కదలిక తెప్పించారు. తూర్పున గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచగా.. పశ్చిమ ప్రాంతానికి కీలకమైన హంద్రీ నీవా కాలువల పనులు తుది దశకు చేరాయి. ఈ ప్రాజెక్టు ద్వారా పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో పొలాలకు సాగు నీరు, ప్రజలకు తాగునీటిని ఈ వేసవి నుంచే అందించాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే.. సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గానికీ విస్తరించాలని జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. హంద్రీనీవా కాలువ నుంచి వచ్చే నీటిని  పాకాల మండలం దామలచెరువు మీదుగా.. చంద్రగిరి మండలంలోని చెరువులకు తరలించాలన్నది ప్రణాళిక. తద్వారా ఈ ప్రాంతంలో సాగు, తాగు నీటి ఇక్కట్లను అధిగించనున్నారు.

ఇదీ ఆకృతి..
హంద్రీనీవా ప్రధాన కాలువ జిల్లాలోని తంబళ్లపల్లి, పెద్దమండ్యం, మదనపల్లి ప్రాంతాల మీదుగా సాగుతుంది. ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీటిని గొల్లపల్లి, మరల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి జలాశయాల్లో నిల్వ చేయనున్నారు. చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దుల్లో.. పీలేరు సమీపంలోని అడవిపల్లి జలాశయాన్ని సుమారు 1.418 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇక్కడికి చేరిన నీటిని నీవా బ్రాంచి కాలువ ద్వారా వివిధ ప్రాంతాలకు మళ్లించనున్నారు. అడవిపల్లి నుంచి బంగారుపాళెంకు తరలించే బ్రాంచి కాలువపై దామలచెరువు ప్రాంతం వద్ద నుంచి నీటిని తీసుకురానున్నారు. అక్కడి నుంచి నారావారిపల్లెలోని మూలపల్లి చెరువుకు తరలిస్తారు. మూలపల్లి చెరువుకు అనుసంధానంగా ఉన్న కనిటిమడుగు, కొండారెడ్డి కండ్రిగ, నాగపట్ల, వెంకటరాయ చెరువులకు సరఫరా చేస్తారు. చంద్రగిరి మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందిని తొలగించడంతోపాటు 154 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం రూ.44 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. పనులు చేపట్టేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర వచ్చిన వెంటనే నెలాఖరులోగా టెండరు ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నీవా నుంచి నీటిని పైప్‌లైన్ల ద్వారా తరలించాలని భావిస్తున్నారు. కాలువ ద్వారా మూలపల్లి చెరువుకు నీటిని తరలించాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందన్నది అధికారుల అంచనాగా ఉంది. భూసేకరణ కూడా అంత సులువు కాదని చెబుతున్నారు. ఇప్పటికే అంచానలను ప్రభుత్వానికి నివేదించిన అధికారులు నెలాఖరులోగా టెండరు ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా పనులను వేగవంతం చేసి ప్రాధాన్యత క్రమంలో నీటి కష్టాలు తీర్చనున్నారు.

Link to comment
Share on other sites

చిత్తూరుకు కృష్ణమ్మ పరవళ్లు! 
ట్రయల్‌ రన్‌కు రంగం సిద్ధం 
ctr-top1a.jpg

ఈనాడు-తిరుపతి  : వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న పశ్చిమ ప్రాంతాన్ని కొద్ది రోజుల్లో కృష్ణమ్మ పలకరించనుంది. ప్రాజెక్టు భూసేకరణ నుంచి టన్నెల్‌ తవ్వకాల వరకు అడ్డంకులు అధిగమించి.. చిత్తూరు జిల్లాకు బిరబిరా పరుగులిడేందుకు సిద్ధమైంది. న్యాయస్థానంలో ఉన్న చిక్కుల కారణంగా నిలిచిపోయిన పనులు పూర్తికావొచ్చాయి. హంద్రీ నీవా నీటిని జిల్లాకు తీసుకొచ్చేందుకు ఉన్న అవరోధాలు తొలగిపోయాయి. పుటపర్తి, మదనపల్లెలోనూ పనులు పూర్తికానున్నాయి. పుంగనూరు బ్రాంచి కెనాల్‌ ద్వారా పలమనేరు వరకు నీటిని ప్రధాన కాలువల్లో తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి చిత్తూరుకు నీరు చేరుకోవాలంటే మరో 12 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ స్వయంగా ప్రకటించారు. కాలువల్లో నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఉన్నాయా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇప్పటికే అధికారులు డ్రోన్ల ద్వారా సర్వే చేయించారు. సమస్యలన్నింటినీ అధిగమించి ట్రయన్‌ రన్‌ ద్వారా జిల్లాకు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు  పూర్తిచేశారు. చిత్తూరు జిల్లాలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు ప్రాంతంలో నీటి ఇబ్బందులు తక్కువ. సాగునీటి కోసం తెలుగు గంగ, సోమశిల స్వర్ణముఖి జలాశయాలు ఉన్నాయి. పశ్చిమ ప్రాంతం నిత్యం కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వేసవి వస్తే చాలు నీటి ఎద్దడితో వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంది. కేవలం వర్షం ఆధారంగానే వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. సాగునీటిని అందించేందుకు  ఆ ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టు ఒక్కటీ లేదు. సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం హంద్రీనీవా ద్వారా సాగు, తాగునీటి వసతి  కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. జిల్లా పరిధిలోని మదనపల్లెలో నెలకొన్న ఇబ్బందులు తొలగిపోవడంతో అక్కడ పనులు చేపట్టారు. అనంతపురం జిల్లాలోని పుటపర్తి వద్ద పనులు వేగవంతం చేశారు. ఇవి కూడా పూర్తవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే లేపాక్షి ప్రాంతానికి హంద్రీనీవా నీరు చేరుకుంది. పుటపర్తికి మరో రెండు రోజుల్లో నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాకు సుమారు 150 కి.మీల పొడవున కాలువ ఉంది. అక్కడికి నీరు చేరుకునేందుకు మరో 12 రోజుల సమయం పడుతుంది. నీరొచ్చేందుకు  వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పుటపర్తి, కదిరి, ముదిగుబ్బపట్నం మీదుగా జిల్లాకు చేరుకుంటాయి. ముదిగుబ్బపట్నం వద్ద కాలువ రెండు భాగాలుగా వెళ్తుంది. అందులో పుంగనూరు బ్రాంచి కెనాల్‌ ఒకటి.

చెర్లోపల్లి జలాశయం దాటి.. 
మరోవైపు జీడిపల్లి జలాశయంలోని నీటిని ఇప్పటికే విడుదల చేశారు. ఇవి మళ్లీ జలాశయానికి చేరుకుని అక్కడి నుంచి పుటపర్తి వైపు పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారి పుటపర్తి దాటిన తర్వాత చెర్లోపల్లి జలాశయానికి వెళ్తాయి. అక్కడ 1.425 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 0.3 టీఎంసీలు జలాశయానికి చేరితే అక్కడి నుంచి దిగువకు నీరు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. ఆ మేరకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలో 16 పంపింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటికే వీటి పనితీరును అధికారులు పరిశీలించి ఎక్కడా సమస్యలు లేవని గుర్తించడంతో పలమనేరు వరకు నీరు విడుదలకు మార్గం సుగమమైంది.

డ్రోన్‌ సాయంతో సర్వే 
చిత్తూరు జిల్లాకు నీరు రానుండటంతో అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. డ్రోన్‌ ద్వారా సర్వే చేపట్టారు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనే అంశాన్ని గుర్తించి వెంటనే పనులు పూర్తి చేస్తున్నారు. మొత్తంగా చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి సాగు, తాగునీటి సమస్యలు తొలగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Another hurdle crossed. 4_ tmc storage

బిరబిరా... కృష్ణమ్మ! 
ఏడాదిగా భూసేకరణతో ఇక్కట్లు.. 
ఎలాగోలా కొంత మేర కాల్వ పనులు 
ఎట్టకేలకు పుట్టపర్తిని దాటిన కృష్ణమ్మ 
ఇక మారాలకు చేరడంపైనే ఆశలు... 
atp-top1a.jpg

పుట్టపర్తి ప్రాంతంలో హంద్రీనీవా ప్రధాన కాల్వ పనులు చాలా కిందటే దాదాపు పూర్తయ్యాయి. రైల్వే క్రాసింగ్స్‌ వద్ద కూడా ఎలాగోలా పనులు పూర్తిచేశారు. ఈ ఏడాది ఎలాగైనా నీటిని ఆ ప్రాంతం దాటించి ముందుకు తీసుకెళ్లొచ్చు అనుకున్నారు. అయితే... భూసేకరణ సమస్యతో పనులు ముందుకు సాగలేదు. మధ్యలో కొంత వెసులుబాటు లభించింది. ఈ సమయాన్ని ఇంజినీర్లు సద్వినియోగం చేసుకున్నారు. ఆగమేఘాలపై అపరిష్కృతంగా ఉన్న కాల్వను తవ్వించారు. ఎట్టకేలకు కృష్ణమ్మ గురువారం పుట్టపర్తిని దాటి పరవళ్లు తొక్కుతూ ముందుకు పయనమైంది.

ఈనాడు - అనంతపురం, న్యూస్‌టుడే, పుట్టపర్తి

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) రెండో దశలో ప్రధాన కాల్వ పుట్టపర్తి మండలం మీదుగా వెళ్తుంది. ఇది దాటితే బుక్కపట్నం మండలంలోని మారాల జలాశయానికి, ఆ తర్వాత పుంగనూరు ఉప కాల్వపై ఉన్న చెర్లోపల్లి జలాశయానికి నీరు వెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ ఏడాది శ్రీశైలం నుంచి పెద్దఎత్తున కృష్ణా జలాలు హంద్రీనీవా ద్వారా తీసుకొచ్చిన నేపథ్యంలో.. వీటిని ఈసారి తప్పకుండా మారాల, చెర్లోపల్లి జలాశయాలకు తీసుకెళ్లొచ్చని భావించారు. అయితే పుట్టపర్తి వద్ద 500 మీటర్ల మేర భూసేకరణలో తలెత్తిన సమస్యతో నీరు ముందుకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ప్యాకేజీ నెంబరు 9బిలో భాగంగా ప్రధాన కాల్వ 340 కి.మీ నుంచి 360 కి.మీ. వరకు పనులు చేయాల్సి ఉంది.

అవాంతరాలు అధిగమించి... 
పుట్టపర్తి పట్టణానికి శివారులోని కమ్మవారిపల్లె వద్ద 340.450 కి.మీ నుంచి 340.950 కి.మీ వరకు 500 మీటర్ల మేర కాల్వ పనులు చాలా కాలంగా నిలిచిపోయాయి. భూసేకరణ విషయంలో రైతులు కోర్టును ఆశ్రయించడంతో సమస్య తలెత్తింది. అధికారులు పదేపదే చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ఓ రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పనులు జరిపే అవకాశం లేకుండాపోయింది. అయితే ఆ మధ్య హైకోర్టులో అధికారులకు కొంత అనుకూలంగా ఆదేశాలు రావడంతో పెండింగ్‌ కాల్వ తవ్వే ప్రయత్నం చేశారు. అయితే ఆ రైతు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మళ్లీ పనులు నిలిచిపోయాయి. తాజాగా ఇటీవల అధికారులకు వెసులుబాటు దక్కింది. దీంతో శరవేగంగా పెండింగ్‌ కాల్వ పనులు చేపట్టి పూర్తిస్థాయిలో  కాకపోయినా నీరు ముందుకు వెళ్లేలా పనులు చేశారు.

ఎట్టకేలకు పుట్టపర్తిని దాటి... 
పుట్టపర్తి వద్ద పెండింగ్‌ కాల్వ తవ్వకం పనులు బుధ, గురువారాలకు పూర్తయ్యే అవకాశం ఉండటంతో.. హంద్రీనీవా ఇంజినీర్లు మూడు రోజుల కిందట జీడిపల్లి నుంచి ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేశారు. 600 క్యూసెక్కులు చొప్పున నీటిని విడుదల చేయగా.. అవి గురువారం పుట్టపర్తి వద్దకు చేరుకున్నాయి. ఇంజినీర్లు కూడా పుట్టపర్తి వద్ద కాల్వ తవ్వకం పూర్తిచేయడంతో.. ఆ ప్రాంతాన్ని దాటి కృష్ణా జలాలు ముందుకు సాగాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయానికి నీరు పుట్టపర్తి మండలం దాటి జానకంపల్లికి చేరుకున్నాయి. మరోవైపు ప్రస్తుతానికి కొత్తచెరువు మండలంలోని మైలసముద్రం చెరువును నింపాలని నిర్ణయించనున్నారు. గురువారం నుంచి కాల్వలో 300 క్యూసెక్కులు మేర నీరు వస్తోంది. దీంతో నాలుగైదు రోజుల్లో మైలసముద్రం చెరువుకి నీరివ్వనున్నారు.

మారాలకు చేరేనా?... 
పుట్టపర్తి వద్ద ఆటంకాన్ని దాటి కృష్ణమ్మ ముందుకు సాగిన నేపథ్యంలో.. ఆ నీరు ఇప్పుడు మారాల జలాశయానికి చేరడంపై ఆసక్తి నెలకొంది. ముందుగా 358 కి.మీ. నుంచి 360 కి.మీ. వరకు బుక్కపట్నం మండలంలోని సొరంగాన్ని దాటాల్సి ఉంది. ఈ పనులు కొంత పెండింగ్‌ ఉండగా, వీటిని వేగంగా చేస్తున్నారు. అయిదారు రోజుల్లో ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి 8 కి.మీ. దూరంలో ఉన్న మారాల జలాశయానికి నీరు చేరాల్సి ఉంది. 0.464 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయంలో ఈసారి కొంతైనా నీటిని నింపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పుట్టపర్తి నుంచి మారాల జలాశయం వరకు సన్నాహక పరుగు (ట్రయల్‌ రన్‌) పేరిట నీటిని ముందుకు తీసుకెళ్తున్నారు. మధ్యలో ఏవైనా అవాంతరాలు ఎదురవుతున్నాయా? అనేది పరిశీలించనున్నారు. వీలైనంత వరకు ఈసారి ఎలాగైనా మారాలకు నీటిని తీసుకెళ్లే యత్నం చేస్తున్నట్లు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఇంజినీర్‌ ఒకరు తెలిపారు.

చెరువులకు నీరు... 
మరోవైపు మడకశిర ఉప కాల్వ ద్వారా లేపాక్షి చెరువుకి నీరు చేరుతున్న నేపథ్యంలో.. హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలోని కొన్ని చెరువులకు నీరివ్వాలని నిర్ణయించారు. హిందూపురం పరిధిలోని చెరువులకు ఈ నెలంతా నీరు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పెనుకొండ నియోజకవర్గంలోని చెరువులకు మే నెలలో నీరివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గొల్లపల్లి జలాశయంలో 0.95 టీఎంసీల నీరుండగా, ఇందులో 0.35 టీఎంసీలు ఉంచనున్నారు. మిగిలిన నీటిలో కొంత చెరువులకు ఇవ్వనున్నారు. హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల్లోని మడకశిర ఉప కాల్వ పరిధిలో ఉన్న కొన్ని చెరువులకు నీరివ్వడం ద్వారా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి, వేసవిలో తాగునీటి సమస్య తీరేందుకు దోహదపడుతుందని హంద్రీ-నీవా ఎస్‌ఈ రామకృష్ణారెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.

Link to comment
Share on other sites

atp-sty3a.jpg

జీవితాలను మార్చిన జలాశయం 
హంద్రీనీవా నీటిరాకతో మారిన పల్లెలు 
 పచ్చని పంటలతో గ్రామాలు కళకళ 

బెళుగుప్ప, న్యూస్‌టుడే: ఒకప్పుడు రాళ్లతో నిండిన భూములు.. నేడు కాసులు పండే పండ్ల తోటలుగా మారాయి. బీడుభూములు నేడు.. సిరులు కురిపించే పచ్చని పంట పొలాలయ్యాయి. తీవ్ర వర్షాభావం.. కరవు కాటకాలతో.. దుర్భిక్ష పరిస్థితుల నడుమ పొట్టచేతపట్టుకొని వలసలు వెళ్లేవారు. అలా నిత్యం సమస్యలతో సతమతమయ్యే పల్లె ప్రజల బతుకుల్లో నేడు చిరునవ్వులు చిందిస్తున్నాయి. వీటంతటికీ కారణం.. ఈ ప్రాంతంలో జలాశయ నిర్మాణం చోటు చేసుకోవడమే. అంతేకాదు.. అవసరమైనంత నీటి సరఫరా కావడంతో ఈ ప్రాంత ప్రజల ఆనందానికి హద్దుల్లేకుండాపోయాయి.

బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి గ్రామంలో జీడిపల్లి జలాశయ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల బతుకులు మారాయి. హంద్రీనీవా ద్వారా జలాశయంలోకి నీరు రావడంతో బీడు భూములు పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నాయి. ఒకప్పుడు సకాలంలో వర్షాలు కురవక భూమిలో పంటలు పండించేందుకు శక్తి లేక కొందరు, మరికొందరు తమ భూములను ఇతరులకు కౌలుకు ఇచ్చి గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు వెళ్లారు. భూములు ఉన్నా ఇతర ప్రాంతాల్లో ఒకరి కింద కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవనం గడిపేవారు. నేడు జలాశయంలోకి క్రమం తప్పకుండా నీరు వస్తుండటంతో ఎండిన బోర్లలో గంగమ్మ తల్లి పైపైకి రావడంతో పట్టణాల నుంచి స్వగ్రామాలకు తిరిగి వచ్చి పంటలు సాగు చేసుకుంటున్నారు. 
హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా 2005లో జీడిపల్లి జలాశయం నిర్మాణ పనులు మొదలు పెట్టారు. జలాశయ నిర్మాణం కోసం మండలంలోని రామసాగరం, జీడిపలి,్ల అంకంపల్లి, కోనంపల్లి పరిసర గ్రామాల పరిధిలో దాదాపు 2867 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు.  2012లో తొలిసారిగా హంద్రీనీవా కాలువల వెంట కృష్ణా జలాలు గలగలమంటూ జలాశయంలోకి చేరాయి. ఫలితంగా భూగర్భ జలాలు పెరుగుతుండటంతో పరిసర గ్రామాల రైతులకు వరంగా మారింది. నీరు సమృద్ధిగా లభిస్తుండటతో ప్రతి రైతు ఆనందంతో తమ పొలాల్లో బోరుబావులు తవ్వించుకున్నారు. ఇటీవలి కాలంలో జలాశయంలోకి నీరు సక్రమంగా చేరుతుండటంతో వలసలు వెళ్లిన కూలీలు, సన్నకారు రైతులు అందరూ తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. జలాశయం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల్లో సుమారు ఐదువేల ఎకరాల్లో ఉద్యాన, వేరుసెనగ ఇతర పంటలను సాగు చేస్తూ వ్యవసాయరంగంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. నీరు పుష్కలంగా వస్తుండటంతో జలాశయం పరిసర గ్రామాల్లో పంట పొలాలు కోనసీమను తలపించేలా పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. 
 

విస్తరించిన ఉద్యాన పంటలు 
జలాశయం రాక ముందు గ్రామాల్లో పదుల సంఖ్యలో కూడా ఉద్యాన పంటలు సాగు చేసేవారు కాదు. నేడు జలాశయంలోకి నీరు రావడంతో ఎండినబోరు బావుల్లో సమృద్ధిగా వస్తుండటంతో  రైతులు ఉద్యాన పంటలు వైపు మొగ్గుచూపుతున్నారు. జీడిపల్లి, అంకంపల్లి, రామసాగరం, కోనంపల్లి, దుద్దేకుంట గ్రామాల్లో 1050 ఎకరాల్లో అరటి.. జీడిపల్లి, రామసాగం గ్రామాల్లో 70 ఎకరాల్లో ద్రాక్ష పంటలను సాగు చేస్తున్నారు.

ద్రాక్ష పంట సాగుతో సిరులు 
మాది కణేకల్లు మండలం హనుమపురం గ్రామం. జీడిపల్లి జలాశయంలోకి నీరు వస్తున్నాయని అధికారులు ప్రకటించడంతో స్వగ్రామం నుంచి వచ్చేసి బూదిగుమ్మ సమీపంలో 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. బోర్లు తవ్వించి బిందు పరికరాలతో ఉద్యాన పంటలు సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధించాను. నాలుగు ఎకరాల్లో ద్రాక్ష పంటను సాగు చేశాను. ద్రాక్ష ధర టన్ను రూ.36 వేలు పలుకుతోంది. పెట్టుబడి పోను సుమారు రూ.10 లక్షల వరకు ఆదాయం వచ్చింది.

- వెంకటేశులు, కణేకల్లు మండలం హనుమాపురం
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...